
ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదే
తెయూ(డిచ్‌పల్లి): బీఆర్ అంబేడ్కర్ భారతదేశాన్ని కేవలం రాజకీయంగా కాకుండా ప్ర జాస్వామ్యంగా మార్చాలనే లక్ష్యంతో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం రూపొందించారని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావు అన్నారు. మహనీయుల జయంతి ఉ త్సవాలలో భాగంగా ఆదివారం తెయూ ఎస్సీ సెల్ డైరెక్టర్ వాణి నేతృత్వంలో ‘21వ శతాబ్దంలో అంబేడ్కర్ ఆలోచనల ఔచిత్యం’ అనే అంశంపై వెబినార్ నిర్వహించారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ.. వర్తమాన సమాజంలో భారతదేశానికి అంబేడ్కర్ ఆలోచనలు అనుసరనీయమన్నారు. తెయూ రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను వేరువేరుగా చూడలేమన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుకుమార్ మాట్లాడుతూ.. ఆధునిక భారతదేశంలో రాజ్యాంగం ప్రా ముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సి టీ ప్రొఫెసర్ నాగరాజు, కేఆర్‌ఈఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాంబయ్య మాట్లాడారు. ప్రి న్సిపాల్ మామిడాల ప్రవీణ్, డీన్‌లు ఘంటాచంద్రశేఖర్, రాంబాబు గోపిశెట్టి, పీఆర్‌వో పున్నయ్య, అధ్యాపకులు నాగరాజు, జెట్లింగ్ ఎల్లోసా, ప్రసన్నరాణి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
ముదక్‌పల్లిలో కుస్తీపోటీలు
మోపాల్: మండలంలోని ముదక్‌పల్లిలో హను మాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివా రం వీడీసీ ఆధ్వర్యంలో కుస్తీపోటీలు నిర్వహించారు. పోటీల్లో చుట్టుపక్కల గ్రామాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి మల్లాయోధులు భారీగా తరలివచ్చారు. విజేతలకు నిర్వాహకులు వెండి కడియం, నగదు ప్రోత్సహక బహుమతులు అందజేశారు. వీడీసీ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కలప లారీ బోల్తా
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని మాగి గ్రామ శివారులో ఆదివారం కలప లారీ బోల్తాపడింది. పిట్లం వైపు నుంచి నిజాంసాగర్ వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.
సీసీ కెమెరాల ఏర్పాటు
మద్నూర్(జుక్కల్): మద్నూర్ ఎస్సై విజయ్‌కొండ సహకారంతో మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారయణ గోశాలలో ఆదివారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గోశాలలో ఆవులు చోరీకి గురికాకుండ ఉండేందుకు సీసీ కెమెరాలను ఎస్సై ఏర్పాటు చేయించారు. అనంతరం ఆవులను ఎలా రక్షించుకోవాలో గోశాల కమిటీకి ఎస్సై పలు సూచనలు సలహాలు అందించారు. అనంతరం ఎస్సైని గోశాల కమిటీ అధ్యక్షుడు సంజయ్ సన్మానించారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదే

ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదే