
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని, హామీలన్నీ అమలు చేయాలనే డిమాండ్‌తో ఏడాదిపాటు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వద్ద నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై బీఆర్‌ఎస్ పోరాటం ప్రారంభమవుతుందన్నారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో అమలు చేస్తామని చె ప్పిన హామీలు, 15 నెలలు గడిచినా అమలు చేయ లేకపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని, ని రంతర విద్యుత్, సాగు, తాగునీటికి ఇబ్బందుల్లేకుండా పాలన సాగిందని, దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ మోసాలపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ధర్పల్లి మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, మండల నాయకులు శక్కరికొండ కృష్ణ, నల్లవెల్లి సాయిలు, ఒడ్డెం నర్సయ్య, నీరడి పద్మారావు, రమే శ్ నాయక్, హన్మంత్‌రెడ్డి, ధీకొండ శ్రీనివాస్, మొ చ్చ శీను, ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ హామీల అమలుపై పోరాడతాం
బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
15న డిచ్‌పల్లిలో సన్నాహక సభ
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయడంలో భాగంగా ఈ నెల 15న డిచ్‌పల్లి మండల కేంద్రంలో సన్నాహక సభ నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సభకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి హాజరవుతారని వివరించారు.