
కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలి
నిజామాబాద్ రూరల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఇంటింటా ప్రచారం చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. రూరల్ మండలంలోని మాధవనగర్ గ్రామంలో ‘గావ్ చలో– బస్తీ చలో’ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రీయ విద్యాలయాలతోపాటు ఏడు నవోదయ పాఠశాలలు మంజూరు చేయించామని, అందులో రెండు నవోదయ పాఠశాలలు జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. పార్టీలకతీతంగా నవోదయ పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, సీ్ట్రట్ లైట్లు, రేషన్ బియ్యం పంపిణీ తదితర వాటిలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, నాయకులు పద్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజలకు
బీజేపీ నాయకులు వివరించాలి
ఎంపీ అర్వింద్ ధర్మపురి