
సాఫీగా ధాన్యం తరలింపు
గతంలో ధాన్యం తూకం వేసిన తర్వాత కొనుగోలు కేంద్రాల వద్దనే నాలుగైదు రోజుల పాటు నిలువలు ఉండేవి. ఇప్పుడు పౌర సరఫరాల శాఖ తీసుకున్న చర్యలతో లారీలు అందుబాటులో ఉంటున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం తరలింపు సాఫీగా సాగుతుంది.
– కుంట రవిశంకర్ రెడ్డి, రైతు, పాలెం
రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం...
ధాన్యం తరలించే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ధాన్యంను కొనుగోలు కేంద్రాల వద్ద అలాగే ఉంచితే అకాల వర్షాల వల్ల తడిసిపోయే అవకాశం ఉంది. నష్టం జరిగితే అందరికి ఇబ్బంది. ఇంతకుముందు లారీలు రావాలంటే నిరీక్షించాల్సి వచ్చేది. ఇప్పుడు లారీలను ముందస్తుగానే అందుబాటులో ఉంచుతున్నాం.
– బూత్‌పురం మహిపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్, మోర్తాడ్

సాఫీగా ధాన్యం తరలింపు