
పోలీసుల అత్యుత్సాహం
నిజామాబాద్‌అర్బన్: సమస్యను విన్నవించుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన ఓ వృద్ధురాలి విషయంలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. శ్రీనగర్‌కు చెందిన సరస్వతి అనే వృద్ధురాలు తన సమస్య ను ఉన్నతాధికారులకు తెలిపేందుకు బుధవారం కలెక్టరేట్‌కు వచ్చింది. అదే సమయంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం ప్రారంభం కానుండటంతో పోలీసులు ఆమెను చు ట్టుముట్టి ఇక్కడికి రావొద్దంటూనే బలవంతంగా బ యటికి తీసుకెళ్లారు. ఆటోను పిలిపించి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో ఆర్టీసీ బస్టాండ్‌కు తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఎండలో తిప్పలు పడుతూ అధికారులను కలిసేందుకు తాను వస్తే పోలీసులు వెనక్కి పంపించేశారని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రులు, అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలి కానీ ఇలా సమస్యను విన్నవించుకోవడానికి వచ్చిన వృద్ధురాలిని వెనక్కి పంపించడమేమిటని పలువురు చర్చించుకున్నారు.

పోలీసుల అత్యుత్సాహం