
సొసైటీకి తాళం వేసిన రైతులు
రుద్రూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గ న్నీ బ్యాగులు ఇవ్వడం లేదని, హమాలీల కొరత ఉందని ఆరోపిస్తూ మండలంలోని ఎ త్తొండ సొసైటీకి రైతులు బుధవారం తా ళం వేసి ఆందోళన చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో సమస్యల గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదన్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్ద నిల్వ ఉంచి రోజులు గడుస్తున్నాయని, అకా ల వర్షం కురిస్తే ధాన్యం తడిసిపోయే ప్ర మా దం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రంలో సమస్యలను పరిష్కరించి గన్నీ బ్యాగులను, హమాలీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
డంపింగ్‌యార్డ్‌లో
బోర్ పాయింట్ల గుర్తింపు
నిజామాబాద్ సిటీ: నగర శివారులోని నాగా రం డంపింగ్‌యార్డులో బోర్ వేసే పాయింట్లను గుర్తించారు. ఈమేరకు బుధవారం జియాలజిస్ట్ బృందం సభ్యులు నిఖిత్ పర్వీన్, హరీష్, ధర్మయ్య యార్డును పరిశీలించి, రెండు చోట్ల బోర్ పాయింట్లను గుర్తించారు. త్వరలోనే బోర్లు వేసి నీటి వసతి కల్పించనున్నట్లు ఏఎంసీ జయకుమార్ తెలిపారు. మున్సిపల్ శానిటేషన్ సూపర్‌వైజర్ సాజిద్‌అలీ, డంపింగ్‌యార్డు ఇన్‌చార్జి ప్రభుదాస్, మున్సిపల్ ఏఈలు ఇనాయత్‌కరీం, సల్మాన్ ఖాన్, సూపరింటెండెంట్ రాకేశ్ తదితరులు ఉన్నారు.
జిల్లాకు నేడు
డీఎంఈ రాక
నిజామాబాద్‌నాగారం: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరేంద్రకుమార్, టీజీ ఎమ్‌ఐడీసీ సీఈ దేవేందర్ గురువారం జిల్లా కేంద్రానికి రానున్నారు. జిల్లాకేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం, క్రిటికల్ కేర్ విభాగాన్ని వారు పరిశీలించనున్నారు. సద రు విభాగాలను గతేడాది డిసెంబర్‌లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. కానీ లిప్టులు, ఇతర పరికరాలు అందుబాటులో లేకపోవడంతో సంబంధిత అధికారులు భవనాన్ని అలాగే ఉంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రానికి అవసరమైన నాలుగు లిప్టులు, ఇతర పరికరాలను వారు మంజూరు చేయనున్నట్లు తెలిసింది. తదుపరి జీజీహెచ్‌లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

సొసైటీకి తాళం వేసిన రైతులు