
నేటి నుంచి భూ భారతి సదస్సులు
మోర్తాడ్(బాల్కొండ): ధరణి స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్ పనితీరు, భూ ముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మోర్తాడ్‌లో గురువారం మొదటి అవగాహన సదస్సు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు హాజరుకానున్నారు. ఈ నెలాఖరు వరకు అన్ని మండల కేంద్రాల్లో భూ భారతి అమలుపై రైతుల భాగస్వామ్యంతో సమావేశాలను నిర్వహించనున్నారు. అవగాహన సదస్సు నిర్వహించే ముందు రోజు గ్రామాల్లో దండోరా వేయించను న్నారు. రెవెన్యూ ఉన్నతాధికారులు, ఆర్డీవోలు, తహసీ ల్దార్‌ల పర్యవేక్షణలో భూ భారతి అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
ప్రభుత్వం భూములకు సంబంధించిన అన్ని వివాదాలను పరిష్కరిస్తామని చెబుతోంది. ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే దీనిని తీసుకువచ్చామంటోంది. ఈ నేపథ్యంలో అవగాహన సదస్సుల ద్వారా రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకునే వీలు ఏర్పడనుంది.
ఈ నెలాఖరు వరకు
మండల కేంద్రాల్లో నిర్వహణ
మోర్తాడ్ నుంచి శ్రీకారం
సందేహాలను నివృత్తి చేసేందుకే..
కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్‌పై సందేహాలను నివృత్తి చేసేందుకే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. రైతులు స్వచ్ఛందంగా సమావేశాలకు హాజరు కావాలి. ఎలాంటి అనుమానాలు ఉన్నా వాటికి సమాధానం రాబట్టుకోవాలి.
– కృష్ణ, తహసీల్దార్, మోర్తాడ్