
యువ వికాసానికి దరఖాస్తుల జోరు
నిజామాబాద్‌అర్బన్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువ తకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రాయి తీతో కూడిన రుణాలు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. జిల్లాలోని నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ పథకానికి మార్చి 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మొదట ఈ నెల 5వ తేదీ దరఖాస్తులకు తు ది గడువు ప్రకటించిన ప్రభుత్వం.. గడువు తేదీని ఈ నెల 14కు పొడిగించింది. దీంతో మరింత మంది దరఖాస్తు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు.
ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులకు అవకాశం
రాజీవ్ యువ వికాసం పథకానికి ప్రభుత్వం మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది. ఇటీవల ఆఫ్‌లైన్(ఫారం రూపం)లోనూ దరఖాస్తులను తీసుకుంటోంది. ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచింది. అక్కడే దరఖాస్తు ఫారాలను నింపి సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దరఖాస్తుదారులు పూరించిన ఫారాలను సంబంధిత మండల కేంద్రాల్లో ఎంపీడీవో కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. కాగా, సంబంధిత శాఖల అధికారులు అర్హులందరికీ ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చాలని భావిస్తున్నారు. అందులో భాగంగా విస్తృత ప్ర చారం నిర్వహిస్తున్నారు.
ధ్రువీకరణ పత్రాల కోసం బారులు
జిల్లా వ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో నిరుద్యోగ యువత కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు అప్లయ్ చేసుకునేందుకు బారులు తీరుతున్నారు. యువవికాసం పథకానికి రెండు సర్టిఫికెట్లు ప్రధా నం కావడంతో మీ సేవలో దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంత యువతకు సంవత్సర ఆదాయం రూ.1,50,000, మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రాంతాల వారికి రూ.2,00,000 ఆదాయం మించకూడదని పథకం గైడ్‌లైన్స్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.
జతచేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు
పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
ఆధార్
పాన్ కార్డు
రేషన్‌కార్డు (లేనివారు ఆదాయ
ధ్రువీకరణ పత్రం)
కుల ధ్రువీకరణపత్రం
బ్యాంకు ఖాతా జిరాక్స్
విద్యార్హతల సర్టిఫికెట్లు
శిక్షణ సర్టిఫికెట్ (శిక్షణ పొంది ఉంటే)
బల్దియాలో ప్రత్యేక కౌంటర్లు
నిజామాబాద్ సిటీ: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణకు నగర బల్దియాలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అర్హులైన యువత ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకొని మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు ఫారాన్ని పూరించి నేరుగా అధికారులకు ఇచ్చే వెసులుబాటును కల్పించింది.
7వ తేదీ వరకు 28,828 అప్లికేషన్లు
ఈ నెల 14 వరకు అవకాశం
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తుల స్వీకరణ
బల్దియా, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలోని నిరుద్యోగులు రా జీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకొని నచ్చి న రంగాల్లో ఉపాధి పొందే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. సకాలంలో దరఖా స్తు చేసుకుంటే ఎంతో మేలు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– రమేశ్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి

యువ వికాసానికి దరఖాస్తుల జోరు

యువ వికాసానికి దరఖాస్తుల జోరు