
భక్తలోకం మురిసే..
కనుల పండువగా జగదభిరాముడి కల్యాణం
లొద్దిరామన్న కల్యాణం..
జగదభిరాముడి కల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించిన భక్తలోకం తన్మయత్వంతో మురిసిపోయింది. జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా, సుభాష్‌నగర్ రామాలయాలతోపాటు బడారాం మందిర్, అయోధ్యనగర్ కోదండరామాలయం, సారంగాపూర్‌లోని హరిహరాత్మక బాలకరామ్ రామానంద ఆశ్రమంతోపాటు ఆలయాల్లో జిల్లా వ్యాప్తంగా నవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జైశ్రీరాం నినాదాలతో ఆలయాల పరిసరాలు మారుమోగాయి. సాయంత్రం నిర్వహించిన శోభాయాత్రల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. – సాక్షి నెట్‌వర్క్
మోర్తాడ్(బాల్కొండ): భీమ్‌గల్ మండలం పిప్రి అటవీ ప్రాంతంలోని లొద్ది రామన్న ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. టీపీసీసీ అ ధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, బాల్కొండ ని యోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి దంపతులు వేడుకల్లో పాల్గొన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్ దంపతులు కల్యాణోత్సవానికి త లంబ్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, వినయ్‌రెడ్డి, నరాల రత్నాకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఆలయాలకు నిధులు
రహత్‌నగర్‌లో కాళీమాత, లలిత మాత ఆలయాల నిర్మాణం కోసం రూ.50లక్షల ప్రొసీడింగ్‌లు అందజేయడంతోపాటు లొద్ది రామాలయ అభివృద్ధి కోసం సొంతంగా రూ.2లక్షల నగదును మహేశ్‌కుమార్‌గౌడ్ అందజేశారు. అలాగే రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు.