
మద్యం తాగొద్దంటే కత్తితో పొడుచుకున్నాడు
ఖలీల్‌వాడి: నిత్యం మద్యం తాగివస్తే కుటుంబ పోషణ ఎలా గడుస్తుందని భార్య అడగడంతో భర్త కత్తితో పొడుచుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. రెండో టౌన్ ఎస్సై యాసీన్ ఆరాఫత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అహ్మద్‌పుర కాలనీకి చెందిన షేక్ రఫత్ (43), రేష్మాబేగం దంపతులు. రఫత్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. నిత్యం మద్యం సేవిస్తే ఆటో ఫైనాన్స్, పిల్లల చదువుతోపాటు కుటుంబం ఎలా గడుస్తుందని రఫత్‌ను మంగళవారం భార్య ప్రశ్నించింది. దీంతో ఇంట్లో ఉన్న మామిడికాయలు కోసే కత్తితో రఫత్ పొడుచుకున్నాడు. గమనించిన భార్య జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ రఫత్ బుధవారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఒంటరి జీవితంపై విరక్తితో మహిళ..
దోమకొండ: మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన కొత్తపల్లి మల్లవ్వ (52) మంగళవారం గ్రామ శివారులోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం.. మల్లవ్వ భర్త ఎల్లయ్య 2001 నుంచి కనిపించడం లేదు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూతురికి పెళ్లి చేయగా కుమారుడు నరేశ్ ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి మల్లవ్వ ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. కుటుంబీకులు ద గ్గర లేకపోవడంతో ఒంటరి జీ వితంపై విరక్తి చెంది మంగళవారం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని బుధవారం చెరువులో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్రవంతి వివరించారు.
కుటుంబ కలహాలతో ఒకరు..
ఇందల్వాయి: చంద్రాయన్‌పల్లి గ్రామానికి చెందిన తూర్పు రాజన్న (48) కుటుంబ లహాలతో మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మనోజ్ తెలిపారు. రాజన్న నెల రోజుల క్రితమే గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చాడని, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు పేర్కొన్నారు. మృతుడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారని, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మద్యం తాగొద్దంటే కత్తితో పొడుచుకున్నాడు

మద్యం తాగొద్దంటే కత్తితో పొడుచుకున్నాడు