
తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
డిచ్‌పల్లి: వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య తలె త్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు సిబ్బందిని ఆదేశించారు. డిచ్‌పల్లి మండలంలోని నడిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేశా రు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. పంచాయతీ పరిధిలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అనంతరం డీపీవోను ఇన్‌చార్జి ఎంపీడీవో, గ్రామ ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌గౌడ్, కార్యదర్శి రాధిక, జూనియర్ అసిస్టెంట్ రజత్‌కుమార్, సిబ్బంది సన్మానించారు.
ప్రజావాణి ఫిర్యాదుపై విచారణ..
డిచ్‌పల్లి మండలం నడిపల్లి గ్రామశివారులో పెట్రోల్ బంక్ సమీపంలో తన పట్టా భూమిలోకి కల్వర్టు నుంచి నీళ్లు వస్తున్నాయని నిజామాబాద్‌కు చెందిన ఉప్పల అంజయ్య ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, ఈ విషయమై డీపీవో విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారుడి భూమిని పరిశీలించిన అనంతరం నీటి పారుదల, రెవెన్యూ శాఖలకు చెందిన సమస్య కావడంతో సంబంధిత అధికారులకు లేఖ రాసి సమస్య పరిష్కరించాలని సూచించినట్లు తెలిపారు. బాధితుడి భూమిలో తాత్కాలికంగా నీళ్లు నిలువకుండా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను డీపీవో ఆదేశించారు.
డీపీవో శ్రీనివాస్‌రావు
నడిపల్లి పంచాయతీ తనిఖీ