
మీ ఆరోగ్యం.. మీ చేతుల్లోనే..
నిజామాబాద్‌నాగారం: ప్రస్తుతం అందరూ ఈజీ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. దీనికితోడు మొబైల్స్‌తో ఎక్కువగా గడుపుతుండటంతో ప్రజలు ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. అనారోగ్యాలకు గురికాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉందంటున్నారు నిపుణులు. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం..
సమాజంలో చాలామంది ఆరోగ్యంపై అశ్రద్ధ వల్ల అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారు. చిన్న వయస్సులోనే రోగాల బారిన పడుతున్నారు. ము ఖ్యంగా మందు, సిగరెట్, గుట్కా, గంజాయి, డ్రగ్స్ వంటివి సేవిస్తూ ఎంజాయ్ చేస్తూ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాగే కొందరు ఒత్తిడితో కూడా రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుత కాలంలో బీపీ, షుగర్ వయస్సుతో సంబంధం లేకుండా వస్తుంది. జన్యుపరమైన రోగాలు చిన్నచిన్న పిల్లలో కూడా వస్తున్నాయి. ఆహారపు అలవాట్లలో తేడాలు రావడంతో క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి ఏడాది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్య విషయాలపై నివేదిక విడుదల చేస్తుంది. ఈ ఏడాది మహిళల్లో వచ్చే అనారోగ్య సమస్యలు బ్రెస్ట్‌క్యాన్సర్, సర్వేకల్ క్యాన్సర్, పిల్లలో వచ్చే సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టి పరిష్కరించాలని సూచించారు.
దురలవాట్లకు దూరంగా ఉండాలి
ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాలి
నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
రెగ్యులర్ హెల్త్‌చెకప్ తప్పనిసరి
ప్రతిఒక్కరూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. బీపీ, షుగర్ ఉంటే అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిడికి గురికావద్దు. ప్రతినిత్యం వ్యాయామం చేయాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. వయస్సుతో సంబంధం లేకుండా రోగాలు వస్తున్నాయి. అందుకే రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి.
– చిటిమెల్ల సంతోష్‌కుమార్,
జనరల్ ఫిజీషియన్, ఎండీ

మీ ఆరోగ్యం.. మీ చేతుల్లోనే..