
నీటి విడుదల నిలిపివేత
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగి సీజన్ కోసం కాలువలు, లిఫ్టుల ద్వారా నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు బుధవారం నిలిపివేశారు. డిసెంబర్ 25 నుంచి ఆయకట్టుకు ప్రాజెక్ట్ అధికారులు నీటి విడుదలను ప్రారంభించారు. వారబంధీ ప్రకారం కాలువల ద్వారా నీటి విడుదల చేపట్టారు. యాసంగి సీజన్ కోసం 63.5టీఎంసీల నీటిని కేటాయించగా, ఇప్పటి వరకు 68 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. నీటి విడుదల సమయంలో ప్రాజెక్ట్‌లో 80.5 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం 12.5 టీఎంసీల నీరుంది.
కాకతీయకు కొనసాగింపు..
కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదలను మరో మూడు రోజులు కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో కాలువ ద్వారా 3,500 క్యూసెక్కుల నీరు జోన్–2 ఆయకట్టుకు ప్రవహిస్తోంది. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రాజెక్ట్ ఎస్‌ఈ శ్రీనివాస్ గుప్తా తెలిపారు. కాగా, ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1062.00(12.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది ఇదే రోజున ప్రాజెక్ట్‌లో 9.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
కాకతీయ కాలువ ద్వారా కొనసాగింపు
ఎస్సారెస్పీ లక్ష్మి, సరస్వతి
కాలువలతోపాటు లిఫ్టులకు బ్రేక్