
నగరంలో ఆపరేషన్ ఛబుత్రా
ఖలీల్‌వాడి: నగరంలోని మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి 11 గంటల నుంచి రాత్రి 1:30 వరకు ఆపరేషన్ ఛబుత్రాను పోలీసులు నిర్వహించారు. ఈక్రమంలో ట్రాఫిక్ నిబంధనలు పా టించని 18మంది వాహనదారులను పట్టుకున్నా రు. వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో మద్యం తా గుతున్న ముగ్గురిపై పిటీ కేసు నమోదు చేశారు. ఎ స్‌హెచ్‌వో రఘుపతి, ఎస్సై హరిబాబు మాట్లాడుతూ.. రాత్రి 10:30 తర్వాత నగరంలో ఎలాంటి షా పులు ఓపెన్ చేసినా, రోడ్లు, వీధుల్లో ఎవరైనా సంచరించినా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.