బీజేపీ విజయయాత్రను వివరించాలి | - | Sakshi
Sakshi News home page

బీజేపీ విజయయాత్రను వివరించాలి

Apr 6 2025 1:10 AM | Updated on Apr 6 2025 1:10 AM

బీజేప

బీజేపీ విజయయాత్రను వివరించాలి

సుభాష్‌నగర్‌: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లాలోని అన్ని పోలింగ్‌ బూత్‌లలో పార్టీ జెండా ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ పటేల్‌ కులాచారి పేర్కొన్నారు. బూత్‌ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ సిద్ధాంతాలు, విజయయాత్రను ప్రజలకు వివరించాలని సూచించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లాస్థాయి పదాధికారుల సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పోలింగ్‌ బూత్‌ల ఆధ్వర్యంలో నిర్వహించే జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 14న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు వడ్డే మోహన్‌రెడ్డి, ఆర్మూర్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కంచెట్టి గంగాధర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, రాష్ట్ర, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ సతీమణికి భగవద్గీత అందజేత

సుభాష్‌నగర్‌: నగరంలోని నీల కంఠేశ్వరాలయంలో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు సతీమణి విజయలక్ష్మీకి మంచాల శంకరయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ మంచాల జ్ఞానేందర్‌ దంపతులు భగవద్గీత, వారాహి మాతా చిత్రపటాన్ని శనివారం అందజేశారు. నగర శివారులోని అమ్మనగర్‌లో నిర్మిస్తున్న వారాహి మాతా ఆలయాన్ని సందర్శించాలని ఆహ్వానించారు.

అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతా

డిచ్‌పల్లి: అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నిజామామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాన్ని జిల్లాలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. డిచ్‌పల్లి మండలంలోని కొరట్‌పల్లి తండా, కొరట్‌పల్లి, సుద్దులం, యానంపల్లి, సాంపల్లి, సుద్దపల్లి గ్రామాల్లో రూ.12.50 కోట్ల నిధులతో శనివారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పులపాలు చేశారని విమర్శించారు. వాటికి నెలానెలా వడ్డీ చెల్లిస్తూనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్‌ శేఖర్‌గౌడ్‌, ఐడీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ మునిపల్లి సాయిరెడ్డి, తారాచంద్‌ నాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్‌ గంగాధర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, సొసైటీ చైర్మన్లు రాంచందర్‌గౌడ్‌, చింత శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ, మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్‌, చిన్నోల్ల నర్సయ్య, నాయకులు సురేందర్‌రెడ్డి, సేవాలాల్‌, మహేశ్‌, మహిపాల్‌, అంకం నరహరి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ విజయయాత్రను వివరించాలి1
1/2

బీజేపీ విజయయాత్రను వివరించాలి

బీజేపీ విజయయాత్రను వివరించాలి2
2/2

బీజేపీ విజయయాత్రను వివరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement