
ధర్పల్లిలో గావ్ చలో అభియాన్ కార్యక్రమం
ధర్పల్లి: బీజేపీ ఆధ్వర్యంలో చేపడుతున్న గావ్ చలో అభియాన్ కార్యక్రమం శనివారం ధర్పల్లి మండల కేంద్రంలో కొనసాగింది. పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు దళితవాడలను సందర్శించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం బీజేపీలోకి దళితవాడ నుంచి 20 మంది చేరగా వారికి మహిపాల్‌యాదవ్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులు సుమన్, దేవేందర్ నాయక్, గంగాదాస్, కర్క గంగారెడ్డి, మహేశ్, జ్ఞానేశ్వర్, మల్లయ్య, నరేశ్, సందీప్, చందు తదితరులు పాల్గొన్నారు.