
ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిపించాలి
ఆర్మూర్‌టౌన్: ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జ రిగే చూడాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్ అన్నా రు. ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్స్, ఎంసీహెచ్ సూపర్‌వైజర్‌లతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సమయపాలన పాటించాలని, రోగులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలందించాలని సూచించారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.