
గంజాయి బానిసలకు కౌన్సెలింగ్ ఇవ్వాలి
మోర్తాడ్: గంజాయి మత్తుకు బానిసైన వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని సీపీ సాయిచైతన్య సిబ్బందిని ఆదేశించారు. భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. అంతకుముందు గౌరవ వందనం స్వీకరించారు. సీపీ మాట్లాడుతూ.. గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మత్తు పదార్థాల నిరోధన కోసం కృషి చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ రూరల్, భీమ్‌గల్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌లు శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ, సర్కిల్ ఎస్సైలు మహేష్, అనిల్‌రెడ్డి, విక్రమ్, రాము తదితరులు పాల్గొన్నారు.