
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని మైలారం గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై లావణ్య తెలిపిన వివరాలు ఇలా.. మైలారం గ్రామానికి చెందిన దూళి గంగారాం(73) చాలా రోజులు గా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కొన్ని నెలల క్రితం ఎడమ కాలుకు గాయం కావడంతో షుగర్‌వ్యాధి కారణంగా నడవలేక పోయేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
బీబీపేట మండలంలో..
బీబీపేట: మండలంలో ఇటీవల ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని తుజాల్‌పూర్ గ్రామానికి చెందిన కన్న బాల్‌రాజ్‌గౌడ్ (54)కు కొద్ది నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నొప్పి తగ్గలేదు. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది ఈనెల 5న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అతడిని గమనించి, వెంటనే ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుమారుడు సాయికృష్ణాగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య