
డిగ్రీ ప్రాక్టికల్స్ బహిష్కరిస్తాం
● ప్రైవేట్ కాలేజ్ మేనేజ్‌మెంట్
అసోసియేషన్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16 నుంచి నిర్వహించే డిగ్రీ ప్రాక్టికల్స్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల విషయమై ప్రభుత్వానికి విన్నవించినా ప ట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రభు త్వం చేస్తున్న జాప్యంతో ప్రైవేట్ కళాశాలల భవనాల అద్దెలు చెల్లించలేక, లెక్చరర్ల జీ తభత్యాలు ఇవ్వలేక యాజమాన్యాల బతుకులు అగమ్యగోచరంగా మారాయన్నా రు. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ డిగ్రీ ప్రాక్టికల్స్ బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తెయూ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారికి లేఖ అందజేసినట్లు పేర్కొన్నారు.
పసుపు రైతుల స్టాల్‌ను సందర్శించిన మంత్రి
సుభాష్‌నగర్: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన రైతు మహోత్సవ మేళాలో జిల్లా తరఫున జేఎంకేపీఎం పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సందర్శించారు. విలువ ఆధారిత పసుపు ఉత్పత్తులను చూసి రైతులను అభినందించారు. ఈ నెలలోనే నిజామాబాద్‌లో కూడా రైతు మహోత్సవ మేళాను ఏ ర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూ చించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన పసుపును జేఎంకేపీఎం అధ్యక్షుడు పా ట్కూరి తిరుపతిరెడ్డి మంత్రికి అందజేశారు. కార్యక్రమంలో వారాహమూఖి ఎఫ్‌పీవో ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, ఫెడరేషన్ కార్యదర్శి ఏవీ రావు, జేఎంకేపీఎం సూపర్‌వైజర్ కంఠం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
నందిపేట
పోలీస్ స్టేషన్ తనిఖీ
నందిపేట్ (ఆర్మూర్): పోలీస్ కమిషనర్ సాయిచైతన్య నందిపేట పోలీస్ స్టేషన్‌ను శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సై చిరంజీవితో మాట్లాడి నందిపేట, డొంకేశ్వర్ మండలాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. రెండు మండలాల ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, కమ్యూనల్ షీట్స్‌పై నిఘా ఉంచాలని సూ చించారు. దొంగతనాల నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నించారు.

డిగ్రీ ప్రాక్టికల్స్ బహిష్కరిస్తాం