
భక్తులతో పులకించిన ఇందూరు
● హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు
● విజయయాత్ర నిర్వహించిన భక్తులు
● బందోబస్తు నిర్వహించిన పోలీసులు
హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లోని హనుమాన్ ఆలయాలు భక్తులతో శనివారం పులకరించాయి. స్వామి వారి దర్శనానికి ఆలయాల్లో భక్తులు క్యూ కట్టారు. జై హనుమాన్.. జైజై హనుమాన్ అంటూ భక్తులు స్వామి వారి నామస్మరణ చేశారు. భక్తులకు ఆలయ, గ్రామ కమిటీ సభ్యులు అన్నదానం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, హిందూ సంఘాలు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు చేపట్టిన హనుమాన్ విజయయాత్ర విజయవంతంగా సాగింది. ప్రజలంతా విజయయాత్రలో పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నామస్మరణ చేశారు. యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. – సాక్షి నెట్‌వర్క్

భక్తులతో పులకించిన ఇందూరు