
అణగారినవర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్
తెయూ(డిచ్‌పల్లి): బాబూ జగ్జీవన్‌రామ్ అట్టడుగు, అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి పేర్కొన్నారు. తెయూ ఎస్సీ సెల్ డైరెక్టర్ వాణి అధ్యక్షతన బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం రిజిస్ట్రార్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, కేంద్రంలో వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా కూడా వ్యవహరించి దళిత హక్కుల రక్షణ కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మామిడాల ప్రవీణ్, ప్రొఫెసర్ కనకయ్య, బీ అంజయ్య, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మణచక్రవర్తి, కిరణ్ రాథోడ్, బీఆర్‌నేత, విద్యార్థులు పాల్గొన్నారు.
యువత ఆదర్శంగా తీసుకోవాలి
నిజామాబాద్ సిటీ: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని కాంగ్రెస్ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ అంటరానితనానికి వ్యతిరేకంగా జగ్జీవన్‌రామ్ పోరాడారని, నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మీసాల సుధాకర్ రావు, జావేద్ అక్రమ్, ప్రొఫెసర్ విద్యాసాగర్, నరేందర్ గౌడ్, కోనేరు సాయికుమార్, గోపి, సంతోష్, ప్రమోద్, బొబ్బిలి రామకృష్ణ, వినయ్, సుభాష్ జాదవ్, నరేందర్‌సింగ్, స్వామి గౌడ్, సంగెం సాయిలు, చాంగూబాయి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి

అణగారినవర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్