
ఆగడాలకు చెక్
నిజామాబాద్
ఆకతాయిల
న్యాయం చేయడమే..
వినియోగదారులకు న్యాయం చేయడమే ఫోరం లక్ష్యమని సీజీఆర్‌ఎఫ్–2 టీజీఎన్‌పీడీసీఎల్ చైర్మన్ నారాయణ అన్నారు.
గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లో u
మంగళవారం రాత్రి సిబ్బందికి సూచనలు చేస్తున్న నార్త్ సీఐ శ్రీనివాస్
అర్ధరాత్రి వేళ ఛబుత్రా(అరుగు)ల మీద కూర్చుని గప్పాలు కొట్టే.. బైక్‌లపై రయ్‌మని దూసుకెళ్లే ఆకతాయిల ఆగడాలకు ‘ఆపరేషన్ ఛబుత్రా’ చెక్ పెడుతోంది. జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి వేళ పోలీసులు గతకొద్ది రోజులుగా విస్తృతంగా తనిఖీలు, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. సరైన కారణం చూపకుండా రోడ్లపై కనిపించిన వారిని విచారిస్తూ స్టేషన్‌లకు తరలిస్తున్నారు. మరుసటి రోజున కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు జరిమానా విధిస్తున్నారు.
సీఎస్‌ఆర్‌గా
అంబులెన్స్ అందజేత
నిజామాబాద్‌అర్బన్: కార్పొరేట్ సోషల్ రె స్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్)గా అథాంగ్ టోల్‌ప్లాజా ఆధ్వర్యంలో జిల్లా వైద్యారోగ్యశాఖకు రూ.30లక్షల విలువ చేసే అంబులెన్స్‌ను అందజేశారు. జిల్లా సమీకృత కార్యాలయా ల సముదాయంలో బుధవారం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు అంబులెన్స్‌ను అ ప్పగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. అంబులెన్స్‌ను జిల్లా ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించుకోవాలని, మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చి సీఎస్‌ఆర్ కింద ప్రజలకి ఉపయోగపడేలా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారి మధు, ఐరాడ్ మేనేజర్ వర్ష, టోల్ గేట్ మేనేజర్ అనిల్, సిబ్బంది విరాజ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
రైతులు మోసపోవద్దు
సుభాష్‌నగర్: దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మార్కెటింగ్‌శాఖ గ్రేడ్–2 సెక్రటరీ శ్రీధర్ రైతులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మా ర్కెట్ కమిటీలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం సన్నర కాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చే సుకోవాలని శ్రీధర్ సూచించారు. మార్కెట్‌యార్డులో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో మెప్మా ప్రతినిధులు, మహిళా సమాఖ్య స భ్యులు, మార్కెట్‌యార్డు సూపర్‌వైజర్ కిషన్, సిబ్బంది శంకర్‌దాస్, హమాలీలు, దడువాయిలు పాల్గొన్నారు.
చిన్నారులకు పోషకాహారం అందించాలి
ధర్పల్లి(నిజామాబాద్‌రూరల్): శారీరక, మా నసిక ఎదుగుదల కోసం చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని జిల్లా శిశు సంక్షేమ అధికారిని రసూల్ బీ పేర్కొన్నారు. ధర్పల్లి మండల కేంద్రంతోపాటు దమ్మన్నపేట్ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం గర్భిణులు, బాలింత లు, కిశోర బాలికలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రసూ ల్ బీ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లీబిడ్డల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పుట్టిన బిడ్డకు మొ దటి ఆరు నెలలపాటు తల్లిపాలు మాత్రమే పట్టించాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకారాం, మెడికల్ ఆఫీసర్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: అర్ధరాత్రి వేళ ఛబుత్రాల(అరుగు)పై కూర్చుని గప్పాలు కొట్టే, రోడ్లపై తిరిగి ఆకతాయిల ఆటకట్టించేందుకు పోలీసులు జిల్లా కేంద్రంలో ‘ఆపరేషన్ ఛబుత్రా’ నిర్వహిస్తున్నారు. నగరంలోని రోడ్లపై అర్ధరాత్రి వేళ తిరిగే వారికి చెక్ పెడుతున్నారు. ఇటీవల నాలుగు రోజుల్లో సుమారు వంద మందికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. గతంలో సీపీగా పని చేసిన కార్తికేయ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో ‘ఆపరేషన్ ఛబుత్రా’ అమలు చేశారు. అప్పటి ఏసీపీ వెంకటేశ్వర్లు ‘ఆపరేషన్ ఛబుత్రా’ను పక్కాగా అమలు చేశారు. ఆ తరువాత నాగరాజు, సత్యనారాయణ, కల్మేశ్వర్ సీపీలుగా పనిచేసిన కాలంలో నిర్వహించలేదు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన సీపీ
కొత్తగా వచ్చిన సీపీ పోతరాజు సాయిచైతన్య ఇటీవల నగరంలో రాత్రివేళల్లో పెట్రోలింగ్ వెళ్లిన సందర్భంగా యువకులు బైక్‌లపై తిరగడం, ఛబుత్రాలపై కూర్చుని ముచ్చట్లు పెట్టడాన్ని గమనించారు. వెంటనే ఆపరేషన్ ఛబుత్రా అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో గత నాలుగు రోజులుగా నిజామాబాద్ నగరంలో ఆపరేషన్ ఛబుత్రా కొనసాగుతోంది. రాత్రివేళలలో బైక్‌లపై తిరిగే వారిని సంబంధిత పోలీస్‌స్టేషన్‌లకు తరలించి వాహనాల పత్రాలను పరిశీలిస్తున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో యువకులకు కౌన్సెలింగ్ ఇస్తూ జరిమానా విధిస్తున్నారు. మరోసారి పట్టుబడితే కేసులు నమో దు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అత్యవసరమైతేనే రాత్రి వేళ బయటికి రావాలని సూచిస్తున్నారు.
గొడవలకు చెక్ పెట్టేందుకు..
నగరంలోని పలు ప్రాంతాల్లో యువకుల మధ్య ఇటీవల గొడవలు చోటుచేసుకున్న ఘటనలు ఉన్నాయి. కొన్ని చోట్ల పరస్పరం దాడులు చేసుకోగా, మరికొన్ని చోట్ల కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ పరిస్థితికి ఆపరేషన్ ఛబుత్రాతో చెక్ పెట్టే అవకాశం ఉండడంతో సీపీ ఆదేశాల మేరకు పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఆపరేషన్ ఛబుత్రా నిర్వహిస్తున్నారు.
కౌన్సెలింగ్.. జరిమానాలు
అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై తిరిగినా, ఛబుత్రాలపై కూర్చున్నా పోలీసులు స్థానిక స్టేషన్‌లకు తరలిస్తారు. ఆ తరువాత వాహనాల పత్రాలు, వ్యక్తిగత వివరాలను పరిశీలించి తరువాతి రోజు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తారు. జరి మానాలు విధిస్తారు. రెండోసారి పట్టుబడితే కేసు లు తప్పవని స్పష్టం చేసి పంపిస్తారు.
● వేరే పనులకు ముందుకురాని
ఉపాధి కూలీలు
● గతేడాదితో పోలిస్తే సగానికి తగ్గిన హాజరు
● చెరువుల్లో పూడికతీత పనులు
లేకపోవడమే కారణం
న్యూస్‌రీల్
శాంతినగర్‌లో..
ఖలీల్‌వాడి: నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న శాంతినగర్‌లో మంగళవారం రాత్రి 12 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఆపరేషన్ ఛబుత్రా నిర్వహించారు. సరైన డాక్యుమెంట్లు లేని 25 ద్విచక్రవాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రిపుల్ రైడింగ్ కేసులో ఓ వాహనాన్ని సీజ్ చేశారు. రోడ్లపై, గ్రౌండ్‌లో తిరుగుతున్న 25 మంది యువకులను స్టేషన్‌కు తీసుకెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. నార్త్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు గంగాధర్, రాజశేఖర్, లక్ష్మయ్య, 50 మంది సిబ్బంది పాల్గొన్నారు.
ఆపరేషన్ ఛబుత్రా
రెండేళ్ల తర్వాత జిల్లా కేంద్రంలో
మళ్లీ ప్రారంభించిన పోలీసులు
రాత్రి వేళల్లో గుంపులుగా
తిరిగే వారిపై చర్యలు

ఆగడాలకు చెక్

ఆగడాలకు చెక్

ఆగడాలకు చెక్

ఆగడాలకు చెక్

ఆగడాలకు చెక్