
రాములోరి కల్యాణానికి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరామనవమి పురస్కరించుకొని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు ఆదివారం జిల్లాలోని భీమ్‌గల్ మండలం పిప్రి, రహత్‌నగర్ గ్రామాలకు రానున్నారు. రహత్‌నగర్ సమీపంలోని పిప్రి వద్ద ఉన్న లొద్ది రామన్న ఆలయంలో నిర్వహించనున్న శ్రీ సీతారాముల కల్యాణంలో పాల్గొననున్నారు. రహత్‌నగర్ మహేశ్ కుమార్‌గౌడ్ సొంత గ్రామం కాగా సరిహద్దులో ఉన్న పిప్రి వద్ద ఆయన తండ్రి బొమ్మ గంగాధర్‌గౌడ్ 1969లో ఈ రామాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం వారి కుటుంబానికి సెంటిమెంట్ కావడంతో చిన్ననాటి నుంచి నేటి వరకు సేవలు చేస్తూ వస్తున్నారు. సీతారాముల కల్యాణ క్రతువులో మహేశ్ గౌడ్ కుటుంబసమేతంగా పాల్గొననున్నారు. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక మొదటిసారి గ్రామ కమిటీ ఆహ్వానం మేరకు మహేశ్ గౌడ్ రానున్నారు.
నేడు వైన్ షాపులు బంద్
ఖలీల్‌వాడి: శ్రీ రామనవమి సందర్భంగా జిల్లాలోని వైన్స్ షాపులు, కల్లు దుకాణాలు, బార్‌లను నేడు(ఆదివారం) మూసివేయాల ని సీపీ పోతరాజు సాయిచైతన్య శనివారం ఆదేశించారు. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 వరకు మూసి ఉంచాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఘనంగా బాబూ
జగ్జీవన్ రామ్ జయంతి
నిజామాబాద్‌అర్బన్: భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంఠేశ్వర్ కమాన్ వద్ద ఉన్న పాత అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్‌లు అంకిత్, కిరణ్‌కుమార్ పాల్గొని జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని బాబూ జగ్జీవన్‌రామ్ సేవలను కొనియాడారు. బా బూ జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రత్యేకించి యువత రం, విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ హనుమంతు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారిణి నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, నిజా మాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, ఆయా శాఖల అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

రాములోరి కల్యాణానికి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

రాములోరి కల్యాణానికి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్