
సమానత్వమే పూలే అభిమతం
నిజామాబాద్ అర్బన్: అన్నివర్గాల సమానత్వమే మహాత్మా జ్యోతీబాపూలే అభిమతమని, ఆ దిశగా తుది వరకు తన కృషి కొనసాగించారని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు కొనియాడారు. జ్యోతీబాపూలే జయంతి వేడుకల్లో భాగంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేడ్కర్ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉత్సవాలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక రుగ్మతలను, దురాచారాలను పారద్రోలేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుడు జ్యోతీబాపూలే అని అన్నారు. పూలే ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వీడీసీలపై ఫిర్యాదులొస్తున్నాయి
జిల్లాలోని పలు ప్రాంతాల్లో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ల పేరిట సాంఘిక బహిష్కరణలు విధిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, అలాంటి వీడీసీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ పూలే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పాటుపడుతోందన్నారు. అంతకుముందు వినాయక్‌నగర్‌లోని పూలే విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్య నారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బీసీ సంఘాల ప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారిణి స్రవంతి, సహాయ అధికారి నర్సయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు గైని గంగారాం, బుస్స ఆంజనేయులు, నరాల సు ధాకర్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సాంఘిక బహిష్కరణలు విధించే
వీడీసీలపై కఠిన చర్యలు
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
ఘనంగా జ్యోతీబాపూలే జయంతి