
పిల్లల పెంపకంలో జాగ్రత్తలు తప్పనిసరి
మోపాల్: ప్రస్తుత రోజుల్లో పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ గురూజీ అన్నారు. ఆదివారం మోపాల్ మండలం మంచిప్పలో ఉన్న జ్ఞానోదయ హైస్కూల్‌లో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో పిల్లల పెంపకంపై ప్రేరణ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జగన్ గురూజీ, మోటివేటర్ తిరునగిరి శ్రీహరి, మదం మహిపాల్ పిల్లల పెంపకం, పరీక్షల విషయంలో అపోహలు, భయం, పలు అంశాలపై వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దేవ శంకర్, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వాల్మీకి రామాయణ గ్రంథాల పంపిణీ
నిజామాబాద్ రూరల్: నగరంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న రామాలయంలో ఆదివారం శ్రీరామనవమిని పుస్కరించుకొని శ్రీ రామకృష్ణ సేవా సమితి సభ్యులు భక్తులకు వాల్మీకి రామాయణం గ్రంథాలను పంపిణీ చేశారు. ఆలయ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.