
ఆదాయంపైనే దృష్టి!
● ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు జమ
చేయించుకుంటున్న ప్రభుత్వం ●
● జిల్లాలో ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్
ఆదాయం రూ.46.23 కోట్లు జమ
మోర్తాడ్(బాల్కొండ): లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీం అమలు చేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం మూడు దశల్లో దరఖాస్తులను పరిశీలించిన తరువాత ఎల్‌ఆర్‌ఎస్ ఫీజును వసూలు చేయాలి. అయితే ఆదాయం దండిగా ఉండడంతో అసలు విషయాన్ని మరిచి ఫీజు వసూలుపైనే దృష్టి సారించిన ప్రభుత్వం ఇప్పుడిప్పుడే దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేయిస్తుండటం గమనార్హం. ఈనెల 30వ తేదీ వరకూ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ఫీజులో 25 శాతం రాయి తీ ని పొందే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో 15,212 దరఖాస్తుల ద్వారా రూ.46.23 కోట్ల ఆ దాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య 20వేలకు మించి ఉంటుందని అంచనా.
ఇప్పుడిప్పుడే మొదలవుతున్న పరిశీలన
మార్చి 31 వరకు ఫీజులో 25 శాతం రాయితీని పొంది ప్రభుత్వ ఖజానాకు సొమ్ము జమ చేసిన వారి దరఖాస్తుల పరిశీలన క్షేత్ర స్థాయిలో మొదలైంది. మొదటి దశలో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఉద్యోగులు దరఖాస్తులను పరిశీలించి ఇంటి స్థలం ఫొటోను తీసుకుని రెండో దశ పరిశీలన కో సం రెవెన్యూ అధికారులకు పంపిస్తున్నారు. రెండో దశలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, నీటిపారుదల శాఖ ఏఈలు పరిశీలించి నివేదికను అందించాల్సి ఉంది. ఈ రెండు దశలు పూర్తయిన తరువాత జిల్లా స్థా యిలో పరిశీలన చేపట్టి ప్రొసిడింగ్‌ను జారీ చేయనున్నారు. రెండు దశల్లో పరిశీలన, మూడో దశలో ప్రొ సిడింగ్‌ను జారీ చేసిన తరువాతనే ఫీజును దర ఖాస్తుదారులు ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉండ గా, ప్రభుత్వం మూడు దశల పరిశీలనను పక్కన పెట్టి ఫీజు జమ చేయించుకోవడం గమనార్హం.
మొదటి దశ సర్వే పూర్తి చేస్తున్నాం
ఫీజు చెల్లించిన వారికి సంబంధించి మొదటి దశ పరిశీలన పూర్తి చేస్తున్నాం. రెండో దశలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పరిశీలన చేసి క్లీన్‌చీట్ ఇ వ్వాల్సి ఉంది. మూడో దశలో మరోసారి దరఖాస్తులను పరిశీలించి ప్రొసిడింగ్ కాపీలను అందించనున్నారు. మరోసారి రాయితీ అవకాశం కల్పించినందున ఫీజు చెల్లించని వారు సద్వినియోగం చేసుకోవాలి. – శ్రీధర్, ఎంపీవో, మోర్తాడ్
తిరస్కరిస్తే 10 శాతం నష్టం
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు ముందస్తుగా చెల్లించగా, ఏ ఒక్క దశలో దరఖాస్తు తిరస్కరించినా ఫీజులో 10 శాతం మినహాయించుకొని మిగతా మొ త్తాన్ని ప్రభుత్వం రిఫండ్ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ముందుగానే దరఖాస్తులను పరిశీలించి ఆ తరువాత ఫీజు వసూలు చేస్తే దర ఖాస్తుదారులకు ఎలాంటి నష్టం ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.