
త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయానికి త్వరలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్లు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 12 ఏళ్లుగా యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్య ఈ నిర్ణయంతో పరిష్కారం కానుంది. నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితారాణా ఆదివారం విడుదల చేశారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన కామన్ రిక్రూట్‌మెంట్ గైడ్‌లైన్స్‌ను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసిన మార్గదర్శకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. మరోవైపు కాంట్రాక్ట్ ప్రాతిపదికన యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫె సర్లు (అకడమిక్ కన్సల్టెంట్లు)గా విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. ప్రభు త్వం జారీచేసిన మార్గదర్శకాల్లో కాంట్రాక్టు అధ్యాపకుల ఊసే లేకపోవడంతో రెగ్యులరైజ్ కోసం పోరాడుతున్న వారికి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని చెప్పొచ్చు. దీంతో ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కోసం సోమవారం ఓ యూలో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రభుత్వం కేవలం అసిస్టెంట్ ప్రొ ఫెసర్ నియామకాలకు మాత్రమే మార్గదర్శకాలు జారీచేయడం, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుల భ ర్తీ ఊసే లేకపోవడంతో నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెయూలో ఖాళీలు ఇలా..
నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
తెయూలో 42 ఖాళీలు
నిరుద్యోగుల్లో ఆశలు
కాంట్రాక్ట్ అధ్యాపకుల్లో ఆందోళన
ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ల
నియామకమెన్నడో?
పాలకమండళ్ల ఆమోదం తర్వాతే..
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పాలకమండళ్ల సమావేశంలో ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రభుత్వం నియామకాల నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అనంతరం రిజర్వేషన్, రోస్టర్ విధానాలు తయారు చేస్తారు. రెండు, మూడు నెలల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
– టీ యాదగిరిరావు, వీసీ, తెయూ

త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ