
వెదురుబొంగుల షాపులో అగ్నిప్రమాదం
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని ఓ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. వర్ని చౌరస్తా వద్ద ఓ వెదురు బొంగుల షాపులో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. అ క్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సీఐ ప్రసాద్ అక్కడి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లు ఘటన స్థలా నికి చేరుకోగా, ఫైర్ ఆఫీసర్ నర్సింగ్‌రావు ఆఽధ్వర్యంలో సిబ్బంది మంటలను అర్పివేశారు. షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు, సుమారు రూ.10లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.