
‘ట్రామా కేర్’పై చిగురించిన ఆశలు
ఇందల్‌వాయి: ప్రమాదాల్లో క్షతగాత్రులకు సత్వరమే అత్యవసర చికిత్సలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 90 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్‌ను నెలకొల్పేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లా పరిధిలో సుమారు 75 కి.మీల మేర జాతీయ రహదారి ఉంది. దీనికి అనుసంధానంగా రాష్ట్ర రహదారులు కూడా ఉన్నాయి. వీటిపై నిత్యం ఏదో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో అత్యవసర చికిత్స అందక కొందరి ప్రాణాలు పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇందల్‌వాయి, బాల్కొండ, ఆర్మూర్ ప్రాంతాల్లో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుపై ఆశలు చిగురించాయి.
అనుకూలంగా ఇందల్‌వాయి పీహెచ్‌సీ
జిల్లాలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఒక్క ట్రామా కేర్ సెంటర్ కూడా లేదు. కామారెడ్డిలో ఓ సెంటర్ ఉన్నా నిర్దేశిత వైద్యసేవలందక పోవడంతో క్షతగాత్రులు ఇబ్బందులుపడుతున్నారు. జాతీయ రహదారిని ఆనుకొని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాలకు సమాన దూరంలో ఉన్న ఇందల్‌వాయి పీహెచ్‌సీని ట్రామా కేర్ సెంటర్‌గా మార్చి నిరంతర వైద్య సేవలందిస్తే క్షతగాత్రులకు దోహదపడే అవకాశం ఉంది.
ఇందల్వాయి పరిధిలో రోడ్డు ప్రమాదాలు
జిల్లా పరిధిలోని జాతీయ
రహదారిపై లేని సెంటర్
క్షతగాత్రులకు గోల్డెన్ అవర్‌లో
అందని చికిత్స
రాష్ట్ర వ్యాప్తంగా 90 కేంద్రాల
ఏర్పాటుకు సర్కారు కసరత్తు
అత్యవసర చికిత్స ఆలస్యం అవదు
రాష్ట్రంలో సగటున రోజుకు 21 మంది రోడ్డు ప్రమాదా ల్లో చనిపోతున్నారు. ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుతో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారికి త్వరగా చికిత్స అందే అవకాశం ఉంటుంది. దీంతో రోడ్డు ప్రమాద మరణాలు తగ్గుతాయి. ట్రామాకేర్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాద బాధితులకు ఊరట కలుగుతుంది.
– కే మల్లేశ్, సీఐ, డిచ్‌పల్లి
ప్రతిపాదనలు అందించాం
మంత్రి దామోదర రాజనరసింహ జనవరిలో నియోజకవర్గంలో ప ర్యటించినప్పుడు ఇందల్‌వాయి లో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు అవశ్యకతపై వివరించి ప్రతిపా దనలు అందజేశాం. అత్యవసర చికిత్సల కోసం డీఎంహెచ్‌వోతో మాట్లాడి ఇద్దరు అదనపు డాక్టర్లను డిచ్‌పల్లి సీహెచ్‌సీ కేటాయించాం. ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తా.
– ఆర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్యే, నిజామాబాద్ రూరల్

‘ట్రామా కేర్’పై చిగురించిన ఆశలు