
బైక్ అదుపుతప్పి ఒకరి మృతి
మోర్తాడ్(బాల్కొండ): భీమ్‌గల్ మండలంలో బైక్ అదుపుతప్పడంతో ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌కు చెందిన గండికోట మహేష్(42) కొన్నేళ్ల నుంచి మోర్తాడ్‌లో ఒంటరిగా జీవిస్తున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడు సొంత పనిపై ఆదివారం భీమ్‌గల్‌కు బైక్‌పై వెళ్లి, తిరిగి వస్తుండగా భీమ్‌గల్ మండలం జాగిర్యాల్ రోడ్డు మార్గంలో బైక్ అదుపుతప్పింది. దీంతో అతడు బైక్ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడటంతో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి..
ఇందల్వాయి: జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి ఎల్లమ్మ గుడి దగ్గర ఆదివారం ఒక గుర్తుతెలియని వ్యక్తి నిస్సహాయస్థితిలో ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని అతడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 65 నుంచి 70ఏళ్ల లోపు ఉంటుందని, తెలుపు చొక్కా ధరించి ఉన్నాడన్నారు. ఎవరైనా అతడిని గుర్తిస్తే ఇందల్వాయి ఎస్సై ఫోన్ నంబర్ 8712659854, సీఐ ఫోన్‌నంబర్ 8712659851ను సంప్రదించాలన్నారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
రుద్రూర్: పోతంగల్ మండలం సుంకిని గ్రామంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్‌లను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం అందడంతో సుంకినికి వెళ్లగా రెండు ట్రాక్టర్లు పట్టుబడ్డాయన్నారు. వాటిని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
మహిళ అదృశ్యం
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని గొల్లవాడకు చెందిన కొట్టూరి లక్ష్మి అనే మహిళ అదృశ్యమైనట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఈనెల 5న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె ఇప్పటికీ తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు చాలా చోట్ల గాలించినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో ఆమె భర్త పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.