
కల్లుదుకాణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు
ఎడపల్లి(బోధన్): మండలంలోని జానకంపేట్ గ్రామంలో అనుమతి లేకుండా కల్లు విక్రయిస్తున్న దుకాణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. అర్సపల్లి గ్రామానికి చెందిన అమర శ్రీనివాస్‌గౌడ్ లైసెన్స్ లేకుండా కల్లు విక్రయించడంతో కేసు నమోదు చేసి బోధన్ ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు.దుకాణంలో నిల్వ ఉన్న 350 లీటర్ల కల్లును అధికారులు పారబోసారు. సీఐ స్వప్న,హెడ్ కానిస్టేబుల్ రాజన్న, కానిస్టేబుళ్లు హమీద్, ఉత్తం, శ్యామ్, ఆశన్న పాల్గొన్నారు.
వివాహిత అదృశ్యం
రెంజల్(బోధన్): మండలంలోని నీలా గ్రామానికి చెందిన సుల్తానా అనే వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై చంద్రమోహన్ గురువారం తెలిపారు. ఆమెకు సాటాపూర్ గ్రామానికి చెందిన యువకుడితో కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో ఇటీవల పుట్టింటికి వచ్చింది. ఈ నెల 8న ఆమె స్నేహితురాలిని కలిసి వస్తానని కుటుంబీకులకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. ఇప్పటి వరకు తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.