
51ఏళ్ల తర్వాత కలిసిన బాల్య మిత్రులు
డిచ్‌పల్లి: వారంతా పూర్వ విద్యార్థులు. 51ఏళ్ల క్రితం పదోతరగతి చదివి ఎక్కడెక్కడో స్థిరపడిన వారు. మళ్లీ ఇన్నాళ్లకు కలిశారు. గత మధురస్మృతులను నెమరువేసుకుని పరవశించి పోయారు. జిల్లా కేంద్రంలోని మాణిక్ భవన్ పాఠశాలలో 1973–74 పదోతరగతి బ్యాచ్ విద్యార్థులు డిచ్‌పల్లిలోని ఫాంహౌస్‌లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆటపాటలతో అలరించారు. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు అమెరికాలో స్థిరపడిన ఒకరు సమ్మేళనానికి తరలివచ్చారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా ఆటపాటలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. డిచ్‌పల్లి సొసైటీ మాజీ చైర్మన్ గజవాడ జైపాల్, నాగరాజు, అశోక్, చిరంజీవి, ఉమాపతి, చంద్రసేన్, సుబ్రహ్మణ్యం, రాజేశ్వర్, జనార్ధన్ యాదవ్, వీరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో 22ఏళ్లకు..
కామారెడ్డి రూరల్: కామారెడ్డిలోని వివేకనంద పాఠశాలలో 2002–2003 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు 22 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. 60 మంది విద్యార్థులకుగాను 45 మంది పూర్వ విద్యార్థులు ఆదివారం పట్టణంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరై, ఆనాటి తీపి గుర్తులను గుర్తుచేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆనాటి గురువులను సన్మానించారు. అనంతరం ఆటపాటలు, వింధుభోజనంతో ఆహ్లాదంగా గడిపారు. నగేష్‌గుప్తా, మహేశ్వరీ, బబిత, జ్యోతి, దొడ్లె సంజీవ్‌కుమార్, సుధాకర్, భాస్కర్, రణధీర్ తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డిలో ముప్పై ఏళ్లకు..
ఎల్లారెడ్డిరూరల్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలు ర ఉన్నత పాఠశాలకు చెందిన 1994–95 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి 30 ఏళ్ల తరువాత విద్యార్థులంతా కలుసుకున్నారు. అనంతరం వారికి పాఠాలను బోధించిన ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పద్మ శ్రీకాంత్, వెంకట్‌రాములు, వెంకటేశం, దత్తు, విజయ్, నర్సింలు తదితరులున్నారు.
పెద్దవాల్గోట్‌లో 21ఏళ్లకు..
సిరికొండ: మండలంలోని పెద్దవాల్గోట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2003–04 ఎస్సెస్సీ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని సరదాగా గడిపారు. ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు.
పద్మాజీవాడిలో 25ఏళ్లకు..
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజీవాడిలో ఆదివారం మాతృశ్రీ జూనియర్ కళాశాలకు చెందిన 1998–2000 బ్యాచ్ ఇంటర్ విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత ఒక్కచోట చేరారు. పద్మాజీవాడి శివారులో ఓ వ్యవసాయ క్షేత్రంలో కలుసుకుని గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి గురువులను సన్మానించారు. గురువులు రాజ గంబీర్‌రావు, గోపాల్‌రెడ్డి, లింగారెడ్డి, కృష్ణ, కృష్ణ ప్రసాద్, పూర్వ విద్యార్థులు శ్రీధర్ రెడ్డి, కృష్ణరెడ్డి, సంతోష్, రాజేందర్, శ్రీకాంత్, మోహన్, గంగాధర్, సురేందర్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

51ఏళ్ల తర్వాత కలిసిన బాల్య మిత్రులు

51ఏళ్ల తర్వాత కలిసిన బాల్య మిత్రులు

51ఏళ్ల తర్వాత కలిసిన బాల్య మిత్రులు

51ఏళ్ల తర్వాత కలిసిన బాల్య మిత్రులు