జడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు | Two ZP And 60 Mandal Parishad Election Updates Today In Andhra Pradesh, More Details Inside | Sakshi
Sakshi News home page

జడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు

Published Thu, Mar 27 2025 8:13 AM | Last Updated on Thu, Mar 27 2025 6:54 PM

Andhra Pradesh: Two Zp And 60 Mandal Parishad Election Updates

చిత్తూరు జిల్లా: పోలీస్ వాహనంలో ఎంపీటీసీలను తరలిస్తుండగా వెంటాడుతున్న టీడీపీ శ్రేణులు

టీడీపీ నేతలు.. రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపారు. బలం లేకపోయినా ఎంపీపీ స్ధానాలు కైవసం చేసుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది.

అనంతపురం:

టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

  • బలం లేకపోయినా రామగిరి ఎంపీపీ ఎన్నిక లో పోటీకి దిగారు
  • పేరూరు ఎమ్పీటీసీ భారతిని కిడ్నాప్ చేశారు
  • కొందరు సీఐలు, ఎస్సైలు పరిటాల సునీత కు తొత్తుగా వ్యవహరిస్తున్నారు
  • వందలాది మంది టీడీపీ గూండాలను రామగిరి లోకి ఎలా అనుమతించారు?
  • పరిటాల హింసా రాజకీయాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాం 
     

విజయనగరం జిల్లా

భోగాపురం మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం

  • వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ పచ్చిపాల నాగలక్ష్మిని వైస్ ఎంపీపీగా ప్రకటించిన ఎన్నికల అధికారి.

 

చిత్తూరు జిల్లా:

కుప్పం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు: ఎమ్మెల్సీ భరత్

  • ఎంపీటీసీ లను ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలోకి రాకుండా అడ్డుకున్నారు
  • పోలీసులు నామమాత్రంగా  బందోబస్తు నిర్వహించారు
  • మా ఎంపీటీసీ వెళ్తున్న బస్సును  అడుగు అడుగునా అడ్డగించారు
  • పోలీసులు సెక్యూరిటీ ఉన్నా చోద్యం చూస్తున్నారు
  • టిడిపి సీనియర్ నేతలు గంజాయి కేసులు పెడతాము అని ఎంపీటీసీలు ను  బెదిరించారు
  • రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతోంది అని చెప్తున్న చంద్రబాబు కుప్పం లో ఏం జరుగుతుందో అందరు చూశారు
  • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ లను భయబ్రాంతులకు గురి చేశారు
  • ఈ రోజు మా పై దాడి కూడా చేయాలని కుట్ర చేశారు
  • ఈ ఎన్నికలు పై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం,
  • కోరం లేకుండా ఎంపిపి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు..

గోవింధప్ప శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్

  • ప్రజాస్వామ్య వాదులు కుప్పం వైపు ఒకసారి చూడండి..ఇక్కడ ఏం జరుగుతుందో..
  • కోరం లేకుండా రామకుప్పం ఎంపిపి ఎన్నికలు నిర్వహించారు
  • టిడిపి నాయకులతో కుమ్మక్కు రాజకీయం చేశారు
  • కుప్పం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యం ను ఖూనీ చేశారు
  • అధికారులు చేసిన తీరుపై హైకోర్టు లో ఈ కేసు సూటిగా తీసుకోవాలి
  • టిడిపి కు కుట్ర రాజకీయాలు చేస్తోంది

 

కుందనందన రెడ్డి, రామకుప్పం ఎంపీటీసీ

  • ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడు జరగ లేదు
  • సిఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అంటే ఒక ఆదర్శంగా ఉండాలి
  • వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపిటిసి అందరినీ తప్పుడు కేసులు పెడతామని బెదిరించడం
  • మా పై కేసులు పెడతాం అని బెదిరించారు
  • రామకుప్పం వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీ అందరినీ బెదిరించారు
  • దీనిపై న్యాయ పోరాటం చేస్తాం, హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం

 

ఏలూరు: కారుమూరి ఇంటిని ముట్టడించిన పచ్చమూక
👉ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో అత్తిలిలో తీవ్ర ఉద్రిక్తత
👉కూటమికి తగిన సంఖ్యా బలం లేకపోవడంతో
👉గెలుపు కోసం ఫ్యాక్షన్‌ రాజకీయాలకు తెరతీసిన ఎమ్మెల్యే ఆరుమిల్లి
👉మాజీ మంత్రి కారుమూరి నివాసంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు
👉ఎన్నికకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కారుమూరి ఇంటిని ముట్టడించిన పచ్చమూక

వైస్ ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ
👉పల్నాడు జిల్లా: నరసరావుపేట రూరల్ మండలం వైస్ ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ
👉వైస్ ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ దారుణాలకు ఒడిగట్టింది: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి
👉పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు నిర్వహిస్తోంది
👉రెండు రోజుల నుంచి మా ఎంపీటీసీ సభ్యులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు
👉పోలీసులతో కేసులు పెడతావని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
👉ఎంపీపీ మోరబోయిన సుబ్బాయమ్మ భర్తను రాత్రి పోలీసులు తీసుకువెళ్లారు
👉పాలపాడు ఎంపీటీసీ రామిరెడ్డిని పోలీసులు తీసుకువెళ్లారు
👉పోలీసులే వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను తీసుకెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
👉టీడీపీ నాయకులు, పోలీసుల వైఖరిని నిరసిస్తూ మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాం
👉వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నామినేషన్ వేయరు
👉లోకేష్ పోలీసులను అడ్డంపెట్టి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాడు

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకం
👉కుప్పం మెయిన్ రోడ్డు అన్నవరం క్రాస్ వద్ద ఎంపీటీసీలను తరలిస్తున్న వాహనాన్ని అడ్డగించిన టీడీపీ శ్రేణులు
👉రోడ్డుపై బైఠాయించిన టీడీపీ శ్రేణులు. పరిస్థితి ఉద్రిక్తం
👉ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా గెలవని రామకుప్పం మండలంలో ఎంపీపీ ఎన్నిక కోసం అడ్డదారుల్లో ప్రయత్నాలు

టీడీపీ అరాచకం.. ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ
తూర్పుగోదావరి: అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు ఎంపీపీ స్థానాన్ని అడ్డగోలుగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న టీడీపీ
👉బిక్కవోలు మండలంలో ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా లేని టీడీపీ
👉బెదిరింపులు, ప్రలోభాలు చూపి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను తమ వైపుకు తిప్పుకున్న టీడీపీ నేతలు
👉టీడీపీ వ్యవహార శైలితో ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ నేతలు

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
చిత్తూరు జిల్లా: వి.కోట మండలం పట్రపల్లి గ్రామం జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు నివాసం నుంచి పోలీస్ భద్రత నడుమ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను రామకుప్పం ఎంపీడీవో కార్యాలయానికి తరలిస్తుండగా, మార్గ మధ్యలో వి.కోట వద్ద టీడీపీ శ్రేణులు అడ్డగించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. హైకోర్టు ఆదేశాలతో బందోబస్తుతో తరలిస్తుండగా.. పోలీస్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు.

తాడేపల్లి: జడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు తెరతీసింది. బలం లేకున్నా దొడ్డిదారిన పదవులు దక్కించుకునేందుకు కుట్రలు చేస్తోంది. వైఎస్సార్‌సీపీ సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు భారీఎత్తున ప్రలోభాలకు పాల్పడుతోంది. తమ దారికి రాకుంటే కిడ్నాప్‌‌లు, బెదిరింపులు, ఆస్తుల ధ్వంసం చేస్తూ.. నిన్నటి నుంచే అనేకచోట్ల టీడీపీ నేతలు  భీతావాహ వాతావరణం సృష్టించారు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో టీడీపికి ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో ఎంపీటీసీ, ఆమె భర్త కిడ్నాప్‌ చేశారు.

తూర్పు గోదావరి జిల్లా జిక్కవోలు ఎంపీటీసీలకు రూ.3 లక్షల చొప్పున ఎర వేశారు. ముగ్గురు ఎంపీటీసీలున్న కాకినాడ రూరల్ ఎంపీపీ పదవి కోసం జనసేన బరితెగించింది. ఒకే సభ్యుడు ఉన్న వైఎస్సార్ జిల్లాలో జెడ్పీ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు హైకోర్టులో పిటిషన్ వేసింది. టీడీపీ, జనసేన అరాచకాలను చూసి ప్రజాస్వామ్యవాదులు విస్తుపోతున్నారు.

జెడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు

👉శ్రీ సత్యసాయి జిల్లా: ఎంపీపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు.. రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపారు. బలం లేకపోయినా ఎంపీపీ స్ధానాలు కైవసం చేసుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతల దౌర్జన్యాలకు దిగుతున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో విప్ జారీ చేసేందుకు వెళ్లిన ముగ్గురు వైఎస్సార్ సీపీ నేతలపై దాడి చేసిన పరిటాల వర్గీయులు.. వైఎస్సార్ సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు.

👉వైఎస్సార్‌సీపీ నేతల వాహనాల్లో మారణాయుధాలు ఉన్నాయంటూ పోలీసులు కౌంటర్ కేసులు నమోదు చేశారు. రామగిరిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యాలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు. కదిరి వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు కిడ్నాప్ కేసులు నమోద చేయగా, తాము సురక్షితంగా ఉన్నామని చామలగొంది, కటారుపల్లి ఎంపీటీసీలు సెల్ఫీ విడియో విడుదల చేశారు. అయినప్పటికీ కదిరి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మక్బూల్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా సహా ఆరుగురిపై కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. దీంతో జిల్లా పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

👉చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రామకుప్పం ఎంపీపీ ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. రామకుప్పం ఎంపీడీవో కార్యాలయం బి. ఫార్మ్ తీసుకునేందుకు వెళ్లిన మురుగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

👉ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్‌ను పోలీలసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారు. ఏ స్టేషన్‌కు తీసుకువెళ్లారో కూడా పోలీసులు చెప్పలేదు. మురుగేశ్‌తో పాటు సర్పంచ్‌లు  మోహన్ నాయక్, భాస్కర్ నాయక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మురుగేష్, సర్పంచ్‌ మోహన్  నాయక్, భాస్కర్ నాయక్‌లను పోలీసులు విడిచి పెట్టారు.

👉ఏలూరు జిల్లా: నేడు కైకలూరు మండలం వైస్ ఎంపీపీ-2 ఎన్నిక జరగనుంది. వైఎస్‌ ఎంపీపీ-2 ఎన్నికకు సైతం అధికారి ప్రలోభాలకు తెరతీసింది. బలం లేకపోయినా ప్రలోభాలతో వైస్ ఎంపీపీ- 2 స్థానాన్ని దక్కించుకునేందుకు కుట్రలు చేస్తోంది. ఉదయం 11 గంటలకు కైకలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నిక జరగనుంది. చేతులు ఎత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించనున్నారు.

👉కృష్ణా జిల్లా: రామవరప్పాడు ఉపసర్పంచ్‌కు ఎన్నిక ఇవాళ జరగనుంది. వార్డు సభ్యురాలు రాజీనామా చేయడంతో ఉపసర్పంచ్ పదవికి 
ఎన్నిక నిర్వహించనున్నారు. ఉప సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు టీడీపీ చీప్ పాలిటిక్స్‌ తెరతీసింది. 11వ వార్డు సభ్యుడు కత్తుల శ్రీనివాస్‌కు వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యుల మద్దతు, ఆరో వార్డు సభ్యుడు అద్దెపల్లి సాంబశివనాగరాజుకు కూటమి మద్దతు ఉంది. కత్తుల శ్రీనివాస్‌కే మెజారిటీ మద్దతు ఉంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది.

👉వైఎస్సార్ జిల్లా: నేడు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో మూడు వైస్ ఎంపీపీల ఎన్నిక జరగనుంది. రాయచోటి, ఖాజీపేట, ఒంటిమిట్ట వైస్ ఎంపీపీలను పాలకవర్గాలు ఎన్నుకోనున్నాయి. పూర్తి స్థాయి బలం ఉండటంతో మూడు చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించే అవకాశం ఉంది. పొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక కూడా జరగనుంది.

👉తిరుపతి జిల్లా: తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ ఎన్నికల్లో ఉత్కంఠత కొనసాగుతోంది. పటిష్ట బందోబస్తు నడుమ తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి పార్టీల అరాచకాలను దృష్టిలో ఉంచుకుని భద్రత కోసం ముందుగానే వైఎస్సార్‌షీపీ ఇన్‌చార్జ్‌ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల క్యాంప్‌ నుంచి వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీలు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.

విమానాశ్రయం నుంచి తుమ్మలగుంట వరకు ఎంపీటీసీల బస్సులను భారీ భద్రత నడుమ పోలీసులు తరలించారు. మరి కాసేపట్లో తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీటీసీలు పాల్గొననున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అభ్యర్థిగా పేరూరు-1 ఎంపీటీసీ మూలం చంద్రమోహన్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ఎంపీపీ ఎన్నికల్లో బలం లేనందున పోటీ నుంచి టీడీపీ తప్పుకున్నట్లు సుమాచారం. వైఎస్సార్‌సీపీకి వన్ సైడ్ మెజారిటీ ఉండటంతో సునాయాసంగా విజయం సాధించే అవకాశాలున్నాయి.

టీడీపీ ద్వంద్వనీతి
👉 వైఎస్సార్‌ జిల్లా: జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. గురువారం కలెక్టర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ నేతృత్వంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10గంటలకు నామినేషన్‌ స్వీకరణ, 12గంటలకు నామినేషన్లు పరిశీలన పూర్తి, అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. 1 గంటలకు నామినేషన్‌ ఉపసంహరణ చేపట్టనున్నారు. ఆపై పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కొనసాగించనున్నారు.

👉జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్‌ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.

👉బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్‌ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్‌ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్‌ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్‌ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్‌కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కాగా చైర్మన్‌ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించింది.

 

 

 

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement