Zilla Parishad
-
కూటమి దౌర్జన్యాలకు తెర.. తిరిగింది ఫ్యాన్ గిరగిర
సాక్షి నెట్వర్క్: అధికార కూటమి ప్రభుత్వ బెదిరింపులు, దౌర్జన్యాలు, అడ్డంకుల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన ‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తన హవాను చాటుకుంది. అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగుర వేసింది. ఎక్కడికక్కడ అధికార కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు తీవ్ర బెదిరింపులకు పాల్పడినా చాలా చోట్ల వారి ఆటలు సాగలేదు. పలు చోట్ల ఎంతగా ఒత్తిడి ఎదురైనా ఎంపీటీసీ/జెడ్పీటీసీ/వార్డు సభ్యులు వైఎస్సార్సీపీ అభ్యర్థులు, మద్దతుదారుల పక్షానే నిలిచి ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెప్పారు. తీవ్ర నిర్బంధాలు.. ప్రలోభాలు.. భయపెట్టడాలు.. దాడులు.. వైఎస్సార్సీపీ సభ్యులపైకి పోలీసుల ప్రయోగాలు.. అయినప్పటికీ అధికార కూటమి పార్టీలకు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కలేదు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేసినా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తాము గెలిచిన పార్టీ వైఎస్సార్సీపీ జెండాను గట్టిగా పట్టుకుని మరోసారి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా అధికార టీడీపీ వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. ఒక జడ్పీ చైర్మన్, 24 ఎంపీపీ, 17 వైస్‌ఎంపీపీ, 8 కో ఆప్షన్ సభ్యుల స్థానాలు మొత్తం కలిపి 50 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగగా, 40 స్థానాల్లో (ఇందులో ఒక వైస్ ఎంపీపీ రెబల్) వైఎస్సార్సీపీ గెలిచింది. ఆరు స్థానాల్లో టీడీపీ, రెండు చోట్ల జనసేన, ఒకచోట బీజేపీ.. ప్రలోభాలతో గట్టెక్కారు. 7 స్థానాల్లో ఎన్నిక వివిధ కారణాలతో వాయిదా పడింది. 210 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం ఎన్నికలు నిర్వహించింది. ఇందులో 184 పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నిక పూర్తయింది. వార్డు సభ్యుల పదవి ఖాళీగా ఉండటం వల్ల 16 పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నిక రద్దయింది. మరో పది పంచాయతీల్ల్లో ఉప సర్పంచు ఎన్నిక వాయిదా పడింది. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ముత్యాల రామగోవిందరెడ్డి ఏకీగ్రవంగా ఎన్నికయ్యారు. దౌర్జన్యకాండ.. వైఎస్సార్ జిల్లా గోపవరంలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన ఉప సర్పంచ్ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డిపై దాడి చేస్తున్న టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ జెడ్పీ పీఠంపై ఫ్యాన్ రెపరెపలు వైఎస్సార్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా బ్రహ్మంగారిమఠం జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ డిక్లరేషన్ అందజేసి, ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం ఉదయం 10 గంటలకు సహాయ ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రామగోవిందురెడ్డి అభ్యరి్థత్వాన్ని మాత్రమే జెడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించడం, బలపర్చడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలోని 48 మంది జెడ్పీటీసీ సభ్యుల్లో ఒక్కరు మాత్రమే టీడీపీ సభ్యుడు. ఐదుగురు వైఎస్సార్సీపీ సభ్యులను టీడీపీ నేతలు బలవంతంగా, ప్రలోభాలతో ఆ పారీ్టలోకి లాక్కున్నారు. ఈ లెక్కన వైఎస్సార్సీపీకి నికరంగా 42 సభ్యుల మద్దతు ఉండగా, వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి మాతృమూర్తి వియోగంతో ఎన్నికకు హాజరు కాలేకపోయారు. దీంతో 41 మంది జెడ్పీటీసీ సభ్యులు రామగోవిందురెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాడులకు తెగబడ్డ టీడీపీ శ్రేణులు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యకర్తలు యథేచ్ఛగా దాడులకు తెగించారు. రెండు కార్లలో వైఎస్సార్సీపీ మద్దతుదారులైన 14 మంది వార్డు సభ్యులు రాగా, గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని పెద్దమ్మ గుడి వద్ద పోలీసులు వారిని నిలిపేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాలని చెప్పడంతో వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డి కారు దిగబోయాడు. అంతలోనే వందల సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కారు వద్దకు వచ్చి అతడిపై దాడి చేస్తూ ఈడ్చుకెళ్లారు. తర్వాత ఆయన అక్కడి నుంచి తప్పించుకుని గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి చేరుకున్నారు. కానీ మిగిలిన వార్డు సభ్యులు కారులోనే ఉండిపోయారు. దీంతో టీడీపీ నేతలు కారు అద్దాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో వాహన డ్రైవర్‌తో పాటు వార్డు మెంబర్లకు గాయాలయ్యాయి. పంచాయతీ కార్యాలయంలోకి చొరబడిన టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు బచ్చల పుల్లయ్య, బచ్చల ప్రతాప్, తోట మహేశ్వరరెడ్డి, వంగనూరు మురళీధర్‌రెడ్డి, చీమల రాజశేఖరరెడ్డి, గంటా వెంకటేశ్వర్లు, బొగ్గుల సుబ్బారెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఎన్నిక జరుగుతున్న కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమేశారు. ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి కోరం తప్పకుండా ఉండాలని చెప్పడంతో టీడీపీ నాయకులు 10వ వార్డు మెంబర్ కందుల బీబీ, 9వ వార్డు మెంబర్ షేక్ ఖాదర్ బాషా, 4వ వార్డు మెంబర్ కేశవ స్థానంలో నకిలీ గుర్తింపు కార్డులతో కొత్త వ్యక్తులను వార్డు సభ్యులు అని చెప్పి కార్యాలయంలోకి పంపారు. విచారణలో వారు వార్డు సభ్యులు కాదని నిర్ధారించారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి వచ్చేందుకు కారులో ఉన్న వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు ప్రయతి్నంచగా టీడీపీ నాయకులు మళ్లీ దాడులకు పాల్పడ్డారు. కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, ఒంటిమిట్ట వైస్ ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ బెదిరింపులు, ప్రలోభాల పర్వంతో చేజిక్కించుకుంది. ఖాజీపేట ఉప మండలాధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ (రెబల్) అభ్యర్థి ముమ్మడి స్వప్న విజయం సాధించారు. రాయచోటి రూరల్ మండల ఉపాధ్యక్షురాలు–2గా వైఎస్సార్ సీపీకి చెందిన శిబ్యాల ఎంపీటీసీ సభ్యురాలు నాగ సుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.త్రిపురాంతకంలో టీడీపీకి దిమ్మ తిరిగేలా షాక్ప్రకాశం జిల్లాలో గురువారం రెండు ఎంపీపీలు, ఒక వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్, నాలుగు ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి. రెండు ఎంపీపీలతో పాటు వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యుడిని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మార్కాపురం ఎంపీపీగా బండి లక్ష్మిదేవి, త్రిపురాంతకం ఎంపీపీగా ఆళ్ల సుబ్బమ్మ, పుల్లలచెరువు వైస్ ఎంపీపీగా లింగంగుంట్ల రాములు, యర్రగొండపాలెం కో–ఆప్షన్ సభ్యునిగా సయ్యద్ సాధిక్లు వైఎస్సార్సీపీ తరుఫున ఎన్నికయ్యారు. సృజన, కృష్ణలతో ఎంపీపీ సుబ్బమ్మ త్రిపురాంతకంలో ఎంపీటీసీ సభ్యురాలు ఎం.సృజనను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన టీడీపీకి ఆమె దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఎంపీపీ ఉప ఎన్నికలో పాల్గొనేందుకు టీడీపీ మద్దతు వర్గంతో వచ్చిన ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థినిగా పోటీ చేసిన ఆళ్ల సుబ్బమ్మకు మద్దతుగా చేయి ఎత్తారు. దీంతో మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి ఆమె చున్నీ పట్టుకుని లాగాడు. చేయిదించమని గట్టిగా అరుస్తూ గద్దించినా సృజన చలించలేదు. దీంతోపాటు మేడపి గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండిపెండెంట్ ఎంపీటీసీ సభ్యుడు పి.కృష్ణ నేరుగా వచ్చి సుబ్బమ్మకు మద్దతిచ్చారు. ఫలితంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ ఎంపీపీగా ఎన్నికైంది. పుల్లలచెరువులో కూడా బలం లేకపోయినా టీడీపీ కుయుక్తులు పన్నింది. రెండు వర్గాలకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీలో వైఎస్సార్సీపీ వైస్ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది.జగనన్న పార్టీకే జై ‘మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి వెంటే ఉంటానని మాట ఇచ్చాను. నిలబెట్టుకున్నాను. నేను మొదటి నుంచి జగనన్న అభిమానిని. ఆయన చరిష్మాతోనే ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచా. కొంత మంది నన్ను మభ్య పెట్టాలని చూశారు. మూడు రోజులుగా హౌస్ అరెస్ట్ చేసి ఇప్పుడు ఎన్నిక సందర్భంగా ఇక్కడికి తీసుకొచ్చారు. – ఎం.సృజన, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం–2 ఎంపీటీసీ సభ్యురాలుధీరనారి... నాగేంద్రమ్మప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం వైస్ ఎంపీపీ పదవికి గురువారం జరిగిన ఉప ఎన్నికలో టీడీపీకి ఓటు వేయాలని భర్త ఒత్తిడి తెచ్చినా, భార్య మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఓటు వేసి అటు నుంచి అటే పల్నాడులోని పుట్టింటికి వెళ్లింది. పుల్లల చెరువు మండలం ముటుకుల విద్యుత్ సబ్ స్టేషన్లో పోలయ్య నైట్ వాచ్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య వి.నాగేంద్రమ్మ మర్రివేముల ఎంపీటీసీ సభ్యురాలు. మండల వైస్ ఎంపీపీగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు పోలయ్యపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. చేసేదిలేక పోలయ్య తన భార్యతో ఓటు వేయిస్తానని చెప్పారు. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైస్ ఎంపీపీ పోటీలో ఉన్న రాములుకు మద్దతుగా చేయి ఎత్తారు. ఆ తర్వాత తన భర్తతో మాట పడాల్సి వస్తుందని అటునుంచి అటే పల్నాడు జిల్లా దాచేపల్లిలోని తన పుట్టింటికి వెళ్లారు.రామగిరిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీల అడ్డగింతశ్రీ సత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చిల్లర రాజకీయం చేశారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్‌ను అడ్డు పెట్టుకుని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను బెదిరించారు. ప్రలోభాలకు గురిచేసే యత్నం చేశారు. మొత్తంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా చేసి ఎంపీపీ పదవి చేజిక్కించుకోవాలని భావించారు. తీవ్ర గందరగోళం మధ్య ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. కంబదూరు ఎంపీపీగా ఎన్నికైన లక్ష్మీదేవితో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీ తలారి రంగయ్య రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు గానూ 9 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. ఎంపీపీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ క్రమంలో ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ ఇటీవల మరణించారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే టీడీపీ తరఫున ఒక్క మహిళా సభ్యురాలు కూడా లేకపోవడంతో ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపారు. టీడీపీ తరఫున ఒక్కరే ఉన్నారు. భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు టీడీపీలోకి లాక్కున్నారు. ముగ్గురూ పురుషులే కావడంతో టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు అభ్యర్థి కూడా లేరు. ఈ క్రమంలో బెంగళూరులో ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులు ఆరుగురు రామగిరికి వస్తుండగా.. కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ ప్లాజా వద్దకు పోలీసులు చేరుకుని అడ్డుకున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బందోబస్తు మధ్య రామగిరికి తామే తీసుకెళ్తామని, మిగతా వాళ్లు రాకూడదని చెప్పారు. ఈ క్రమంలో ఆలస్యం కావడంతో నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు మీరిందని.. ఎన్నికను మరుసటి రోజుకు (శుక్రవారానికి) వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ సంజీవయ్య ప్రకటించారు. దీంతో మార్గం మధ్యలో ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులను పెనుకొండ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ సుధాకర్ యాదవ్ అక్కడికి చేరుకుని వైఎస్సార్సీపీ సభ్యులతో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌కు వీడియో కాల్ కలిపారు. డబ్బులు, పదవులు ఆశ చూపి.. పార్టీ మారాలని వారు కోరగా.. వైఎస్సార్సీపీ సభ్యులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అనారోగ్యంగా ఉందని.. వాంతి వస్తోందని పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతి వాహనం నుంచి కిందకు దిగారు. వెనుకే వస్తున్న టీడీపీ నేతలు ఆమెను బలవంతంగా వారి వాహనం ఎక్కించుకుని ఉడాయించారు. మిగిలిన ఐదుగురు వైఎస్సార్సీపీ సభ్యులను కర్ణాటక సరిహద్దు వరకు పోలీసులు వదిలివచ్చారు. కాగా, కూటమి పార్టీల నేతలు చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వ్యవస్థకు చెడ్డపేరు తెస్తోన్న ఎస్ఐ మొన్నటి వరకు సెలవులో ఉన్న రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఉన్నఫలంగా ఎంపీపీ ఎన్నికల సమయంలో విధులకు రావడం దేనికి? బందోబస్తులో భాగంగా రామగిరిలో డ్యూటీ ముగించుకుని వెంటనే.. ప్రత్యేక వాహనాల్లో వైఎస్సార్సీపీ సభ్యుల వెంట వెళ్లడం.. పరిటాల సునీత, శ్రీరామ్‌తో వీడియో కాల్స్ మాట్లాడించి.. బెదిరింపులకు దిగడం సబబు కాదు. రక్షణ కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఎస్ఐ సుధాకర్ యాదవ్ ప్రవర్తించాడు. గత ఎన్నికల్లోనూ ఆయన అనంతపురం జిల్లాలో టీడీపీ తరఫున బరిలో దిగేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు.– తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేకర్నూలు జిల్లాలో ఫ్యాన్ ప్రభంజనంఉమ్మడి కర్నూలు జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఏర్పడిన నాలుగు ఖాళీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జెడ్పీ కోఆప్షన్ సభ్యునిగా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడుకు చెందిన మదర్ఖాన్ ఇలియాజ్‌ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణగిరి కోఆప్షన్ సభ్యునిగా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు చిన్నషాలును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తుగ్గలి మండల పరిషత్ అధ్యక్షురాలిగా మండలంలోని శభాష్‌పురం ఎంపీటీసీ సభ్యురాలు రాచపాటి రామాంజనమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వెల్దుర్తి ఎంపీపీగా ఎల్.నగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మిదేవమ్మను ఎన్నుకున్నారు. నందిగామ పీఠం వైఎస్సార్సీపీదే ఎనీ్టఆర్ జిల్లా నందిగామ మండల పరిషత్ పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గురువారం నిర్వహించిన ఎన్నికలో రాఘవాపురం ఎంపీటీసీ సభ్యురాలు పెసరమల్లి రమాదేవి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కిడ్నాప్ చేసి దక్కించుకున్న టీడీపీ పల్నాడు జిల్లా అచ్చంపేటలో మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యుల్లో 16 మంది వైఎస్సార్ సీపీ, ఒక్కరు టీడీపీ. వారిలో గ్రంధశిరి ఎంపీటీసీ సభ్యుడు చిలకా జ్ఞానయ్య అనారోగ్యంతో మృతి చెందారు. మిగిలిన 16 మందితో ఎన్నిక నిర్వహించవలసి ఉంది. అయితే బుధవారం పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు తొమ్మిది మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వారికి పచ్చ కుండువాలు కప్పి బలవంతంగా ఎన్నికకు తీసుకువచ్చారు. వైఎస్సార్సీపీకి మద్దతిస్తున్న ఆరుగురు ఎంపీటీసీలను ఆలస్యంగా వచ్చారన్న సాకుతో ఎన్నికకు రాకుండా అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నూతన ఎంపీపీగా భూక్యా స్వర్ణమ్మ భాయి ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. నరసరావుపేటలో ఎన్నిక బాయ్‌కాట్ నరసరరావుపేట వైస్ ఎంపీపీ ఎన్నిక కోరం లేదన్న కారణంతో ఆగిపోయింది. మొత్తం 17 మంది ఎంపీటీసీలకు గాను అన్ని స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలోనే ఉన్నాయి. ఇందులో గతంలో వైస్ ఎంపీపీగా గెలిచిన యాంపాటి లక్ష్మీ మరణించడంతో గురువారం ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే బుధవారం రాత్రి ఎంపీపీ భర్త మూరబోయిన శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ తన్నీరు శ్రీనిసవారావు, పాలపాడు ఎంపీటీసీ మెట్టు రామిరెడ్డిలను పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు అపహరించారు. దీనికి నిరసనగా ఎన్నికలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు పాల్గొనలేదు. విడవలూరులో ఏకపక్షంగా ఎన్నిక నెల్లూరు జిల్లా విడవలూరు ఎంపీపీని గురువారం ఏకపక్షంగా ఎన్నుకున్నారు. మొత్తం 14 స్థానాల్లో వైఎస్సార్సీపీ 12, సీపీఎం 2 స్థానాల్లో గతంలో విజయం సాధించాయి. అయినప్పటికీ బెదిరింపులతో టీడీపీ బలపరిచిన ఏకుల శేషమ్మను ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దగదర్తిలో వాయిదా వేశారు. విశాఖలో వైఎస్సార్సీపీకి నాలుగుఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో ఫ్యాన్ జోరు పెంచింది. మొత్తం 5 ఎంపీపీ, 2 వైఎస్ ఎంపీపీ, ఒక కోఆప్షన్ మెంబర్‌కు గురువారం ఎన్నికలు జరిగాయి. వీటిలో 4 ఎంపీపీ, ఒక వైఎస్ ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.సీఎం సొంత జిల్లాలో టీడీపీ అరాచకం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గురువారం జరిగిన నాలుగు మండలాల ఎంపీపీ ఉప ఎన్నికల్లో మూడింట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలోని రామకుప్పం ఎంపీపీ స్థానాన్ని, వైస్ ఎంపీపీ స్థానాన్ని టీడీపీ అడ్డదారిలో కైవశం చేసుకుంది. రామకుప్పంలో ఉప ఎన్నిక సందర్భంగా ఎనిమిది మంది ఎంపీటీసీలతో ఎమ్మెల్సీ భరత్‌కృష్ణ మండల పరిషత్ కార్యాలయానికి బయలు దేరారు. వీరి వాహనాన్ని టీడీపీ మూకలు పథకం ప్రకారం పట్రపల్లి క్రాస్, అన్నవరం క్రాస్, రాజుపేట క్రాస్‌లో అడ్డుకున్నారు. ఎంపీటీసీల వాహనానికి ముందు, వెనుక కార్లు, ట్రాక్టర్లు, టెంపో వాహనాలను అడ్డుపెట్టి ముందుకు కదలకుండా చేశారు. మరి కొన్నిచోట్ల చెట్లను నరికి రోడ్డుకు అడ్డుగా వేశారు. అడ్డుగా ఉన్న వాహనాలు, చెట్లను తొలగించుకుంటూ రామకుప్పం మండల పరిషత్ కార్యాలయం చేరేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది. ఆ లోపు టీడీపీ ఆరుగురు ఎంపీటీసీలతో ఎంపీపీ ఎన్నికను పూర్తి చేయించుకున్నారు. చివరకు ఎంపీపీగా టీడీపీ బలపరచిన సులోచనమ్మ, వైస్ ఎంపీపీగా టీడీపీ బలపరచిన వెంకట్రామయ్య గౌడ్ గెలుపొందారు. ఆ మూడు మండల పరిషత్‌లు వైఎస్సార్సీపీ ఖాతాలోకే.. తిరుపతి జిల్లాలోని తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడిగా మూలం చంద్రమోహన్‌రెడ్డి, చిత్తూరు జిల్లా సదుం మండల పరిషత్ అధ్యక్షురాలిగా మాధవి, తవణంపల్లి ఎంపీపీగా ప్రతాప్సుందర్రాయల్ రెడ్డి విజయం సాధించారు. వీరు ముగ్గురూ వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులే. చిత్తూరు జిల్లా విజయపురం మండల ఉపాధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ బలపరిచిన కన్నెమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కో–ఆప్షన్ సభ్యురాలిగా వైఎస్సార్సీపీ బలపరచిన నసీమా ఎన్నికయ్యారు. తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలోని చింతగుంట పంచాయతీ ఉప సర్పంచ్‌గా వైఎస్సార్సీపీ మద్దతుదారు అన్నపూర్ణ గెలుపొందారు. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె ఉప సర్పంచ్‌గా టీడీపీ బలపరచిన వెంకటరమణ గెలుపొందారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లె పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక కోరం లేక వాయిదాపడింది. భయపెట్టినా..నిలబడ్డారు నామమాత్రపు బలం లేకపోయినా బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ పన్నిన కుట్రలు భగ్నమయ్యాయి. పిట్టలవానిపాలెం ఎంపీపీ పరిధిలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 10 మంది ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ తరఫున పోటీకి దిగిన దిందుకూరి సీతారామరాజుకు మద్దతుగా నిలిచి ఓట్లేశారు. ఆయన ఎంపీపీగా ఎన్నికయ్యారు. భట్టిప్రోలు మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడిగా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు సయ్యద్ నబీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం ఉప సర్పంచ్‌గా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికకాగా, రేపల్లె మండలం పేటేరు ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు దారు శ్రీదేవి ఎన్నికయ్యారు. భట్టిప్రోలు మండలం పెదపులివర్రు ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు దారుడు శ్రీనివాసరావు, పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు పలికిన వాసంతి విజయం సాధించారు. పశ్చిమగోదావరిలో ప్రజాస్వామ్యం ఖూనీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గురువారం జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఉప సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తూ పచ్చమూకలు రెచి్చపోయాయి. అత్తిలిలో 20 ఎంపీటీసీ స్థానాలకు గాను ఒక ఎంపీటీసీ గల్ఫ్‌లో ఉండగా, ప్రస్తుతం వైఎస్సార్సీపీకి 13, కూటమికి ఆరుగురు సభ్యుల సంఖ్యాబలం ఉంది. ఐదుగురు సభ్యులను తమవైపు తిప్పుకొనేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం నుంచి ఉదయం 13 మంది సభ్యులు బయలుదేరుతుండగా అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు ఇంటిని చుట్టుముట్టారు. రోడ్డుకు మోటారు సైకిళ్లు అడ్డంగా పెట్టి దమ్ముంటే తీసుకువెళ్లమంటూ గొడవకు దిగారు. ఒకానొక దశలో గేట్లు తోసుకుంటూ లోపలకు వచ్చే ప్రయత్నం చేయడంతో ఎంపీటీసీ సభ్యులు కారుమూరి నివాసంలోకి వెళ్లి తలదాచుకోవాల్సి వచి్చంది. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నిక వాయిదా వేసినట్టు సమాచారం అందాక కూటమి శ్రేణులు కారుమూరి నివాసం నుంచి వెళ్లారు.యలమంచిలిలో హైడ్రామాకూటమి హైడ్రామా నడుమ యలమంచిలి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. 17 మంది ఎంపీటీసీలకు గాను 13 మంది వైఎస్సార్సీపీ సభ్యులు కాగా, నలుగురు కూటమి సభ్యులు ఉన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీపీ ఎన్నిక లాంఛనమే కావాల్సి ఉంది. తమకు ఓటేయాలని వైఎస్సార్సీపీ నాయకుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ కూటమి సభ్యులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా, అధికారులు ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. కైకలూరు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకానికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన భుజబలపట్నం ఎంపీటీసీ సభ్యుడు పెన్మత్స సూర్యనారాయణరాజును కూటమి నేతలు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకున్నారు. ఈ సన్నివేశాన్ని ఫొటోలు తీస్తున్న స్థానిక జర్నలిస్ట్ కురేళ్ల కిషోర్‌ను కూటమి నేతలు చితకబదారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీని రాకుండా అడ్డుకోవడంతో నియోజకవర్గ ఇన్చార్జి దూలం నాగేశ్వరరావు నిరసన వ్యక్తం చేశారు. కూటమి పార్టీకి చెందిన తొమ్మిది మంది మాత్రమే ఎన్నికకు హాజరుకావడంతో కోరం లేక ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. -
వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కైవసం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం రామగోవిందరెడ్డి జడ్పీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.కాగా, బ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డిని వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థిగా ఆపార్టీ ప్రకటించింది. రెండు పర్యాయాలుగా బి.మఠం జెడ్పీటీసీగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేశారు.కాగా, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.కాగా, చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన ఎన్నికలో వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికల అధికారి అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. -
జడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు
అనంతపురం:టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిబలం లేకపోయినా రామగిరి ఎంపీపీ ఎన్నిక లో పోటీకి దిగారుపేరూరు ఎమ్పీటీసీ భారతిని కిడ్నాప్ చేశారుకొందరు సీఐలు, ఎస్సైలు పరిటాల సునీత కు తొత్తుగా వ్యవహరిస్తున్నారువందలాది మంది టీడీపీ గూండాలను రామగిరి లోకి ఎలా అనుమతించారు?పరిటాల హింసా రాజకీయాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాం విజయనగరం జిల్లాభోగాపురం మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవంవైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ పచ్చిపాల నాగలక్ష్మిని వైస్ ఎంపీపీగా ప్రకటించిన ఎన్నికల అధికారి. చిత్తూరు జిల్లా:కుప్పం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు: ఎమ్మెల్సీ భరత్ఎంపీటీసీ లను ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలోకి రాకుండా అడ్డుకున్నారుపోలీసులు నామమాత్రంగా బందోబస్తు నిర్వహించారుమా ఎంపీటీసీ వెళ్తున్న బస్సును అడుగు అడుగునా అడ్డగించారుపోలీసులు సెక్యూరిటీ ఉన్నా చోద్యం చూస్తున్నారుటిడిపి సీనియర్ నేతలు గంజాయి కేసులు పెడతాము అని ఎంపీటీసీలు ను బెదిరించారురాష్ట్రంలో సుపరిపాలన జరుగుతోంది అని చెప్తున్న చంద్రబాబు కుప్పం లో ఏం జరుగుతుందో అందరు చూశారువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ లను భయబ్రాంతులకు గురి చేశారుఈ రోజు మా పై దాడి కూడా చేయాలని కుట్ర చేశారుఈ ఎన్నికలు పై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం,కోరం లేకుండా ఎంపిపి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు..గోవింధప్ప శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ప్రజాస్వామ్య వాదులు కుప్పం వైపు ఒకసారి చూడండి..ఇక్కడ ఏం జరుగుతుందో..కోరం లేకుండా రామకుప్పం ఎంపిపి ఎన్నికలు నిర్వహించారుటిడిపి నాయకులతో కుమ్మక్కు రాజకీయం చేశారుకుప్పం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యం ను ఖూనీ చేశారుఅధికారులు చేసిన తీరుపై హైకోర్టు లో ఈ కేసు సూటిగా తీసుకోవాలిటిడిపి కు కుట్ర రాజకీయాలు చేస్తోంది కుందనందన రెడ్డి, రామకుప్పం ఎంపీటీసీఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడు జరగ లేదుసిఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అంటే ఒక ఆదర్శంగా ఉండాలివైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపిటిసి అందరినీ తప్పుడు కేసులు పెడతామని బెదిరించడంమా పై కేసులు పెడతాం అని బెదిరించారురామకుప్పం వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీ అందరినీ బెదిరించారుదీనిపై న్యాయ పోరాటం చేస్తాం, హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం ఏలూరు: కారుమూరి ఇంటిని ముట్టడించిన పచ్చమూక👉ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో అత్తిలిలో తీవ్ర ఉద్రిక్తత👉కూటమికి తగిన సంఖ్యా బలం లేకపోవడంతో👉గెలుపు కోసం ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీసిన ఎమ్మెల్యే ఆరుమిల్లి👉మాజీ మంత్రి కారుమూరి నివాసంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు👉ఎన్నికకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కారుమూరి ఇంటిని ముట్టడించిన పచ్చమూకవైస్ ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీ👉పల్నాడు జిల్లా: నరసరావుపేట రూరల్ మండలం వైస్ ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీ👉వైస్ ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ దారుణాలకు ఒడిగట్టింది: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి👉పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు నిర్వహిస్తోంది👉రెండు రోజుల నుంచి మా ఎంపీటీసీ సభ్యులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు👉పోలీసులతో కేసులు పెడతావని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు👉ఎంపీపీ మోరబోయిన సుబ్బాయమ్మ భర్తను రాత్రి పోలీసులు తీసుకువెళ్లారు👉పాలపాడు ఎంపీటీసీ రామిరెడ్డిని పోలీసులు తీసుకువెళ్లారు👉పోలీసులే వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను తీసుకెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు👉టీడీపీ నాయకులు, పోలీసుల వైఖరిని నిరసిస్తూ మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాం👉వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నామినేషన్ వేయరు👉లోకేష్ పోలీసులను అడ్డంపెట్టి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాడుకుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకం👉కుప్పం మెయిన్ రోడ్డు అన్నవరం క్రాస్ వద్ద ఎంపీటీసీలను తరలిస్తున్న వాహనాన్ని అడ్డగించిన టీడీపీ శ్రేణులు👉రోడ్డుపై బైఠాయించిన టీడీపీ శ్రేణులు. పరిస్థితి ఉద్రిక్తం👉ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా గెలవని రామకుప్పం మండలంలో ఎంపీపీ ఎన్నిక కోసం అడ్డదారుల్లో ప్రయత్నాలుటీడీపీ అరాచకం.. ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీతూర్పుగోదావరి: అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు ఎంపీపీ స్థానాన్ని అడ్డగోలుగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న టీడీపీ👉బిక్కవోలు మండలంలో ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా లేని టీడీపీ👉బెదిరింపులు, ప్రలోభాలు చూపి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను తమ వైపుకు తిప్పుకున్న టీడీపీ నేతలు👉టీడీపీ వ్యవహార శైలితో ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీ నేతలువైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను అడ్డుకున్న టీడీపీ శ్రేణులుచిత్తూరు జిల్లా: వి.కోట మండలం పట్రపల్లి గ్రామం జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు నివాసం నుంచి పోలీస్ భద్రత నడుమ వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను రామకుప్పం ఎంపీడీవో కార్యాలయానికి తరలిస్తుండగా, మార్గ మధ్యలో వి.కోట వద్ద టీడీపీ శ్రేణులు అడ్డగించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. హైకోర్టు ఆదేశాలతో బందోబస్తుతో తరలిస్తుండగా.. పోలీస్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు.తాడేపల్లి: జడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు తెరతీసింది. బలం లేకున్నా దొడ్డిదారిన పదవులు దక్కించుకునేందుకు కుట్రలు చేస్తోంది. వైఎస్సార్సీపీ సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు భారీఎత్తున ప్రలోభాలకు పాల్పడుతోంది. తమ దారికి రాకుంటే కిడ్నాప్‌లు, బెదిరింపులు, ఆస్తుల ధ్వంసం చేస్తూ.. నిన్నటి నుంచే అనేకచోట్ల టీడీపీ నేతలు భీతావాహ వాతావరణం సృష్టించారు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో టీడీపికి ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో ఎంపీటీసీ, ఆమె భర్త కిడ్నాప్ చేశారు.తూర్పు గోదావరి జిల్లా జిక్కవోలు ఎంపీటీసీలకు రూ.3 లక్షల చొప్పున ఎర వేశారు. ముగ్గురు ఎంపీటీసీలున్న కాకినాడ రూరల్ ఎంపీపీ పదవి కోసం జనసేన బరితెగించింది. ఒకే సభ్యుడు ఉన్న వైఎస్సార్ జిల్లాలో జెడ్పీ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు హైకోర్టులో పిటిషన్ వేసింది. టీడీపీ, జనసేన అరాచకాలను చూసి ప్రజాస్వామ్యవాదులు విస్తుపోతున్నారు.👉శ్రీ సత్యసాయి జిల్లా: ఎంపీపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు.. రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపారు. బలం లేకపోయినా ఎంపీపీ స్ధానాలు కైవసం చేసుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతల దౌర్జన్యాలకు దిగుతున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో విప్ జారీ చేసేందుకు వెళ్లిన ముగ్గురు వైఎస్సార్ సీపీ నేతలపై దాడి చేసిన పరిటాల వర్గీయులు.. వైఎస్సార్ సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు.👉వైఎస్సార్సీపీ నేతల వాహనాల్లో మారణాయుధాలు ఉన్నాయంటూ పోలీసులు కౌంటర్ కేసులు నమోదు చేశారు. రామగిరిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యాలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు. కదిరి వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు కిడ్నాప్ కేసులు నమోద చేయగా, తాము సురక్షితంగా ఉన్నామని చామలగొంది, కటారుపల్లి ఎంపీటీసీలు సెల్ఫీ విడియో విడుదల చేశారు. అయినప్పటికీ కదిరి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మక్బూల్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా సహా ఆరుగురిపై కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. దీంతో జిల్లా పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.👉చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రామకుప్పం ఎంపీపీ ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. రామకుప్పం ఎంపీడీవో కార్యాలయం బి. ఫార్మ్ తీసుకునేందుకు వెళ్లిన మురుగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.👉ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్‌ను పోలీలసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఏ స్టేషన్‌కు తీసుకువెళ్లారో కూడా పోలీసులు చెప్పలేదు. మురుగేశ్తో పాటు సర్పంచ్‌లు మోహన్ నాయక్, భాస్కర్ నాయక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మురుగేష్, సర్పంచ్ మోహన్ నాయక్, భాస్కర్ నాయక్‌లను పోలీసులు విడిచి పెట్టారు.👉ఏలూరు జిల్లా: నేడు కైకలూరు మండలం వైస్ ఎంపీపీ-2 ఎన్నిక జరగనుంది. వైఎస్ ఎంపీపీ-2 ఎన్నికకు సైతం అధికారి ప్రలోభాలకు తెరతీసింది. బలం లేకపోయినా ప్రలోభాలతో వైస్ ఎంపీపీ- 2 స్థానాన్ని దక్కించుకునేందుకు కుట్రలు చేస్తోంది. ఉదయం 11 గంటలకు కైకలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నిక జరగనుంది. చేతులు ఎత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించనున్నారు.👉కృష్ణా జిల్లా: రామవరప్పాడు ఉపసర్పంచ్‌కు ఎన్నిక ఇవాళ జరగనుంది. వార్డు సభ్యురాలు రాజీనామా చేయడంతో ఉపసర్పంచ్ పదవికి ఎన్నిక నిర్వహించనున్నారు. ఉప సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు టీడీపీ చీప్ పాలిటిక్స్ తెరతీసింది. 11వ వార్డు సభ్యుడు కత్తుల శ్రీనివాస్‌కు వైఎస్సార్సీపీ వార్డు సభ్యుల మద్దతు, ఆరో వార్డు సభ్యుడు అద్దెపల్లి సాంబశివనాగరాజుకు కూటమి మద్దతు ఉంది. కత్తుల శ్రీనివాస్‌కే మెజారిటీ మద్దతు ఉంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది.👉వైఎస్సార్ జిల్లా: నేడు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో మూడు వైస్ ఎంపీపీల ఎన్నిక జరగనుంది. రాయచోటి, ఖాజీపేట, ఒంటిమిట్ట వైస్ ఎంపీపీలను పాలకవర్గాలు ఎన్నుకోనున్నాయి. పూర్తి స్థాయి బలం ఉండటంతో మూడు చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించే అవకాశం ఉంది. పొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక కూడా జరగనుంది.👉తిరుపతి జిల్లా: తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ ఎన్నికల్లో ఉత్కంఠత కొనసాగుతోంది. పటిష్ట బందోబస్తు నడుమ తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి పార్టీల అరాచకాలను దృష్టిలో ఉంచుకుని భద్రత కోసం ముందుగానే వైఎస్సార్‌షీపీ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల క్యాంప్ నుంచి వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీలు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.విమానాశ్రయం నుంచి తుమ్మలగుంట వరకు ఎంపీటీసీల బస్సులను భారీ భద్రత నడుమ పోలీసులు తరలించారు. మరి కాసేపట్లో తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీటీసీలు పాల్గొననున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీపీ అభ్యర్థిగా పేరూరు-1 ఎంపీటీసీ మూలం చంద్రమోహన్‌రెడ్డిని వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఎంపీపీ ఎన్నికల్లో బలం లేనందున పోటీ నుంచి టీడీపీ తప్పుకున్నట్లు సుమాచారం. వైఎస్సార్సీపీకి వన్ సైడ్ మెజారిటీ ఉండటంతో సునాయాసంగా విజయం సాధించే అవకాశాలున్నాయి.టీడీపీ ద్వంద్వనీతి👉 వైఎస్సార్ జిల్లా: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. గురువారం కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ నేతృత్వంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10గంటలకు నామినేషన్ స్వీకరణ, 12గంటలకు నామినేషన్లు పరిశీలన పూర్తి, అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. 1 గంటలకు నామినేషన్ ఉపసంహరణ చేపట్టనున్నారు. ఆపై పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగించనున్నారు.👉జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.👉బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కాగా చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించింది. -
నేడు వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నిక
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. గురువారం కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ నేతృత్వంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10గంటలకు నామినేషన్ స్వీకరణ, 12గంటలకు నామినేషన్లు పరిశీలన పూర్తి, అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. 1 గంటలకు నామినేషన్ ఉపసంహరణ చేపట్టనున్నారు. ఆపై పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగించనున్నారు.జిల్లాలో 50 మంది జెడ్పీటీసీ సభ్యులుండగా వారిలో పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి ఓ ప్రమాదంలో చనిపోయారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్నాథరెడ్డి జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతూ రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జెడ్పీకి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో 48 మంది జెడ్పీటీసీ సభ్యులున్నారు. వారిలో గోపవరం మండల జెడ్పీటీసీ జయరామిరెడ్డి మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. మిగతా అందరూ వైఎస్సార్సీపీ నుంచి ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులే కావడం విశేషం. వైఎస్సార్సీపీ సభ్యులకు విప్ జారీ... జిల్లా పరిషత్‌లో 47మంది జెడ్పీటీసీలకు వైఎస్సార్సీపీ విప్ జారీ చేసింది. జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి సూచన మేరకు వేముల జెడ్పీటీసీ బయపురెడ్డి ద్వారా సభ్యులకు విప్ జారీ చేశారు. విప్ జారీ చేసిన రిసిప్ట్ కాపీలు ఎన్నికల అధికారికి అందజేయనున్నారు. విప్ అందుకున్న సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. విప్ ధిక్కరిస్తే ఆయా సభ్యులు సభ్యుత్వం కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ముక్తకంఠంతో వెల్లడిస్తున్నారని సమాచారం. దాంతో వైఎస్సార్సీపీ ఆత్మవిశ్వాసంతో ఉంది. చైర్మన్‌గిరిని పార్టీ ఖాతాలో జమ చేసుకునేందుకు సన్నద్ధంగా ఉంది.రామగోవిందురెడ్డిని వరించనున్న చైర్మన్ పీఠంబ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డికి జెడ్పీ చైర్మన్ పీఠం దక్కనుంది. వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యరి్థగా ఆపార్టీ ప్రకటించింది. రెండు పర్యాయాలుగా బి.మఠం జెడ్పీటీసీగా ఆయన ప్రాతిని«థ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యరి్థత్వాన్ని ఎంపిక చేశారు. అధినేత సూచనలు మేరకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు చైర్మన్ ఎన్నిక కోసం కంకణబద్ధులై ఉన్నారు. కలిసికట్టుగా ఎన్నిక ప్రక్రియ వ్యవహారం నడిపించేందుకు సన్నాహాలు చేస్తుండడం విశేషం. తెలుగుదేశం పార్టీ ద్వంద్వనీతిజిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కాగా చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించింది. -
ఇక జెడ్పీలు, మండలాల్లో ‘ప్రత్యేక’ పాలన
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్‌లలో ‘ప్రత్యేక’ అధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. జూలై 4తో 32 జిల్లా పరిషత్‌లు, 538 మండల పరిషత్ పాలకమండళ్ల పదవీకాలం ముగియనుంది. టర్మ్ ముగిసేలోగా ఎన్నికలు జరిపే అవకాశం లేకపోవడంతో రోజువారీ కార్యక్రమాల కొనసాగింపునకు వీలుగా స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నారు. మెజారిటీ జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు బీఆర్ఎస్కు చెందినవారే ఉండటంతో ఎన్నికలు జరిగే దాకా పాత పాలక మండళ్లనే కొనసాగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సన్నాహాలు చేస్తోంది. జూలై 5 కల్లా కసరత్తు పూర్తిచేసి, పీఆర్, రెవెన్యూ, మున్సిపల్,విద్య, వైద్య, ఆరోగ్య శాఖల నుంచి ఉద్యోగుల హోదాలకు అనుగుణంగా ప్రత్యేక అధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. గత ఫిబ్రవరి 1తో రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామపంచాయతీల కాలపరిమితి ముగిసింది. మరుసటి రోజు నుంచే పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. ఇవీ సమస్యలు... పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక, మండల, జిల్లాపరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా వివిధ కారణాలు, ఆయా అంశాలపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వపరంగా అటు గ్రామపంచాయతీలు, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు అడుగు ముందుకుపడలేదు. ⇒ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, ఉపకులాల వారీగా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అయితే ఈ వాగ్దానం అమలు చేసేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా చర్యలు చేపట్టాల్సి ఉండగా, దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో కసరత్తు మొదలు కాలేదు. ⇒ బీసీ కులగణన ఆధారంగా గ్రామీణ స్థానికసంస్థల్లో స్థానికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ⇒ రాష్ట్రవ్యాప్తంగా కులగణనకు ఎక్కువగా సమయం పట్టే అవకాశం ఉండటంతో కొత్త ఓటర్ల జాబితా (లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వెలువరించిన లిస్ట్) ప్రాతిపదికన పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను నోడల్ ఏజెన్సీలుగా నియమించి..ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలు సేకరించాలని బీసీ కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. ⇒ బీసీ కమిషన్పరంగా ఓటర్ల జాబితా ఆధారంగా ఖరారు చేసిన రిజర్వేషన్లకు అనుగుణంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ విచారణ, రాష్ట్రస్థాయిలో అన్ని రాజకీయపక్షాలతో సమావేశం నిర్వహించి ముందుకు సాగొచ్చనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు సమాచారం. ⇒ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఓటర్ల జాబితా ప్రకారమా లేక క్షేత్రస్థాయిలో చేపట్టే సామాజిక, ఆర్థిక, కుల సర్వే ఆధారంగా ముందుకెళ్లాలా అనే దానిపై ప్రభుత్వపరంగా స్పష్టత కొరవడినట్టు చెబుతున్నారు. ⇒ ఓటర్ల లిస్ట్‌కు అనుగుణంగా అయితే పెద్దగా శ్రమ లేకుండా త్వరగానే క్షేత్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల జనాభా వివరాలు తేల్చొచని, సామాజిక, ఆర్థిక కులసర్వే అయితే సమయం ఎక్కువ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ⇒ మరో రెండునెలల్లో (ఆగస్టు నాటికి) ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిషన్న్ద్వారానే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేస్తారా లేక కొత్త కమిషన్‌ను నియమించేదాకా ఆగుతారా అనేదానిపై స్పష్టత లేదు. ట్రిపుల్ టెస్ట్..మరో మెలిక సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’పేరిట స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై మార్గదర్శకాలు నిర్దేశించింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుపై బీసీ కమిషన్ ద్వారా విచారణ జరపాలని, ఆయా చోట్ల ఏఏ నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపై తేల్చాలని స్పష్టం చేసింది. ⇒ మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి) 50 శాతానికి మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ⇒ ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహ¯న్‌రావు ఆధ్వర్యంలో ట్రిపుల్ టెస్ట్ మేరకు క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలిసింది. ⇒ ఓటర్ల జాబితా ప్రకారం కసరత్తు పూర్తిచేసి ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలనే సూచనలు బీసీ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లినట్టు తెలిసింది. అయితే దీనిపై ప్రభుత్వపరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సందిగ్ధత నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ⇒ రిజర్వేషన్లు ఖరారు చేసి, ఆ వివరాలు, ఎన్నికల నిర్వహణకు తేదీలు తెలియజేస్తే 15, 20 రోజుల అంతరంలో గ్రామపంచాయతీ, జిల్లా, మండలపరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. -
రంగారెడ్డి: డీఈవో లేట్.. జడ్పీ ఛైర్మన్ క్లాస్
సాక్షి, రంగారెడ్డి: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.. ఛైర్మన్ అనితా హరినాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ శశాంక, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. విద్య, వైద్యంపై అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. అయితే, డీఈవో సమావేశానికి ఆలస్యంగా రావడంపై జడ్పీ ఛైర్మన్ క్లాస్ తీసుకోగా, సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులందరికి డీఈవో బహిరంగ క్షమాపణ చెప్పారు. స్కూల్ యూనిఫామ్స్ విషయంలో చర్చ వల్ల ఆలస్యమైందని డీఈవో వివరణ ఇచ్చారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఆపరేషన్ థియేటర్లు, భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిల్లో వైద్యుల కొరత ఉందంటూ మండిపడ్డారు. విద్య, వైద్యంలో అధికారుల డిప్యూటేషన్ల రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.డిప్యుటేషన్ల రద్దు కుదరదంటూ కలెక్టర్ వివరించారు. మీ సమస్యను సంబందిత శాఖకు సమగ్రంగా వివరించాలని సూచించారు. డిప్యుటేషన్ల విషయంలో అనేక ఒత్తిళ్లు ఉంటాయని కలెక్టర్ అన్నారు. కందుకూరు మెడికల్ కళాశాల రద్దు కాలేదని.. మెడికల్ కళాశాలకు వేరే ప్రాంతంలో స్థలం కోసం చూస్తున్నామని డీఎంహెచ్‌వో తెలిపారు. -
నల్లగొండ జిల్లా పరిషత్ పాత ఆఫీస్‌లో అగ్నిప్రమాదం
-
పశ్చిమగోదావరి జెడ్పీ చైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ
సాక్షి, పశ్చిమగోదావరి: ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీ మహిళ అయిన పద్మశ్రీ కి సీఎం జగన్ బీఫామ్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఇవాళ జెడ్పీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగ్గా.. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీకి జిల్లా మంత్రులతో పాటు పలువురు నేతలు అభినందనలు తెలియజేశారు. ‘‘బీసీ మహిళగా నన్ను గుర్తించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. సాధారణ గృహిణి నైన నాకు జెడ్పీటీసీగా అవకాశం ఇచ్చారు . కొప్పుల వెలమలకు పెద్దపీట వేస్తూ జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారు. మెరుగైన పాలన అందించి సీఎం జగన్‌కి మంచి పేరు తీసుకొస్తాను’’ అని గంటా పద్మశ్రీ చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చినట్లే వెనుక బడిన వర్గాలకు అండగా నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ ,అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చి అండగా ఉంటున్నారు. పార్టీ కోసం కష్ట పడ్డ ప్రతి కార్య కర్త కు మంచి భవిష్యత ఉంటుందని నిరూపించారు. ఒక బీసీ మహిళకు జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించారు. ::ఎమ్మెల్యే ఆళ్ళ నాని బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి. నాడు జడ్పీ చైర్మన్ గా నాకు వైఎస్సార్ రాజకీయ భవిష్యత్తు ఇస్తే.. నేడు మంత్రి గా సీఎం జగన్మోహన్రెడ్డి అవకాశం ఇచ్చారు. ఉద్యోగులకు వరాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులంతా మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఈనాడు లాంటి టిష్యూ పేపర్ మరొకరి లేదు. మేము అప్పుల పాలు చేశాము అంటున్నారు. మరి ఆనాడు 20 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు... వారికి కనపడలేదు. 4500 కోట్లు పసుపు కుంకుమ రూపంలో డైవర్ట్ చేశారు చంద్రబాబు. బాబు చేసిన అప్పై మేము తీర్చు తున్నాము. ::: మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఈరోజు సామాజిక విప్లవం సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి పాలనలో కనిపిస్తుంది. బలహీన వర్గాల చెందిన వ్యక్తి కవురు శ్రీనివాస్ ను శాసనమండలికి పంపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో బలహీన వర్గాలకు పెద్దపీట వేసి విప్లాత్మకమైన మార్పు తెచ్చారు. :::ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే చంద్రబాబు.. సరిగ్గా ఎన్నికల ముందు బీసీలను ముందు పెట్టీ అధికారం అనుభవించేవాడు. ఇప్పుడు బీసీ వెలమ కులస్తులకి జడ్పీ చైర్మన్ కేటాయించి ప్రత్యేక స్థానం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. సీఎం జగన్మోహన్రెడ్డికి వచ్చే ఎన్నికల్లో 175 కు 175 స్థానాలు ఇచ్చి ఆయన రుణo తీర్చుకుందాం ::: ఎంపీ కోటగిరి శ్రీధర్ రెండో మహిళగా.. పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ 1936లో జిల్లా బోర్డుగా ఏర్పడింది. 1959 లో జిల్లా ప్రజాపరిషత్‌గా అవతరించింది. అప్పటి నుంచి 21 మంది జెడ్పీ చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో 1995, 2000లో జెడ్పీ చైర్మన్‌గా ఇమ్మణ్ణి రాజేశ్వరి పనిచేయగా.. రెండో మహిళా చైర్‌పర్సన్‌గా పద్మశ్రీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
భారత్ పరివర్తన్ మిషన్‌గా బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పు కోసం భారత్ రాష్ట్ర సమితి ‘భారత్ పరివర్తన్ మిషన్’గా పని చేస్తుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. మే 7 నుంచి జూన్ 7 వరకు నెల రోజుల్లో మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కమిటీలు వేస్తామని, జూన్‌లో 10 లక్షల నుంచి 12 లక్షల మంది రైతులతో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. నాగపూర్, ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తే రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మహారాష్ట్రను తీర్చిదిద్దుతామని, ఓట్లు వేస్తేనే ఎవరైనా సహాయం చేయగలరు అంటూ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్, యావత్మాల్, గడ్చిరోలి ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీల నేతలు బుధవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. దేశ సంస్కరణ లక్ష్యంతో ముందుకు.. ‘దేశంలో ఎన్నో పార్టీలు, ఎందరో రాజకీయ నాయకులు, ఎన్నో ప్రాంతీయ, జాతీయ పార్టీలున్నా.. దేశ పరిస్థితులపై అవగాహన ఉన్నా సరైన రీతిలో స్పందించడం లేదు. మనది వింత దేశం, ప్రజలు కూడా వింతైన వారు. మనం కుట్రలో ఇరుక్కుపోవడానికి గల కారణాలను చర్చించాలి. ఎన్నికల కోసమో, ఎవరినో నాయకుడిని చేయాలనే లక్ష్యంతోనో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించలేదు. భారతదేశాన్ని సంస్కరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. దేశంలో అపూర్వ సంపద ఉన్నా నీరు, విద్యుత్తు వంటి సమస్యలను తెలంగాణ మినహా మహారాష్ట్ర సహా యావత్ దేశం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆనకట్టల ద్వారా నీటిని బంధించి, తాగునీరు, సాగు నీరు ఇవ్వడం ద్వారా రైతులు సిరిసంపదలతో తులతూగేలా చేసే లక్ష్యంతో బీఆర్ఎస్ ఆవిర్భవించింది..’అని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు ఎందుకు? ‘మహారాష్ట్ర పుణ్యభూమిలో గోదావరి, కృష్ణా, వెన్‌గంగ, పెన్‌గంగ, వార్ధా, మూల, ప్రవర,పంచగంగ, మంజీర, భీమా లాంటి ఎన్నో నదులు పుడుతున్నాయి. అయినా ఔరంగాబాద్‌లో ఎనిమిది రోజులకోసారి తాగునీరు అందిస్తున్నారు. అకోలాలోనూ ఇలాంటి పరిస్థితే ఉండాల్సిన ఆగత్యం ఎందుకు? మహారాష్ట్రలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్నాం. అవినీతి నేతలే దివాళా తీస్తారు.. తెలంగాణలో అమలవుతున్న ఈ పథకాలు మహారాష్ట్రలో అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని పుకార్లు పుట్టిస్తున్నారు. కానీ మేము ఏండ్లుగా అమలు చేస్తున్నా తెలంగాణ ఆర్థికంగా బాగానే ఉంది. మహారాష్ట్ర కంటే చిన్న రాష్ట్రం కావడంతో పాటు ఆర్థికంగా మహారాష్ట్ర తర్వాతే నిలిచే రాష్ట్రమైన తెలంగాణ దివాళా తీయనప్పుడు మహారాష్ట్ర ఎలా దివాళా తీస్తుంది? అవినీతికి పాల్పడే నాయకులే దివాళా తీస్తారు.ౖమహారాష్ట్రలో భూ క్రయవిక్రయాల్లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు తెలిసింది. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను సంస్కరించి, పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా ముగిసేటట్లుగా విధానాలు తీసుకొచ్చాం..’అని తెలిపారు. ఫడ్నవీస్ నుంచి జవాబు లేదు ‘మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఏం పని అని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేస్తే మధ్యప్రదేశ్‌కు వెళ్లిపోతామని చెబితే ఇప్పటివరకు ఫడ్నవీస్ నుంచి సమాధానం లేదు. తెలంగాణలో సాధ్యమైనవన్నీ మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావు? అని ప్రజలు ప్రశ్నించుకోవాలి..’అని కేసీఆర్ అన్నారు. పెద్ద సంఖ్యలో చేరికలు బీఆర్ఎస్లో చేరిన మహారాష్ట్ర నేతల్లో ఆల్ ఇండియా డీఎన్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు, ఒబీసీ వెల్ఫేర్ సంఘ్ నాయకుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆనంద్ రావ్ అంగళ్వార్, వంచిత్ ఆఘాడీ ఉమెన్, చంద్రాపూర్ బంజారా ఉమెన్ అధ్యక్షురాలు, ఎమ్మెల్యేగా పోటీచేసిన రేష్మ హాన్ ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొ.బల్బీర్ సింగ్ గురు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ సింగ్ సలూజా, గడ్చిరోలి మాజీ జెడ్పీ చైర్మన్ పసుల సమ్మయ్య, గడ్చిరోలి మాజీ జడ్పీ సభ్యులు సంజయ్ చర్దుకె, యువ స్వాభిమాన్ పార్టీ రజురా జిల్లా అధ్యక్షుడు సూరజ్ థాకరే, చంద్రాపూర్ డీసీసీ అధ్యక్షుడు దిలీప్ పల్లేవార్, బిర్సాముండా క్రాంతిదళ్ అధ్యక్షుడు సంతోష్ కులమతే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంపెల్లి మల్లేష్, ఆప్ బల్లార్పూర్ విభాగ్ అధ్యక్షుడు ప్రశాంత్ గడ్డల, భారత్ ముక్తి మోర్చా వర్కింగ్ ప్రెసిడెంట్ శనిగరపు శంకర్, యువ స్వాభిమాన్ పార్టీ కార్యదర్శి ఆదిత్య భాకె, శివసేన గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు మిలింద్ భాసర్ బీఆర్ఎస్లో చేరారు. చంద్రాపూర్ డీసీసీ మాజీ అధ్యక్షుడు అరికిల్ల హనుమంతు, డబ్ల్యూసీఎల్ ఐటీటీయూసీ అధ్యక్షుడు నర్సింగ్ రాజం దొంత, విదర్భ తెలుగు సమాజ్ ప్రధాన కార్యదర్శి రాజేషం పుల్లూరి, తేలి సమాజ్ జిల్లా అధ్యక్షుడు రవి జుమ్డే, విదర్భ ముక్తి మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ తిరమల్ ముంజమ్, శివసేన పార్టీ రాజుర పట్టణ అధ్యక్షుడు రాకేష్ చికుల్వార్, శివసేన బల్లార్షా అధ్యక్షుడు సన్నీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెరెన అజ్మీరా, యువ స్వాభిమాన్ గడ్చిరోలి ఉపాధ్యక్షుడు అజయ్ చన్నే, చంద్రాపూర్ డ్రైవర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ వ్యవస్థాపకుడు అభిలాష్ సింగ్‌తో పాటు మరో నలభై మందికి పైగా నేతలు కూడా బీఆర్ఎస్లో చేరారు. -
Nagarkurnool: ముందస్తు ఊహాగానాలు.. టీఆర్ఎస్లో అలజడి
సాక్షి, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మావతిపై అనర్హత వేటు అధికార పార్టీ టీఆర్ఎస్కు తలనొప్పి తెచ్చిపెట్టింది. నేతల మధ్య ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు జిల్లా పరిషత్ పీఠం సాక్షిగా మరోసారి తెరమీదకు రావడంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్‌ప్రసాద్‌ను కాదని.. వైస్ చైర్మన్ బాలాజీసింగ్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం దుమారానికి దారితీసినట్లు తెలుస్తోంది. భరత్ప్రసాద్కు చెక్ పెట్టేలా జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు గతంలో లాగే పావులు కదిపి.. తెరవెనుక తతంగం నడిపించినట్లు ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల్లో వైరం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలొస్తాయని ఊహాగానాలు వెల్లువెత్తుతుండగా.. తాజా రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయోననే ఆందోళన పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. తొలుత అలా.. 2019 జూన్‌లో జరిగిన నాగర్‌కర్నూల్ జెడ్పీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 20 జెడ్పీటీసీలకు 17 స్థానాలను కైవసం చేసుకుని జెడ్పీ పీఠాన్ని దక్కించుకుంది. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వేషన్ కాగా.. కల్వకుర్తి నుంచి గెలుపొందిన భరత్‌ప్రసాద్‌ను చేయాలని తొలుత భావించారు. అయితే అనూహ్యంగా తెలకపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి పేరును ఓ ఇద్దరు ముఖ్యనేతలు తెరపైకి తీసుకు రాగా.. ఆమెకే అవకాశం దక్కింది. రాములు ప్రస్తుతం నాగర్‌కర్నూల్ ఎంపీగా ఉండడం, గతంలో అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించడంతో ఆయన కుమారుడు, విద్యావంతుడైన భరత్‌ప్రసాద్‌ను చైర్మన్ చేస్తే తమకు భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయని భావించిన సదరు నేతలు పద్మావతి పేరును తెరమీదికి తెచ్చినట్లు జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు, వారి అనుచరుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఎంపీ అనుచరుల్లో అసహనం.. విమర్శలు జెడ్పీ పీఠానికి సంబంధించి జిల్లాకు చెందిన ముఖ్యనేతలు అనుసరిస్తున్న వ్యవహారశైలిపై ఎంపీ రాములు, అతడి అనుచరుల్లో అసహనం నెలకొన్నట్లు తెలుస్తోంది. అంతర్గత భేటీలో ఈ విషయం చర్చకు రాగా.. కావాలనే గతంలో తెరచాటు రాజకీయాలు చేశారు, ఇప్పుడు చేస్తున్నారని ఒకరిద్దరు ఆగ్రహావేశాలకు లోనైనట్లు సమాచారం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు నడుచుకోవాలని.. సంయమనం పాటించాలని వారికి ఎంపీ సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికలకు సమయం ఇంకా ఏడాదికి పైగా ఉన్నప్పటికీ బాలాజీసింగ్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టడం.. ఎస్సీకి కేటాయించిన స్థానంలో వేరొకరిని నియమించడంపై ఆ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కోర్టు ఆదేశించినప్పటికీ.. తెలకపల్లి జెడ్పీటీసీగా సుమిత్ర ప్రమాణస్వీకారంలో జాప్యం జరుగుతోంది. పద్మావతి కోర్టు నుంచి స్టే తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని.. అందుకే జాప్యం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇలా.. తెలకపల్లి జెడ్పీటీసీ పద్మావతి తన ఎన్నికల అఫిడవిట్లో సంతానానికి సంబంధించి తప్పు డు వివరాలు సమర్పించారని కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. 1997లో మొదటి కుమారుడు, 2001లో ఇద్దరు కవలలు జన్మించినట్లు పేర్కొన్నారని.. వాస్తవానికి 1991లో మొదటి కుమారుడు, 1997లో ఒకరు, 2001లో మరొకరు జని్మంచారంటూ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ తర్వాత పద్మావతిని జెడ్పీటీసీ సభ్యత్వానికి అనర్హురాలిగా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికైనట్లు ప్రకటించాలని ఆదేశించింది. దీనిపై పద్మావతి హైకోర్టును ఆశ్రయించగా ఆ తీర్పుపై స్టే ఇచ్చింది. చివరకు స్టే పిటిషన్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించడంతో పద్మావతిపై అనర్హత వేటు పడింది. దీనిపై ఆమె డివిజనల్ బెంచీకి వెళ్లినా చుక్కెదురైంది. దీంతో జెడ్పీ చైర్మన్ ఎంపిక అనివార్యం కాగా.. భరత్‌ప్రసాద్‌తో పాటు ఊర్కొండ జెడ్పీటీసీ శాంతకుమారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే తొలి నుంచి పీఠం ఆశిస్తున్న భరత్‌నే జెడ్పీచైర్మన్ పదవి వరిస్తుందని అందరూ భావించారు. కానీ.. వైస్ చైర్మన్ బాలాజీసింగ్‌కు ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక సైతం తొలుత అడ్డు పడిన వారే ఉన్నారని.. జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత అన్నీ తానై పథకం ప్రకారం భరత్‌కు చెక్‌పెట్టేలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
విజయ గీతిక.. ప్రగతి వీచిక
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లా పరిషత్ చరిత్రను ఓటర్లు తిరగరాసి ఆదివారంతో ఏడాది పూర్తవుతోంది. ప్రజాకంటక తెలుగుదేశం పాలనకు చరమగీతం పాడిన ప్రజలు.. జెడ్పీలో ఆ పార్టీని ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేసి ఇంటికి సాగనంపారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీకి తిరుగులేని ఆధిక్యతను కట్టబెట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్న క్రమంలో.. గత ఏడాది జరిగిన జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) ఎన్నికల్లో 99 శాతం వైఎస్సార్సీపీనే వరించాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థులు 58 స్థానాల్లో విజయదుంధుభి మోగించారు. అంతకుముందు వరకూ అధికారాన్ని అనుభవించిన టీడీపీని ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేశారు. జెడ్పీటీసీ ఎన్నికలు ప్రారంభమైన 1995 నుంచి ఇప్పటి వరకూ జిల్లా చరిత్రలో గతంలో ఏ పాలకవర్గంలోనూ ప్రతిపక్ష పార్టీకి ఈ రకమైన పరాభవం ఎదురైన దాఖలాలు లేవు. గత ఏడాది జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం ఎస్సీలకు రిజర్వు అయిన జెడ్పీ చైర్మన్ పదవి.. వివాదరహితుడు, విద్యావంతుడు, ఆవిర్భావం నుంచీ పార్టీలో అంకిత భావంతో పని చేస్తున్న నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ విప్పర్తి వేణుగోపాలరావును వరించింది. జెడ్పీ పాలకవర్గం పగ్గాలు చేపట్టాక.. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతో రాష్ట్రవ్యాప్త నిర్ణయంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి తూర్పు గోదావరిని మూడు జిల్లాలుగా పునర్విభజించారు. జిల్లాల విభజన జరిగినా జిల్లా పరిషత్ పాలకవర్గ అస్థిత్వానికి భంగం కలగకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌గానే కొనసాగించారు. అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు గత ఏడాది నూతన పాలక వర్గం చేపట్టాక జెడ్పీ ద్వారా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి వడివడిగా అడుగులు పడ్డాయి. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ‘పంచాయతీ సశక్తీకరణ్ పురస్కార్’ను తొలి ఏడాదే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీరాజ్ దివస్ అయిన గత ఏప్రిల్ 24న 2021–22 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ప్రధాని వర్చువల్ విధానంలో అందజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన’ అమలులో మన జిల్లా పరిషత్ దేశంలోనే తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. 14వ ఆర్థిక సంఘం నుంచి 21 సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు రూ.8.73 కోట్లు వెచ్చించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సీపీడబ్ల్యూఎస్ పథకంలో రూ.16.62 కోట్లు కేటాయించారు. సాధారణ పనుల విభాగంలో 260 పనులకు రూ.4.93 కోట్లు ఖర్చు చేశారు. ఎస్సీ సంక్షేమానికి రూ.2.14 కోట్లు, మహిళా, శిశు సంక్షేమానికి రూ.3 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.1.88 కోట్లు, తాగునీటికి రూ.3.32 కోట్లు, సెక్టోరియల్ పనులకు రూ.1.43 కోట్లు వెచ్చించారు. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజనలో 32 గ్రామాలను గుర్తించారు. ప్రతి గ్రామానికి గరిష్టంగా రూ.20 లక్షల చొప్పున 161 పనులకు రూ.10.65 కోట్లు కేటాయించారు. ఇందులో 49 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. జాతీయ ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, ఐసీడీఎస్ తదితర నిధుల సమన్వయంతో పనులు చేపట్టడంలో దేశంలోనే జిల్లా పరిషత్ తృతీయ స్థానంలో నిలిచింది. డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ రూరల్ అర్బన్ మిషన్‌లో రూ.15 కోట్ల అంచనాతో రంపచోడవరం మన్యంలో 73 పనులు చేపట్టారు. వీటిలో 38 ఇప్పటికే పూర్తి చేశారు. దశాబ్దాలుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న 18 మంది ఎంపీడీఓల కల ఈ పాలకవర్గం హయాంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో సాకారమైంది. ప్రావిడెంట్ ఫండ్ రూపంలో జెడ్పీలో 10,090 మందికి ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ.7 కోట్లు జెడ్పీ జమ చేస్తోంది. దీంతో వారందరూ సంతోషంగా ఉన్నారు. గత చంద్రబాబు పాలనలో మూడు ఆర్థిక సంవత్సరాలుగా పెండింగ్‌లో పెట్టేసిన జెడ్పీ పీఎఫ్‌ను ఒకేసారి పరిష్కరించి రికార్డు సృష్టించారు. రిటైరైన 308 మందికి, సర్వీసులో ఉన్న 1,717 మందికి ఒకేసారి రూ.101.69 కోట్లు చెల్లించారు. అందరి సమన్వయంతో ఏడాది పాలన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారుల సమన్వయంతో ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేశాం. ఎక్కడా ఒక్క వివాదానికి కూడా తావు లేకుండా పని చేయడం చాలా సంతృప్తినిచ్చింది. గత పాలకుల హయాంలో ఉద్యోగులు, రిటైరైన వారికి పెండింగ్‌లో ఉన్న అంశాలను ఒకేసారి క్లియర్ చేశాం. జిల్లాపరిషత్ అధికారులు, ఉద్యోగులు సమష్టి కృషితో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పురస్కారాలు అందుకోగలిగాం. – విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా పరిషత్ చైర్మన్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా -
నాలుగు బిల్లులకు ఆమోదం
సాక్షి, అమరావతి: నాలుగు బిల్లులకు శుక్రవారం శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపాయి. ప్రస్తుత జెడ్పీ చైర్మన్ల పదవీకాలం ముగిసే వరకు ఉమ్మడి జిల్లాల ప్రకారమే పాత జిల్లా పరిషత్‌లు కొనసాగేందుకు వీలుగా ఏపీ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. ఆర్డీసీలో ఇకపై 16 మంది సభ్యులు ఉండేలా ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చట్ట సవరణ బిల్లుకు, ఏపీ సివిల్ సర్వీసెస్ (డిసిప్లినరీ ప్రొసీడింగ్ బిల్లు) చట్ట సవరణ బిల్లుకు, సవరించిన మార్కెట్ సెస్ నుంచి కొంత మొత్తాన్ని కేంద్ర మార్కెట్ నిధికి జమ చేయడానికి ఉద్దేశించిన ఏపీ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ లైవ్‌స్టాక్ మార్కెట్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపాయి. ఈ బిల్లులను గురువారం ఉభయ సభల్లో ప్రవేశపెట్టగా, శుక్రవారం ఆమోదించాయి. మరో నాలుగు బిల్లులు.. ఒక తీర్మానం శాసనసభలో శుక్రవారం మరో నాలుగు బిల్లులను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టారు. ఇండియన్ స్టాంప్ చట్ట సవరణ బిల్లు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లు, ఏపీ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ చట్ట సవరణ బిల్లును మంత్రి ధర్మాన సభలో ప్రవేశపెట్టారు. మరోవైపు రైల్వే ప్రయాణికుల కమిటీలో శాసనసభ నుంచి ఒకరిని నామినేట్ చేయాలని కోరుతూ సభ తీర్మానించింది. -
ఈ ప్రజలకు ఏమైంది.. వాళ్లనే ఎన్నుకుంటారు!
రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ ప్రతినిధుల ఎన్నిక ఇటీవల ముగిసింది. ఇందులో సింహభాగం అధికార పక్షం బిజూ జనతాదళ్ అభ్యర్థులే విజేతలుగా నిలిచారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో 90శాతం మంది ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అయితే అరకొర విద్యార్హతతో పాటు నేర చరితులు, కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. ఒడిశా ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సంస్థలు వెల్లడించిన విశ్లేషణాత్మక వివరాల నివేదికలో ఈ వివరాలు బయటపడ్డాయి. భువనేశ్వర్: రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 851మంది జిల్లా పరిషత్ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో 125 మంది విజేతలు అఫిడవిట్ వివరాలు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ కాలేదు. ఈ నేపథ్యంలో 726 మంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన వివరాలను ఒడిశా ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ ఏడీఆర్ సంస్థలు విశ్లేషణాత్మకంగా వివరించాయి. దాఖలైన పూర్తి వివరాలు ప్రకారం 726 మంది జిల్లా పరిషత్ విజేత అభ్యర్థుల్లో 385 మంది మహిళలు ఉన్నారు. అలాగే నేర చరితుల వర్గంలో అగ్రస్థానంలో నిలిచిన బీజేడీ.. కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానం చేజిక్కించుకోవడం ప్రత్యేకం. 726మంది జిల్లా పరిషత్ సభ్యుల్లో 113మంది నేర చరితులు. 15 మందిపై హత్యాయత్నం ఆరోపణలతో ఐపీసీ 307 సెక్షన్ కింద కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 12మంది విజేత అభ్యర్థులు మహిళల పట్ల అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కలంకితులు.. పంచాయతీ ఎన్నికల్లో విజయ శంఖారావం చేసిన బీజేడీ అభ్యర్థుల్లో అత్యధికంగా 66 మందిపై నేరారోపణలు ఉన్నాయి. 53మంది తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 37మంది బీజేపీ జెడ్పీటీసీలు, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఏడుగురు, ఝార్కండ్ ముక్తి మోర్చా(జేఏఎంఎం), భారతీయ కమ్యునిస్ట్ పార్టీ(సీపీఐ), స్వతంత్ర అభ్యర్థుల వర్గంలో ఒక్కొక్కరి చొప్పున నేరచరితులు ఉన్నారు. బీజేపీకి చెందిన జెడ్పీ సభ్యుల్లో నలుగురిపై తీవ్ర నేరారోపణలు, కాంగ్రెస్ నుంచి ఆరుగురిలో, జేఏఎంఎం, స్వతంత్ర అభ్యర్థుల వర్గంలో ఒక్కొక్క అభ్యర్థికి వ్యతిరేకంగా నమోదైన కేసులు వివిధ కోర్టుల్లో కొనసాగుతున్నాయి. సగటు ఆస్తుల విలువ.. కొత్తగా ఏర్పాటైన మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో సమగ్రంగా 95 మంది(13 శాతం) కోటీశ్వరులు ఉన్నారు. వీరి సగటు ఆస్తుల విలువ రూ.56 లక్షల 60 వేలు. వీరిలో బీజేడీకి చెందిన జిల్లా పరిషత్ అభ్యర్థుల్లో అత్యధికంగా 90 మంది(14 శాతం) కోటీశ్వరులు కాగా.. బీజేపీ నుంచి ముగ్గురు(8శాతం), కాంగ్రెస్‌లో ఇద్దురు(9శాతం) కోటీశ్వరులు ఎన్నికయ్యారు. విద్యాధికులు అంతంతమాత్రమే.. తాజా ఎన్నికల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులుగా ఎన్నికైన వారిలో విద్యాధికులు అంతంత మాత్రమే. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సంస్థ విశ్లేషణాత్మక వివరాలను బహిరంగం చేసింది. కొత్తగా ఎన్నికైన వారిలో 451 మంది(62శాతం) 5వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య విద్యార్హతలు కలిగి ఉన్నారు. 256 మంది(35 శాతం) పట్టభద్రులు, ఆరుగురు డిప్లొమా విద్యార్హత కలిగి ఉన్నారు. ఏడుగురు అభ్యర్థులు నామమాత్రపు అక్షరాశ్యులు. 50 ఏళ్లు పైబడిన అభ్యర్థులు అత్యధికంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. 51 ఏళ్ల నుంచి 70 ఏళ్లు పైబడిన వారు 88 మంది ఉన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన 373మంది అభ్యర్థులు వయస్సు సంబంధిత వివరాలు దాఖలు చేయలేదని నివేదికలే తేలింది. చదవండి: క్షణంలో పెళ్లి.. సొమ్మసిల్లి పడిపోయిన వరుడు.. షాకిచ్చిన వధువు.. ఏం చేసిందంటే! -
MLA Jogarao: ‘మార్గం’ చూపిన ఎమ్మెల్యే
సాక్షి, పార్వతీపురం మన్యం(బలిజిపేట): పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు చొరవతో వంతరాం నుంచి కొత్త వంతరాం వరకు రూ.20లక్షలతో రోడ్డు నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. కొత్తవంతరాం గ్రామస్తులకు సరైన రహదారి సదుపాయం లేక రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుండడంతో ఎమ్మెల్యే జోగారావుకు కొద్దికాలం క్రితం గ్రామస్తులు విన్నవించుకున్నారు. వంతరాం నుంచి కొత్తవంతరాం వరకు నిర్మిస్తున్న రోడ్డు ఇదే దీనికి స్పందించిన ఎమ్మెల్యే జోగారావు జిల్లా పరిషత్ నిధులు రూ.20లక్షలు మంజూరుచేయించి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2 కిలోమీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పుతో రోడ్డు చేపట్టి నిర్మాణం పూర్తయితే తమ అవస్థలు తీరుతాయని గ్రామస్తులు తెలిపారు. చదవండి: (Nandyal District: నెరవేరబోతోన్న రేనాటి ప్రాంత వాసుల కల) -
పాత జెడ్పీ చైర్మన్లే.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా పాత జిల్లా పరిషత్‌ల విధానమే కొనసాగనుంది. ప్రస్తుత జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవీకాలం ముగిసే వరకు పాత జిల్లాల విధానంలోనే ఆయా పదవుల్లో కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగో తేదీ నుంచి ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రస్తుత జిల్లా ప్రజా పరిషత్‌ల పదవీ కాలం ముగిసే వరకు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వాటి పరిధి, అధికారాలపై కొత్త జిల్లాల ఏర్పాటు ఎలాంటి ప్రభావం చూపదు అని నోటిఫికేషన్లో పేర్కొంది. 2026 సెప్టెంబరు వరకు.. గతేడాది సెప్టెంబర్ 25న రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుత జిల్లా పరిషత్‌ల పదవీ కాలం 2026 సెప్టెంబరు 24 వరకు ఉంది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అప్పటి వరకు పాత జిల్లాల ప్రాతిపదికనే జిల్లా పరిషత్‌ల పాలన కొనసాగనుంది. పాత జిల్లాల ప్రాతిపదికనే జెడ్పీ సీఈవో కార్యాలయాలు కొనసాగుతాయి. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలలో జెడ్పీ కార్యాలయాలు ప్రత్యేకంగా ఉండవు. అడ్వకేట్ జనరల్ సూచనల మేరకు న్యాయ వివాదాలు తలెత్తకుండా జిల్లా పరిషత్తులపై ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలోనూ.. తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. తెలంగాణలో 2016లో దసరా రోజు కొత్త జిల్లాలు ఏర్పాటు కాగా అప్పటికి జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక జరిగి రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. దీంతో 2014లో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లే 2019లో పూర్తి పదవీకాలం ముగిసే వరకు కొనసాగారు. 2019లో జెడ్పీటీసీ ఎన్నికలకు ముందు మాత్రమే 33 జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్‌లను విభజించి ఎన్నికలు నిర్వహించారు. ఇది చదవండి: ఏపీలో కొత్త డివిజన్లకు ఆర్డీవోల నియామకం -
నూతన జిల్లాలకు కొత్త జెడ్పీ చైర్మన్లు
సాక్షి, అమరావతి: జిల్లాల పునర్విభజన పూర్తయిన వెంటనే ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్ (జెడ్పీ)లను 26 జెడ్పీలుగా విభజించి, కొత్తగా ఏర్పాట య్యే జిల్లాలకు వేరుగా జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ దిశగా కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరిగి ఐదు నెలలైంది. 13 జిల్లాల్లో ఒక్కో జెడ్పీ చైర్మన్, ఇద్దరేసి వైస్ చైర్మన్ల చొప్పున గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా పదవులకు ఎన్నికైన వారు మరో నాలుగున్నర ఏళ్లకు పైనే ఆ పదవుల్లో కొనసాగాల్సి ఉంది. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా సుదీర్ఘ కాలం పాటు పాత జిల్లా ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్లను కొనసాగించడం మంచిది కాదనే అభిప్రాయంతో ప్రభుత్వం కొత్త జెడ్పీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోందని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. అప్పట్లో తెలంగాణలో భిన్న పరిస్థితులు మన పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత కూడా అప్పటికే ఉన్న జెడ్పీ చైర్మన్లే పదవీ కాలం ముగిసే వరకు ఆయా పదవుల్లో కొనసాగారు. ఆ రాష్ట్రంలో 2016 దసరా రోజున కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. అంతకు ముందు 10 జిల్లాలుగా ఉండే తెలంగాణ రాష్ట్రం జిల్లాల పునర్విభజన తర్వాత 33 జిల్లాలుగా మారిపోయింది. 2014లో ఉమ్మడి జిల్లాల వారీగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్లే 2019లో వారి పూర్తి పదవీ కాలం ముగిసే వరకు ఆయా పదవుల్లో కొనసాగారు. అయితే రాజకీయంగా ఆ రాష్ట్రానికి, మన రాష్ట్రానికి మధ్య చాలా తేడా ఉందని, ఈ దృష్ట్యా కొత్త జిల్లాల వారీగా జెడ్పీల విభజన ప్రక్రియకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పట్లో తెలంగాణలో కొత్త జిల్లాలకు అనుగుణంగా వెంటనే జెడ్పీల విభజన చేపట్టడానికి పలు చోట్ల టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లేదనేది ఒక కారణం అని తెలుస్తోంది. అప్పట్లో తెలంగాణలో జిల్లాల పునర్విభజన తర్వాత 33 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరిగితే అన్నిచోట్ల కచ్చితంగా అధికార టీఆర్ఎస్ వారే చైర్మన్లుగా గెలుస్తారో లేదో అన్న సంశయంతో పాత జెడ్పీలనే కొనసాగించారని విశ్లేషకులు చెబుతున్నారు. దానికి తోడు జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం అప్పటికి మరో రెండేళ్లు మాత్రమే మిగిలి ఉండడం వల్ల కూడా జెడ్పీల విభజన జోలికి పోలేదని సమాచారం. అయితే మన రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత కూడా 26 జిల్లాల ప్రాతిపదికన జెడ్పీలను విభజిస్తే అన్ని చోట్ల అధికార పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉందనే విషయాన్ని గమనించాలని పలువురు స్పష్టం చేస్తున్నారు. ఈ దృష్ట్యా కొత్త జిల్లాల ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకే ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఏజీకి లేఖ.. ప్రస్తుత జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం మధ్యలో కొత్త జిల్లాల వారీగా జెడ్పీల విభజన ప్రక్రియలో న్యాయ పరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా.. అని నిర్ధారించుకోవడానికి పంచాయతీ రాజ్ శాఖ న్యాయ సలహాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌కు లేఖ రాశారు. మరోవైపు జిల్లాల పునర్విభజన జరిగిన వెంటనే కొత్త జిల్లాల వారీగా జెడ్పీలను విభజిస్తే.. జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి వంటి అదనపు పోస్టుల కల్పనకు కూడా పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
606 మండలాల్లో వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షులే
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 623 మండలాల్లో మంగళవారం రెండో మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. 606 మండలాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏడు మండలాల్లో తెలుగుదేశం, మూడుచోట్ల జనసేన, ఒక చోట సీపీఎం ఆ పదవుల్ని దక్కించుకున్నాయి. ఆరు మండలాల్లో ఇండిపెండెంట్ ఎంపీటీసీ సభ్యులు రెండో ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. వీరిలో ఎక్కువమంది వైఎస్సార్సీపీ మద్దతుతో గెలుపొందారు. 2 జిల్లాల్లో అన్ని మండలాల్లో ఎన్నికలు పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా 649 మండలాల్లో రెండో ఉపాధ్యక్ష ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. వీటిలో 623 మండలాల్లో మంగళవారం ఎన్నికలు ముగిశాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అన్ని మండలాల్లో ఎన్నిక పూర్తవగా, మిగిలిన 11 జిల్లాల్లో 26 మండలాల్లో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. ఈ మండలాల్లో బుధవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా మండలాల్లో ఎంపీటీసీ సభ్యులకు మండల ప్రిసైడింగ్ అధికారులు సమాచారం ఇచి్చనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం తెలిపింది. కర్నూలు జెడ్పీ చైర్మన్‌గా పాపిరెడ్డి మండలాల్లో రెండో ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలతో పాటు వివిధ కారణాలతో పలుచోట్ల ఖాళీగా ఉన్న జెడ్పీ చైర్మన్, మండల అధ్యక్ష (ఎంపీపీ), ఒకటో ఉపాధ్యక్ష పదవులకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. కర్నూలు జెడ్పీ చైర్మన్‌గా వైఎస్సార్సీపీకి చెందిన యర్రబోతుల పాపిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ► విశాఖ జిల్లా మాకవరపాలెం, చిత్తూరు జిల్లా గుర్రంకొండ, రామకుప్పం మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా రామకుప్పం మండలంలో ఎన్నిక వాయిదా పడింది. మాకవరపాలెం, గుర్రంకొండ మండలాధ్యక్ష పదవుల్ని వైఎస్సార్సీపీ గెల్చుకుంది. రామకుప్పం మండలంలో బుధవారం ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ► వైఎస్సార్ జిల్లా గాలివీడు, సిద్ధవటం, కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలాల్లో మొదటి ఉపాధ్యక్ష పదవుల్ని వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెల్చుకున్నారు. ► గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో రెండు ఉపాధ్యక్ష పదవులకు నిర్వహించాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. -
విషాదం: జడ్పీ వైస్ చైర్మన్ అంబటి అనిల్ మృతి
సాక్షి, విజయనగరం : జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అంబటి అనిల్ గుండె పోటుతో మృతి చెందారు. జిల్లా పరిషత్‌లో అందరి కన్నా చిన్న వయస్సున్న జడ్పీటీసీగా గుర్తింపు పొందారు. అంబటి అనిల్.. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మేనల్లుడు. అనిల్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. అనిల్ సొంతూరు సొంతూరు సాలూరు మండలం సన్యాసిరాజుపేట. జడ్పీ వైస్ చైర్మన్ మృతితో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనిల్ మృతిపై వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..! -
AP: చంటిబిడ్డలతో ప్రమాణ స్వీకారానికి..
నెల్లూరు (పొగతోట) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారానికి ఇద్దరు సభ్యులు తమ చంటిబిడ్డలతో హాజరయ్యారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జెడ్పీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాపూరు జెడ్పీటీసీ సభ్యురాలు చిగురుపాటి లక్ష్మీప్రసన్న, తడ జెడ్పీటీసీ సభ్యురాలు ఇందుమతి రోజుల బిడ్డలతో హాజరయ్యారు. వీరిని సహాయకుల వద్ద ఉంచి వారు ప్రమాణ స్వీకారం చేశారు. రాపూరు జెడ్పీటీసీ సభ్యురాలు చిగురుపాటి లక్ష్మీప్రసన్న జెడ్పీ వైస్ చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. -
ఏపీ: జెడ్పీల్లోనూ ‘సామాజిక’ రెపరెపలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇప్పటికే అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. శనివారం జరిగిన జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయా పదవులను ఏకగ్రీవం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసింది. 13 జిల్లాల జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికల్లో తిరుగులేని అఖండ విజయం సాధించింది. అంతేకాదు.. రాజకీయాల్లో సామాజిక విప్లవం సృష్టిస్తున్న ఆ పార్టీ మరోసారి జెడ్పీ పదవుల్లోనూ రెపరెపలాడించింది. ఇక ఒక రాష్ట్రంలో అన్ని జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఒకే పార్టీ చేజిక్కించుకోవడం దేశంలో ఇదే తొలిసారి. ఇలా కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీ 630 జెడ్పీటీసీ స్థానాల్లో చారిత్రక విజయం సాధిం చింది. విపక్ష పార్టీలైన టీడీపీ కేవలం ఆరు, జనసేన రెండు, సీపీఎం 1, ఇతరులు ఒక స్థానంలో మాత్రమే గెలుపొందాయి. కో–ఆప్షన్ సభ్యుల పదవులకూ శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఇందులోనూ అన్ని పదవులకు వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదీ సామాజిక న్యాయమంటే.. జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయాన్ని మరోసారి చేతల్లో చూపించారు. 13 జిల్లా పరిషత్ చైర్మన్/చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏకంగా తొమ్మిది కేటాయించారు. అలాగే.. ►విజయనగరం, చిత్తూరు జెడ్పీ చైర్మన్ పదవులను జనరల్ విభాగానికి ప్రభుత్వం రిజర్వు చేసింది. కానీ, ఆ రెండింటినీ బీసీ వర్గాలకు చెందిన మజ్జి శ్రీనివాసరావు, గోవిందప్ప శ్రీనివాసులుకు అవకాశం కల్పించారు. ►కృష్ణాజిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవిని జనరల్ (మహిళ)కు ప్రభుత్వం రిజర్వు చేస్తే.. ఆ పదవిని బీసీ మహిళ ఉప్పాల హారికకు పట్టంగట్టారు. ►ఇలా జనరల్, జనరల్ (మహిళ) విభాగాలకు ప్రభుత్వం రిజర్వు చేసిన మూడు జెడ్పీ అధ్యక్ష పదవుల్లో బీసీ వర్గాలకు అవకాశం కల్పించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ సామాజిక ఢంకా మోగించారని రాజకీయ పరిశీలకులు ప్రశంసిస్తున్నారు. ►మరోవైపు.. ఒక్కో జిల్లా పరిషత్‌కు ఇద్దరేసి ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. మొత్తం 26 ఉపాధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 20 పదవులను కేటాయించారు. మిగిలిన ఆరింటిలో ఓసీలకు అవకాశం కల్పించారు. ►అంతేకాక.. జిల్లా పరిషత్ చైర్పర్సన్లుగా ఏడుగురికి.. వైస్ చైర్పర్సన్లుగా 15 మంది మహిళలకు అవకాశం కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు సీఎం వైఎస్ జగన్ మరోసారి పెద్దపీట వేశారు. ►ఇక రాష్ట్రంలో 620 ఎంపీపీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి 67 శాతం, ఓసీలకు 33 శాతం పదవులను కేటాయించారు. ఎంపీపీ పదవుల్లో ఏకంగా 64 శాతం (397) పదవులను మహిళలకు కేటాయిస్తే.. 36 శాతం (223) పదవులను పురుషులకు కేటాయించారు. ‘జనరల్’లో బీసీలకు అవకాశం ►విజయనగరం, చిత్తూరు జెడ్పీ చైర్మన్ పదవులను జనరల్ విభాగానికి ప్రభుత్వం రిజర్వు చేసింది. కానీ, ఆ రెండింటినీ బీసీ వర్గాలకు చెందిన మజ్జి శ్రీనివాసరావు, గోవిందప్ప శ్రీనివాసులుకు అవకాశం కల్పించారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవిని జనరల్ (మహిళ)కు రిజర్వు చేస్తే.. బీసీ మహిళ ఉప్పాల హారికకు పట్టంగట్టారు. -
రెండేళ్ల పాలనకు నిదర్శనమే ఈ ప్రజా తీర్పు: మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం: రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల జెడ్పీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. సీఎం వైఎస్ జగన్ నాయకత్వాన్ని ఓటర్లందరూ సమర్థించారు. మాపై పూర్తి విశ్వాసాన్ని ఉంచారు. ఈ పదవుల వలన మరింత బాధ్యత పెరిగింది. మేము ఇంకా కష్టపడి పనిచేయాలని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న జెడ్పీటీసీ అభ్యర్థులు వందకి వంద శాతం గెలుపొందారు. అందరికీ పార్టీ తరపున, వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరూ కష్టపడి పనిచేయాలని కోరుతున్నా. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన మజ్జి శ్రీనివాస్‌రావుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చదవండి: ('భారత్ బంద్‌కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు') జిల్లా ప్రజలకు మాట ఇస్తున్నాం. గెలిపించిన ప్రజల ఆశయాలను వమ్ము చేయకుండా ప్రజల కోసం పాలన చేపడతాం. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకున్నారు. టీడీపీ ఒకవైపు పోటీ చేసి మరోవైపు ఎన్నికకు దూరంగా ఉన్నాం అంటూ కుంటి సాకులు చెప్పింది. రెండేళ్ల పాలనకు నిదర్శనమే ఈ ప్రజా తీర్పు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీయే విజయం సాధిస్తుందిని మంత్రి అన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు: జెడ్పీ చైర్మన్ చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీఎం జగన్ పరిపాలన, సంక్షేమం వలనే ప్రజా విజయం సాధించాం. ప్రతి ఒక్కరి ఆలోచన తీసుకొని, గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడతా. సీఎంకు పేరు, గౌరవం తెచ్చే విధంగా బాధ్యతలను నిర్వహిస్తాను. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటా. పదవి ఉన్నా.. లేకున్నా ఒకేలా ఉంటా అని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్‌రావు అన్నారు. చదవండి: (ఎన్నికల బహిష్కరణ టీడీపీ డ్రామానే: బొత్స) -
Andhra Pradesh: జెడ్పీ వైస్ ఛైర్మన్లు వీరే..
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను వైఎస్సార్సీపీనే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వైస్ చైర్మన్ల ఎంపిక కూడా పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి వైస్ చైర్మన్ల ఎంపిక పూర్తికాగా, వారి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాల వారిగా జెడ్పీ వైస్ ఛైర్మన్లుగా ఎంపికైన వారు.... తుంపాల అప్పారావు, భీశెట్టి సత్యవతి ( విశాఖ), బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత (తూర్పు గోదావరి), పెనుమాల విజయబాబు, శ్రీలేఖ ( పశ్చిమ గోదావరి), గరికపాటి శ్రీదేవి, గుడిమల కృష్ణంరాజు (కృష్ణ), బత్తుల అనురాధ, శొంఠిరెడ్డి నర్సిరెడ్డి( గుంటూరు), యన్నాబత్తిన అరుణ, సుజ్ఞానమ్మ (ప్రకాశం), శ్రీహరి కోట లక్ష్మమ్మ, చిగురుపాటి లక్ష్మీ ప్రసన్న(నెల్లూరు ), ధనుంజయ్‌రెడ్డి, రమ్య( చిత్తూరు), కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, నాగరత్న ( అనంతపురం), దిల్షాద్ నాయక్, కురువ బొజ్జమ్మ ( కర్నూలు), సిరిపురపు జగన్మోహన్రావు, పాలిన శ్రావణి ( శ్రీకాకుళం), జేష్టాది శారద, పిట్టు బాలయ్య (వైఎస్సార్), అంబటి అనిల్‌కుమార్, బాపూజీ నాయుడు(విజయనగరం). చదవండి: AP ZPTC Chairman Election: 13 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లగా ఎంపికైన వారు -
AP: జెడ్పీ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ
అనంతపురం: నూతనంగా ఎన్నికైన 62 జడ్పీటీసీల ప్రమాణస్వీకారం పూర్తి అయింది. జడ్పీ కో-ఆప్షన్ సభ్యులుగా ఫయాజ్ వలి, అహ్మద్ బాషా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనంతవెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఏపీ ఉర్ధూ అకాడమీ ఛైర్మన్ నదీం అహ్మద్, ఏపీ నాటక అకాడమీ ఛైర్ పర్సన్ హరిత పాల్గొన్నారు. ► విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పరిషత్ వద్ద వైఎస్సార్సీపీ అభ్యర్థుల కోలాహలం నెలకొంది. మొత్తం 38 స్థానాలకు గాను 36 మంది జడ్పీటీసీ అభ్యర్థులు వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవులు కూడా వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ఈ సందర్భంగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ఇదంతా సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ ఫలాలు అందించిన విజయంగా పేర్కొన్నారు. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాట్లాడుతూ.. ముఖ్యంగా ఈ సారి జడ్పీ చైర్ పర్సన్ పదవి గిరిజన ప్రాంతానికి దక్కడంతో సంతోషంగా ఉందన్నారు. ► వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ కో అప్షన్ సభ్యులుగా ఇద్దరు మైనారిటీలకు అవకాశం. ► కరీముల్లా, షేక్ అన్వర్ బాష లను కో అప్షన్ మెంబర్లుగా ఏకగ్రీవ ఎన్నిక. ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయరామ రాజు. జిల్లాల వారీగా జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నిక కానున్నది వీరే.. ► అనంతపురం జిల్లా: బోయ గిరిజమ్మ (బీసీ) ► చిత్తూరు జిల్లా: శ్రీనివాసులు ( బీసీ) ► తూర్పు గోదావరి జిల్లా: వేణుగోపాల్ రావు (ఎస్సీ) ► పశ్చిమ గోదావరి జిల్లా: కవురు శ్రీనివాస్ (బీసీ) ► గుంటూరు జిల్లా: హెనీ క్రిస్టినా( ఎస్సీ) ► కర్నూలు జిల్లా: వెంకట సుబ్బారెడ్డి( ఓసీ) ► కృష్ణా జిల్లా: ఉప్పాళ్ల హారిక( బీసీ) ► నెల్లూరు జిల్లా: ఆనం అరుణమ్మ( ఓసీ) ► ప్రకాశం జిల్లా: వెంకాయమ్మ (ఓసీ) ► వైఎస్సార్ కడప జిల్లా: ఆకేపాటి అమర్నాథ్రెడ్డి (ఓసీ) ► విశాఖపట్నం జిల్లా: జల్లిపల్లి సుభద్ర (ఎస్టీ) ► విజయనగరం జిల్లా: మజ్జి శ్రీనివాసరావు (బీసీ) ► శ్రీకాకుళం జిల్లా: విజయ( సూర్య బలిజ) మధ్యాహ్నం 3 గంటకు జడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. జడ్పీ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. కలెక్టర్లు జడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్‌తో ప్రమాణం చేయుంచనున్నారు. ► కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జడ్పీ కార్యాలయం వరకు వైఎస్సార్సీపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నిక కానున్న ఆకెపాటి అమర్నాథ్రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి సీఎం అంజాద్ బాష, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ పాల్గొన్నారు. ► కోఆప్షన్ సభ్యుల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక శనివారం మధ్యాహ్నం జరగనుంది. అందులో భాగంగా ముందుగా కోఆప్షన్ సభ్యుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు జడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా శ్రీనివాసులు( వి.కోట జడ్పిటీసీ), తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా విపర్తి వేణుగోపాల రావు(పి.గన్నవరం జడ్పీటీసీ), అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా బోయ గిరిజమ్మ (ఆత్మకూరు జెడ్పీటీసీ), వైఎస్సార్ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా ఆకెపాటి అమర్నాథ్రెడ్డి ఎన్నిక కానున్నారు. కృష్ణా జిల్లాలో జడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బీసీ మహిళ జడ్పీ పీఠాన్ని అధిష్టించనున్నారు. 13 జిల్లాల్లో చైర పర్సన్, ప్రతి జిల్లాకు ఇద్దరు వైస్ చైర్ పర్సన్లకు ఎన్నిక జరగనుంది.13 జిల్లా పరిషత్‌లు వైఎస్సార్సీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 శాతానికిపైగా పదవులు దక్కనున్నాయి. నూరుశాతం జడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడం దేశంలోనే ఇదే ప్రథమం. -
ఏపీ: నేడు జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక శనివారం జరగనుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను 640 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కొత్తగా ఎన్నికైన సభ్యులు చేతులు ఎత్తే విధానంలో ఆయా జిల్లాల జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. అన్ని జిల్లాల్లో నేటి ఉదయం 10 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రిసైడింగ్ అధికారి.. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఒక్కో జిల్లాలో ఇద్దరు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్, జిల్లాకు ఇద్దరు చొప్పున వైస్ చైర్మన్ల ఎన్నికను నిర్వహించనున్నారు. -
మెట్టినింట మెరిసిన కోదాడ బిడ్డ.. ఈమె ఎవరో తెలుసా?
సాక్షి, కోదాడ(నల్గొండ) : ఆమెది రాజకీయ కుటుంబ నేపథ్యం.. ప్రజాప్రతినిధులుగా అమ్మానాన్న చేస్తున్న సేవలను చిన్నప్పటినుంచీ చూసిన ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి కలిగింది. ఓవైపు ఫ్యాషన్ డిజైనర్‌గా, ఇంటీరియర్ డిజైనర్‌గా రాణిస్తూనే రాజకీయంవైపు అడుగులు వేసింది. పలు పార్టీల్లో చేరి పుట్టినింట తన అదృష్టాన్ని పరీక్షించాలనుకున్నా సాధ్యపడలేదు. కానీ మెట్టినింట మాత్రం తాను అనుకున్న కలను నెరవేర్చుకుంది. ఆమె కోదాడ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కూతురు శ్రీకళారెడ్డి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై ప్రజాసేవబాటలో తొలి అడుగువేసింది. జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తర్వాత తన సంతోషాన్ని ‘సాక్షి’తో పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే.. మాది సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం రత్నవరం. మా నాన్న కీసర జితేందర్‌రెడ్డి కోదాడ సమితి ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా పని చేశారు. మా అమ్మ కీసర లలితారెడ్డి. గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. వారికి నేను ఒక్కదానినే సంతానం. మానాన్న యుక్త వయస్సులో ఉండగా పులితో కలబడ్డాడు. ఆయన చేతిని పులి గాయపర్చినా లెక్క చేయకుండా దాన్ని చంపారు. అందరూ ఆయనను పులి అంటారు. ఆయన బిడ్డను కాబట్టి నేను పులి బిడ్డను. నా విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే సాగింది. ఫ్యాషన్ డిజైనర్‌గా, ఇంటీరియర్ డిజైనర్‌గా కొంత కాలం పని చేశాను. రాజకీయరంగ ప్రవేశం ఇలా.. మా తండ్రి జితేందర్‌రెడ్డి 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో తెలంగాణ– ఆంధ్ర సరిహద్దు పాలేరు వంతెన వద్ద జరిగిన పోరులో ముందుండి కోదాడ పట్టణా న్ని కాపాడాడు. ఆ తరువాత కో దాడ సమితి ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా పని చేశారు. మాఅమ్మ లలి తారెడ్డి మా స్వగ్రామం రత్నవరానికి సర్పంచ్‌గా పని చేశారు. వారిని చూసి స్ఫూర్తిపొంది చిన్నతనం నుంచే రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలనుకున్నాను. 2004 నుంచి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీల నుంచి కోదాడ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించినా దక్కించుకోలేకపోయాను. తరువాత బీజేపీలో చేరాను. భర్త, మామ ప్రోత్సాహంతో.. పుట్టింట రాజకీయరంగ ప్రవేశం చేసినా అనుకున్న లక్ష్యాన్ని చేరలేక పోయా. ఎనిమిదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ ధనుంజయ్సింగ్తో వివాహం జరగడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో స్థిరపడ్డాను. మా మామగారు రాజ్‌దేవ్‌సింగ్ కూడా ఉత్తరప్రదేశ్‌లో మాజీ ఎమ్మెల్యే. వారి ప్రోత్సాహంతోనే ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జాన్పూర్ జిల్లా పరిధిలోని మలహాని నియోజకవర్గ పరిధిలో టిక్రరా మండలం నుంచి బీజేపీ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేశా. రెబల్ అభ్యర్థి ఉన్నప్పటికీ 12,900 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాను. 83 మంది జెడ్పీటీసీల్లో 43 మంది మద్దతు తెలపడంతో జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యాను. మహిళలకు అండగా.. ప్రజాసేవ చేయాలనే లక్ష్యానికి ఇన్నాళ్లకు ఒక వేదిక దొరికింది. దీని ద్వారా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఎంత చేయగలనో అంత చేయ్యాలన్నదే నా లక్ష్యం. త్వరలోనే జిల్లా పరిస్థితులపై అవాహన ఏర్పర్చుకొని అందరి సహకారంతో ముందుకు వెళ్తాను. -
Putta Madhu: ఫోన్ స్విచ్ఛాఫ్.. పుట్ట మధు ఎక్కడ..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఐదు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచే ఆయన అదృశ్యం కావడం పెద్దపల్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈటలకు సన్నిహితుడిగా పేరున్న పుట్ట మధు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొని ఎందుకు కనిపించకుండా పోయారనేది హాట్ టాపిక్ అయింది. ఈటల ఎపిసోడ్ వెలుగులోకి రాకముందే.. అడ్వకేట్ దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చిందని, హత్య కోసం రూ.2 కోట్ల సుపారీ ఇచ్చారనే పుకార్లు షికారు చేశాయి. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే సమయంలో ఈటల రాజేందర్ ఎపిసోడ్ తెరపైకి రాగా.. అనూహ్యంగా మధు అదృశ్యమయ్యారు. ఐదు రోజులుగా ఆయన ఫోన్లోనూ అందుబాటులో లేరు. గన్మెన్లు మధు వెంటే ఉన్నారా..? ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొని అదృశ్యం అయిన పుట్ట మధు వెంట రక్షణ కోసం నలుగురు గన్మెన్లు ఉంటారు. మంథని నుంచి గన్మెన్లకు కూడా చెప్పకుండా మధు అదృశ్యం అయినట్లు మంథనిలో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ విషయాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ధ్రువీకరించలేదు. ‘జెడ్పీ చైర్మన్ మధు వెంటే గన్మెన్లు ఉన్నారు. మధు అదృశ్యమైనట్లు గన్మెన్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి కూడా ఫిర్యాదు రాలేదు’ అని ‘సాక్షి’కి తెలిపారు. గన్మెన్ల ఫోన్లు పనిచేస్తున్నాయని మాత్రం చెప్పిన సీపీ మధు ఎక్కడున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ‘ప్రజాప్రతినిధులు పనుల మీద దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. వారితోపాటు వారి రక్షణ కోసం గన్మెన్లు కూడా వెళతారు. ఆ వివరాలేవీ గన్మెన్లు మాకు రిపోర్టు చేయరు’ అని సీపీ సత్యనారాయణ వివరించారు. హంతకులను అరెస్టు చేసినట్లు అసెంబ్లీలో చెప్పిన సీఎం వామన్‌రావు దంపతుల హత్య వ్యక్తిగత కక్షలతో జరిగిందే తప్ప రాజకీయ కోణంలో కాదని, తమ పార్టీ వారికి హత్యతో ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. కేసులో దోషులను కూడా అరెస్టు చేసిన విషయాన్ని వెల్లడించారు. అయితే.. పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను ఈ హత్యకేసులో నిందితుడు కావడంతో మంథనిలో పుకార్లు ఆగలేదు. తాజాగా వామన్‌రావు హత్యకు రూ.2 కోట్ల సుపారీ అందించారని, ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఒకరిద్దరిని అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. నిందితుల్లో ఒకరు అప్రూవల్‌గా మారారని.. చాలా విషయాలు వెల్లడించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీటన్నింటి నేపథ్యంలో మధు కనిపించకుండా పోవడం చర్చనీయాంశమైంది. ఒకట్రెండు రోజుల్లో ఫోన్ ఆన్ అవుతుందన్న ముఖ్య నేత పుట్ట మధు ఎక్కడికీ పోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నారని టీఆర్ఎస్కు చెందిన ఓ ముఖ్య నేత ‘సాక్షి’తో చెప్పారు. ఐదు రోజులుగా ఫోన్ స్విచ్ఛాఫ్ అవడం వ్యక్తిగతమని చెప్పిన ఆయన.. ఒకట్రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తారని అన్నారు. అయితే.. మధు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి వేరే రాష్ట్రానికి వెళ్లినట్లు చర్చ జరుగుతుండగా.. రెండు రోజుల క్రితం హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ అధిష్టానాన్ని కలిసే ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈటలతో తనకేమీ సంబంధం లేదనే విషయాన్ని హైకమాండ్‌కు చెప్పాలని భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. చదవండి: ఈటల ఎమ్మెల్యే పదవిపై తొలగని ఉత్కంఠ Etela Rajender: సరైన సమయంలో సరైన నిర్ణయం -
కార్పొరేషన్ల చైర్మన్లకు జెడ్పీల్లో ఎక్స్అఫిషియో సభ్యత్వం
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్‌లలో ఎక్స్ అఫిషియో సభ్యత్వం కల్పించనుంది. ఇందుకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. సాధారణంగా.. జిల్లా పరిషత్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతుంటారు. అలాగే, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు కూడా తమతమ వర్గాల సమస్యలను జెడ్పీ సమావేశాల్లో ప్రస్తావించేందుకు వీలుగా వారికీ ఎక్స్ అఫిషియో సభ్యత్వం కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు చట్ట సవరణకు చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ప్రస్తుతమున్న 61 కార్పొరేషన్ల చైర్మన్లు తాము కోరుకున్న జిల్లాలో ఎక్స్అఫిషియో సభ్యునిగా హోదా పొందే వీలు కలుగుతుంది. ఓటు హక్కు మాత్రం ఉండదు ఇదిలా ఉంటే.. జెడ్పీలో ఇప్పటికే ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు జెడ్పీ చైర్మన్ ఎంపిక తదితర అంశాల్లో ఓటు హక్కు లేదు. అలాగే, కార్పొరేషన్ చైర్మన్లకూ ఇది వర్తిస్తుందని పంచాయతీరాజ్ శాఖాధికారులు వెల్లడించారు. కానీ, జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే స్టాండింగ్ కమిటీల్లో ఎక్స్ అఫిషియో సభ్యుని హోదాలో ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు స్టాండింగ్ కమిటీ సభ్యునిగా కూడా నియమితులయ్యే వీలుంటుందని వారు వివరించారు. -
భూ వివాదం: ఎస్ఐపై జెడ్పీటీసీ ఫిర్యాదు
సాక్షి, మునుగోడు/రామగిరి(నల్లగొండ): మునుగోడు ఎస్ఐ మండలంలోని భూ వివాదాలతో పాటు ఇసుక అక్రమ రవాణాదారులకు అండగా నిలుస్తున్నాడని ఆరోపిస్తూ స్థానిక జెడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణిరవి ఆదివారం ట్విట్టర్లో డీజీపీతో పాటు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. భూవివాదాల్లో అనేక మందిని ఇబ్బందులకు గురిచేయడంతో పాటు ఒకే వర్గం వ్యక్తులకు పూ ర్తి మద్దతు పలుకుతూ బాధితులను రోజుల తరబడి స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నాడని ఆరో పించారు. ఎస్ఐ చేస్తున్న అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, అధి కారులు తగిన విచారణ జరిపి చర్యలు తీసుకో వాలని కోరారు. స్పందించిన జిల్లా ఎస్పీ రంగనాథ్ త్వరలో విచారణ జరిపిస్తానని మెసేజ్ ద్వారా హామీ ఇచ్చినట్లు జెడ్పీటీసీ తెలిపారు. అదృశ్యమైన మహిళ మృతి మిర్యాలగూడ: రెండు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ మృతిచెందింది. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. టూ టౌన్ సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని వాసవీనగర్‌కు చెందిన కామెల్లి సుధీర్‌కుమార్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు పట్టణానికి చెందిన అనూష(26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు ఉంది. కొంత కాలంగా కుటుంబంలో కలహాలు చోటు చేసుకోవడంతో రెండు రోజుల క్రితం అనూష ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో భర్త సుధీర్‌కుమార్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం బోటిక్పార్క్ పెద్ద చెరువు వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం అనూషదిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించి అనూష తల్లికి సమచారం అందించారు. మధ్యాహ్నం మిర్యాలగూడకు చేరుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా, క్షణికావేశంలో కుటుంబ కలహాలతోనే అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కరోనాతో మరో టీఆర్ఎస్ నేత మృతి
సాక్షి, ఆదిలాబాద్: కరోనాతో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆరె రాజన్న(56) ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. గత నెల చివరి వారంలో రాజన్నకు కోవిడ్ నిర్ధారణ కావడంతో కొన్ని రోజుల పాటు హోంక్వారంటైన్లో ఉన్న ఆయనను ఆదిలాబాద్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. పది రోజులపాటు వైద్యానికి స్పందించిన ఆయన శరీరం గత రెండు రోజులుగా సహకరించలేదు. స్వగ్రామంలో అంత్యక్రియలు.. ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని చాందా(టి) గ్రామం రాజన్న స్వస్థలం. ఈయన గతంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌రూరల్ జెడ్పీటీసీగా ఎన్నికై జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈయన మృతిపై జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజన్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కంటతడి పెట్టారు. పలువురు నాయకులు బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. సోమవారం చాందా(టి)లో అంత్యక్రియలు నిర్వహించగా.. అదనపు కలెక్టర్ డేవిడ్, జెడ్పీ సీఈవో కిషన్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, ఆదిలాబాద్ ఎంపీపీ సెవ్వ లక్ష్మీ, వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, మెట్టు ప్రహ్లాద్, పార్టీ నేతలు పాల్గొన్నారు.కుటుంబ సభ్యులు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆర్టీసీ కండక్టర్ నుంచి జెడ్పీ వైస్ చైర్మన్ వరకు.. ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వర్తించిన రాజన్న రాజకీయాల్లోకి ప్రవేశించి తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిçష్కరించేలా చొరవ చూపేవారని పలువురు పేర్కొన్నారు. -
ఏపీ జిల్లా పరిషత్ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్ధల ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 181, సబ్ సెక్షన్ 2 ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. మొత్తం 13 జిల్లాలకు గాను మహిళలకు ఏడు స్థానాలు (రెండు బీసీ) రిజర్వు కాగా, నాలుగు స్థానాలు జనరల్, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒక స్థానం చొప్పున రిజర్వు చేయబడ్డాయి. జిల్లాల వారిగా రిజర్వేషన్లు... 1 ) అనంతపురం : బీసీ మహిళ 2) చిత్తూరు : జనరల్ 3) తూర్పుగోదావరి : ఎస్సీ 4) గుంటూరు : ఎస్సీ మహిళ 5) కృష్ణా : జనరల్ మహిళ 6) కర్నూలు : జనరల్ 7) ప్రకాశం : జనరల్ మహిళ 8) నెల్లూరు : జనరల్ మహిళ 9) శ్రీకాకుళం : బీసీ మహిళ 10) విశాఖపట్నం : ఎస్టీ మహిళ 11) విజయనగరం : జనరల్ 12: పశ్చిమ గోదావరి : బీసీ 13) కడప : జనరల్ -
మండల, జిల్లా పరిషత్‌లకు కేంద్ర నిధులు
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా నిధుల లేమితో కొట్టుమిట్టాడిన జిల్లా, మండల పరిషత్‌లకు ఊరట దక్కనుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ సంస్థలకు ఇచ్చే నిధులను గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు సైతం కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ సంస్థలకు 15 ఆర్థిక సంఘం నిధుల విడుదలకు సంబంధించిన విధివిధానాలు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేసింది. శుక్రవారం రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. మొండిచేయి చూపిన 14వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వం తనకు వచ్చే పన్ను వాటాలో కొంత మొత్తాన్ని ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రాలతో పాటు స్థానిక సంస్థలకు నేరుగా అందజేస్తుంది. 2015 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య ఐదేళ్ల కాలానికి అమల్లో ఉన్న 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం విడుదల చేసే నిధుల్లో 100 శాతం నిధులను గ్రామ పంచాయతీలకే కేటాయిస్తూ అప్పట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు 13వ ఆర్థిక సంఘం అమల్లో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చే నిధుల్లో 70 శాతం గ్రామ పంచాయతీలకు, 20 శాతం జిల్లా పరిషత్‌లకు, 10 శాతం మండల పరిషత్‌లకు కేటాయించేవారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా మండల, జిల్లా పరిషత్‌లు నిధులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా నిధులివ్వకపోవడంతో మండల, జిల్లా పరిషత్‌ల్లో అభివృద్ధి నిలిచిపోయింది. రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 70–85 శాతం నిధులను గ్రామ పంచాయతీలకు.. 10–25 శాతం నిధులను మండల పరిషత్‌లకు.. 5–15 శాతం నిధులను జిల్లా పరిషత్‌లకు కేటాయించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. నిర్ణీత పరిమితికి లోబడి ఎంతెంత కేటాయింపులు చేయాలన్న దానిపై రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ ఇస్తున్నట్టు పేర్కొంది. రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నచోట(ఆంధ్రప్రదేశ్ కాదు) గ్రామ పంచాయతీలకు 70–85 శాతం.. జిల్లా పరిషత్‌లకు 15–30 శాతం నిధులు కేటాయించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,625 కోట్లు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీలోని గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు కలిపి రూ.2,625 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రానికి రూ.1,847 కోట్లు కేటాయించింది. పరిమితికి లోబడి ఏ పంచాయతీరాజ్ సంస్థకు ఎన్ని నిధులను కేటాయిస్తారన్న వివరాలను ఏప్రిల్‌లోగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖకు తెలియజేస్తే జూన్‌లో మొదటి విడత నిధులు విడుదల చేస్తామని కేంద్రం వెల్లడించింది. -
రమణారెడ్డి ఎక్కడ?
అనంతపురం: జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ రమణారెడ్డి ఎక్కడ అనే చర్చ జోరుగా సాగుతోంది. దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఆయన మూన్నెళ్లవుతున్నా.. విధుల్లో చేరకపోవడమే ఇందుకు కారణమైంది. కూడేరు ఎంపీడీఓగా పని చేస్తున్న రమణారెడ్డి 2019 ఆగస్టు 1న డిప్యూటీ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. అదే ఏడాది డిసెంబరు 19న సెలవుపై వెళ్లారు. ముందుగా ఐదు రోజులు సెలవు పెట్టినా తర్వాత పొడిగించుకున్నారు. జిల్లా పరిషత్‌లో ఈ పోస్టు అత్యంత కీలకం. కార్యాలయంలో పది సెక్షన్లు ఉన్నాయి. పరిషత్ పరిధిలో జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరి జీతభత్యాలు, పెన్షన్లు, మెడికల్ రీయింబర్స్మెంట్, పదోన్నతులు ఇలా నిత్యం పదుల సంఖ్యలో ఫైళ్లు ఆయా సెక్షన్ల నుంచి వెళ్తుంటాయి. ప్రతి ఫైలూ సీఈఓ చూడడం సాధ్యం కాదు. సీఈఓ క్షేత్రస్థాయిలో పర్యటించి జెడ్పీ ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. పైళ్లకు సంబంధించి ఆయా సెక్షన్ల అడ్మినిస్ట్రేషన్ అధికారుల ద్వారా డిప్యూటీ సీఈఓకు వెళ్తాయి. వచ్చిన ఫైళ్లను డిప్యూటీ డీఈఓ పరిశీలించి పంపితే సీఈఓ ఆమోద ముద్ర వేస్తారు. ఉద్యోగులకు, సీఈఓకు మధ్య కీలకంగా ఉండే ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఫడ్నవిస్‌కు మరో షాకిచ్చిన ఉద్ధవ్ ఠాక్రే!
సాక్షి ముంబై : రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ఆరు జిల్లా పరిషత్‌లలో నాలుగు జిల్లాల్లో మహావికాస్ ఆఘాడి విజయ ఢంకా మోగించింది. మాజీ ముఖ్యమంత్రి దేశ్‌ముఖ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల ప్రాంతమైన విదర్భలోని నాగ్‌పూర్, నందుర్బా, వాశీం జిల్లాల్లో బీజేపీకి పరాజయం చవిచూడాల్సివచ్చింది. మరోవైపు పాల్ఘర్ జిల్లాలో కూడా మహావికాస్ ఆఘాడి విజయం సాధించగా అకోలా జిల్లాలో మాత్రం ఎవరికీ పూర్తి మెజార్టీ రాలేదు. అయితే ధులేలో మాత్రం బీజేపీ పూర్తి మెజార్టీతో విజయం సాధిం చి మహావికాస్ ఆఘాడిని ఖంగు తిన్పించింది. (ఉద్ధవ్‌కు చెక్.. రాజ్‌ఠాక్రే సరికొత్త వ్యూహం..!) ఫడ్నవిస్ ఇలాకాలోనూ.. రాష్ట్రంలోని పాల్ఘర్, నాగ్‌పూర్, ధులే, నందుర్బార్, అకోలా, వాషీం జిల్లా పరిషత్ ఎన్నికలు జరగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం తొలిసారిగా జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. దీంతో ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి కేంద్రికృతమైంది. ఇలాంటి నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైంది. ఎంతో ఉత్కంఠతగా కొనసాగిన ఓట్ల లెక్కింపులో బీజేపీకి ఓటర్లు షాక్ నిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల సొంత జిల్లా నాగ్‌పూర్‌లో బీజేపీ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. బీజేపీకి పెట్టని కోటగా ఉన్న నాగ్‌పూర్ జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్ పాగా వేసింది. నాగ్‌పూర్ జిల్లా పరిషత్‌లోని మొత్తం 58 స్థానాల్లో కాంగ్రెస్ 30, ఎన్సీపీ 10, శివసేన ఒక స్థానం దక్కించుకున్నాయి. మరోవైపు బీజేపీ మాత్రం కేవలం 15 స్థానాలతో సంతృప్తి పడాల్సివచ్చింది. మరోవైపు ఇండిపెండెంట్, శేత్కరీ కామ్‌గార్ పార్టీలు చెరొక స్థానం దక్కించుకున్నాయి. (శివసేనకు చెక్.. బీజేపీతో కలిసిన రాజ్‌ఠాక్రే..!) కలసి.. విడిపోయి గతేడాది అసెంబ్లీ ఎన్నికల వరకు ఒక మాదిరిగా ఉంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ చిత్రం పూర్తిగా మారింది. ఊహించని ట్విస్ట్‌లతో ప్రజలతోపాటు రాజకీయ పార్టీల కార్యకర్తలను ఆయోమయంలో పడేశాయి. 2019లో లోకసభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. శివసేన, బీజేపీలు లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఒక్కటయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీలు, కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా పోటీ చేశాయి. ఫలితాలు శివసేన, బీజేపీల కూటమికి అనుకూలంగా వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 105 శివసేనకు 56 ఇలా పూర్తి మెజార్టీ లభించింది. అయితే ఫిఫ్టీ–íఫ్టీ మార్పుల ఒప్పందంతో విబేధాలు ఏర్పడ్డాయి. ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చినప్పటికీ శివసేన, బీజేపీలు విడిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో మహావికాస్ ఆఘాడీగా ఏర్పడి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కూటమితోనే జిల్లా పరిషత్ ఎన్నికలకు మహావికాస్ ఆఘాడీ వెళ్లింది. భారీ మెజారిటీ సాధించింది. -
ఏపీ : జెడ్పీ రిజర్వేషన్లు.. 6 స్థానాలు మహిళలకే
-
ఏపీ : జెడ్పీ రిజర్వేషన్లు.. 6 స్థానాలు వారికే
తాడేపల్లి: స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లకు సంబంధించి శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. స్ధానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లు అంశంపై పంచాయతీరాజ్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఈనెల 7వ తేదీ లోపు ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 8వ తేదీన స్థానిక సంస్థల షెడ్యూల్ అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
జనహితం.. అభిమతం
సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా సమావేశం శుక్రవారం సుమారు మూడున్నర గంటలపాటు అర్థవంతమైన చర్చలతో సాగింది. జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా, ఇళ్ల పట్టాల పంపిణీ, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, గ్రామ వలంటీర్లు, సచివాలయాలు, వైద్య ఆరోగ్యం, కొత్త ఇసుక పాలసీ వంటి కీలక అంశాలపై సభ్యులు తమ గళం వినిపించారు. విప్లవాత్మక మార్పులు.. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పారదర్శక పాలన అందించేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే కొత్తగా గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చామని చెప్పారు. దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1.34లక్షల పోస్టులను ఒకేసారి భర్తీ చేశామన్నారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే 19 కొత్త చట్టాలను తీసుకొచ్చామని.. నవరత్నాలతో పాటు తాము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. మీలా అర్ధరాత్రి అరెస్ట్‌లు చేయడం లేదు: పేర్ని నాని సమావేశం ప్రారంభం కాగానే టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇసుక సమస్యపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిరాహార దీక్ష తలపెడితే హౌస్ అరెస్ట్‌లు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై మంత్రి పేర్ని నాని బదులిస్తూ తమ ప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని.. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది కాబట్టి హౌస్ అరెస్ట్‌లు చేసి ఉంటారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం మాదిరిగా అరెస్టులు చేíసి జైల్లో పెట్టడం లేదని వివరించారు. పోర్టు కోసం 33వేల ఎకరాలు సేకరించి 28 గ్రామాలను ఖాళీ చేయిస్తే.. తాను వారికి అండగా పోరాటం చేసినప్పుడు అర్ధరాత్రి తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. మరో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఇసుక కొరత టీడీపీ ప్రభుత్వ నిర్వాకం వల్లే వచ్చిందన్నారు. ఇసుక పేరిట ఐదేళ్లు దోపిడీ చేసి ఇప్పుడు రాజకీయం చేయడం సరికాదని మరో మంత్రి వెలంపల్లి హితవు పలికారు. రైతు రుణమాఫీ జీవో పేరిట టీడీపీ రగడ రైతు రుణమాఫీ జీవో రద్దు చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కొద్దిసేపు రగడ చేశారు. ఇతర టీడీపీ ప్రజా ప్రతినిధులతో కలిసి జీవో 30ను చించి నిరసన తెలిపి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై కన్నబాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుతవం రూ. 84వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరకు రూ. 24 వేల కోట్లు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించి, రూ. 15వేల కోట్లతో సరిపెట్టారన్నారు. కోటయ్య కమిటీ, కుటుంబరావు కమిటీల పేరిట రైతుల నోట్లో మట్టి కొట్టింది మీరు కాదా అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిలదీశారు. ఓసీ రైతులకు రైతు భరోసాకై తీర్మానం వ్యవసాయరంగంపై జరిగిన చర్చలో రైతు భరోసాపై అర్ధవంతమైన చర్చ జరిగింది. ఓసీల్లోని పేద రైతులకు కూడా రైతు భరోసా వర్తింప చేయాలని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కోరారు. ఈ మేరకు డీఆర్సీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు. ఇదే అంశంపై ఎమ్మెల్యేలు వసంతకృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీలు కృష్ణారావు, అర్జునుడు కూడా మాట్లాడారు. జిల్లాలో అర్హులైన 3.01లక్షల కుటుంబాలుండగా, ఇప్పటి వరకు 2.26లక్షల కుటుంబాల ఖాతాల పరిశీలన పూర్తయిందని మంత్రి కన్నబాబు వివరించారు. కౌలురైతులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు మోకాలొడ్డు తున్నారని పలువురు సభ్యులు ఆరోపించగా, వచ్చే సమావేశం కల్లా రుణాల మంజూరును మెరుగుపడాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రికి అభినందన తీర్మానం.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1.34లక్షల పోస్టులను భర్తీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభినందిస్తూ తీర్మానం చేయాలని ఎమ్మెల్యే జోగి రమేష్ కోరగా, సభ్యులందరూ హర్షధ్వానాలతో ఆమోదించారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు.. కృష్ణా జిల్లాలో 1.81లక్షల మంది అర్హులను గుర్తించామని, వారికి అవసరమైన భూములను సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసామని జేసీ మాదవీలత వివరించగా, తమ ప్రాంతాల్లో అర్హులు ఇంకా ఉన్నారని ఎమ్మెల్యేలు కైలా అనీల్‌కుమార్, రక్షణ నిధి, జగన్మోహన్రావు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి కురసాల స్పందిస్తూ ఇది నిరంతర ప్రక్రియని అర్హులైన వారందరికి రానున్న ఐదేళ్లు ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మిస్తామని బదులిచ్చారు. సచివాలయ వ్యవస్థతో సమూల మార్పులు జిల్లాలో 980 పంచాయతీలకు 845 గ్రామ సచివాలయలు ఏర్పాటయ్యాయని, 11,025 పోస్టులకు గానూ ఇప్పటివరకు 5,153 మందికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చామని జెడ్పీ సీఈవో సూర్యప్రకాష్ వివరించారు. వరద ఉధృతి తగ్గగానే ఇసుక కొరతను అధిగమించవచ్చునని మంత్రులు కురసాల, పేర్ని పేర్కొన్నారు. ఇసుక పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రతి 15 రోజులకోసారి సమీక్షించాలని జేసీని ఇన్చార్జి మంత్రి ఆదేశించారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. పాముకాటు మరణాలు లేకుండా ఉండేందుకు కార్యాచరణ ప్రణాళికతో మూడు వారాల్లో ముందుకు రావాలని మంత్రి కురసాల డీఎంఅండ్‌హెచ్‌ఓను ఆదేశించారు. డెంగీ నిర్థారణ పరీక్షా కేంద్రాలను విజయవాడతో పాటు మచిలీపట్నంలో కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. గడిచిన ఐదేళ్లలో జరిగిన పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందని, రిపోర్టు రాగానే పెండింగ్ బిల్లులన్నింటిని దశల వారీగా విడుదల చేస్తామని మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు. బందరుకు మెడికల్ కాలేజీ, జిల్లాకు వాటర్ గ్రిడ్ మంజూరుకు కృషి చేసిన మంత్రి పేర్ని నానికి సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీఆర్ఓ ఎ.ప్రసాద్, సీపీఓ సీహెచ్ భాస్కరశర్మ, వ్యవసాయశాఖ జేడీ మోహనరావు, డీఎంఅండ్హెచ్ఒ మూర్తి, డీఆర్డీఏ పీడీ శ్రీనివా సరావు, డీఈఓ రాజ్యలక్ష్మి, మైనింగ్ డీడీ శ్రీనివాసరావు, బందరు ఆర్డీఓ ఖాజావలి పాల్గొన్నారు. -
జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదాం
సాక్షి, ఆసిఫాబాద్: ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుదామని జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడుతూ వెనకబడిన ఆదవాసీ జిల్లాకు ప్రత్యేక నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. వచ్చే ఐదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా జిల్లాకు వచ్చిన నిధులు అన్ని మండలాలకు సమానంగా పంచుతామని తెలిపారు. ఆదివాసీల సమస్యలు జెడ్పీ స్టాండింగ్ కమిటీలో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా కొత్తగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు. త్వరలోనే సీఎం అపాయింట్మెంట్ తీసుకుని జిల్లా సమస్యలు వివరిస్తామని తెలిపారు. వైస్‌చైర్మన్‌గా కృష్ణ ప్రమాణ స్వీకారం.. కాగజ్‌నగర్ జెడ్పీటీసీ కోనేరు కృష్ణ జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్‌గా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు జెడ్పీ సీఈవో వైస్‌చైర్మన్ కృష్ణకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పతో పాటు జిల్లాలోని అన్ని మండలాల జెడ్పీటీసీలు కృష్ణను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గం నుంచి కృష్ణ అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జెడ్పీ కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, సీఈవో వేణు, డిప్యూటీ సీఈవో సాయిగౌడ్, జెడ్పీటీసీలు తాళ్లపెల్లి రామారావు, అజ య్‌కుమార్, సంతోశ్, కోవ అరుణ, దృపదా బాయి, అన్ని మండలాల సభ్యులు, కో అప్షన్ సభ్యులు సిద్దిక్, అబుద్ అలీ పాల్గొన్నారు. -
రెండు రోజులు నిర్వహించాలి..!
సాక్షి,ఆదిలాబాద్: ఎజెండా అంశాలు 42.. సమావేశం ప్రారంభమైంది ఉదయం 11గంటలకు.. మొదటి ఎజెండా అంశం విద్య. రెండోది వ్యవసాయంపై చర్చసాగే సరికి మధ్యాహ్నం 2గంటలైంది. దీంతో భోజన విరామం నుంచి మళ్లీ 2.30 గంటల నుంచి తిరిగి సమావేశమయ్యారు. ఇక వడివడిగా ఎజెండా అంశాలను ముగించాలని చూశారు. రెండో సెషన్ మధ్యాహ్నం జరిగిన సమావేశంలో వైద్యం మీద కొంత చర్చ జరిగినా. మిగితా ఎజెండా అంశాల పరంగా ఇలా చదివి.. అలా నెట్టేశారు. మొత్తం మీద సాయంత్రం 5.30 గంటల్లోపు 20అంశాల వరకు పూర్తి కానిచ్చారు. మిగితా అంశాల జోలికే వెళ్లలేదు. గతనెల 27న జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం తీరిది. మరోమారు డిమాండ్.. జెడ్పీ సర్వసభ్య సమావేశం మూడు నెలలకోసారి నిర్వహించేది. మొన్నటి సమావేశం ఆగస్టు చివరి వారంలో నిర్వహించగా, మళ్లీ నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలను రెండు రోజుల పాటు నిర్వహించాలనేది ఇప్పటి డిమాండ్ కాదు. గతం నుంచే ఉన్నది. ఉమ్మడి జిల్లాలో జెడ్పీ పరంగా 52మంది జెడ్పీటీసీలు, 52మంది ఎంపీపీలు, పది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొనేవారు. సభ్యులు, ఎమ్మెల్యేలలో కొందరు 200కిలో మీటర్ల దూరం నుంచి వచ్చేవారు. అయితే అప్పుడు సమావేశాల్లో ఎజెండా అంశాలపై పూర్తిస్థాయిలో చర్చ జరగడం లేదని పలువురు సభ్యులు వాపోయేవారు. దీంతో గత పాలకవర్గంలో ఒకట్రెండు సార్లు, అంతకుముందు పాలకవర్గంలో ఒకసారి రెండు రోజుల పాటు సమావేశాలను నిర్వహించారు. అధిక మంది సభ్యులు ఉండడంతో వారికి వసతులు, భోజనాలు సౌకర్యాలు కల్పించడం ఇబ్బందిగా పరిణమించింది. అప్పట్లో జెడ్పీకి నిధుల కొరత కారణంగా జెడ్పీ సమావేశాల నిర్వహణను ఒకరోజుతోనే కానిచ్చారు. ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పడటం, ఆదిలాబాద్ జెడ్పీ 17మంది జెడ్పీటీసీలు, 17 మంది ఎంపీపీలు, నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉన్నారు. సభ్యులు ఒక గంటలోపే జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం ఉంది. దూరభారం లేదు. 17మండలాల సభ్యులు తమ మండలాలకు వెళ్లి మరుసటి రోజుకూడా వచ్చేందుకు అవకాశం ఉంది. గతనెల నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి రెండు రోజుల పాటు ఈ సమాశాలు నిర్వహించాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. సమావేశం అనంతరం అధికార పార్టీ సభ్యులతో పాటు మిగితా వారు కూడా సమస్యలను చర్చించాలి, సమస్యలందరు మాట్లాడాలంటే రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించడంతోనే ఇది సాధ్యమవుతుందనే రీతిలో చర్చించుకోవడం జరిగింది. దీనిపై మరోసారి చర్చ సాగుతోంది. ప్రధానంగా కోరం సభ్యులు కోరిన పక్షంలో రెండు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. సభ్యులు కోరితే ప్రజల సమస్యలపై చర్చించేందుకు రెండు రోజులు నిర్వహించేందుకు సిద్ధమన్న రీతిలో పాలకవర్గం పేర్కొంటుంది. మళ్లీ నిర్వహించే సమావేశాల్లోనే ఇది అమలైతే ఆమోదయోగ్యంగా ఉంటుందన్న అభిప్రాయం సభ్యుల్లో వ్యక్తమవుతోంది. గతంలో సభ్యులకు గౌరవ వేతనంతో పాటు టీఏ, డీఏలు ఉండేవి. ప్రస్తుతం సభ్యులకు గౌరవ వేతనం ఉన్నప్పటికీ టీఏ, డీఏలు ప్రభుత్వం ఇవ్వడం లేదు. తద్వారా సభ్యులు రెండు రోజుల పాటు సమావేశాల్లో పాల్గొన్నా జెడ్పీపై పడే అదనపు భారం కేవలం నిర్వహణ ఖర్చులు. సభ్యులు సబ్జెక్టుతో వస్తే.. యాభై నుంచి అరవై శాఖలకు సంబంధించి 42 ఎజెండా అంశాలను జెడ్పీ సమావేశంలో రూపొందించడం జరుగుతోంది. ఇందులో కొన్ని శాఖలకు అనుబంధంగా జోడించడంతో ఎజెండా అంశాలు శాఖల పరంగా పోల్చితే కొన్ని తక్కువగా ఉంటాయి. ప్రధానంగా జెడ్పీ సమావేశంలో సభ్యులు పూర్తి అవగాహనతో వస్తే మాత్రం ఎజెండా అంశాలు చర్చించడానికి ఒక్కరోజు అసలుకే సరిపోదు. గత సర్వసభ్య సమావేశంలో విద్య శాఖతో ఎజెండా అంశం ప్రారంభమైంది. ఉదయం 11గంటలకు ప్రారంభం కాగా ముగ్గురు నలుగురు సభ్యులు దీనిపై మాట్లాడారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖపై చర్చ సాగింది. ఈ రెండు అంశాలకే మూడుగంటల సమయం తీసుకుంది. విద్య శాఖ చర్చ సాగుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యుడు గోక జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తాను పదవీ చేపట్టిన తర్వాత తన మండలం తలమడుగులోని 75శాతం పాఠశాలల్లో పర్యటించినట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని వాపోయారు. పాలకవర్గం సభ్యుని మాటలు కుదించితే మిగితా సభ్యులు మాట్లాడేందుకు అవకాశం దక్కుతుందని పేర్కొన్నప్పుడే తాను ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదని గణేష్‌రెడ్డి పేర్కొనడం, సమావేశాలను రెండు రోజుల పాటు నిర్వహిస్తే సుదీర్ఘ చర్చ జరుగుతుందన్న వాదనను తెరపైకి తేవడం జరిగింది. సమావేశాల్లో ప్రధాన అంశాలపైనే చర్చ సాగించి మిగితావి మమ అనిపిస్తున్నారు. అంశాల వారీగా చర్చ సాగుతున్నప్పుడు సభ్యులు వాటి ప్రకారమే సమస్యలను లేవనెత్తినప్పుడే పరిష్కారానికి దోహద పడుతుంది. అలాంటప్పుడే జిల్లాలోని సమస్యలపై తీర్మాణాలు చేసి ప్రభుత్వానికి పంపినప్పుడు దానికి పరిష్కార మార్గం లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 42అంశాల్లో ఒక్కో అంశంపై సుమారు 15నిమిషాల పాటు చర్చించినా అన్ని అంశాలపై చర్చ సాగాలంటే సుమారు 11గంటల సమయం పడుతుంది. మొన్నటి సమావేశం కేవలం ఆరు గంటలు మాత్రమే నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించి మొదటి రోజు సగం, రెండో రోజు సగం ఎజెండా అంశాలను చర్చిస్తే పరిష్కారం లభిస్తుందన్న అభిప్రాయం సభ్యుల్లో వ్యక్తమవుతుంది. సమయం సరిపోకపోతే పరిశీలిస్తాం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎజెండా అంశాలపై సమయం సరిపోకపోతే మరుసటి రోజు కొనసాగించే విషయాన్ని పరిశీలిస్తాం. ప్రజల సమస్యల పరిష్కారంలో వెనకడుగు వేసేది లేదు. సభ్యుల కోరిక మేరకు ముందుకు వెళ్తాం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. – రాథోడ్ జనార్దన్, జెడ్పీ చైర్మన్, ఆదిలాబాద్ డిమాండ్‌ను పరిశీలిస్తాం రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై పరిశీలన చేస్తాం. దీనికి 1/3వ వంతు సభ్యులు కోరితే రెండు రోజులు చేపట్టేందుకు అవకాశం ఉంది. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ప్రత్యేకంగా దృష్టికి మాత్రం తీసుకురాలేదు. – కిషన్, జెడ్పీ సీఈఓ, ఆదిలాబాద్ -
స్థాయీ సంఘాల ఏర్పాటుకు ముహూర్తం
సాక్షి, భూపాలపల్లి: జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల ఏర్పాటుకు ముహూర్తం కుదిరింది. జిల్లాలోని సమస్యలను ఆ శాఖల అధికారుల దృష్టికి తీసుకువచ్చి, సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు జిల్లా పరిషత్‌కు స్థాయి సంఘాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అటువంటి స్థాయీసంఘాలకు నేడు సభ్యుల ఎన్నిక జరగబోతోంది. దీని కోసం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సభ్యులు సమావేశం కాబోతున్నారు. దీంతో అన్ని మండలాల జెడ్పీటీసీలతో సహా, కోఆప్షన్ మెంబర్లు, జిల్లాతో సంబంధం ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆహ్వాన లేఖలు అందాయి. స్థాయీ సంఘాల ఏర్పాటుకు సంబంధించిన సమాచారం వారం క్రితమే ప్రతీ జెడ్పీటీసీ సభ్యుడికి అధికారులు తెలియజేశారు. జిల్లాలో జెడ్పీ చైర్మన్‌తో కలిపి మొత్తం 11 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు కోఆప్షన్ మెంబర్లతో పాటు జిల్లాకు సంబంధం ఉన్న ములుగు, భూపాలపల్లి, మంథని ఎమ్మెల్యేలతో పాటు వరంగల్ మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులతో కలిపి మొత్తం 19 మంది ఉన్నారు. స్టాండింగ్ కమిటీల కూర్పు జిల్లా పరిషత్ పాలనలో కీలకమైనవి స్థాయిసంఘాలు. ప్రతీ జిల్లా పరిషత్‌లో 7 సాయీ సంఘాలు ఉంటాయి. ఇందులో 1. ఆర్థికం ప్రణాళిక , 2. పనుల స్టాండింగ్ కమిటీ, 3. గ్రామీణాభివృద్ధి , 4. విద్యా వైద్యం ఈ నాలుగు స్థాయిసంఘాలకు జెడ్పీ చైర్మన్ అధ్యక్షురాలిగా వ్యవహరి స్తారు. 5. వ్యవసాయ స్టాండింగ్ కమిటీకి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తా రు. 6. మహిళా స్త్రీ శిశు సంక్షేమ కమిటీకి, 7. సాంఘిక సంక్షేమ స్థాయిసంఘానికి మహిళా జెడ్పీటీసీలు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం జిల్లాలో జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ మహిళలే కావడంతో జిల్లాలోని ప్రతీ స్థాయీ సంఘానికి మహిళలే అ«ధ్యక్షురాలిగా ఉండనున్నారు. గ్రామీణాభివృద్ధి, విద్యా, వైద్య కమిటీలకు డిమాండ్ జిల్లా పరిషత్‌లో ఏడు స్టాండింగ్ కమిటీలు ఉన్నా రెండింటికి మాత్రమే ఫుల్ డిమాండ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణాభివృద్ధి, విద్యావైద్యానికి సంబంధించిన స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా ఉండేందుకే జెడ్పీటీసీలు, ఇతర సభ్యులు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఈరెండింటాì ఎక్కువగా సమీక్షించే అవకాశం ఉండటం కూడా డిమాండ్‌కు కారణంగా ఉంది. స్థాయీ సంఘాల ఎన్నికకు సంబధించిన నియమాలు జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యుడు ఒకటి కంటే ఎ క్కువ సంఘాల్లో సభ్యుడిగా ఉండరాదు. ఏ స్థాయి సంఘం కొరకు ఎన్నిక జరుగుతుందో, ఆ స్థాయీ సంఘం పేరును, ఖాళీల సంఖ్యను ప్రకటిస్తారు. ఎన్నిక కోసం నిలబడే ప్రతి అభ్యర్థిని ఒక జెడ్పీటీసీ సభ్యుడు ప్రతిపాదించాలి, మరోకరు బలపరచాలి. సరైన క్రమంలో ప్రతిపాదించబడిన జెడ్పీటీసీ సభ్యుల పేర్లను ఈ సమావేశంలో చదువుతారు. ఎన్నిక జరిగేలోపు అభ్యర్థి ఏ దశలోనైన తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవచ్చ. ప్రతిపాదించిన అభ్యర్థుల సంఖ్య కమిటీల్లోని స్థానాల కన్నా ఎక్కువగా ఉంటే ఎన్నికలు నిర్వహిస్తారు. ఒక వేళ అభ్యర్థుల సంఖ్య, స్థాయి సంఘాల్లో ఉండాల్సినసభ్యుల సంఖ్యకు సమానంగా ఉంటే నిబంధనలకు లోబడి పోటీలో ఉన్న అభ్యర్థులందరూ ఎన్నికైనట్లు ప్రకటించవచ్చు. ఏదేని కారణం వల్ల స్థాయీ సంఘం ఎన్నిక జరగకపోతే తరువాత ఎన్నిక ఉంటుంది. ఉన్న సభ్యులతోనే సర్దుబాటు మొత్తం జెడ్పీ చైర్మన్‌తో సహా 19 మంది సభ్యులు 7 సాయీ సంఘాల్లో సభ్యులుగా ఉండనున్నారు. హోదారీత్యా జెడ్పీచైర్మన్ అన్ని స్థాయీ సంఘాల్లో సభ్యురాలిగా ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ సంఘాల్లో సభ్యులుగా ఉండేందుకు అవకాశం లేదు. దీంతో పాలకపక్షంతో పాటు ప్రతిపక్ష సభ్యులు కూడా ఏదో ఒక కమిటీలో చోటు దక్కనుంది. సభ్యులు తక్కువగా ఉండటంతో జెడ్పీచైర్మన్‌తో కలిపి కొన్ని స్థాయిసంఘాల్లో నలుగురు, కొన్నింటిలో ముగ్గురు సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే 7 కమిటీల్లో నాలుగు కమిటీల్లో జెడ్పీ చైర్మన్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు మొత్తంగా నలుగురు సభ్యులు ఉంటే, మూడు స్థాయీ సంఘాల్లో జెడ్పీ చైర్మన్, మరో ఇద్దరు సభ్యులు మొత్తంగా ముగ్గురు సభ్యులు ఉండే అవకాశం ఉంది. జిల్లాలో ప్రస్తుతం ఆరుగురు జెడ్పీటీసీలు టీఆర్ఎస్ వారు కాగా, నలుగురు కాంగ్రెస్, ఒక్కరు ఏఐఎఫ్బీ నుంచి ఉన్నారు. -
సమర్థులకు పెద్దపీట?
జెడ్పీ స్థాయీ సంఘాల కూర్పులో చైర్పర్సన్ సునీతారెడ్డి సమర్థులకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. జెడ్పీలో టీఆర్ఎస్కు మెజార్టీ బలం ఉన్నందున స్థాయీ సంఘం సభ్యుల ఎన్నిక దాదాపు ఏకగ్రీవం కానుంది. దీంతో ఏయే కమిటీలో ఎవరికి చోటు కల్పించాలనే అంశంలో చైర్పర్సన్ నిర్ణయమే కీలకం కానుంది. నిబంధనల మేరకు అన్ని సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఎంపీలు, ఎమ్మెల్యేల సలహాలతో స్థాయీసంఘాల కూర్పును పూర్తిచేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. స్టాండింగ్ కమిటీలో సభ్యుల ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు మంగళవారం తెరపడనుంది సాక్షి, వికారాబాద్: జిల్లా పరిషత్ పాలనలో స్థాయీ సంఘాలది కీలక పాత్ర. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షించి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో ఇవి ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇంతటి ప్రాముఖ్యమున్న స్థాయీ సంఘాల కమిటీలను ఈనెల 27న ఏర్పాటు చేయనున్నారు. దీంతో జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యుల దృష్టి ఈ కమిటీల ఏర్పాటుపై పడింది. విమర్శలకు తావివ్వకుండా అన్ని వర్గాల జెడ్పీటీసీలకు న్యాయం జరిగేలా చైర్పర్సన్ సునీతారెడ్డి స్థాయీ సంఘాల కూర్పు ఎలా చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు సునీతారెడ్డి అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో స్థాయీ సంఘాల ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు. జెడ్పీలో టీఆర్ఎస్కు మెజార్టీ ఉన్నందున స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. చైర్పర్సన్ సునీతారెడ్డి ఇప్పటికే స్టాండింగ్ కమిటీ సభ్యుల కూర్పు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎంపీ, ఎమ్మెల్యేలతో సోమవారం మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. స్త్రీశిశు సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా తన తల్లి ప్రమోదినిదేవికి స్థానం కల్పించే దిశగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ చైర్‌పర్సన్‌గా తన సతీమణికి చాన్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య కోరుతున్నట్లు సమాచారం. ఏడు కమిటీలు.. జిల్లా పరిషత్‌లో ఏడు స్థాయీ సంఘాలు (స్టాండింగ్ కమిటీలు) ఉంటాయి. 1994 పంచా యతీరాజ్ యాక్టును అనుసరించి స్థాయీ సం ఘాలను ఏర్పాటు చేస్తారు. జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన ప్రణాళిక, ఆర్థిక కమిటీ, గ్రామీణాభి వృద్ధి, విద్య ఆరోగ్యం, నిర్మాణం పనులు కమి టీలు పనిచేస్తాయి. జెడ్పీ వైస్ చైర్మన్ వ్యవసాయ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. స్త్రీశిశు సంక్షే మ కమిటీ చైర్‌పర్సన్‌గా మహిళా జెడ్పీటీసీని ఎన్నుకుంటారు. అలాగే సాంఘిక సంక్షేమ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆ సామాజికవర్గానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. జెడ్పీలో మొత్తం 28 మంది సభ్యులు ఉన్నారు. చైర్పర్సన్ సునీతారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, కాలె యాదయ్య శాశ్వత సభ్యులు. అలాగే 17 మండలాల జెడ్పీటీసీలు, ఇద్దరు కోఆప్సన్ సభ్యులుగా ఉన్నారు. దీంతో జెడ్పీలో మొత్తం సభ్యుల సంఖ్య 28 చేరుకుంది. ఈలెక్క ఒక్కో కమిటీలో చైర్పర్సన్ కాకుండా నలుగురు సభ్యు లు ఉంటారు. ఏడు కమిటీలకుగాను ఒక్కో కమిటీకి నలుగురు సభ్యులను ఎన్నుకోవా ల్సి ఉంటుంది. జెడ్పీ స్థాయీ సంఘాల సభ్యులను ఎన్నుకుంటారు. టీఆర్ఎస్కు మెజార్టీ సభ్యులు ఉన్నందున ఎన్నిక ఎకగ్రీవం కానుంది. -
ఖజానా ఖాళీగా..!
గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ఉత్సవ విగ్రహాలుగా మిగలవద్దు. ఎవరు ఏ బాధ్యత నిర్వహించాలనే దానిపై త్వరలోనే స్పష్టత ఇస్తాం. కొత్త పంచాయతీరాజ్ చట్టం వెలుగులో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అనుగుణంగా నిర్ణయాలుంటాయి. స్థానిక సంస్థలకు అధికారాలను బదలాయిస్తాం. స్థానిక సంస్థలకు నిధుల కొరత ఉండరాదు. నిధులు, విధులు, బాధ్యతలను త్వరలో అప్పగిస్తాం’ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇటీవల స్థానిక సంస్థలకు నిధులు, అధికారాల విషయంలో చేసిన వ్యాఖ్యలివి. సాక్షి, సంగారెడ్డి: మండల ప్రజా పరిషత్‌లు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పదవీ బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు కావస్తున్నా నిధుల లేమితో అభివృద్ధి పనులేమీ చేయలేకపోతున్నామని ఎంపీపీ అధ్యక్షులు నిట్టూరుస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మండలాలకు ఒక్కరూపాయి కూడా రాలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో పోటీకి దిగిన సమయంలో అవి చేస్తాం..ఇవి చేస్తామంటూ వాగ్దానాలిచ్చారు. గెలుపొందిన వారికి మాత్రం ఏం చేద్దామన్నా నిధుల కొరత అడ్డుగా మారింది. గత నెల 4న పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిధుల విషయంలో మండలాల్లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజల వద్దకు పాలన, అధికార వికేంద్రీకరణ, సత్వర అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ.రామారావు 1989లో మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిధులు ఉంటేనే మండల ప్రజా పరిషత్‌ల అధ్యక్షులు గ్రామాలకు ఏదైనా అభివృద్ధి చేయగలుగుతారు. ఖాళీ ఖజానాలే కొత్త నేతలకు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో మొత్తం 25 మండలాలున్నాయి. వీటిలో మే 6,10,14 తేదీల్లో విడతల వారీగా ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. గెలుపొందిన ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ అధ్యక్షులను ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిలో 90 «శాతం మంది కొత్త వారే కావడం గమనార్హం. ఎంతో అభివృద్ధి చేస్తామని పదవులను అధిష్టించినప్పటికీ నిధులు లేమితో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయారు. ఇదిలా ఉండగా రిజిస్ట్రేషన్ల ద్వారా స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయం అర్బన్ మండలాల్లో కాస్త ఎక్కువగా వస్తున్నా గ్రామీణ మండలాల్లో మాత్రం అతి తక్కువగా వస్తోందని పలువురు మండల పరిషత్ అధ్యక్షులు వాపోతున్నారు. సీనరేజీ, స్టాంప్ డ్యూటీలు మాత్రమే మండల పరిషత్‌లకు ఆదాయ వనరులుగా ఉన్నాయి. ప్రత్యేక నిధులంటూ ఏమీ లేకపోవడంతో అలంకార ప్రాయంగా తయారయ్యాయి. వచ్చింది అరకొరనే.. జిల్లాలోని మండలాలకు ఐదేళ్లలో అరకొర నిధులే వచ్చాయి. మండల ప్రజా పరిషత్‌లకు ప్రభుత్వం నుంచి తలసరి ఆదాయం (రూ. 8 ఫర్క్యాపిటా) ప్రకారం జనాభా ప్రాతిపదికన మూడు నెలలకొకసారి ఏడాదిలో నాలుగుసార్లు నిధులు విడుదలవుతాయి. వీటితో పాటుగా ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. మండల ప్రజా పరిషత్‌లకు 13వ ఆర్థిక సంఘం నిధులు అరకొరగానే వచ్చాయి. కాగా 14వ ఆర్థిక సంఘం నిధులను డైరెక్ట్‌గా పంచాయతీలకే కేటాయించారు. ఇవి గాకుండా సీనరేజీ రుసుముల కింద 25:50:25 నిష్పత్తి మేరకు పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్‌లకు కేటాయింపులు జరుగుతాయి. ఈ లెక్కన ఒక్కో మండలానికి గత ఐదేళ్లలో రూ. 5–20 లక్షల లోపు నిధులు మాత్రమే విడుదలయ్యాయి. వీటిలో 35 శాతం అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మండలాలకు మంజూరయ్యే నిధులకు భారీగా కోత విధించడంతో ఆశించిన అభివృద్ధి జరగలేదు. ఎంపీటీసీ సభ్యులే ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. ఐదేళ్ల పదవీకాలంలో కొందరు ఎంపీటీసీ సభ్యులు ఒక్క పని కూడా చేయలేకపోయారంటే నిధుల కొరత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. తక్కువ జనాభా ఉన్న మండల పరిషత్‌లకు రూ.లక్ష లోపు వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. కొత్తగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తే తప్ప ఏ పనులు చేపట్టలేని దయనీయ పరిస్థితి మండలాల్లో ఉంది. నిలిచిపోయిన నిధులను గతంలో కేంద్ర ప్రభుత్వం బీఆర్జీఎఫ్ పేరిట ప్ర«త్యేకంగా కేటాయించేది. ఈ నిధులను గత ప్రభుత్వం రద్దు చేసింది. వీటి స్థానంలో మళ్లీ ఏ నిధులూ విడుదల కాలేదు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ఏడాదిలో రెండు సార్లు మంజూరు అవుతుంటాయి. మండలాలను బట్టి రూ. 50 వేలు నుంచి రూ. 2 లక్షల వరకు కేటాయిస్తారు. ఇవి కూడా మూడేళ్లుగా రావడం లేదు. సీనరేజీ నిధులు సంబంధిత శాఖనే నేరుగా పంచాయతీలకు కేటాయిస్తుండటంతో అవి కూడా మండలాలకు అందకుండా పోయాయి. గత ఏడాది అసలే నిధులు రాలేదు. మండల పాలకవర్గాలు ఏర్పాటు చేసిన తరువాత ఆర్థిక వనరులు సమకూరిస్తే ప్రయోజనం ఉంటుంది. లేనట్లయితే గతంలో మాదిరిగా ఎంపీటీసీ సభ్యులతోపాటు మండలాధ్యక్షులు సైతం నిధులు, విధులు లేక ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఎంపీ, ఎమ్మెల్యేలే దిక్కు.. మండల పరిషత్ ద్వారా అభివృద్ధి పనులు చేయాలంటే ఎంపీ, ఎమ్మెల్యేల ద్వారా కేటాయించే నిధులే దిక్కయ్యే పరిస్థితి నెలకొంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ల లో అభివృద్ధి పనులకు ఖర్చు చేసేందుకు (సీడీఎఫ్) శాసనసభ, లోక్‌సభ సభ్యులకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తారు. వీళ్లు మండల నేతల ప్రాతినిధ్యం మేరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. గతంలో కొన్ని మండల పాలకవర్గాలు తమ పరిధిలో పనులు చేయించేందుకు వాళ్ల ద్వారా నిధులు తీసుకునేవారు. ప్రస్తుతం సీడీఎఫ్ (నియోజకవర్గ అభివృద్ధి నిధులు) కూడా విడుదల కాలేదు. నిధులుంటేనే అభివృద్ధి నిధులు ఉంటేనే ఏదైనా అభివృద్ధి పని చేయడానికి సాధ్యమవుతుంది. స్థానిక సంస్థలకు విరివిగా నిధులివ్వాలి. స్థానిక సంస్థలకు త్వరలో నిధులు, విధులు, అధికారాలు ఇస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. గ్రామాలకు వెళ్లినప్పుడు సమస్యల గురించి ప్రజలు, ప్రజాప్రతినిధులు విన్నవిస్తున్నారు. వాటిని పరిష్కరించాలంటే నిధులు కావాలి. మండల పరిషత్‌లకు ప్రభుత్వం నిధులను విడుదల చేయాలి. అప్పుడే ఏదైనా అభివృద్ధి పని చేయడానికి వీలవుతుంది. – మనోజ్‌రెడ్డి, ఎంపీపీ అధ్యక్షుడు, కొండాపూర్ -
ముహూర్తం ఖరారు!
సాక్షి, రంగారెడ్డి: ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల సమీక్షలో కీలకమైన స్థాయి సంఘాల కమిటీల ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 29వ తేదీన కమిటీలను నియమించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రత్యేకంగా భేటీ కానుంది. సర్వసభ్య సమావేశం నిర్వహించి స్థాయి సంఘాల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మరోపక్క కొత్త జిల్లాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న ఈ కమిటీల కూర్పు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు దీనిపై దృష్టి సారించారు. జిల్లాలో 21 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. ఇందులో 16 స్థానాల్లో అధికార పార్టీ సభ్యులు కొనసాగుతున్నారు. నాలుగు జెడ్పీటీసీలు కాంగ్రెస్ చేతికి చిక్కగా.. మరొకటి ఏఐఎఫ్బీ దక్కించుకున్న విషయం తెలిసిందే. కమిటీల కూర్పు ఇలా.. జిల్లా పరిషత్‌లో ఏడు స్థాయి సంఘాలు ఉంటాయి. గ్రామీణాభివృద్ధి, విద్య–వైద్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, ప్లానింగ్– ఫైనాన్స్, పనుల కమిటీలు ఉంటాయి. జిల్లాలో 21 మంది జెడ్పీటీసీలు, ఇద్దరు కో–ఆçప్షన్ సభ్యులు ఉన్నారు. వీరితోపాటు చేవెళ్ల, భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఎంపీలు రంజిత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రాములు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఆరుగురు ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 33 మంది సభ్యులు ఉంటారు. అయితే, కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సభ్యుల సంఖ్యలో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. జిల్లా పరిధిలో ఓటు హక్కు ఉన్న ప్రజాప్రతినిధులే జెడ్పీ సభ్యులుగా కొనసాగుతారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నాగర్‌కర్నూల్‌లో ఓటు ఉంది. నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జెడ్పీల్లో దేనిలో కొనసాగుతారో ఆయన విచక్షణపై ఆధారపడి ఉంది. ఈ మేరకు స్పష్టత కోసం రంగారెడ్డి జిల్లా జెడ్పీ అధికారులు ఆయనకు ఒకటిరెండు రోజుల్లో లేఖ రాయనున్నారు. ఎంతో కీలకం.. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జిల్లా పరిషత్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. జిల్లా స్థాయిలో ప్రజా సమస్యలను, నిధులు అవసరాన్ని, పథకాల్లో లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కమిటీల తీర్మానాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. అధికారులకు సూచనలు అందజేయడంలోనూ కమిటీల ప్రాధాన్యత ముఖ్యమైంది. జెడ్పీ సర్వసభ్య సమావేశం, స్థాయి సంఘం సమావేశాల్లో సభ్యులు చేసే తీర్మానాలను ఆమోదించి ప్రభుత్వానికి పంపిస్తారు. దీనికి అనుగుణంగా సర్కారు చర్యలు తీసుకుంటుంది. ఇలా కీలకమైన స్థాయి సంఘాల కమిటీల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులు దృష్టిసారించారు. ఆయా సంఘాల్లో ఎవరికి ప్రాతినిథ్యం కల్పించాలనే అంశంపై జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ అనితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. కమిటీ స్వరూపం ఇలా.. సభ్యులందరినీ ఏడు భాగాలుగా విభజించి ఒక్కో స్థాయి సంఘంలో సమానంగా చోటు కల్పిస్తారు. గ్రామీణాభివృద్ధి, విద్య–వైద్యం, ప్లానింగ్–ఫైనాన్స్ కమిటీలకు జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. వ్యవసాయ కమిటీకి జెడ్పీ వైస్ చైర్మన్ అధ్యక్షుడిగా కొనసాగుతారు. మహిళా శిశు సంక్షేమ కమిటీకి జనరల్ మహిళా జెడ్పీటీసీ అధ్యక్షురాలిగా ఉంటారు. సాంఘిక సంక్షేమ కమిటీకి అ«ధ్యక్షురాలిగా ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలిని అధ్యక్షురాలిగా నియమిస్తారు. ఏడు స్ధాయి సంఘాల్లో ప్లానింగ్–ఫైనాన్స్ కమిటీ ప్రధానమైంది. ఈ కమిటీలో చోటు కోసం జెడ్పీటీసీ సభ్యులు పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఎలాగైనా స్థానం దక్కించుకోవాలని తమ పరిధి ఎమ్మెల్యేల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. చైర్పర్సన్ అనితారెడ్డి సూచన మేరకు జెడ్పీ అధికారులు స్థాయి సంఘం కమిటీల ఏర్పాటు కోసం కరసత్తు పూర్తి చేస్తున్నారు. ఏ కమిటీలో ఎవరిని సభ్యులుగా చేర్చాలనే అంశంపై గోప్యత పాటిస్తున్నారు. కమిటీల ఏర్పాటు అనంతరం ప్రతి రెండు నెలలకోసారి స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించనున్నారు. -
వదల బొమ్మాళీ..!
సాక్షి, ఒంగోలు సిటీ: ఫోకల్ సీట్లంటే దండిగా డబ్బులొచ్చేవి. పై అధికారుల పలుకుబడి సంపాయించి పెట్టేవి. నాన్ ఫోకల్ సీట్లంటే ఎడతెరిపి లేకుండా.. మెండుగా పని ఉండేవి. క్షణం తీరిక లేకుండా దమ్మిడి ఆదాయం లేకుండా ఉండేవి. సహజంగా ఉద్యోగులు వీటిలో మొదటి సీటుకే ఓటు వేస్తారు. దీంతో ఫోకల్ సీట్లకు గిరాకీ బాగా పెరిగింది. జిల్లా పరిషత్తు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల్లో బదిలీల జాతర మొదలయినప్పటి నుంచి బలవంతుల గురి ఫోకల్ సీట్లపైనే. ఈ సీజన్లో మోతాదు మరికాస్త రెట్టించింది. ఎక్కువ మంది ఫోకల్ సీట్లలో ఉండేందుకే ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు. దీంతో జిల్లా పరిషత్తు పరిధిలోని ఇంజినీరింగ్ విభాగాల్లో బదిలీల జాతర జరుగుతోంది. జిల్లా పరిషత్తు, జిల్లా పరిషత్తు పరిధిలోని పాఠశాలలు, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల్లో బదిలీలకు దరఖాస్తుల గడువు ముగిసింది. అన్ని కేడర్లలో కలిపి 520 దరఖాస్తులు వచ్చాయి. తొలుత ఈ నెల 5వ తేదీ నాటికి బదిలీ ప్రక్రియ పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం పొడిగించడంతో ఈ నెల10వ తేదీలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలి. జెడ్పీ చైర్మన్ వ్యవస్థ ఉంటే వారి కనుసన్నల్లో బదిలీలు జరిగేవి. ఈ నెల 4వ తేదీతో చైర్మన్ల వ్యవస్థ రద్దయింది. జెడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పోలా భాస్కర్, జిల్లా పరిషత్తు ముఖ్యకార్యనిర్వహణాధికారిగా జాయింట్ కలెక్టర్ సగిలి షన్మోహన్ బాధ్యతలను స్వీకరించారు. బదిలీల వంతు వీరి పర్యవేక్షణకు వచ్చింది. గతంలో జెడ్పీ పరిధిలోని ఉద్యోగులు, పీఆర్ ఇంజినీరింగ్ శాఖల్లోని ఉద్యోగులు బదిలీల వ్యవహారంలో బలాబలాలు చూపించేవారు. పెద్ద ఎత్తున సిఫార్సులు తెచ్చే వారు. గత ప్రభుత్వ హయాంలో మంచి ఫోకల్ సీట్లలో పని చేసిన వారు, గత ఐదేళ్లుగా ఫోకల్లోనే ఉన్న వారు తిరిగి ఈ ప్రభుత్వంలోనూ ఫోకల్ సీట్లను ఆశిస్తున్నారు. గట్టిగా పోటీ పడుతున్నారు. మరీ గట్టిగా సిఫార్సులు చేయిస్తున్నారు. దీంతో రాజకీయం అంతా ఫోకల్ సీట్ల చుట్టూనే గిరాగిరా మంటోంది. వీరెక్కడికి పోరట..! జిల్లా పరిషత్తు పరిధిలోని వివిధ విభాగాలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలోని పీఐయూ, క్వాలిటి కంట్రోల్ ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో బదిలీకి సీట్లు కోరుకుంటున్నారు. గతంలో ఇక్కడే పని చేసిన వారు తిరిగి ఇక్కడే ఉండేందుకు సిఫార్సులు పొందుతున్నారు. నిబంధనల మేరకు ఇప్పటి వరకు ఫోకల్ సీట్లలో పని చేసిన వారిని నాన్ ఫోకల్ సీట్లకు బదిలీ చేయాలి. జిల్లా పరిషత్తు పాఠశాలలు ఇతర విభాగాలకు అంతగా ప్రాధాన్యం లేని సీట్లకు వీరిని బదిలీ చేయాలి. జెడ్పీలో వివిధ కేడర్లలో ఖాళీలు ఉన్నందున అర్హత అంతగా లేని వారిని కూడా అందలమెక్కిస్తున్నారు. కీలకమైన సీట్లలో రాజసం వెలగబెడుతున్నారు. వీరిని ఇక్కడి నుంచి బదిలీ చేయడానికి తగిన నిబంధనలు ఉన్నా నిబంధనలను పక్కన పెట్టండి. ఫోకల్ సీట్లకు బదిలీ చేయండని అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఏళ్ల నుంచి పాతుకుపోయిన వీరు తిరిగి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లరట.. అని జెడ్పీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. పెరుగుతున్న పోటీ.. బదిలీ ప్రక్రియ ఈ నెల 10వ తేదీతో పూర్తి చేయాలి. బదిలీ పరిధిలో 520 మంది వివిధ హోదాల్లోని వారు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు 260 మంది వరకు ఫోకల్ సీట్లే కావాలని పట్టుబడుతున్నట్లుగా సమాచారం. వీరు నేతల ద్వారా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకరి చూసి మరొకరు పోటీ పడుతున్నారు. బదిలీ నిబంధనలతో పని లేదంటున్నారు. అడిగిన సీట్లకు బదిలీ చేయమంటున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు కొందరి వ్యవహారాలు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయని సమాచారం. గతంలో జరిగిన బదిలీల్లో నిబంధనలు అమలయినా లేకపోయినా నడిచిందంటున్నారు. ఇప్పుడలా కాదు.. జిల్లా అధికారులైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఉద్యోగుల బదిలీలను చూస్తున్నారు. నియమాలు, నిబంధనలు కచ్చితంగా పాటిస్తారని సిఫార్సులు తెచ్చుకోలేని వారు న్యాయం జరుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులపై బదిలీల వ్యవహారంలో విపరీతమైన ఒత్తిడి కొనసాగుతోంది. ఎక్కువ మంది కోరుతుంది ఇక్కడికే.. ఎక్కువ మంది పీఆర్ ఇంజినీరింగ్ విభాగంలో ఉండేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ నీటి సరఫరాలో ఉన్న వారు అక్కడికే మరో సబ్ డివిజన్, డివిజన్‌కు కోరుకుంటున్నారు. పంచాయతీరాజ్‌లో ఉన్న వారు క్వాలిటీ కంట్రోలు విభాగం, పంచాయతీరాజ్ ప్రాజెక్టు యూనిట్ ఇంజినీరింగ్ విభాగాల్లోనే కొన్ని విభాగాల్లో సీట్లకు కోరుకుంటున్నారు. మండలాల్లోని ఫోకల్ సీట్లకు కూడా ఇదే తరహాలో ఒత్తిడి పెరుగుతోంది. నాన్ ఫోకల్ సీట్లకు పోటీ లేకుండా పోయింది. ఒకే కేంద్రంలో ఐదేళ్లు నిండిన వారు సైతం ఫోకల్ సీట్లకు పోటీ పడుతున్నారు. జెడ్పీ రాజకీయం మొత్తం ఫోకల్ సీట్లపైనే తిరుగుతోంది. -
నా హీరో.. నా దైవం కేసీఆర్
నేను అసలు సినిమాలు చూడను.. నాకు అభిమాన హీరోలు లేరు.. నాకు తెలిసినంత వరకు తెలంగాణ ఉద్యమ సారధి, ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు హీరో.. అంతే కాదు నాకు దైవంతో సమానం. ఏదో ఓ కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్గా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో ఆ ఉద్యోగాన్ని వదులుకొని ఉద్యమంలోకి వచ్చా. వ్యాపారం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపా. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న.. నిర్బంధాన్ని తట్టుకొని ఉద్యమంలో పాల్గొన్న. నా మీద 28 కేసులు నమోదయ్యాయి. ఎన్నో కష్టాలను అనుభవించా. ఈ సమయంలో నా కుమారుడు ఉంటే బాగుండు. అధినేత కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగుతానని జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి అన్నారు. ‘సాక్షి’ పర్సనల్ టైమ్‌లో తన ఉద్యమ సమయం నాటి జ్ఞాపకాలతోపాటు తన ఇష్టాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. సాక్షి, జనగామ: మాది జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలం రాజవరం గ్రామం. మా అమ్మానాన్నలు సుకన్య, జయపాల్‌రెడ్డి. ముగ్గురు సంతానంలో నేనే పెద్దవాడిని. నా ప్రాథమిక విద్య ను రాజవరంలో పూర్తి చేసి 8, 9 తరగతులను హన్మకొండలో చదివాను. 10వ తరగతి, ఇంటర్ స్టేషన్‌ఘన్‌పూర్‌లో చదివాను. బీకాం హైదరాబాద్‌లో చదివి, హన్మకొండలో ఐటీఐ చేశాను. కాంట్రా క్టర్‌గా మారి కొంతమందికి ఉపాధి కల్పించాలనే భావనతో ప్రత్యేకంగా ఐటీఐ కోర్సు తీసుకున్నా. 1992లో సుజాతతో వివాహం అయింది. కుమార్తె సంజనారెడ్డి బీటెక్ చదువుతోంది. రూ.4వేలకు సూపర్వైజర్ ఉద్యోగం చేశా.. మాది పక్కా వ్యవసాయ కుటుంబం. గ్రామీణ నేపథ్యంలోనే పెరిగాను. కాంట్రాక్టర్‌గా మారి పది మందికి ఉపాధి కల్పించాలనే కోరిక నాలో బలంగా ఉండేది. డిగ్రీ తర్వాత ఐటీఐ కోర్సు చేశా. ఆ తరువాత హైదరాబాద్‌లో ఓ కాంట్రాక్టర్ దగ్గర నెలకు రూ.నాలుగు వేల జీతానికి పనిచేశాను. అలా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాను. కేసీఆర్ పిలుపుతో ఉద్యమకారుడిగా మారా.. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుకొచ్చారు. ఉద్యమంలో చేరాలని కేసీఆర్ పిలుపునివ్వడంతో కరీంనగర్లో జరిగిన జైత్రయాత్ర సభకు వెళ్లాను. అప్పటి నుంచి కేసీఆర్ వెంటే ఉన్నా. 2002–06 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన విభాగం ప్రచార ప్రధాన కార్యదర్శిగా, 2006–13 వరకు స్టేషన్‌ఘన్‌పూర్ మండల అధ్యక్షుడిగా, 2013–15 వరకు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్చార్జితో పాటు పలు పదవుల్లో పనిచేశాను. నిర్బంధంతోనే పట్టుదల పెరిగింది.. తెలంగాణ ఉద్యమ సమయంలో నాపైన తీవ్రమైన నిర్బంధం ఉండేది. నా ప్రతి కదలికపై పోలీసుల నిఘా ఉండేది. ఉద్యమ సమయంలో ఓ సారి అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య పాలకుర్తి పర్యటనకు వస్తున్నారు. పర్యటనకు ముందే నన్ను అరెస్టు చేయాలని పోలీసులు భావించి అర్ధరాత్రి మా ఇంటికి వచ్చారు. సంపత్‌రెడ్డిని పిలవమని నా భార్యను కోరారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఇంటి వెనుకవైపు ఉన్న గోడ నుంచి దూకాను. రాత్రి కావడంతో రాళ్లపై పడడంతో నాకు గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకొని అదేరోజు తిరిగొచ్చి పొన్నాల పర్యటనను అడ్డుకున్నా. ఓ సారి ఘన్‌పూర్‌లో రాస్తారోకో చేస్తుంటే ఓ పోలీసు అధికారి వాహనాన్ని అడ్డుకున్నాం. ఆ సమయంలో నన్ను భయపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలు ఉన్నాయంటే ముందుగానే స్టేషన్‌కు తీసుకుపోయే వారు. నా కోసం ఒక పోలీసు టీం ఎప్పటికీ తిరుగుతూ ఉండేది. నిర్బంధం కారణంగా వ్యవసాయ బావులు దగ్గర పడేకునేది. నాపైన 28 కేసులు పెట్టారు. ఈ సమయంలో నా కుమారుడు ఉంటే బాగుండు.. నా కుమారుడు ఈ సమయంలో ఉంటే బాగుండు అనిపిస్తోంది. నా కుమారుడు సాయి 2012లో ఇంటర్ చదువుకునే రోజుల్లో బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. నా కుమారుడి మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసింది. ఆ ప్రభావం మా కుటుంబంపై పడింది. నా భార్య గౌరవాన్ని పెంచింది.. నా భార్య సుజాత నా గౌరవాన్ని పెంచింది. ఆమె పీజీ వరకు చదువుకుంది. ఉద్యమం సమయంలో నేను ఎక్కువగా బయటనే ఉండేవాడిని. ఏ రోజు కూడా ఆమె నన్ను వద్దనలేదు. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమలోనే ఉండాలని చెప్పేది. ఆమె మాటలు నాకు స్ఫూర్తిగా నిలిచాయి. మేము ముగ్గురం అన్నదమ్ములం ఇప్పటికీ కలిసే ఉంటాం. మాది ఉమ్మడి కుటుంబమే. రాజవరంలో క్రికెట్ ప్రారంభించాను.. మా ఊరు రాజవరంలో మొదటగా క్రికెట్‌ను ప్రారంభించిందే నేను. నాకు క్రికెట్ అంటే మహా ఇష్టం. స్వయంగా నేను ఆడుతా. గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్లు పెట్టేది. ఇప్పటికీ క్రికెట్ కిట్లు అందజేస్తాను. క్రీడాకారులను ప్రోత్సహిస్తాను. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా.. నాకు చాలా ఆనందంగా ఉంది. ఉద్యమకారుడిని కావడం వల్లనే పదవి దక్కింది. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతో జిల్లాను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా. ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం కొట్లాడినట్లుగానే అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాను. వెనుకబడిన జిల్లాను సమగ్రాభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా పని చేస్తా. నిత్యం జిల్లా ప్రజానీకానికి అందుబాటులో ఉంటా. కేసీఆర్ నాపైన పెట్టిన బాధ్యతలు నేరవేరుస్తా.. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయను. వ్యాపారం చేసి ఉద్యమాన్ని నడిపా.. నాడు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడిని. మాకు ఆర్థికంగా లేకపోయేది. దీంతో స్వయంగా నేనే ఇటుక బట్టీల వ్యాపారం ప్రారంభించాను. దాంతో వచ్చిన డబ్బులను ఉద్యమానికి ఉపయోగించేది. ప్రస్తుతం 50 మంది బట్టీల్లో పని చేస్తున్నారు. వారందరికి ఉపాధి కల్పిస్తున్నా. తెలంగాణ ప్రకటన మర్చిపోలేను.. డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రకటన రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజుగా ఉంటుంది. కేసీఆర్ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయించారు. తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మళ్లీ జూన్ రెండో తేదీన చిరకాల కోరిక నేరవేరింది. ఈ రెండు సందర్భాల్లో ఎంతో ఆనందంగా గడిపాం. -
నవశకానికి నాంది
సాక్షి, వరంగల్ : జిల్లా పరిషత్ ఎన్నికలు ముగిసిన రెండు నెలలు నిరీక్షణ తర్వాత పరిషత్ కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది. నేడు జిల్లా పరిషత్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేసింది. జిల్లా ఏర్పాటయ్యాక తొలి పరిషత్ కొలువుదీరి నవశకానికి నాంది పలకనుంది. జెడ్పీ చైర్‌పర్సన్‌గా గండ్ర జ్యోతి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇన్నాళ్లు ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ పాలక మండలి గడువు ముగియడంతో నూతన జిల్లా ప్రజా పరిషత్‌లు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ స్థానంలో ఆరు కొత్త జెడ్పీలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం కొనసాగిన భవనంలోనే ఐదు గదులను కేటాయించారు. పాత కార్యాలయంలోనే రూరల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం కొనసాగనుంది. శుక్రవారం ఉదయం 11గంటలకు హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయం భవనంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో రూరల్ జిల్లా ప్రజా పరిషత్ మొదటి సమావేశం జరుగనుంది. మొదటి సమావేశంతో పాలక మండలి బాధ్యతలు స్వీకరించినున్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, వైస్ చైర్మెన్ శ్రీనివాస్‌లతో పాటు జెడ్పీటీసీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులచే కలెక్టర్ ముండ్రాతి హరిత ప్రమాణ స్వీకారం చేయించనున్నార. అనంతరం సమావేశం జరుగుతుంది. సమావేశంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులతో పాటు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. సీఈఓగా రాజారావు.. నూతన జెడ్పీలకు ప్రభుత్వం ముఖ్య కార్యనిర్వహణాధికారులను నియమించింది. రూరల్ జెడ్పీకి రాజారావు సీఈఓగా నియమించింది. శుక్రవారం రాజారావు సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అదే విధంగా జెడ్పీకి సిబ్బందిని నియమించారు. ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో ఉద్యోగులను కేటాయించారు. ఈ మేరకు అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. రూరల్ జిల్లాకు 16 మంది ఉద్యోగులను కేటాయించారు. ఇందులో ఇద్దరు సూపరింటెండెంట్లు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, ఒక రికార్డు అసిస్టెంట్, ఒక డ్రైవర్, నలుగురు నాలుగో తరగతి సిబ్బందిని కేటాయిం చారు. వీరు ఈ నెల 5న నూతన వరంగల్ రూరల్ జెడ్పీలో బాధ్యతలు చేపట్టనున్నారు. -
అవినీతిరహిత పాలనే లక్ష్యం : డిప్యూటీ సీఎం
సాక్షి, కడప : రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా సాగుతున్నారని, అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని డిప్యూటీ సీఎం ఎస్బి అంజద్‌బాషా పేర్కొన్నారు. కడపలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం జిల్లా పరిషత్తు సర్వసభ్య చివరి సమావేశం జరిగింది. జెడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన సీఈఓ నగేష్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సభ ప్రారంభంలో జిల్లాకు విశిష్ట సేవలు అందించిన మాజీ ఎంపీ దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం నూతనంగా ఎంపికైన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సభకు పరిచయం చేసుకోవాలని చైర్మన్ కోరగా అందరం పాత వాళ్లమే కదా అన్నారు. ఇందులో ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, శివనాధరెడ్డి సభకు పరిచయం చేసుకున్నారు. తర్వాత నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను జిల్లా పరిషత్తు చైర్మన్ గూడూరు రవి, వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్, జేసీలు శివారెడ్డి, గౌతమిలు సన్మానించారు. అనంతరం సభనుద్దేశించి డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారని, 151 మంది ఎమ్మెల్యేలను, 23 మంది ఎంపీలను గెలిపించారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టి 30 రోజులైందని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా సాగుతున్నారని వివరించారు. అన్ని కార్యాలయాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయనకు ప్రజాపత్రినిధులు, అధికారులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన నవతర్నాల్లో భాగంగా జులై 2 నుంచి వృద్ధులకు పెన్షన్, ఆశ, అంగన్వాడీల జీతాలను పెంచి అమలు చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో నూతన పద్ధతి ద్వారా 50 ఇళ్లకు ఒక వలంటీరు చొప్పున 4 లక్షల మంది యువతి, యువకులను గ్రామ వలంటీర్లను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలో గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థను ఏర్పాటు చేసి రెండు వేల జనాభా ఉన్న ప్రతి చోట ఒక సెక్రటరీని నియమించి నిరుద్యోగ వ్యవస్థను తొలగించనున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను చదువుకోవాలనే ఉద్దశ్యంతో అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టినట్లు, ఆగస్టు 15న ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించనున్నట్లు తెలిపారు. 2019 కంటే ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రైతులను ఆదుకున్నారని వివరించారు. తండ్రి అడగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు బరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు రూ. 12,500 అందించనున్నట్లు చెప్పారు. వీటితోపాటు నవరత్నాల్లోని అన్ని సంక్షేమ పథకాలను గ్రామవాంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి అందించన్నారన్నారు. మంత్రులు, అధికారుల కార్యాలయాల్లో మేనిఫెస్టో టేబుల్‌పై ఉండాలని అన్నారు. ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాను ప్రగతి పథకంలో నడిపించేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో అభివృద్ధి పడకేసిందని, ప్రభుత్వ పథకాల లబ్ధి కొందరికే చేకూరిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంతి జగన్ 30 రోజులపాలన స్పూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ చీప్‌విఫ్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రజల సమస్యల పట్ల త్వరితగతిన స్పందించాలని, జిల్లాలో మంచినీటి ఎద్దడి అధికంగా ఉందని దీనిపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాయచోటి విడిజన్‌లో విత్తనాల కొరత కొంత వేధిస్తోందని, 50 శాతం మేర మామిడి చెట్లు ఎండిపోయాయని, పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందించాలని కలెక్టర్‌ను కోరారు. అధికారులు బయటకు వెళ్లేటప్పుడు సమాచారాన్ని కార్యాలయంలో ఇచ్చి వెళ్లాలన్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాలన్నారు. దీనికి స్పందించిన కలెక్టర్ సీఎం ఆదేశాల మేరకు ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని త్వరలో అమలు చేస్తున్నామన్నారు.కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం కావడం మన జిల్లాకు ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. సమస్యలేమైనా ఉంటే తమకు తెలియజేయాలని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. జలశక్తి అభియాన్‌లో మన జిల్లాకు చోటు దక్కిందన్నారు. అధికారులంతా ఒక ఫ్యామిలీలాగా పనిచేయాలని,ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం కావాలని చెప్పారు. త్వరలో మున్సిపాలిటీలు, జెడ్పీ, ఎంపీపీల పాలకవర్గం ముగియనుందని, వారి స్థానాల్లో మీరంతా స్పెషల్ అపీసర్లు కానున్నారన్నారు. త్వరలో గ్రామవలంటీర్ వ్యవస్థ వస్తుందని, ప్రతి ప్రభుత్వ పథకం వారి ద్వారానే అమలవుతుందని వివరించారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించకుని పింఛన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. -
విభజనపై సందిగ్ధం..!
కరీంనగర్: జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు ముగిశాయి. కొత్త పాలకవర్గం ఎన్నిక పూర్తయ్యింది. మరో 20 రోజుల్లో కొలువుదీరడమే మిగిలింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు నాలుగు జిల్లాల్లోనూ పల్లె ఓటర్లను తమవైపు తిప్పుకొని పాలకవర్గాలను ‘కారు’ ఎక్కించిన విషయం విదితమే. నాలుగు జిల్లాల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో గెలుపొందడం, చైర్పర్సన్, వైస్‌చైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకపక్షంగా జరిగి నాలుగు జిల్లా పరిషత్‌లను తమ ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. గత మూడు నెలలుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు. ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్, లెక్కింపు, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలక వర్గాల ఎంపిక ప్రక్రియలో జెడ్పీ అధికారులు తలమునకలు అయ్యారు. ఇక కొత్తపాలక వర్గాలు కొలువుదీరేందుకు అవసరమైన జిల్లా పరిషత్ కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఉద్యోగుల పదోన్నతులు చేపడుతారా.. లేదా వర్క్ టు సర్వ్ కింద ఉన్న సిబ్బందినే ఆయా జిల్లాలకు విభజిస్తారా అనేది తేలాల్సి ఉంది. జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఇంకా పూర్తిస్థాయి మార్గదర్శకాలు అందలేదు. నాలుగు జిల్లాలకు నోడల్ జెడ్పీగా ఉన్న కరీంనగర్ జిల్లా పరిషత్ పరిధిలోని ఉద్యోగుల వివరాలు కేడర్ల వారీగా, మౌలిక సదుపాయాలు, సామగ్రి వివరాలను రెండు నెలల క్రితమే పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడి సిబ్బంది నివేదించారు. కరీంనగర్ జెడ్పీలో 80 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. ఈ సిబ్బందినే నాలుగు జిల్లాలకు విభజించే ఆస్కారం ఉంది. ఇటీవల వెలువడిన ఆదేశాల ప్రకారం జెడ్పీలోని కొన్ని విభాగాలను కుదించే అవకాశం కూడా లేకపోలేదు. మరికొన్ని పోస్టులను తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒక్కో జిల్లా పరిషత్‌కు 19 మంది సిబ్బంది అవసరం, సీఈవో, డిప్యూటీ సీఈవో, రెండు సూపరింటెండెంట్ పోస్టులు, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, ఆరుగురు ఆఫీస్ సబార్డినేట్లు ఇలా మొత్తం ఒక్క జెడ్పీలో ఎంత తక్కువ అన్న కనీసం 19 మంది ఉంటేనే పాలన సవ్యంగా కొనసాగించే వీలుంటుంది. ప్రస్తుతం జెడ్పీ పరిధిలో 80 మంది ఉద్యోగులను విభజించే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల జెడ్పీలకు లైజన్ అధికారులతోపాటు ఒక్కొక్క జిల్లాకు ఆరుగురి వరకు సిబ్బందిని ఎన్నికల విధుల నిమిత్తం రిలీవ్ చేశారు. ఎన్నికల అనంతరం ఆయా సిబ్బంది మళ్లీ జెడ్పీలో నివేదించారు. కొత్త జిల్లాల్లో సిబ్బందిని పంచాయతీరాజ్ శాఖ ద్వారా పదోన్నతులు కల్పించి బదిలీ చేస్తారా లేదా సర్వ్ టు రూల్ కింద ఆయా జిల్లాల కలెక్టర్లే ఈ సిబ్బందిని కేటాయిస్తారా అన్న దానిపై జిల్లా పరిషత్ ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ఫ్యాన్లు, జిరాక్స్ మిషన్లు, తదితర సామగ్రి సమాచారం సైతం పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఇప్పటికే చేరింది. కొత్త మండల పరిషత్‌లకు కనీసం పది మంది... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క మండలానికి కనీసం పది మంది సిబ్బంది అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను విభజించి ఒక్కొక్క మండల పరిషత్‌కు మిగతా మండలాల నుంచి పది మంది ఉద్యోగులను నియమిస్తే పాలనసాఫీగా సాగుతుంది. ఒక్క మండలంలో ఓ ఎంపీడీవో, సూపరిండెంటెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, నలుగురు ఆఫీస్ సబార్డినేట్లు అవసరం. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కొత్త కార్యాలయాలు, సిబ్బంది కేటాయింపుల మార్గదర్శకాలు సైతం జెడ్పీకి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. జూలై 5న కొత్తపాలక వర్గాలు... ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించి జిల్లా పరిషత్, చైర్పర్సన్లు, వైస్చైర్మన్లతో పాలక వర్గాలు ఏర్పడ్డాయి. వచ్చే జులై 5న కొత్త పాలక వర్గాలు ఆయా జిల్లాల్లో కొలువుదీరాల్సి ఉంది. కొత్త జిల్లా పరిషత్ కార్యాలయాలతో పాలన ప్రారంభిస్తారా.. లేదా అద్దె భవనాల్లోనా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను జెడ్పీకి కేటాయిస్తారా అన్నదానిపై స్పష్టత రాలేదు. ఎన్నికల సమయంలో ఆయా జిల్లాల్లో ఏర్పడిన ఎంపీడీవో కార్యాలయాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన భవనాల్లో ఎన్నికల తతంగం ముగించారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల సామగ్రి, సిబ్బంది పంపిణీ అంతా పూర్తిస్థాయిలో కరీంనగర్ జిల్లా పరిషత్ నుంచే కొనసాగింది. తక్షణం ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వస్తే తప్ప ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ఆదేశాలు అందాకే కార్యాచరణ... కొత్త జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయాలు, ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. గతంలో అడిగిన పూర్తి సమాచారం నివేదించాం. జిల్లా పరిషత్ కొత్త పాలక వర్గంలు ఎన్నిక నియమాకం ముగిసింది. పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి మార్గదర్శకాలు రాగానే వాటికి అనుగుణంగా తదుపరి కార్యాచరణ చేపట్టి పనులు మొదలు పెడుతాం. – జెడ్పీ సీఈవో వెంకటమాధవరావు -
జెడ్పీలకు భవనాలెట్ల!
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో స్థానిక పరిపాలన కొత్త రూపు సంతరించుకోనుంది. జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై 4తో ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి కొత్తగా ఎన్నికైన వారి పదవీకాలం మొదలవుతుంది. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు మొదటి సమావేశంలోనే పదవీ బాధ్యతలు చేపడతారు. పాలకవర్గం సైతం అదే రోజు కొలువుదీరుతుంది. జిల్లాల పునర్విభజనతో ప్రస్తుతం ఉన్న తొమ్మిది జిల్లా పరిషత్‌లు 32కు పెరగనున్నాయి. అన్ని జిల్లాల్లో జెడ్పీ భవనాల కోసం పంచాయతీరాజ్ శాఖ వెతుకులాట మొదలుపెట్టింది.ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని జెడ్పీ భవనాలు అన్ని రకాలుగా గొప్పగానే ఉన్నాయి. కొత్త జిల్లా కేంద్రాల్లో ఆ స్థాయి భవనాలు ఎక్కడా లేవు. ఒకటిరెండు కొత్త జిల్లాల్లో తప్పితే జెడ్పీలకు ప్రభుత్వ భవనాలు ఉన్న పరిస్థితి లేదు. దీంతో పరిపాలన భవనం, సమావేశ మందిరం వంటి హంగులతో ఉండే భవనాల కోసం అధికారులు వెతుకుతున్నారు. ఎక్కువ జిల్లాల్లో ఆ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని జెడ్పీ కార్యాలయాలుగా మార్చాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో మండల పరిషత్‌లకు కొత్తగా కార్యాలయాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు సొంత భవనాలలో ఉన్న మండల పరిషత్ కార్యాలయాలను ఇప్పుడు ఇతర భవనాల్లోకి మార్చాల్సిన పరిస్థితి నెలకొంది. జెడ్పీ కార్యాలయాల కోసం భవనాల ఎంపిక ప్రక్రియను రెండుమూడు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రెండు జెడ్పీలు ఆలస్యం... ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే విషయంలో జాప్యం వల్ల ఆ జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ఆలస్యంగా మొదలైంది. 2019 ఆగస్టు 6తో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ పదవీకాలం మొదలుకానుంది. -
తెలంగాణలో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు వీరే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో కారు టాప్ గేరులో దూసుకెళ్లింది. అత్యధిక సీట్లు గెలుచుకొని దాదాపు అన్ని మండల ప్రజాపరిషత్(ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించగా.. జిల్లా పరిషత్‌లోనూ అదే జోరును కొనసాగిస్తోంది. ఈనెల 4న పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. 32 జిల్లాల్లోనూ జెడ్పీ చైర్మన్ పీఠాలు కైవసం చేసుకునే రీతిలో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 538 జెడ్పీటీసీలకు గానూ.. టీఆర్ఎస్ 449 స్థానాలను దక్కించుకుంది. కరీంనగర్, గద్వాల, మహబూబ్‌నగర్, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల పరిధిలో టీఆర్ఎస్ అన్ని జెడ్పీటీసీ స్థానాలను క్లీన్‌స్వీప్ చేసింది. ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట, మేడ్చల్, ములుగు జిల్లాల్లో కాంగ్రెస్ కేవలం ఒక్కో జెడ్పీటీసీ స్థానంలో మాత్రమే గెలుపొందగా, మిగిలిన స్థానాలన్నీ టీఆర్ఎస్ ఖాతాలో చేరాయి. నల్గొండ జెడ్పీ చైర్మన్‌గా బండా నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా స్వర్ణ సుధాకర్ రెడ్డి, వైఎస్ చైర్మన్‌గా యాదయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిద్దిపేట జడ్పీ చైర్ పర్సన్ గా వేలేటి రోజా శర్మ, వైఎస్ చైర్మన్ గా రాయిరెడ్డి రాజారెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ముంజు శ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కో-ఆప్షన్ మెంబర్లు గా ముస్తఫా, మహ్మద్ అలీ ఏకగ్రీవం. నల్గొండ జడ్పీచైర్మన్ గా బండా నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ గా పాగాల సంపత్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా గిరబోయిన భాగ్యలక్ష్మి ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రకటించారు. కోఆప్షన్ సభ్యులు గా టిఆర్ఎస్ కు చెందిన ఎండీ గౌస్ పాష మరియు మదర్ ఏకగ్రీవం ఎన్నికయ్యారు. జెడ్పీగా ఎన్నికైన పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తి రెడ్డి తదితరులు మెదక్ జెడ్పీ ఛైర్ పర్సన్‌గా హేమలత శేఖర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జోగులంబ గద్వాల జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ గా సరితా, వైస్ ఛైర్పర్సన్ గా సరోజమ్మ ను ఏకగ్రీవం నాగర్ కర్నూల్ జడ్పీ చైర్మన్ గా పద్మావతి, వైస్ చైర్మన్ గా బాలాజీ సింగ్ ఎన్నికయ్యారు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా కోనారావుపేట జెడ్పీటీసీ న్యాలకొండ అరుణ, వైస్ చైర్మన్ గా ఇల్లంతకుంట జడ్పీటీసీ సిద్దం వేణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యే రమెష్ బాబు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ నిజామాబాద్ నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్‌గా దాదన్నగారి విఠల్ రావ్, వైస్ చైర్మన్‌గా రజిత యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావ్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కనుమల్ల విజయ ఇల్లందకుంట, వైస్ చైర్మన్ గా పేరాల గోపాల్ రావు సైదాపూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కనుమల్ల విజయ ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ గా కోవ లక్ష్మీ ,వైస్ చైర్మన్ గా కోనేరు కృష్ణారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా నల్లాల బాగ్య లక్ష్మీ, వైస్ చైర్మన్ గా సత్యనారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల అధికాని భారతి హోళీకెరీ ప్రకటించారు. బాణా సంచా పేల్చుతూ సంబరాలు జరుపుకుంటున్న తెరాస శ్రేణులుఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ గా జనార్దన్ రాథోడ్ ,వైస్ చైర్మన్ గా ఆరె రాజన్న లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా కోవ.లక్ష్మి, జడ్పీ వైస్ చైర్ పర్సన్ గా కోనేరు కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెరాస శ్రేణుల భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ గా పుట్ట మధుకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా తీగల అనితా హరినాథ్ రెడ్డి , వైస్ ఛైర్మన్ గా ఈటె గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా సునీత మహేందర్ రెడ్డి. వైస్ చైర్మన్ గా విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకూ జిల్లా చైర్ పర్సన్ గా సునీతా మహేందర్ రెడ్డి మూడు సార్లు ఎన్నికయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు సార్లు వికారాబాద్ జిల్లా పరిషత్ మొట్టమొదటి చైర్ పర్సన్ గా సునీత మహేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. సూర్యపేట జడ్పీ చైర్మన్ గా గుజ్జదీపిక యుగేందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యాదాద్రి భువనగిరి జడ్పీచైర్మన్ గా ఏలిమినేటి సందీప్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామారెడ్డి జడ్పీ చైర్మన్ గా దఫెదార్ శోభ, వైస్ చైర్మన్ గా పరికి ప్రేమ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ములుగు జడ్పీ చైర్ పర్సన్ కుసుమ జగదీశ్, వైస్ చైర్ పర్సన్ బడే నాగ జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ గా పుట్ట మధుకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్ అర్బన్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా మరేపల్లి సుధీర్, వైస్ చైర్మన్ గా శ్రీ రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వరంగల్ రురల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా గండ్ర జ్యోతి , వైస్ చైర్మన్ గా ఆకుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ గా కోరం కనకయ్య, వైస్ చైర్మన్ గా కంచర్ల చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
సీల్డ్ కవర్లో జెడ్పీ చైర్మన్లు
సాక్షి, హైదరాబాద్: జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు ఏకపక్ష ఫలితాలు రావడంతో అన్ని జెడ్పీ పీఠాలనూ తన ఖాతాలో వేసుకోనుంది. అయితే, ఆ పదవులు ఎవరికి దక్కుతాయో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులతో పాటు ఇద్దరేసి చొప్పున కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకునేందుకు శనివారం ఆయా జిల్లా పరిషత్‌ల ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా పదవులకు పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా టీఆర్ఎస్ వ్యూహం రచించింది. జెడ్పీ చైర్మన్ పదవులు ఎవరికి అప్పగించాలనే అంశంపై మూడు రోజుల పాటు తీవ్ర కసరత్తు చేసిన టీఆర్ఎస్. కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. జిల్లాలవారీగా జాబితాను ఖరారు చేశారు. అయితే, చాలాచోట్ల జెడ్పీ చైర్మన్ పదవులకు పార్టీలో అంతర్గత పోటీ ఉండటంతో చివరి నిమిషం వరకు గోప్యత పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలవారీగా జెడ్పీ చైర్మన్ పదవులకు ఎంపిక చేసిన పేర్లను ప్రాదేశిక ఎన్నికల కోసం ఇదివరకే నియమించిన పార్టీ జిల్లా ఇన్చార్జిలకు శుక్రవారం రాత్రి సీల్డ్ కవర్లో అందజేశారు. అన్ని చోట్లా జెడ్పీ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేలా చూడాలని వారిని కేటీఆర్ ఆదేశించారు. 30 జెడ్పీలపై ఉత్కంఠ... ఈనెల 4న పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. 32 జిల్లాల్లోనూ జెడ్పీ చైర్మన్ పీఠాలు కైవసం చేసుకునే రీతిలో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది. ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియకు ముందే ఆసిఫాబాద్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ల పేర్లను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఆసిఫాబాద్‌కు మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, పెద్దపల్లికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును ఎంపిక చేయగా.. ప్రస్తుతం మరో 30 జెడ్పీ చైర్మన్ల పేర్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రాదేశిక ఫలితాలు వెలువడిన వెంటనే.. పార్టీ పక్షాన గెలుపొందిన జెడ్పీటీసీ సభ్యులతో జిల్లాలవారీగా క్యాంపులు ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు మొత్తం 28 మందిని 32 జిల్లాలకు ప్రాదేశిక ఎన్నికల ఇన్‌చార్జీలుగా నియమించారు. ఆ క్యాంపుల నిర్వహణను పర్యవేక్షిస్తూ వచ్చిన పార్టీ ఇన్చార్జీలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సంప్రదింపులు జరిపి.. జిల్లాలవారీగా జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఆశిస్తున్నవారి జాబితాను అందజేశారు. అలాగే జిల్లాలవారీగా ఎన్నికైన టీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యుల అభిప్రాయాన్ని కూడా కేటీఆర్‌కు నివేదించారు.నేరుగా సమావేశ మందిరానికే..: జిల్లాల వారీగా వివిధ సమీకరణలను దృష్టిలో పెట్టుకుని చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లను కేటీఆర్ ఖరారు చేశారు. చాలా చోట్ల ఆయా పదవులపై ఏకాభిప్రాయం కుదిరినా, కొన్ని జిల్లాల్లో మాత్రం అంతర్గత పోటీ నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతుదారులకు పదవి దక్కేలా చివరి నిమిషం వరకు లాబీయింగ్ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలవారీగా పార్టీ, స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు పేర్లను ఖరారు చేసిన కేటీఆర్.. సీల్డ్ కవర్లో వాటిని ఇన్‌చార్జీలకు అందజేశారు. శనివారం సాయంత్రం 3 గంటలకు జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. క్యాంపులో ఉన్న జెడ్పీటీసీ సభ్యులు నేరుగా సమావేశ మందిరానికి వెళ్లేలా ప్రణాళిక సిద్దం చేశారు. అంతర్గత పోటీ నెలకొన్న చోట పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాల్సిన బాధ్యతను పార్టీ ఇన్‌చార్జీలకు అప్పగించారు. 449 జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు... గతనెల 6, 10, 14 తేదీల్లో మూడు విడతల్లో రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో (హైదరాబాద్ జిల్లాను మినహాయించి) 538 జిల్లా, 5,816 మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 4న ఫలితాలు విడుదల కాగా.. టీఆర్ఎస్ 449, కాంగ్రెస్ 75, బీజేపీ 8, ఇతరులు ఆరు జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందారు. కరీంనగర్, గద్వాల, మహబూబ్‌నగర్, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల పరిధిలో టీఆర్ఎస్ అన్ని జెడ్పీటీసీ స్థానాలను క్లీన్‌స్వీప్ చేసింది. ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట, మేడ్చల్, ములుగు జిల్లాల్లో కాంగ్రెస్ కేవలం ఒక్కో జెడ్పీటీసీ స్థానంలో మాత్రమే గెలుపొందగా, మిగిలిన స్థానాలన్నీ టీఆర్ఎస్ ఖాతాలో చేరాయి. -
క్యాంపునకు పోదాం... చలో చలో!
సాక్షి, హైదరాబాద్: పరిషత్ రాజకీయం మరింత రసవత్తరమైంది. ఇన్నాళ్లూ ఫలితాల కోసం ఎదురు చూసిన అభ్యర్థులంతా ఇప్పుడు క్యాంపు రాజకీయాల్లో బిజీ అయ్యారు. అధ్యక్ష ఎన్నిక గడువు ముంచుకొస్తుండడంతో ఆశావహులంతా ప్రాదేశిక సభ్యులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల రేసులో ఉన్న అభ్యర్థులు సంప్రదింపుల్లో తలమునకలయ్యారు. తమకు మద్దతివ్వాలని ప్రాధేయపడుతున్నారు. కీలక సభ్యులతో క్యాంపు రాజకీయాలు సైతం మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 538 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు, 534 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈనెల 7వ తేదీన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా ఈనెల 8న జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. గులాబీదే ఆధిక్యమైనా... జిల్లా పరిషత్ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటింది. మెజార్టీ సభ్యులు అధికారపార్టీకి చెందిన వారే గెలుపొందడంతో 32 జిల్లాల్లో జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పీఠాలను ఆ పార్టే కైవసం చేసుకోనుంది. పార్టీ ఆదేశానుసారం ఖరారైన అభ్యర్థులకే టీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులు మద్దతు పలికే అవకాశం ఉండడంతో జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో పెద్దగా ఇబ్బంది లేదు. అయినప్పటికీ సభ్యులంతా అందుబాటులో ఉండేలా ఆ పార్టీ ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా మండల పరిషత్ స్థానాల్లోనూ అధికార పార్టీనే మెజార్టీ సీట్లు దక్కించుకుంది. కొన్ని మండలాల్లో మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బలాన్ని ప్రదర్శించింది. దీంతో హస్తం పార్టీ సభ్యులు ఎక్కువగా ఉన్న మండలాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 534 మండలాల్లో 437 మండల పరిషత్ పీఠాలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయి. మరో 67 మండలాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. మిగతా 30 స్థానాల్లో ఏ పార్టీకీ మెజార్టీ రాకపోవడంతో అక్కడ హంగ్ వాతావరణం కనిపిస్తోంది. ఈ మండలాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రెబెల్స్, స్వతంత్రులు, టీడీపీ, సీపీఐ, సీపీఎం, బీజేపీ పార్టీలకు చెందిన సభ్యుల మద్దతు కీలకం కానుంది. దీంతో వీరిని బుట్టలో వేసుకునేందుకు అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజధాని సమీపంలో.. పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ నెల 7, 8వ తేదీల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నిక ఉండడంతో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మండలాల్లో స్పష్టమైన ఆధిక్యం ఉన్న చోట్ల కూడా క్యాంపులకు ఆస్కారమవుతోంది. సభ్యులు అందుబాటులో ఉండేలా, ఎన్నిక సమయానికి నేరుగా అక్కడికి చేరుకునేలా అభ్యర్థులు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా నగరానికి సమీపంలో ఉన్న రిసార్టులు, హోటళ్లలో క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు రెండ్రోజులే గడువు ఉండటంతో ఆర్థిక భారం పెద్దగా ఉండదని భావించిన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ తరహా క్యాంపులకు తెరలేపాయి. మరోవైపు హంగ్ ఉన్న మండలాల్లో అధికారపార్టీ తన బలాన్ని ప్రదర్శించేందుకు కృషి చేస్తోంది. సంబంధిత ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కీలక అభ్యర్థులతో చర్చలు జరుపుతోంది. స్వతంత్ర, ఇతర పార్టీకి చెందిన వారిని తమవైపునకు తిప్పుకునేందుకు భారీ మొత్తంలో తాయిలాలు ప్రకటిస్తున్నా రు. రిజర్వ్ స్థానాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవినే కట్టబెడతామని ప్రలోభ పెడుతుండటంతో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొత్తంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ముగిసే దాకా ఈ క్యాంపు రాజకీయాలు జోరుగా సాగనున్నాయి. -
నేడు పరిషత్ ఎన్నికల షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. శనివారం ఎన్నికల షెడ్యూల్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా ఏర్పడిన 4 మండలాల్లోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ల ఖరారుపై ఆయా జిల్లాల కలెక్టర్లు శుక్రవారం గెజిట్లు విడుదల చేశారు. శుక్రవారం సెలవు దినం కావడంతో షెడ్యూల్ జారీ చేయలేదు. దీంతో శనివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల జాబితా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జెడ్పీపీ, ఎంపీపీ స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల ఖరారైన విషయం తెలిసిందే. కాగా, ఈ నెల 22 నుంచి మే 14లోగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగించేలా ముసాయిదా షెడ్యూల్‌ను ఎస్ఈసీ ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. మూడు విడతల్లో పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. 26 జిల్లాల్లో మూడు విడతల్లో, ఐదు జిల్లాల్లో 2 దశల్లో, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 4 మండలాల్లో రిజర్వేషన్లు ఇలా.. కొత్తగా ఏర్పడిన నాలుగు మండలాల్లో ఎంపీపీ అధ్యక్ష స్థానాలు, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జెడ్పీటీసీ రిజర్వేషన్లు.. నిజామాబాద్ జిల్లాలోని చండూరు (ఎస్టీ), మోసర (జనరల్), సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట (జనరల్), మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి (జనరల్) కేటగిరీలకు రిజర్వ్ అయ్యాయి. ఎంపీపీ స్థానం రిజర్వేషన్లు.. నిజామాబాద్ జిల్లాలోని చండూరు ఎంపీపీ ఎస్టీలకు, మోసర ఎంపీపీ జనరల్‌కు, సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట ఎంపీపీ జనరల్‌కు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి ఎంపీపీ బీసీ కేటగిరీలకు రిజర్వ్ అయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్లు ఈ నెల 22, 26, 30 తేదీల్లో విడుదల కానున్నాయి. తొలి విడత ఎన్నికలు మే 6, రెండో విడత 10, తుది విడత ఎన్నికలు 14న జరగనున్నాయి. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పరిషత్ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకు జెడ్పీపీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎంపిక ఉంటుంది. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీపీ చైర్పర్సన్, ఎంపీపీ అధ్యక్ష స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోర్టల్‌లో అధికారులు పొందుపరిచారు. -
కారులోకి కాంగ్రెస్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో పూర్తి ఆధిపత్యం లక్ష్యంగా టీఆర్ఎస్ వేగం పెంచింది. టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేసే ప్రక్రియ చివరి దశకు చేరింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేల చేరికకు సైతం రంగం సిద్ధమైంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోపే కాంగ్రెస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిసింది. గతంలో టీఆర్ఎస్లో క్రియాశీలకంగా పనిచేసిన ఈ ఎమ్మెల్యే త్వరలోనే పార్టీలో చేరే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక కోసం 2 రోజుల క్రితం ఈ ఎమ్మెల్యే నియోజకవర్గ సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆ సమావేశాన్ని రద్దు చేశారు. పార్టీ మార్పు అంశం కారణంగానే సమావేశం రద్దయినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. రెండుమూడు రోజుల్లోనే ఈ ఎమ్మెల్యే చేరికపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ఒక్కరు చొప్పున ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం త్వరలోనే అధికార పార్టీలోకి మారే అవకాశం ఉందని టీఆర్ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోపే మరో ముగ్గురు ఎమ్మెల్యేల చేరిక ఉంటుందని అంటున్నారు. మున్సిపల్, రెవెన్యూ కొత్త చట్టాలను ఆమోదించేందుకు ప్రత్యేకంగా నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లోపే టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష విలీనం ప్రక్రియ ముగుస్తుందని అధికార పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. శాసనసభాపక్షం విలీనం... అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాల్లో విజయం సాధించింది. వీరిలో 13 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరితే కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనమైనట్లుగా గుర్తిస్తారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు, చిరుమర్తి లింగయ్య, పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, బానోతు హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్రావు, జాజుల సురేందర్‌లు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నామని, కాంగ్రెస్‌ను వీడితున్నామని తెలిపారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇదే బాటలో నడిస్తే టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం అమలు వ్యూహం పూర్తికానుంది. అసెంబ్లీ సమావేశాల్లోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందనే ధీమాతో టీఆర్ఎస్ ఉంది. ఒకవేళ ఏమైనా కారణాలతో అప్పటికీ పూర్తికాకపోతే.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పూర్తవుతుందని టీఆర్ఎస్ ముఖ్యనేతలు అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఏమాత్రం లేవని.. ఫలితాల్లో ఈ విషయం స్పష్టత వచ్చి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. -
అన్ని జెడ్పీ పీఠాల కైవసమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరిగే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో మరోసారి ఘనవిజయం సాధిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లాలకు 32 జిల్లాపరిషత్ అధ్యక్ష పీఠాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయ మని స్పష్టం చేశారు. వీటితో పాటు ఎన్నికలు జరుగనున్న 530కి పైగా మండల పరిషత్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు రానున్న ఎన్నికల్లోనూ నిరాశ తప్పదన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఆయన ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని ఎన్నికల కమిషన్‌ను కోరిన నేపథ్యంలో రానున్న వారం పది రోజుల్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లాలవారీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కేటీఆర్ ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. గత నెల రోజులుగా పార్లమెంట్ అభ్యర్థుల గెలుపుకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించామని, ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి మరోసారి బ్రహ్మరథం పట్టనున్నారని కేటీఆర్ తెలిపారు. ఇదే తరహాలో వచ్చే స్థానికసంస్థల ఎన్నికల్లో పనిచేయాలన్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకుల సేవలను వినియోగించుకొనేలా ముందుకు పోతామన్నారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో సమావేశం జరిపి మార్గదర్శనం చేస్తారని కేటీఆర్ తెలిపారు. -
25లోగా ‘పరిషత్’ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 20–25 తేదీల మధ్య పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో తొలి విడత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులకే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఎస్ఈసీ ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు వేగవంతం చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాల్సిందిగా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, సీఈవోలు, డీపీవోలు, ఎండీపీవోలకు ఎస్ఈసీ ఆదేశాలిచ్చింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాలను ఆదివారం సిద్ధం చేయాలని సూచించింది. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి ఏవైనా మార్పుచేర్పులు, అభ్యంతరాలు ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ నెల 20న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించాక ఆ వెంటనే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎస్ఈసీ విడుదల చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పూర్తయిన ప్రక్రియలు... మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలకమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ముందుగానే పూర్తి చేశారు. రాష్ట్రంలోని 32 జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీపీ) చైర్మన్లు, మిగతా మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేసి ప్రకటించింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కేటాయించింది. ఈ జాబితాను ఎస్ఈసీకి కూడా పీఆర్‌శాఖ అందజేసింది. దీంతో పరిషత్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేయడంపై ఎస్ఈసీ దృష్టి పెట్టింది. జిల్లాలు, మండలాలవారీగా ఎన్నికలకు అవసరమైన సిబ్బంది కేటాయింపును పూర్తి చేశారు. ఈ నెల 15–20లోగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ప్రక్రియను పూర్తి చేసేందుకు కలెక్టర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో అదే తరహాలో ఈ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకం, ఇతరత్రా కసరత్తు పూర్తి చేసేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది. పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)తో నిర్వహించాలని ఎస్ఈసీ తొలుత భావించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు కూడా పంపించింది. అయితే పలు విడతలుగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఈవీఎంలు తగిన సంఖ్యలో అందుబాటులో లేక పరిషత్ ఎన్నికల నిర్వహణను గతంలో నిర్వహించినట్లుగా పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 20 తర్వాత నోటిఫికేషన్ వెలువడితే మే 8వ తేదీలోగా మొదటి విడత, మే 16లోగా రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. మే 27 వరకు ఎన్నికల కోడ్ లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చే నెల 27 వరకు ఉండటంతో ఆ లోగానే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 11న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తయినా వచ్చే నెల 23నే ఫలితాలు వెలువడనున్నాయి. స్థానిక సంస్థలకు మరో కోడ్ అడ్డంకి లేకుండా ఉండేందుకే ప్రభుత్వం వెంటనే ఈ ఎన్నికలు నిర్వహించనుంది. జూలై 3, 4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీపీ, ఎంపీపీల పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షులతో కూడిన పాలకవర్గాలు జిల్లాలు, మండలస్థాయిల్లో పగ్గాలు చేపట్టనున్నాయి. -
ఎస్టీలకే దక్కిన పీఠం..
సాక్షి, కొత్తగూడెం: జిల్లాల పునర్విభజన తరువాత ఆవిర్భవించనున్న సరికొత్త జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ రెండున్నర సంవత్సరాలుగా జిల్లా, మండల పరిషత్‌లు ఉమ్మడిగానే ఉన్నాయి. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తుండడంతో కొత్త జిల్లాల ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయినప్పటికీ మరికొన్ని మండలాలు మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోకి వెళ్లాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 23 మండలాలు ఉండగా, వాటిలో భద్రాచలం, కొత్తగూడెం మండలాలు పూర్తిగా మున్సిపాలిటీ పరిధిలోకి వస్తున్నాయి. మిగిలిన 21 మండలాల జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలకు, ఆయా మండలాల పరిధిలోని మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 21 మండలాలకు గాను జెడ్పీటీసీలు ఎస్టీ జనరల్‌కు 05, ఎస్టీ మహిళలకు 05 కేటాయించారు. జనరల్ 05, జనరల్ మహిళకు 06 రిజర్వ్ చేశారు. మొత్తం మహిళలకు 11 రాగా, జనరల్‌కు 10 వచ్చాయి. బీసీ, ఎస్సీలకు ఒక్క జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం కూడా కేటాయించలేదు. ఇక మండల పరిషత్ అధ్యక్ష పదవుల్లో ఎస్టీ జనరల్‌కు 09, ఎస్టీ మహిళలకు 09, జనరల్‌కు 01, జనరల్ మహిళకు 01, ఎస్సీ మహిళకు 01 కేటాయించారు. ఎంపీపీ పదవుల్లో మహిళలకు 11, జనరల్‌కు 10 వచ్చాయి. వీటిలో ఎస్టీ కోటాలోనే మొత్తం 18 ఎంపీపీలు వచ్చాయి. బీసీలకు ఒక్క ఎంపీపీ కూడా రాలేదు. జెడ్పీటీసీలపైనే అందరి దృష్టి.. మండల ప్రజాపరిషత్‌లు సింహభాగం ఎస్టీలకు రిజర్వు కావడంతో జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 21 జెడ్పీటీసీల్లో 10 ఎస్టీలకు రిజర్వు కాగా, 11 జెడ్పీటీసీలు జనరల్‌కు వచ్చాయి. వీటిల్లో 05 జనరల్, 06 జనరల్ మహిళలకు కేటాయించారు. జిల్లాలో గత ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో విపక్ష కాంగ్రెస్ పార్టీ కూటమి విజయం సాధించింది. దాదాపు అన్ని మండలాల్లోనూ ఓట్లపరంగా ఆధిక్యం సాధిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో విపక్షాలు ఈ ఎన్నికలపై పకడ్బందీగా దృష్టి పెట్టాయి. అయితే తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ హవా నడిచింది. సింహభాగం పంచాయతీలను గులాబీ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. దీంతో టీఆర్ఎస్లోనూ జోష్ వచ్చింది. ఇక భద్రాద్రి జిల్లాలో వామపక్షాలు స్థానికంగా గట్టి ప్రాబల్యం కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలు సైతం తగినన్ని జెడ్పీటీసీలు, మండల పరిషత్‌లు గెలుచుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. జిల్లా ప్రజా పరిషత్ పీఠం సాధించేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 11 సాధించే విషయంలో ప్రతి జెడ్పీటీసీ స్థానం కీలకమే. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పీఠం కోసం సైతం పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. ఇక మండల ప్రజాపరిషత్‌ల అధ్యక్ష పదవుల విషయంలో రాజకీయం మరింత రసవత్తరంగా ఉండనుంది. కొన్ని మండలాల్లో 4 ఎంపీటీసీ స్థానాలు, మరొకొన్ని మండలాల్లో 5 ఎంపీటీసీలు ఉన్నాయి. ఇలాంటి చోట్ల ఒక్క ఎంపీటీసీ గెలుచుకున్నవారు సైతం ఎంపీపీ రేసులో ముందు వరుసలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో జిల్లా, మండల పరిషత్‌ల పోరు రసవత్తరంగా మారనుంది. జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల జనాభా, రిజర్వేషన్లు.. మండలం మొత్తం జనాభా జెడ్పీటీసీ స్థానాలు రిజర్వేషన్ ఆళ్లపల్లి 12268 1 ఎస్టీ జనరల్ అన్నపురెడ్డిపల్లి 21130 1 జనరల్ మహిళ చండ్రుగొండ 27911 1 జనరల్ చర్ల 42947 1 ఎస్టీ మహిళ చుంచుపల్లి 42290 1 జనరల్ దుమ్ముగూడెం 46802 1 ఎస్టీ జనరల్ గుండాల 15857 1 ఎస్టీ మహిళ జూలూరుపాడు 33395 1 ఎస్టీ మహిళ కరకగూడెం 15221 1 ఎస్టీ జనరల్ లక్ష్మీదేవిపల్లి 38093 1 జనరల్ మహిళ మణుగూరు 40026 1 జనరల్ ములకలపల్లి 34794 1 ఎస్టీ జనరల్ పాల్వంచ 33673 1 జనరల్ పినపాక 33155 1 జనరల్ మహిళ టేకులపల్లి 47879 1 ఎస్టీ జనరల్ ఇల్లందు 57302 1 ఎస్టీ మహిళ అశ్వాపురం 43067 1 జనరల్ మహిళ బూర్గంపాడు 36910 1 జనరల్ మహిళ దమ్మపేట 58444 1 జనరల్ సుజాతనగర్ 27989 1 ఎస్టీ మహిళ మొత్తం 768805 21 -
‘జెడ్పీ’ కసరత్తు
జిల్లా ప్రజానీకం, రాజకీయ నాయకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జిల్లా పరిషత్ త్వరలో ఏర్పాటు కానుంది. పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్న విధంగా నూతన జిల్లా పరిషత్ ఏర్పాటు కోసం చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్‌ను విభజించి కొత్తగా మెదక్, సిద్దిపేట జెడ్పీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును అధికారులు ప్రారంభించారు. ఈనెల 25వ తేదీలోగా నూతన జెడ్పీ, జెడ్పీటీసీలు, ఎంపీపీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ జెడ్పీ సీఈఓకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా పరిషత్ అధికారులు ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధం అవుతున్నారు. సాక్షి, మెదక్: జిల్లా పరిషత్ సభ్యుల పదవీకాలం జూలైతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది. నూతన జిల్లాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణకు వీలుగా సాధ్యమైనంత త్వరగా కొత్త జెడ్పీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా మొదట మెదక్ జిల్లాలో కొత్త జెడ్పీటీసీలు, ఎంపీపీల ఏర్పాటు కోసం అధికార యంత్రాంగం ప్రతిపాదనలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 46 జెడ్పీటీసీలు, 46 మంది మండల పరిషత్ అధ్యక్షులున్నారు. కాగా కొత్తగా ఏర్పాటైన మెదక్ జిల్లా నుంచి ప్రస్తుతం 15 మంది జెడ్పీటీసీలు, 15 మంది ఎంపీపీలు జెడ్పీ సమావేశాలకు హాజరవుతున్నారు. కాగా జిల్లాల పునిర్వభజన సమయంలో మండలాల సంఖ్య పెరిగింది. జిల్లాలో ఇది వరకు 15 మండలాలు ఉండగా కొత్తగా హవేళిఘణాపూర్, నిజాంపేట, చిలిపిచెడ్, నార్సింగి, మనోహరాబాద్ మండలాలు ఏర్పడ్డాయి. దీంతో మండలాల సంఖ్య 20కి చేరింది. కొత్త రెవెన్యూ మండలాల ఆధారంగా జిల్లాలో జెడ్పీటీసీల సంఖ్య కూడా 20కి చేరనుంది. అలాగే మండల పరిషత్‌లు కూడా 20 ఏర్పాటు కానున్నాయి. దీంతో పాటు ఎంపీటీసీల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. కొత్త జిల్లా పరిషత్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల(ఎంపీటీసీ) విభజన చేపట్టనున్నారు. 2011 జనాభా ఆధారంగా ఎంపీటీసీల విభజన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కొత్తగా ఐదు మండలాలు ఏర్పడినందున ఎంపీటీసీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల కేటాయింపు కొత్తగా ఏర్పాటయ్యే జెడ్పీలకు ఉద్యోగుల కేటాయింపుపైనా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటు చేసే మెదక్, సిద్దిపేట జెడ్పీలకు ఉద్యోగులను కేటాయించనున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ జెడ్పీలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరిస్తోంది. జిల్లా పరిషత్ ఆధీనంలో మండల పరిషత్, గ్రామీణ నీటిసరఫరా, పంచాతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలు పనిచేస్తున్నాయి. కాగా కొత్తగా జిల్లాల ఏర్పాటు సమయంలో మండల పరిషత్, గ్రామీణ నీటిసరఫరా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను కొత్త జిల్లాలకు ఆపాయింట్ చేశారు. దీంతో మూడు శాఖల ఉద్యోగులు విభజన ప్రస్తుతం ఉండదని, కేవలం కొత్త జెడ్పీకి సీఈఓ, డిప్యూటీ సీఈఓ, సూపరింటెండెంట్లు, మినిస్టీరియల్ స్టాఫ్‌ను మాత్రమే నియమిస్తారని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, మినిస్టీరియల్ స్టాఫ్‌ను మాత్రమే మూడు జిల్లాలకు విభజించే అవకాశం ఉంది. పదవులపై నాయకుల్లో ఆశలు కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పడుతుండడంతో పాటు కొత్తగా ఐదు జెడ్పీటీసీ, ఐదు ఎంపీపీ పదవులు వస్తున్నందున నాయకుల్లో పదవులపై ఆశలు పెరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్ నాయకులు కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై ఆశలు పెంచుకుంటున్నారు. రిజర్వేషన్లు కలిసివస్తే జెడ్పీటీసీలు పోటీచేసేందుకు అనువైన మండలాలను ఎంపిక చేసుకునేందుకు ద్వితీయ శ్రేణి నాయకులు సిద్ధం అవుతున్నారు. హవేళిఘణాపూర్, చిల్పిచెడ్, నార్సింగి, మనోహరాబాద్, నిజాంపేట మండలాల్లోని కొత్తగా జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులు రానున్నాయి. దీంతో ఆయా పదవులపై నాయకులు ఇప్పటి నుంచే కన్నేసి ఉంచారు. -
నయా పరిషత్‌లు
మండల, జిల్లాపరిషత్ ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా మండల, జిల్లా ప్రాదేశిక స్థానాల ఖరారు ప్రక్రియను ప్రారంభించింది. జూలై 4, 5 తేదీలతో ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగుస్తున్నందున ఆ లోపు కొత్త జిల్లాల ప్రాతిపదికన వీటికి ఎన్నికలు నిర్వ హించాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఈ మేరకు రెవెన్యూ జిల్లా పరిధిలోకి వచ్చే మండలాల జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ నెల 25వ తేదీలోపు ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: 2016లో జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించింది. రంగారెడ్డికి అదనం గా మేడ్చల్, వికారాబాద్‌ను నూతనంగా ఏర్పాటు చేసింది. అయితే, అప్పట్లో పంచాయతీరాజ్ విభాగాన్ని పునర్విభజన నుంచి మినహాయించింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే జిల్లాపరిషత్ కొనసాగుతోంది. మరికొన్ని నెలల్లో జెడ్పీ పాలకవర్గం పదవీకాలం పూర్తికానున్నందున కొత్త జిల్లాలకు అనుగుణంగా జెడ్పీలను కూడా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల డీలిమిటేషన్‌కు ముందు మన జిల్లాపరిషత్ పరిధిలో 33 మండల పరిషత్‌లు ఉండగా.. పునర్విభజన అనంతరం ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం కేవలం 21 మండల పరిషత్‌లే ఉన్నాయి. వాస్తవానికి జిల్లాలో మొత్తం 27 మండలాలు ఉన్నా.. అందులో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, బాలాపూర్, హయత్‌నగర్, గండిపేట మండలాలు ఆర్బన్ మండలాలు. ఇవి పంచాయతీరాజ్ నుంచి డీనోటిఫై అయ్యి.. పురపాలన పరిధిలోకి చేరాయి. గండిపేట మండలంలోని పంచాయతీలను కూడా పురపాలనలో విలీనం చేసినప్పటికీ, ఈ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతానికి యథాతథ పరిస్థితి కొనసాగుతోంది. ఈ మండలాలను మినహాయిస్తే గ్రామీణ మండలాలకు కొత్తగా ఎంపీపీ, జెడ్పీటీసీలు రానున్నారు. రాక..పోక జిల్లాల పునర్విభజన అనంతరం కొత్తగా ఏర్పడ్డ వికారాబాద్, మేడ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలు మండలాలు విలీనమయ్యాయి. వికారాబాద్ జిల్లా పరిధిలోకి పరిగి, కుల్కచర్ల, దోమ, పూడూరు, నవాబ్‌పేట, వికారాబాద్, ధారూర్, మోమిన్‌పేట, మర్పల్లి, బంట్వారం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలు చేరాయి. గండీడ్ మండలం మహబూబ్‌నగర్‌లో విలీనమైంది. ఇక మేడ్చల్ జిల్లాలో ఘట్కేసర్, కీసర, శామీర్‌పేట, కుత్బుల్లాపూర్, మేడ్చల్ కలిశాయి. కాగా, మహబూబ్‌నగర్ నుంచి కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట్ మండలాలు వికారాబాద్‌లోకి వచ్చాయి. ఇక మేడ్చల్‌లో మాత్రం పాత జిల్లాలోని మండలాలే కలిసాయి. రంగారెడ్డి జిల్లాలోకి పాలమూరు నుంచి ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల, కొందుర్గు, చౌదరిగూడ, కొత్తూరు, కేశంపేట, ఫరూఖ్‌నగర్, నందిగామ విలీనమయ్యాయి. -
అంతా హడావుడే!
కర్నూలు(అర్బన్): పనులు పూర్తి కాకుండానే నూతన భవనం నుంచి జిల్లా పరిషత్ పాలన ప్రారంభమైంది. చైర్మన్ మెప్పు పొందేందుకు ఓ అధికారి చేసిన హడావుడి కారణంగా అధికారులు, సిబ్బంది అవస్థ పడాల్సి వచ్చింది. రూ.3.67 కోట్లతో జెడ్పీ నూతన భవనం నిర్మించారు. దీన్ని గత నెల తొమ్మిదిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అయితే.. ఈ భవనంలో అధికారులు, ఉద్యోగులు కూర్చునేందుకు అవసరమైన ఫర్నీచర్, పాలన నిర్వహణకు తగినన్ని కంప్యూటర్లు ఏర్పాటు చేయలేదు. కంప్యూటర్ల నిర్వహణకు సంబంధించి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు కూడా ఇంకా తీసుకోలేదు. జెడ్పీ చైర్మన్, సీఈఓ, డిప్యూటీ సీఈఓ, ఏఓ చాంబర్లతో పాటు సందర్శకుల గదిలో ఫ్యాన్లు, ఏసీలు బిగించలేదు. సందర్శకులు కూర్చుకునేందుకు అవసరమైన కుర్చీలు లేవు. ఈ భవనంలోనే మినీ మీటింగ్ హాలు ఏర్పాటు చేశారు. అందులో ఒక్క కుర్చీ కూడా లేదు. భవనం చుట్టూ ప్రహరీ నిర్మాణం పెండింగ్‌లో ఉంది. మొత్తమ్మీద దాదాపు 40 శాతం పనులు పెండింగ్‌లో ఉండగానే సోమవారం నుంచి ఇక్కడ కార్యకలాపాలు మొదలుపెట్టారు. ఈ నెల 13 (సోమవారం) జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ పుట్టినరోజు కావడంతో ఓ అధికారి ఆయన మెప్పు పొందేందుకు ఇదే రోజు నూతన భవనంలోకి మారాలని పట్టుబట్టి సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టించినట్లు విమర్శలొస్తున్నాయి. సొంత ఖర్చుతో సరంజామా తరలింపు పాత భవనంలోని కంప్యూటర్లు, బీరువాలు, ఫైళ్లు, ఫర్నీచర్‌ను నూతన భవనంలోకి తరలించేందుకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాల్సి ఉంది. అయితే.. ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోగా, కచ్చితంగా 13వ తేదీన నూతన భవనంలోకి షిఫ్ట్ కావాలని ఆదేశాలు జారీ చేయడంతో సంబంధిత సెక్షన్లకు చెందిన ఉద్యోగులు రెండవ శనివారం, ఆదివారం సెలవు దినాల్లో కూడా పనిచేశారు. తమ సొంత ఖర్చులతో ఫర్నీచర్, బీరువాలు, ఫైళ్లను నూతన భవనంలోకి మార్చుకున్నట్లు తెలుస్తోంది. పాలనకు వారం రోజుల విరామం! నూతన భవనంలో ఇంకా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు తీసుకోకపోవడం, కంప్యూటర్లు అమర్చకపోవడం వల్ల మరో వారం రోజుల వరకు జెడ్పీ పాలనకు అనధికార విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పీఎఫ్, ఎస్టాబ్లిష్మెంట్, అకౌంట్స్ తదితర విభాగాల్లో విద్యుత్, ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ పాలన అంతా ప్రస్తుతం ఆన్లైన్లోనే సాగుతున్న నేపథ్యంలో నూతన భవనం నుంచి జెడ్పీ పాలన సజావుగా సాగేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెడ్పీలో అన్ని సెక్షన్లలో 72 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి అవసరమైన ఫర్నీచర్, కంప్యూటర్లు లేకపోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలు వెచ్చిస్తే తప్ప పూర్తి స్థాయిలో వసతులు కల్పించలేమనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఫర్నీచర్ వచ్చేస్తోంది ఫర్నీచర్ రెండు రోజుల్లో వచ్చేస్తుంది. ప్రస్తుతం పలు విభాగాల్లో విద్యుత్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఇస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన కంప్యూటర్ల కొనుగోలకు చర్యలు చేపట్టాం. – ఎం.విశ్వేశ్వరనాయుడు, జిల్లా పరిషత్ సీఈఓ -
జెడ్పీ సీఈఓగా లక్ష్మీనారాయణ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా పరిషత్ సీఈఓగా ఆర్డీఓ లక్ష్మీనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇన్నాళ్లూ ఇక్కడ సీఈఓగా కొమరయ్య విధులు నిర్వహిస్తూ వచ్చారు. రాష్ట్ర రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయనను 2017 ఏప్రిల్ 3న ఏడాది కాలానికి గాను డిప్యూటేషన్‌పై పంపించారు. ఆయన డిప్యూటేషన్ ముగియడంతో మళ్లీ హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు మహబూబ్‌నగర్ ఆర్డీఓగా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మీనారాయణకు ఇన్చార్జి జెడ్పీ సీఈఓగా నియమిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. లక్ష్మీనారాయణ 2015 మే 5 నుంచి 2017 ఏప్రిల్ 2వ తేదీ వరకు కూడా జెడ్పీ సీఈఓగా విధులు నిర్వర్తించారు. -
మనమే నంబర్1
ఆదిలాబాద్‌అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల పథకాలు, కార్యక్రమాలను అమలు పర్చడంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాల అమలులో రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలిచి జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైంది. జెడ్పీ ద్వారా అమలవుతూ అన్ని సెక్టార్ల కింద చేపట్టిన అభివృద్ధి పనుల్లోపురోగతి సాధించింది. ఈ ప్రగతిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ స్వశక్తి కిరణ్’ కింద ఆదిలాబాద్ జిల్లా పరిషత్‌ను పురస్కారం–2018కి ఎంపిక చేసింది. 100 మార్కులున్నా ఈ పోటీలో రాష్ట్రం నుంచి రెండు జిల్లాలు ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ పోటీపడగా ఆదిలాబాద్ 72 మార్కులతో ముందు వరుసలో నిలబడి అవార్డు దక్కించుకుంది. ‘జాతీయ పంచాయతీ దినోత్సవం’ సందర్భంగా ఈ నెల 24న మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో భారత పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జెడ్పీ చైర్పర్సన్ వల్లకొండ శోభ సత్యనారాయణగౌడ్‌కు అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డుతో పాటు రూ.50 లక్షల నగదు పురస్కారం కూడా అందజేయనున్నారు. ఏడాదికోసారి జరిగే జాతీయస్థాయి పోటీలో మొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లా పరిషత్‌కు అవార్డు దక్కడం హర్షించదగ్గ విషయం. ప్రగతి సాధించిందిలా.. ఉమ్మడి జిల్లాలో గ్రామీణ రోడ్ల నిర్మాణం, పీఎంజీఎస్‌వై, జన్‌ధన్ యోజన, బేటీ బచావో.. బేటీ పడావో.. ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్, పారిశుధ్య, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను జిల్లా పరిషత్ సక్రమంగా అమలు చేస్తోంది. ఉన్నతస్థాయి నుంచి క్షేత్ర స్థాయి అధికారి వరకు పథకాలను అమలు పర్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా పరిషత్ ద్వారా వివిధ సెక్టార్ల కింద అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు పూర్తి స్థాయిలో కాకున్నా ఇతర జిల్లాలతో పోల్చితే బాగానే అమవుతున్నాయి. ఆదిలాబాద్‌లో జిల్లా పరిషత్ సమావేశాల నిర్వహణ, స్థాయి సంఘా సమావేశాలు, సర్వసభ్య సమావేశాల నిర్వహణ సరిగ్గా ఉండడంతోపాటు సగం కన్నా ఎక్కువ మంది ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల చక్కని భాగస్వామ్యం భారత ప్రభుత్వాన్నే మెప్పించింది. దీనిని దష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో జాతీయ అవార్డుకు సిఫార్సు చేసింది. అయితే భారత ప్రభుత్వం నియమించబడిన అధికారుల బృందం 2018 జనవరిలో ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించింది. వివిధ శాఖల సమన్వయంతో పలు గ్రామాల్లో వివిధ సెక్టార్ల కింద చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిందీ బృందం. జిల్లా, మండల ప్రజా పరిషత్ సమావేశాలు, నిర్వహణ తీరు, చర్చించిన అంశాలు (మినిట్స్), మహిళా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం, వివిధ పథకాలకు నిధులు ఆమోదం, వాటి ఖర్చులు, ఆడిటింగ్, సంబంధిత రికార్డుల నిర్వహణ తదితర అంశాలను అధికారుల బృందం పరిశీలించింది. దీంతో పాటు ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ), ప్రజా ఫిర్యాదుల విభాగంలో జిల్లా పరిషత్ దృష్టికి వచ్చిన సమస్యలు, వాటి పరిష్కారాలు వంటి అంశాలను పరిశీలించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన జిల్లాలో చేపట్టిన హరితహారం, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, మరుగుదొడ్లు, పాఠశాలల్లో టాయిలెట్స్, పారిశుధ్యం, తాగునీటి వసతి కల్పించడం వంటి వాటిని అధికారుల బృందం పరిశీలించింది. దీనికి తోడు జిల్లాలో ఉద్యానవన శాఖ ద్వారా చేపట్టిన పాలీహౌస్‌ల నిర్మాణం, వైద్యారోగ్య శాఖ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన భీంపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సైతం అధికారుల బృందం సందర్శించింది. తద్వారా అధికారుల బృందం ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు భేష్‌గా ఉన్నాయంటూ భారత ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. జాతీయస్థాయి అవార్డు దక్కడం హర్షణీయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, కార్యక్రమాలను సక్రమంగా అమలు పరుస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా పరిషత్‌ను జాతీయస్థాయి అవార్డుకు ఎంపిక చేయడం హర్షణీయమం. ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు, సిబ్బంది, మీడియా కృషి ఈ అవార్డు ఎంపికకు దోహదపడింది. జాతీయస్థాయిలో మన జిల్లా మెరిసే విధంగా చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగింది. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసేందుకు మరింత ఉత్సహాన్ని ఇస్తోంది. జిల్లా పరిషత్‌కు సంబంధించిన అన్ని సమావేశాలు, రికార్డులు, నిధులు, విధులు, ఖర్చులు సక్రమంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులందరి కృషి ఫలితమే ఈ అవార్డు. – జితేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో -
జెడ్పీలో ముసలం !
జిల్లా పరిషత్‌లో మళ్లీ ముసలం మొదలైందా? చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, సీఈవో నగేష్‌ల మధ్య కోల్డ్ వార్ మరోసారి బయటపడిందా...అంటే నిజమే అంటున్నాయి ఉద్యోగ వర్గాలు! గతేడాది నుంచి చాపకింద నీరులా తీవ్రమవుతున్న ఈ వ్యవహారం తాజాగా కీలక ఉద్యోగుల స్థానచలనం నేపథ్యంలో వివాదాస్పదంగా మారింది. జెడ్పీలో కీలక స్థానాల్లో సూపరింటెండెంట్ల స్థానచలనం ఫైళ్ల విషయంపై ముందస్తుగా సీఈవో నగేష్‌కు సమాచారం లేకపోయినా ఒత్తిళ్ల మ«ధ్య పరిపాలనా సౌలభ్యం కోసం అన్నట్లుగా ఆయన ఆమోద సంతకం చేసి ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. ఇదే విషయంలో సీఈవో తీవ్ర మనస్తాపానికి గురయ్యారంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. విధులు, పరిపాలన విషయంలో తనపై చైర్పర్సన్ పెత్తనాన్ని ఏమాత్రం సహించలేని ఆయన బదిలీ ప్రయత్నాల కోసం అమరావతికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అరసవల్లి: అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు చాలాచోట్ల అధికారులపై వేధింపులకు పాల్పడుతుండడం, రాజకీయ కక్షలు తీర్చుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో కూడా జిల్లా పరిషత్ సీఈవో స్థాయిని తగ్గించే యత్నంతో పాటు రబ్బర్ స్టాంప్‌లా ఆయన కుర్చీని మార్చేలా చైర్పర్సన్ ధనలక్ష్మి వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. గతంలో జిల్లా పరిషత్‌కు చెందిన పాలనా వ్యవహారాలు, పలు ఆమోదాలకు చెందిన ఫైళ్లను అప్పటి జిల్లా కలెక్టర్‌కు నేరుగా పంపించేలా సీఈవో చర్యలు తీసుకోవడాన్ని తప్పుబట్టిన చైర్పర్సన్, ఇప్పుడు సీఈవో అభిప్రాయం లేకుండానే కీలకమైన సూపరింటెండెంట్ల స్థానచలనాన్ని చేపట్టి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. అయితే గతేడాది సాధారణ బదిలీల వ్యవహారాల్లో ఈ ఇరువురి వ్యవహారంతోనే రాష్ట్రంలో బదిలీలు రద్దయిన ఏకైక జిల్లా పరిషత్గా రికార్డుల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.. అలాగే పలు పరిణామాల అనంతరం సీఈవో నగేష్‌ను బదిలీ చేయిస్తున్నట్లు ఏకంగా జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించిన సంగతి విదితమే. అయితే అప్పట్లో సీఈవో నగేష్ ప్రయోగించిన ఎత్తులకు ఆమె ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆ తర్వాత జిల్లాకు చెందిన మంత్రులను సైతం రంగంలోకి దింపి సీఈవోపై ఒత్తిళ్లు తేచ్చే ప్రయత్నం చైర్పర్సన్ చేశారు. దీంతో అప్పటి నుంచి సీఈవో నగేష్ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని..బదిలీ యత్నాల్లోనే ఉన్నారు. తాజాగా సూపరింటెండెంట్ల బదిలీ విషయంలో మరోసారి మనస్తాపానికి గురికావడంతో బదిలీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఇటీవల ఓ డెప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడుని కలిసి జెడ్పీ సీఈవోగా అవకాశమివ్వాలంటూ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో జెడ్పీలో మరికొద్ది రోజుల్లో చాలా తేడాొస్తాయని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. సూపరింటెండెంట్ల స్థానచలనం.. జిల్లా పరిషత్‌లో ఈనెల ఒకటి నుంచి పలువురు సూపరింటెండెంట్ల స్థానాలను అనూహ్యంగా మార్పులు చేస్తూ సీఈవో నగేష్ ఆదేశాలు జారీ చేశారు. అయితే దీని వెనుక పెద్ద కథే నడిచింది. ఈ వ్యవహారంలో అంతా తానై అన్నట్లుగా పరిపాలన వ్యవహారాలపై చైర్పర్సన్ ధనలక్ష్మి హవా చలాయిస్తూ ఈ ఫైళ్లపై సీఈవో ఆమోద సంతకం చేసేలా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈక్రమంలో అమలైన ఉత్తర్వుల మేరకు ఫ్లానింగ్ సెక్షన్‌కు బి.వి.రమణమూర్తి, ఎస్టాబ్లిస్ (సీ) సెక్షన్‌కు కె.రామేశ్వరరావు, డిస్పాచ్ సెక్షన్‌కు ఎస్.వాసుదేవరావును నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. అలాగే వరŠుక్స (బీ సెక్షన్) ఇన్చార్జిగా కె.రామేశ్వరరావుకు, ఎడ్యుకేషన్ సెక్షన్‌కు ఇన్చార్జిగా ఎస్.వాసుదేవరావుకు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమేరకు కొత్త స్థానాల్లో అధికారులు విధుల్లోకి చేరిపోయారు. ఈ విభాగాల్లో బదిలీలకు పరిపాలనా సౌలభ్యం పేరుతో స్థాన చలనాలకు చర్యలు చేపట్టారు. అయితే అక్కౌంట్స్ విభాగం, పీఎఫ్ సెక్షన్లకు సూపరింటెండెంట్ల స్థానాల్లో మార్పులు మాత్రం చేయకపోవడం గమనార్హం. ఏది ఏమైనా ఈ అధికారుల స్థానచలనం మళ్లీ చైర్‌పర్సన్‌కు, సీఈవోకు మధ్య చిచ్చు పెట్దిందనే చెప్పాలి. ఈ వివాదాల ముసలంతో జెడ్పీలో ఏమార్పులు జరుగుతాయో అని ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
కల నెరవేరెను..!
► మంత్రి హోదాలో జెడ్పీలో అడుగుపెట్టిన కళా వెంకటరావు ► ఎమ్మెల్యేగా దూరంగా ఉన్న వైనం అరసవల్లి(శ్రీకాకుళం): ‘‘జిల్లాలో దశాబ్దాల పాటు రాజకీయాలు నెరిపిన నేత ఆయన. విభిన్నమైన శైలితో ఉన్నత స్థానాలను దక్కించుకోవడం అతని ప్రత్యేకత. మనసులో ఏం అనుకున్నా...అది జరిగేంత వరకు బయట పడకుండా వ్యవహారం నడిపే నాయకుడాయన... ఆయనే తాజాగా విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు. అనుకున్నది ఎట్టకేలకు సాధించుకుని కల నెరవేర్చుకున్నారు’’. ఇంతకీ విషయం ఏమిటంటే! 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా గెలుపొందిన కళా ..జిల్లా పరిషత్‌లో ఇంతవరకు ఒక్కసారి కూడా అడుగుపెట్టలేదు. దీని వెనక పెద్ద కథే ఉంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కేబినెట్లోనే మంత్రి పదవి ఆశించినప్పటికీ.. కళాకు కాదని, ఆయన వ్యతిరేకవర్గ నేత అచ్చెన్నాయుడికి మంత్రి పదవి వరించింది. దీంతో కళాకు ఆశాభంగమే మిగిలింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజావసరాలు, బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి నిర్ణయాలు తీసుకునే కీలకమైన జనరల్ బాడీ, స్థాయీ సంఘ సమావేశాలు, బడ్జెట్, డీఆర్సీ తదితర సమావేశాలు జరుగుతుంటాయి. వీటికి తప్పనిసరిగా జిల్లాలో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతి ఎమ్మెల్యే హాజరుకావాలి. తమ నియోజకవర్గంలో సమస్యలు తెలియజేయాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే హోదాతో జెడ్పీ సమావేశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ హాజరు కాకూడదని, ఎలాగైనా మంత్రిగానే వేదికపై కూర్చోవాలనే ప్రధాన లక్ష్యంగా మనస్సులో గట్టి నిర్ణయమే పెట్టుకున్నారట..కళా...! పైగా జెడ్పీలో జరిగే సమావేశాలకు మంత్రులు మాత్రమే ప్రధాన డయాస్‌లో కూర్చొనగా, ఎమ్మెల్యేలంతా క్రింద వరుసలోనే కేటాయించిన సీట్లలోనే కూర్చోవాల్సి ఉంది. ఇదే క్రమంలో తన వైరివర్గ నేత అచ్చెన్నాయుడు మంత్రిగా డయాస్ పైన కూర్చుంటే...సీనియర్‌గా ఉన్న తాను కింద వరుసలో కూర్చుని అతడి ఆదేశాలు పాటించడమా...అనేది కళా అవమానంగా భావించారని సన్నిహితుల ద్వారా తెలిసిన సమాచారం. దీంతో ఎలాగైనా తాను కూర్చుంటే డయాస్ పైనే కూర్చుంటానని, అంతవరకు జెడ్పీలో అడుగుపెట్టనని ఆయన పంతం పట్టారని అతని సన్నిహితులు చెబుతారు. మూడేళ్ల తర్వాత .. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత.. టీడీపీ అధికారం దక్కించుకున్న తర్వాత జెడ్పీలో ఈ మూడేళ్లలో 36 సమావేశాలు జరిగాయి. అయితే ఎమ్మెల్యేగా జెడ్పీలో గానీ, జెడ్పీ సమావేశాలకు గానీ ఒక్కసారి కూడా అడుగు పెట్టని కళా...సరిగ్గా మూడేళ్ల తర్వాత తాను అనుకున్నట్లుగానే మంత్రిగానే సోమవారం తొలి అడుగు వేశారు. వ్యూహాత్మకంగా సమావేశానికి ఆలస్యంగా వచ్చి, పెద్ద సంఖ్యలో తన అనుయాయులతో జెడ్పీలో అడుగుపెట్టారు. వచ్చీ రాగానే నేరుగా ప్రధాన వేదికపైకి ఎక్కి.. నవ్వుతూ అందరినీ ఆకర్షించారు. తొలిసారి జెడ్పీలో మంత్రిగా అడుగుపెట్టడం, అధికారులు, ప్రజాప్రతినిధుల సన్మానాలతో తన కల నెరవేరిందని చెప్పకనే చెప్పారు. ఇదిలావుంటే సోమవారం జెడ్పీలో జరిగే పంచాయితీరాజ్ దినోత్సవానికి మంత్రి కళా వస్తున్నారని తెలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అప్పటికప్పుడు వేరే ప్రోగ్రాం ఎంగేజ్ చేసుకున్నారని అధికారులు, కొందరు నేతలు చర్చించుకున్నారు. -
కరీంనగర్ జెడ్పీకి పురస్కారం
► 24న లక్నోలో ప్రదానం ► అవార్డు అందుకోనున్న చైర్పర్సన్ తుల ఉమ ► కస్బెకట్కూర్, గోపాల్రావుపల్లి పంచాయతీలకూ అవార్డులు కరీంనగర్: పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్‌కు కరీంనగర్ జిల్లా పరిషత్ ఎంపికైంది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురష్కరించుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని రాంమనోహర్ లోహియా విశ్వవిద్యాలయంలో సోమవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ అందుకోనున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద చేతుల మీదుగా పురస్కారంతోపాటు నగదు రివార్డు రూ.50 లక్షలు అందుకోనున్నారు. జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందించే పురస్కారాలకు కరీంనగర్ జెడ్పీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్బెకట్కూర్, తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లి గ్రామ పంచాయతీలు అవార్డుకు ఎంపికయ్యాయి. కస్బెకట్కూర్ గ్రామ సర్పంచ్ పొన్నం మంజుల, తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లి సర్పంచ్ ఏసురెడ్డి రాంరెడ్డి ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు, అవార్డు అందుకోనున్నారు. గర్వకారణం : తుల ఉమ, జెడ్పీ చైర్పర్సన్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జాతీయస్థాయిలో కరీంనగర్ జిల్లా పరిషత్ ఎంపిక కావడం గర్వకారణంగా ఉంది. రికార్డుల నిర్వహణ, జిల్లా పరిషత్ పనితీరును కేంద్రం గుర్తించి ఎంపిక చేయడం శ్రమతగ్గ ప్రతిఫలం లభించినట్లైంది. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు అందించిన సహకారం వల్లే అవార్డును అందుకోగలుతున్నాను. అవార్డు స్వీకరించడం ద్వారా కరీంనగర్ జిల్లా పరిషత్ కీర్తి ప్రతిష్టలు పెరగడం ఆనందంగా ఉంది. -
కరీంనగర్ జెడ్పీకి పురస్కారం
– 24న లక్నోలో ప్రదానం – అవార్డు అందుకోనున్న చైర్పర్సన్ తుల ఉమ – కస్బెకట్కూర్, గోపాల్రావుపల్లి పంచాయతీలకూ అవార్డులు కరీంనగర్: పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్‌కు కరీంనగర్ జిల్లా పరిషత్ ఎంపికైంది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురష్కరించుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని రాంమనోహర్ లోహియా విశ్వవిద్యాలయంలో సోమవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ అందుకోనున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద చేతుల మీదుగా పురస్కారంతోపాటు నగదు రివార్డు రూ.50 లక్షలు అందుకోనున్నారు. జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందించే పురస్కారాలకు కరీంనగర్ జెడ్పీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్బెకట్కూర్, తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లి గ్రామ పంచాయతీలు అవార్డుకు ఎంపికయ్యాయి. కస్బెకట్కూర్ గ్రామ సర్పంచ్ పొన్నం మంజుల, తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లి సర్పంచ్ ఏసురెడ్డి రాంరెడ్డి ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు, అవార్డు అందుకోనున్నారు. గర్వకారణం : తుల ఉమ, జెడ్పీ చైర్పర్సన్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జాతీయస్థాయిలో కరీంనగర్ జిల్లా పరిషత్ ఎంపిక కావడం గర్వకారణంగా ఉంది. రికార్డుల నిర్వహణ, జిల్లా పరిషత్ పనితీరును కేంద్రం గుర్తించి ఎంపిక చేయడం శ్రమతగ్గ ప్రతిఫలం లభించినట్లైంది. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు అందించిన సహకారం వల్లే అవార్డును అందుకోగలుతున్నాను. అవార్డు స్వీకరించడం ద్వారా కరీంనగర్ జిల్లా పరిషత్ కీర్తి ప్రతిష్టలు పెరగడం ఆనందంగా ఉంది. -
ఫలించిన మంత్రాంగం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్‌లో నడుస్తున్న నాటకీయ పరిణామాలకు మంత్రి మహేందర్‌రెడ్డి దిగొ చ్చారు. జెడ్పీటీసీల డిమాండ్లను పరిశీలిస్తానని.. సీఎం వద్దకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అలకపాన్పు ఎక్కిన సభ్యులను బుజ్జ గించి.. ఇకపై మూడు నెలలకోసారి భేటీ అవుదామని నచ్చజెప్పి కథను సుఖాంతం చేసే ప్రయత్నం చేశారు. స్థానికసంస్థలకు రావాల్సి న సీనరేజీ, నిధులను ప్రభుత్వం దారి మళ్లించినా, నిధుల్లేక ప్రజలు నిలదీస్తున్నా పట్టించుకోవడం లేదని కినుక వహించిన అధికార పార్టీ జెడ్పీటీసీలతో ఆయన సోమవారం జెడ్పీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో కొందరు సభ్యులు రాజీనామాలు చేస్తామని హెచ్చరించినట్లు పత్రికల్లో కథనాలు రావడంపై వాడివేడి చర్చ జరిగింది. కేవలం సమస్యలపైనే చర్చించామని, ఎవరిని తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయలేదనే అంశంపై సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ‘మా తీరు పూచిక పుల్లలా తయారైంది. నిధుల్లేవు. కనీసం మీతో బాధలు చెప్పుకుందామంటే సమయం ఇవ్వరు. మా ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదు. మేం జనాల్లోకి ఎలా వెళ్లాలి’ అని కొందరు సభ్యులు మంత్రికి ఏకరువు పెట్టారు. దీంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రికి అనుకూలంగా కొందరు.. వ్యతిరేకంగా మరికొందరు సభ్యులు చీలిపోయారు. జిల్లా పరిషత్ వ్యవహారాలతో మంత్రికేం సంబంధం అంటూ తాండూరు జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్ ప్రశ్నించడం.. ఆయనకు వ్యతిరేకంగా రాజేంద్రనగర్, చేవెళ్ల, కీసర జెడ్పీటీసీ సబ్యులు గళం విప్పడంతో సమావేశం కాస్తా హాట్‌హాట్‌గా మారింది. తీవ్రస్వరంతో ఒకరిపై ఒకరు అరుచుకోవడం.. సమావేశం నుంచి వాకౌట్ చేద్దామనే ఆలోచన కూడా చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న మంత్రి మహేందర్‌రెడ్డి మీటింగ్ పక్కదారి పడుతున్నట్లు గమనించి ఇరువర్గాలను శాంతింపజేశారు. కుటుంబంలాంటి పార్టీలో అభిప్రాయ బేధాలుండడం సహాజమేనని, కూర్చొని మాట్లాడుకుందాం అంటూ సముదాయించారు. కొందరు సభ్యుల వ్యవహారశైలిని మాత్రం మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. చీటికిమాటికి రాజీనామాలు చేస్తామని హెచ్చరించడం బాగాలేదని, సమస్యలుంటే చెప్పుకోవాలి గానీ, ఇలా బెదిరింపులకు పాల్పడడం మంచిదికాదని హితవు పలికారు. ఎమ్మెల్యేలతో మాట్లాడుతా.. ‘‘కొన్నిచోట్ల ఎమ్మెల్యేలతో జెడ్పీటీసీ సభ్యులకు పొసగడంలేదు. ఎమ్మెల్యేలతో కలిసి సాగేలా సమన్వయం పెంపొందిస్తా. తాజా పరిణామాలను వారి దృష్టికి తీసుకెళతా. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి మీతో భేటీ అవుతానని, ఎమ్మెల్యేల కోటాలో 25శాతం నిధులను మీ ద్వారా ఖర్చు చేసేలా చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి మహేందర్ భరోసా ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తమకెలాంటి అసంతృప్తిలేదని, నిధుల గురించి చర్చించడానికి కలిస్తే.. రాజీనామా చేస్తామని పత్రికల్లో వార్తలు రావడం దురదృష్టకరమని అన్నారు. ఈ సమవేశంలో జెడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నిజామాబాద్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లాపరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం నగరంలోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమం స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ లత అధ్యక్షతన కార్యక్రమం సాగింది. షాదీముబారక్ పథకంలో చేసిన సవరణలపై మండల స్థాయి అధికారులకు అవగాహన కల్పించాలని జెడ్పీ చైర్మన్ సూచించారు. ఇప్పటికీ పెళ్లికూతురుపై దరఖాస్తులను అందజేస్తున్నారని, తల్లి పేరుతో నేరుగా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాల న్నారు. కిందిస్థాయి సిబ్బంది పరిశీలించిన తర్వాతే దరఖాస్తుల జాబితాను ఎమ్మెల్యేను పంపించాలన్నారు. జిల్లాకు ఆరు మైనారిటీ గురుకులాలు మంజూరయ్యాయని మైనారిటీ కార్పొరేషన్ అధికారులు తెలిపా రు. జిల్లాలో కళ్యాణలక్ష్మి పథకానికి 1,064 దరఖాస్తు లు వచ్చాయని, అందులో 880 మందికి కళ్యాణ లక్ష్మి నిధులు అందించామని అధికారులు పేర్కొన్నారు. 26 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించామని, 159 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే ఎస్సీ విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధి ద్వారా ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు అందించనున్నట్లు తెలిపా రు. సమావేశంలో జెడ్పీ సీఈవో మోహన్‌లాల్, జెడ్పీటీసీ సభ్యులు కిషన్, లక్ష్మి, సాయిరాం పాల్గొన్నారు. ఎజెండా కాపీ లేకపోవడంపై ఆగ్రహం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ సమావేశానికి వచ్చినా.. తన ఎజెండా కాపీ అందజేయకపోవడంపై జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎజెండా కాపీ ఇవ్వకుండా సమావేశానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. నివేదికను అందించడానికే ఇంత ఇబ్బంది పడితే క్షేత్రస్థాయిలో విధులు ఎలా నిర్వర్తిస్తున్నారో అర్థమౌతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకే సమాచారం ఇవ్వకుంటే మామూలు ప్రజానీకానికి ఏం ఇస్తారన్నారు. తర్వాత జరిగే సమావేశానికి ముందుగానే ఎజెండా కాపీని అందించాలని, లేకుంటే సమావేశానికి రావద్దని సూచించారు. -
జెడ్పీ ఒక్కటే! జిల్లాలు మూడు
♦ పాలకవర్గం సమయం ముగిశాకే కొత్తవి ఏర్పాటు ♦ సర్కార్ యోచన యంత్రాంగం కసరత్తు సాక్షి, సంగారెడ్డి: దసరా నుంచి మూడు జిల్లాలు అమల్లోకి రానున్నప్పటికీ జిల్లా పరిషత్ మాత్రం ఒక్కటే ఉంటున్నట్టు తెలుస్తోంది. జెడ్పీ పాలకవర్గం సమయం ముగిశాకే కొత్త జిల్లాల్లో జెడ్పీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లా పరిషత్ ఏర్పాటులో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రస్తుత పాలకవర్గం సమయం ముగిశాకే కొత్త జెడ్పీలు ఏర్పాటు చేయనున్నట్లు వినికిడి. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా మెదక్, సిద్దిపేట జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దసరా నుంచి కొత్త జిల్లాలో పరిపాలన సాగేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ ఆధ్వర్యంలోని పాలకవర్గం జూలై 5, 1014లో పగ్గాలు చేపట్టింది. జిల్లా పరిషత్ పాలకవర్గం సమయం ఇంకా మూడేళ్లు ఉంది. దీంతో పాలకవర్గం సమయం పూర్తిగా ముగిశాకే కొత్త జిల్లాలో జెడ్పీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి గతంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పునర్వవస్థీకరణను అధికారులు, ప్రజాప్రతినిధులు ఉటంకిస్తున్నారు. గతంలో పంచాయతీ సమితి(బ్లాక్ సమితి)లు ఉండేవి. 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బ్లాక్ సమితిల స్థానే మండల వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టూరు. అయితే రెవెన్యూ మండలాలను తక్షణం అమల్లోకి తెచ్చిన ఎన్టీఆర్ ప్రభుత్వం బ్లాక్ సమితిలను మాత్రం 1987 ప్రాంతంలో రద్దు చేసి వాటి స్థానంలో మండల ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కొత్త జిల్లా పరిషత్ ఏర్పాటుకు ప్రభుత్వానికి అధికారాలు ఉన్నప్పటికీ కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటుకు వల్ల ప్రస్తుతం ఉన్న పాలకవర్గం రద్దు చేసి మూడు జిల్లాల్లో మళ్లీ వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలు ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది. దీని వల్ల సమస్యలు తలెత్తవచ్చని గుర్తించిన ప్రభుత్వం జెడ్పీ విభజన వాయిదా వేసినట్లు సమాచారం. అలాగే పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి వచ్చే పంచాయతీ, ఇంజనీరింగ్, మార్కెటింగ్ , సహకారశాఖల విభజన జరగకపోవచ్చని తెలుస్తోంది. సంక్షేమశాఖలన్నింటినీ జెడ్పీ పరిధిలోకి తీసుకువచ్చి కొత్త జిల్లాలో సంక్షేమ కార్యక్రమాల అమలు జెడ్పీ సీఈఓకు అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. కసరత్తు పూర్తి చేసిన అధికారులు విభజనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం జెడ్పీ విభజనకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసింది. నూతనంగా ఏర్పాటు కానున్న సిద్దిపేట, మెదక్‌లో కొత్తగా జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు సంబంధించి కార్యాలయాలను గుర్తించారు. సిద్దిపేటలో హౌసింగ్ శాఖకు సంబంధించిన నూతన భవనంలో జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే మెదక్‌లోని మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని స్త్రీ శక్తి భవనాన్ని గుర్తించారు. అలాగే సిబ్బంది విభజన ప్రక్రియను పూర్తి చేశారు. అధికారుల సమాచారం మేరకు కొత్తగా ఏర్పాటయ్యే మెదక్, సిద్దిపేట జిల్లాలో జెడ్పీ కార్యాలయాలు ఏర్పాటు చేసినపక్షంలో కొత్తగా 60 మంది అధికారులు, సిబ్బంది అవసరం అవుతారు. రాబోయే రోజుల్లో పదోన్నతుల ద్వారా, కొత్త పోస్టుల మంజూరు ద్వారా సిబ్బంది నియామకాలు చేపట్టే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి అధికారుల కసరత్తును అనుసరించి సంగారెడ్డిలో ఉన్న జెడ్పీ సీఈఓ ఇక్కడే కొనసాగుతారు. డిప్యూటీ సీఈఓకు మెదక్ సీఈఓ బాధ్యతలు అప్పగించనున్నారు. సిద్దిపేటలో కొత్త సీఈఓ పోస్టు మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జెడ్పీలో ఐదుగురు సూపరింటిండెంట్లు పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు సూపరింటెండెంట్లను సంగారెడ్డికి, ఇద్దరిని మెదక్, ఒకరిని సిద్దిపేటకు సర్దుబాటు చేస్తారు. సిద్దిపేటలో అదనంగా ఒక సూపరింటెండెంట్‌ను నియమిస్తారు, సీనియర్ అసిస్టెంట్లను ఇదే పద్దతితో సర్దుబాటు చేస్తారు. -
సిబ్బంది లేక.. పథకాలు పడక
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టపరుస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు చేస్తున్నా.. ఆ శాఖలో వివిధ స్థాయిల్లో ఉద్యోగుల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులన్నీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు దీని పరిధిలోనే పనిచేస్తాయి. అయితే.. గత కొన్నేళ్లుగా పంచాయతీరాజ్ విభాగాన్ని సిబ్బంది కొరత వెంటాడుతోంది. దీంతో ప్రభుత్వ పథకాల అమలు, పర్యవేక్షణ పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి, పల్లెప్రగతి, ఈ-పంచాయతి వంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. క్షేత్రస్థాయిలో తగిన సంఖ్యలో సిబ్బంది లేకుండా పథకాలు రూపకల్పన చేస్తే ఫలితం ఉండదని గ్రామ పంచాయతీ సర్పంచులు పేర్కొంటున్నారు. ఒక్కో గ్రామానికి ఒక్కో పంచాయతీ కార్యదర్శి ఉండాల్సి ఉండగా... ఐదు నుంచే ఏడు గ్రామాల బాధ్యతలు ఒక్కరికే అప్పగిస్తున్నారని, ఇలా అయితే పథకాల అమలు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సీఈవో పోస్టుల వరకు పంచాయతీరాజ్ శాఖలో వివిధ స్థాయిల్లో 2,917 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తాజాగా తేల్చారు. ఈ శాఖలో అన్ని పోస్టుల కలిపి మొత్తం 7,253 పోస్టులుండగా, ప్రస్తుతం 4,336 మంది సిబ్బందే ఉన్నారు. ఆ ఆపరేటర్లకు ఏప్రిల్ నుంచి జీతాలు ఇవ్వొద్దు పంచాయతీరాజ్‌లో కాంట్రాక్ట్ ఏజెన్సీ కింద పనిచేస్తున్న 1,313 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లకు త్వరలోనే మంగళం పాడాలని పంచాయతీరాజ్ విభాగం నిర్ణయించింది. గ్రామ పంచాయతీల్లో వివరాల నమోదు కోసం గతేడాది ఓ ప్రైవేటు కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం వీరిని నియమించుకుంది. ఈ ఏడాది మార్చి ఆఖరుకు సదరు ప్రైవేటు ఏజెన్సీ కాంట్రాక్ట్ కాలపరిమితి ముగియనున్నందున ఏప్రిల్ 1 తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనాలు చెల్లించవద్దని ఉన్నతాధికారుల నుంచి పంచాయతీలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘పల్లె సమగ్ర సేవా కేంద్రాల’ కోసం విలేజ్ లెవల్ ఎంటర్ప్రైన్యూర్లను నియమిస్తున్నందున, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అవసరం ఇకపై ఉండబోదని ఆ విభాగం అధికారి ఒకరు తెలిపారు. -
బదిలీలకు తెర
- 25 మంది ఎంపీడీఓలకు స్థానచలనం - పదోన్నతులు పొందిన 10 మందికి పోస్టింగ్‌లు - అయిష్టంగానే జెడ్పీ చైర్పర్సన్ ఆమోదం - ఎంపీడీఓల అసంతృప్తి.. మంత్రి హరీశ్‌ను కలిసే యత్నం సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్‌లో ఎంపీడీఓల బదిలీల వ్యవహారానికి తెరపడింది. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న 25 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే పదోన్నతులపై జిల్లాకు వచ్చిన పది మంది ఎంపీడీఓలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. బదిలీల ఫైల్‌పై జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ అయిష్టంగానే సంతకం చేసినట్లు తెలుస్తోంది. బదిలీల విషయమై జెడ్పీ చైర్పర్సన్, సీఈఓ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మొత్తానికి ఒత్తిడి రావటంతో బదిలీల జాబితాపై ఆమె సంతకం చేసినట్టు తెలుస్తోంది. శివ్వంపేట, జిన్నారం, రామచంద్రాపురం, కొండాపూర్, జిన్నారం మండలాల్లో బదిలీలపై ఆమె కొన్ని సూచనలు చేయగా.. ఆ మార్పులు చేయకుండానే అధికారులు బదిలీ జాబితాను ఆమోదం కోసం బుధవారం సాయంత్రం పంపినట్లు సమాచారం. ఆపై బదిలీ ఉత్తర్వులు వెలువరించారు. మరోపక్క బదిలీలపై ఎంపీడీఓలు సైతం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గురువారం ఉదయం పలువురు ఎంపీడీఓలు నవాబ్‌పేటకు వచ్చిన మంత్రి హరీష్‌రావుకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో శుక్రవారం కలిసేందుకు సిద్ధమవుతున్నారు. 25 మంది బదిలీ.. పదిమందికి పోస్టింగ్‌లు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న 25 మంది ఎంపీడీఓలను బదిలీ చేశారు. పదోన్నతి పొందిన 10 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఫిర్దోస్ అలి-మనూరు, జితేందర్‌రావు-పాపన్నపేట, బి.శ్రీరాములు-కౌడిపల్లి, ఆర్.మల్లేశం-టేక్మాల్, ఎం.ఎ.ముజీబ్-కల్హేర్, పి.బాల-చిన్నశంకరంపేట, రహ్మతుల్లాఖాన్-దుబ్బాక, ఎం.డి.జాఫర్-చిన్నకోడూరు ఎంపీడీఓగా పోస్టింగ్‌లు పొందారు. పదోన్నతి పొందిన జయలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె డీఆర్డీఏ ఏపీఓగా ఉన్నారు. బదిలీలు, పోస్టింగ్‌లు ముగిసినా.. ఇంకా రామాయంపేట, చేగుంట, నంగునూరు, తొగుట, అందోలు, చిన్నకోడూరు, రామచంద్రాపురం మండలాల్లో ఎంపీడీఓ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పారదర్శకంగా బదిలీలు చేపట్టామని సీఈఓ మధు తెలిపారు. -
అభివృద్ధి ఎలా
జిల్లా పరిషత్‌కు ప్రభుత్వ గ్రాంట్లు తగ్గిపోతున్నాయి. అభివృద్ధిపై ఆప్రభావం పడుతోంది. ప్రభుత్వం నుంచి తలసరి ఆదాయం గ్రాంటు తప్ప మరొకటి రావడం లేదు. స్థానికంగా వచ్చే సీనరేజి, సర్‌చార్జి ఆదాయంపైనే జెడ్పీ ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోదు. ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉండడం లేదు. దీంతో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులపైనే ఆశలు పెట్టుకోవాల్సి వస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: గతంలో కేంద్రప్రభుత్వం నుంచి బీఆర్జీఎఫ్ గ్రాంట్లు వచ్చేవి. ఏటా రూ.26 కోట్లు నిధులు విడుదలయ్యేవి. వాటి ద్వారా జిల్లాలో కొత్త నిర్మాణాలతో పాటు అసంపూర్తిగా ఉండిపోయిన నిర్మాణ పనుల్ని చేసేందుకు అవకాశం ఉండేది.ఇప్పుడా గ్రాంటు నిలిచిపోయింది. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడంతో దాని పరిధిలో గల బీఆర్జీఎఫ్ కూడా ఆగిపోయింది. దీంతో ఏటా రూ.26కోట్ల మేర జెడ్పీ కోల్పోవలసి వస్తోంది. ఆగిపోయిన 14వ ఆర్థిక సంఘం నిధులు జిల్లా పరిషత్‌కు ఆర్థిక సంఘం నిధులు కూడా భారీగా వచ్చేవి. 13వ ఆర్థిక సంఘం అమలైనంతవరకు నిధులొచ్చాయి. కానీ 14వ ఆర్థిక సంఘం వచ్చేసరికి నిధుల విడుదలకు కేంద్రం బ్రేకులేసింది. ఏటా రూ.25నుంచి 30కోట్లు వరకు విడుదలయ్యేవి. వీటితో సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణతో పాటు సీసీ రోడ్లు, అగ్రి, ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారు. అయితే, ఈసారి పంచాయతీలకు సుమారు రూ.25కోట్లు విడుదల చేసి కేంద్రం, జెడ్పీకి ఇప్పటికి ఒక్క పైసా విడుదల చేయలేదు. విడుదల చేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇంతవరకు జెడ్పీకి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణపై జెడ్పీ సందిగ్ధంలో పడింది. ఇక, మౌలిక సదుపాయాల కల్పన, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాల పరిస్థితి అగమ్యగోచరమే.మానవ వనరుల్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాజీవ్ గాంధీ స్వశక్తి కిరణ్ అభియాన్ పథకం కింద జెడ్పీకి సరాసరి రూ.2కోట్లు విడుదలయ్యేవి. అలాగే, మండల పరిషత్‌లకు రూ.10 లక్షల చొప్పున విడుదలయ్యేది. ఇప్పుడా పథకానికి కూడా కేంద్రం మంగళం పాడేసింది. ముఖ్యంగా శిక్షణా కార్యక్రమాలకు దోహదపడే కేంద్రాల నిర్మాణాలకు బ్రేక్ పడింది. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులూ అనుమానమే స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్ఎఫ్సీ) కింద ప్రతి ఏడాది రూ.2కోట్ల వరకు నిధులొచ్చేవి. వీటిని కొత్తగా నిర్మాణాలు చేపట్టేందుకు, పాత నిర్మాణాల నిర్వహణను వినియోగించే వారు. గత ఏడాదిగా ఎస్ఎఫ్సీ గ్రాంటు రాలేదు. దానిపై ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. దాదాపు ఆగిపోయినట్టేనని తెలుస్తోంది. దీంతో జెడ్పీకి పాత నిర్మాణాల నిర్వహణ సమస్యగా మారనుంది. జనరల్ నిధులే ఆధారం నాలుగు రకాల గ్రాంట్లు నిలిచిపోవడంతో జెడ్పీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. ప్రభుత్వం నుంచి ప్రస్తుతం తలసరి ఆదాయం గ్రాంటు మాత్రమే వస్తోంది. ఒక వ్యక్తికి రూ.4 చొప్పున సుమారు రూ.93 లక్షలు వస్తోంది. సర్‌చార్జీ ద్వారా సుమారు రూ.50 లక్షల నుంచి 70 లక్షల వరకు, సీనరేజీ ద్వారా దాదాపు రూ.కోటి వరకు వస్తోంది. ఇవన్నీ జనరల్ ఫండ్స్ కిందకొస్తాయి. ఈ ఆదాయం రూ.3 కోట్ల లోపే ఉంటుంది. ఈ మొత్తంతో జిల్లా వ్యాప్తంగా ఎంత మేర అభివృద్ధి చేయవచ్చన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీంతో అభివృద్ధికి కల్ప తరువుగా ఉపాధి హామీ పథకమే కన్పిస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ పథకమైనప్పటికీ జెడ్పీ తీర్మానం ద్వారా ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనుల్ని ప్రతిపాదిస్తుండటంతో అదే జెడ్పీ గొప్పతనంగా చెప్పుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడా పనుల కోసమే అధికార పార్టీ నేతలు ఆరాటపడుతున్నారు. విపక్షాల పంచాయతీలకు కేటాయింపులు చేయకుండా ఏకపక్షంగా మంజూరు చేయించుకుంటున్నారు. -
‘బాటల’ మాటున బూటకం
అమలాపురం : ‘సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది’అన్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు తన ఖాతాలో వేసుకునేందుకు కొత్త పథకానికి తెర తీసింది. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా విడుదల కాదు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు నిలిపివేసి ఆ సొమ్ములకు త్వరలో వచ్చే 14వ ఆర్థిక సంఘం నిధులను, గ్రామ, మండల, జిల్లా పరిషత్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కలిపి ఈ రోడ్లకు వినియోగించాలనుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామాల్లో విరివిగా సీసీ రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేజర్,మీడియం పంచాయతీల్లో కనీసం కిలో మీటరు నిడివితో సీసీ రోడ్ల నిర్మాణం చేయనున్నారు. పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం వరకు బాగానే ఉన్నా.. సీసీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా విడుదల కాకపోవడం గమనార్హం. 13వ ఆర్థిక సంఘం నిధులతో ఇప్పుడు జరుగుతున్న పనులను అర్ధాంతరంగా నిలిపివేయాలని, త్వరలో విడుదల కానున్న 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎన్ఆర్ఈజీఎస్, జెడ్పీ, మండల పరిషత్ నిధులతో సీసీ రోడ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. ఒక్క పైసా కూడా విడుదల చేయకుండా స్థానిక సంస్థలకు కేంద్రం వచ్చిన నిధుల మీద రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఏమిటని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టకుండా వివిధ కారణాల వల్ల ఆలస్యమైన పనులు నిలిపివేయాలని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లు సర్క్యులర్ ఇవ్వాలని ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. దాంతో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్ని పంచాయతీలకు సర్క్యులర్ జారీ చేయగా సర్పంచ్‌లు మండిపడుతున్నారు. యూక్షన్ ప్లాన్ మాటున తమ వారికే పనులు.. గ్రామ పంచాయతీల్లో చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణ పనులను గుర్తించి యాక్షన్ ప్లాన్ తయారు చేసి పంపించాల్సిందిగా సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఎంపీడీవోలు ఈ మేరకు పనులు గుర్తించి పంచాయతీరాజ్ శాఖకు పంపుతున్నారు. ఇప్పటికే చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు మండలాల వారీగా సర్పంచ్‌లకు, కార్యదర్శులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎంపిక చేసిన పనులు, నిధులపై ఆరా తీయడంతోపాటు, తమకు కావాల్సిన వారికి, నచ్చిన ప్రాంతాల్లో పనులు కట్టబెట్టేలా సిఫార్సులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు చాలా పంచాయతీల్లో ఇంకా ఖర్చు కాలేదు. గ్రామంలో జనాభాను బట్టి మనిషికి రూ.279 చొప్పున 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కానున్నాయి. పంచాయతీని బట్టి రూ.2.50 లక్షల నుంచి రూ.65 లక్షల వరకు రానున్నాయి. ఇలా ప్రతి నియోజకవర్గంలో రూ.13 కోట్లకు పైగా నిధులు రానున్నాయి. వీటికి ఉపాధి హామీ పథకం, జెడ్పీ, మండల పరిషత్ నిధులు, పంచాయతీ నిధులు కలిపితే నియోజకవర్గంలో కనీసం రూ.15 కోట్లకు పైగా నిధులతో రోడ్ల పనులు చేపట్టే అవకాశముంది. ఇదే అధికార పార్టీ ఎమ్మెల్యేలను బాగా ఆకర్షిస్తోంది. ఎమ్మెల్యేలు లేని చోట టీడీపీ ఇన్చార్జిలు చెప్పిన చోట, వారు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే రోడ్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల నిర్వీర్యానికే.. ఇలా చేయడం ద్వారా ఎమ్మెల్యేలకు పలు రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఏసీడీపీ నిధులు విడుదల చేయడం మానేసింది. ఎన్నికై ఏడాది దాటినా తాము ఫలానా మేలు చేశామని చెప్పుకునేందుకు ఏమీ కనిపించడం లేదు. ప్రస్తుతం వివిధ నిధులతో చేపట్టే సీసీ రోడ్ల పనులు తామే చేయించామని చెప్పుకునేందుకు వీలు చిక్కుతోంది. పనుల కేటాయింపులకు సిఫార్సు లేఖలు ఇవ్వడం ద్వారా పర్సంటేజీలు రాబట్టుకోవచ్చు. ప్రతిపక్షానికి చెందిన సర్పంచ్‌లున్న చోట వారి ప్రణాళికతో సంబంధం లేకుండా తమ పార్టీ నాయకుల సిఫార్సుల మేరకు రోడ్లు ఎక్కడో నిర్ణరుుంవచ్చు. ప్రభుత్వం ఈ ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందని, తద్వారా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని సర్పంచ్‌లు మండిపడుతున్నారు. దీనిపై అధికార పార్టీ సర్పంచ్‌లు కూడా ఆగ్రహంతో ఉండడం కొసమెరుపు. అభివృద్ధి కుంటుపడుతుంది.. ఆర్థిక సంఘం నిధుల్ని ప్రభుత్వం సీసీ రోడ్లకు మళ్లిస్తే పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతుంది. ఇప్పటికే పంచాయతీలు నిర్వీర్యం అయిపోయాయి. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులతోనే తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ బిల్లులు కట్టుకుంటున్నాం. ఇప్పుడు వాటినీ లాక్కుంటే అవన్నీ కష్టమవుతారుు. - నక్కా సంపత్‌కుమార్, సర్పంచ్, ఈదరపల్లి, అమలాపురం రూరల్ రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు.. ఆర్థిక సంఘం నిధులపై పెత్తనం చలాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులేదు. ఈ నిధులు పంచాయతీల్లో పాలవర్గాల తీర్మానాల మేరకే ఖర్చు చేయాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సర్పంచ్‌లందరూ కలిసి తీర్మాణాలు చేయనున్నాం. - బొంతు విజయకుమారి, సర్పంచ్, ఇందుపల్లి, అమలాపురం రూరల్ -
టెండర్ల కోలాహలం
మద్యం దుకాణాలకోసం టెండర్ వేసేందుకు జనం పోటెత్తారు. శనివారం చివరిరోజు కావడంతో జిల్లావ్యాప్తంగా ఎంతోమంది దరఖాస్తుదారులు రావడంతో జిల్లాపరిషత్ సమావేశమందిరం కిటకిటలాడింది. రాత్రి వరకూ దరఖాస్తులు స్వీకరించడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిసింది. జిల్లా పరిషత్ కొత్త సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ టెండర్ల స్వీకరణకు జిల్లావ్యాప్తంగా దరఖాస్తు సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇందులో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో హాజరుకావడం విశేషం. ఈ సారి టెండర్లు రెండేళ్ల కాలపరిమితికి మంజూరు చేయనుండటంతో గిరాకీ ఎక్కువైంది. గతంలో టెండరు వేసేందుకు దరఖాస్తు రూ. 25వేలు ఉండగా ఈ ఏడాది రూ. 40వేలకు పెంచారు. అయినా పోటీ తగ్గలేదు. కిక్కిరిసిన జడ్పీ సమావేశమందిరం టెండర్ల దాఖలుకు శనివారం చివరిరోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు రావడంతో జడ్పీ సమావేశ మందిరం కిక్కిరిసిపోయింది. అందులోనూ పచ్చచొక్కల హడావుడి అధికంగా కనిపించింది. కొందరికిదరఖాస్తు నింపే విధానం తెలియక ఇబ్బందులు పడ్డారు. ఎక్సైజ్ డీసీ పి.నాగలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన టెండర్ల స్వీకరణలో పలాస, శ్రీకాకుళం సూపరింటెండెంట్లు ఎస్.సుఖేష్, ఏసుదాసు, సీఐలు పి. శ్రీనివాసరావు, పాపారావు తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకూ లెక్కింపు జిల్లాలో రెండు ఎక్సైజ్ సూపరెంటె ండెంట్ కార్యాలయాల పరిధిలో 14 సర్కిళ్లు ఉన్నాయి. సర్కిల్‌కి ఒక బాక్సు వంతున దరఖాస్తులు వేసేందుకు ఏర్పాటు చేశారు. జిల్లాలో 232 మద్యం షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా అందులో ప్రభుత్వం నేరుగా 23 షాపులు నిర్వహించాలని నిర్ణయించగా, మగిలిన 209 షాపులకు దరఖాస్తులను కోరారు. ఒక్కో దరఖాస్తు ఖరీదు రూ. 40వేలుగా నిర్ణయించారు. మూడు రోజుల్లో 209 షాపులకు సుమారు 2500 దరఖాస్తులు వచ్చాయి. రాత్రి 9గంటలకు లెక్కించినవి 2100కాగా ఇంకా అర్ధరాత్రి వరకు లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే దరఖాస్తుల ద్వారాసుమారు రూ. 8.4 కోట్లు ఆదాయం వచ్చింది. ఇంకా లెక్కించాల్సిన దరఖాస్తులు మరో 500 వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. అవన్నీ లెక్కిస్తే మరింత ఆదాయం సమకూరవచ్చు. ఈ నెల 30న లాటరీ విధానంలో షాపులు ఖరారు చేయనున్నారు. -
అనుకున్నదొక్కటి అయిందొక్కటి !
ప్రతిపక్షాలను దెబ్బతీద్దామనుకుంటే పార్టీలోనే అసంతృప్తి జెడ్పీ చైర్మన్లను డమ్మీ చేసిన సర్కార్ ! బదిలీల్లో పక్కన పెట్టేసిన పరిస్థితి కలెక్టర్, ఇన్చార్జి మంత్రి, సీఈఓకు జెడ్పీ ఉద్యోగుల బదిలీల బాధ్యతలు వైఎస్సార్సీపీ ప్రాతినిధ్యం వహించిన జెడ్పీలో పెత్తనం చెలాయించేందుకు కుట్ర ఇరకాటంలో పడ్డ టీడీపీ జెడ్పీ చైర్మన్లు తమను అవమాన పరిచారని ఆవేదన చెందుతున్న ఆ పార్టీ చైర్మన్లు సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లా పరిషత్‌లో బదిలీల అధికారాన్ని కూడా జిల్లా కమిటీ కి సర్కార్ అప్పగించింది. జెడ్పీ చైర్మన్ల్ని దాదాపు డమ్మీ చేసేసింది. కలెక్టర్, ఇన్చార్జి మంత్రి, జెడ్పీ సీఈఓ ఆధ్వర్యంలోనే బదిలీలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీనివెనుక రాజ కీయ దురుద్దేశం ఉందని పరిశీలకులు భావి స్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా పరిషత్‌లో తమకు నచ్చినట్టుగా బదిలీలు చేయించుకోవాలన్న ఏకైక వ్యూ హంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి రగిల్చింది. తమ అధికారాల్ని వేరే వారికి అప్పగించి తమను అవమానపరిచారనే ఆవేదనతో టీడీపీ జెడ్పీ చైర్మన్లు ఉన్నారు. జిల్లా పరిషత్‌లో బదిలీల అధికారమంతా జెడ్పీ చైర్మన్లకే ఉండేది. ఏటా వారి ఆధ్వర్యంలోనే బదిలీలు జరిగేవి. స్థానిక సంస్థలపై ప్రభుత్వం పెత్తనం తగ్గాలని, స్థానిక సంస్థల అధికారాలు పెరగాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు బదిలీల అధికారాన్ని జెడ్పీకే అప్పగించాయి. కానీ రాష్ట్రంలో మూడు జెడ్పీల్లో వైఎస్సార్సీపీ ప్రాతినిధ్యం వహిస్తోందని, తమకు నచ్చినట్టుగా అక్కడ బదిలీలు జరగవన్న అక్కసుతో కలెక్టర్, ఇన్చార్జి మంత్రి, జెడ్పీ సీఈఓలతో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీకి బదిలీల అధికారాన్ని చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. దీంతో జెడ్పీ చైర్మన్లు బదిలీల విషయంలో డమ్మీ అయిపోయారు. వైఎస్సార్సీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో తమ పెత్తనమే సాగుతుందని కొందరు అధికారపార్టీ నేతులు ఆనందించినా... ఆ పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్లు మాత్రం ఆవేదనతో ఉన్నారు. బదిలీల విషయంలో తమ మాట చెల్లుబాటు కాకపోవడమే కాకుండా అధికారాన్ని తీసేసి అవమాన పరిచారని బాధపడుతున్నారు. ఎందుకంటే, పలు జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లు, కలెక్టర్ల మధ్య పొసగడం లేదు, మరికొన్నిచోట్ల చైర్మన్లు, మంత్రుల మధ్య పడటం లేదు. ఈ నేపధ్యంలో కలెక్టర్లు హవాయే నడుస్తోందని కొందరు, ఇన్చార్జి మంత్రికి అప్పగించడం వల్ల జిల్లా మంత్రే పరోక్షంగా కీలక పాత్ర పోషిస్తారని, దీనివల్ల తమను పట్టించుకునే అభద్రతా భావంతో పలువురు చైర్మన్లు ఉన్నారు. జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి -కలెక్టర్ ఎం.ఎం.నాయక్ మధ్య, జెడ్పీ చైర్పర్సన్ - మంత్రి మృణాళిని మధ్య అభిప్రాయ బేధాలున్నాయి. గత ఏడాది జిల్లా అధికారుల బదిలీల్లో తమ సిఫార్సులకు ప్రాధాన్యం ఇవ్వలేదని జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి అసంతృప్తితో ఉన్నారు. నేటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ ఒక్క విజయనగరంలోనే కాదు టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న మరికొన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో చైర్మన్లను పక్కన పెట్టి కలెక్టర్, ఇన్చార్జి మంత్రి, జెడ్పీ సీఈఓకు బదిలీల బాధ్యతను అప్పగించడంతో వారంతా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇదే విషయమై పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడ్ని కలవాలని జెడ్పీ చైర్మన్లు భావించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించారని అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తారన్న భయంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఏదేమైనప్పటికీ తీవ్ర స్థాయిలో అంతర్మధనం చెందుతున్నారు. -
విన్నపాలు... ఆవేదనలు...
పాతగుంటూరు : ఏడాదిగా సమస్యను పరిష్కరించాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. సమస్య పరిష్కరించాలని ప్రజావాణి కార్యక్రమానికి ఎన్నిసార్లు వచ్చినా సంబంధిత అధికారులు మాత్రం చొరవ చూపడంలేదు. తమకు న్యాయం చేయాలంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందని బాధితులు అధికారులకు విన్నవించుకున్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి పలు సమస్యలపై జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి, వారి బాధలను విన్నవించుకున్నారు. స్పందించిన జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే ప్రజావాణిలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలంటూ సంబంధితఅధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్తిపాడు సావిత్రీబాయి కాలనీలో 12 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు పరిశపోగు శ్రీనివాసరావు వినతిపత్రం ఇచ్చారు. గుంటూరు ఆనందపేట 9వ లైనులో ఇళ్ల మధ్యలో సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్థానికులు ఆదంబీ, ఆషాబేగం, సదరంబీ కోరారు. గుంటూరు శివార్లలో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రిపబ్లికన్ పార్టీ నాయకుడు ఆనందకుమార్ వినతిపత్రం సమర్పించారు. కొల్లిపరలో దేవాదాయ శాఖ గ్రామకంఠంలో ఉన్న 21.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు భూమిని ట్రస్టు పేరుతో సభ్యులు, దేవాదాయ అధికారులు కలిసి అమ్ముకుంటున్నారని ఆ గ్రామానికి చెందిన కొల్లి శివరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త వాటర్ ట్యాంక్ డ్రైవర్‌గా పనిచేస్తూ, 2005లో మృతిచెందాడని, తనకు ఉద్యోగం ఇవ్వాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని గుంటూరుకు చెందిన తాటి లక్ష్మీకుమారి ఫిర్యాదుచేశారు. టీడీపీకి ఓట్లు వేయలేదని తమ పింఛన్లు అక్రమంగా తొలగించారని, తమకు పింఛన్లు ఇప్పించాలని దాచేపల్లి మండలం తంగెడకు చెందిన హనుమాయమ్మ, లాలూబీ విన్నవించారు. జిల్లాలో అర్హులైన వికలాంగుల కుటుంబాలకు నివేశన స్థలాలు వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రామయ్య కోరారు. -
జెడ్పీ సమావేశంలో రివాల్వర్ కలకలం
కరీంనగర్: కరీంనరగ్ జిల్లా జిల్లా పరిషత్ సమావేశంలో సోమవారం రివాల్వర్ కలకలం సృష్టించింది. రివాల్వర్‌తో కాంగ్రెస్ సభ్యుడు చల్లానారాయణ రెడ్డి సమావేశానికి హాజరుకాగా టీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దాంతో సమావేశం నుంచి కాంగ్రెస్ సభ్యుడు నారాయణరెడ్డి అలిగి వెళ్లిపోయారు. -
అభివృద్ధే లక్ష్యం
నెల్లూరు(రెవెన్యూ) : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పరిషత్ నూతన భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జెడ్పీ సాధారణ సర్వ సభ్య సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. రాబోవు ఎండకాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయామని ప్రభుత్వానికి నివేధికలు పంపామన్నారు. ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు బోరింగులు మంజూరు చేయాలని అడుగుతున్నారన్నారు. నిధులు విడుదల చేస్తే కొత్త బోర్లు వేసేలాచర్యలు తీసుకుంటామన్నారు. తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. సుమారు 200కుపైగా గ్రామాల్లో నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన లభ్ధిదారులందరకీ ఒకే విధంగా పేమెంట్లు చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వలన సకాలంలో సాగునీరు అందక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. అధికారులు సర్వే నిర్వహించి ఎండిన పంటల వివరాలు సేకరించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం మంజూరు చేయించేలా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే సీజన్ ప్రారంభానికి ముందే సాగునీటి కాలువలకు మరమ్మతులు పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పింఛన్లు కొల్పోయిన లబ్ధిదారుల్లో అర్హులకు పునరుద్ధరించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఎం. జానకి మాట్లాడుతూ తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో వాహనాల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సకాలంలో పేమెంట్లు చెల్లించేలా ఇప్పటి వరకు రూ.5 కోట్లు ఎంపీడీఓల అకౌంట్లలో జమ చేశామన్నారు. పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతక ముందు జిల్లా పరిషత్ నూతన భవన ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. ప్రొటోకాల్‌పై రగడ గ్రామీణ ప్రాంతాల్లోని జెడ్పీ పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలకు జెడ్పీటీసీ సభ్యులను ఆహ్వానించడంలేదని సభ్యులు వాదనకు దిగారు. తమకు గౌరవం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ విషయంపై జెడ్పీలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ప్రొటోకాల్ పాటించని అధికారులు, పాఠశాలల హెచ్‌ఎంలపై చర్యలు తీసుకోవాలని సభ్యులు పట్టుపట్టారు. సభ్యులకు శాసనసభ్యులు మద్దతు తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ ఇకపై ప్రొటోకాల్ ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో సభ్యులు శాంతించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, జెడ్పీ సీఈఓ ఎం.జితేంద్ర, జెడ్పీ వైస్ చైర్పర్సన్ శిరిషా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జెడ్పీ గెస్ట్‌హౌస్ ప్రారంభం నెల్లూరు(రెవెన్యూ): జెడ్పీ గెస్ట్‌హౌస్‌ను సొంత ఇంటిలా చూచుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. ఆధునీకరించిన జెడ్పీ గెస్ట్‌హౌస్‌ను ఆదివారం జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదేళ్ల నుంచి జెడ్పీ గెస్ట్‌హౌస్ మూతపడిందన్నారు. తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత గెస్ట్‌హౌస్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గెస్ట్‌హౌస్‌లో ఉన్న పాత వాహనాలు, వస్తువులను విక్రయించామన్నారు. రూ.30 లక్షలు ఖర్చు చేసి గెస్ట్‌హౌస్‌ను ఆధునీకరించామని తెలిపారు. ఆరు సూట్లు సిద్ధం చేశామన్నారు. దీనికి సంబంధించి రోజుకు రూ.500 అద్దె చెల్లించాల్సి ఉంటుందన్నారు. జెడ్పీటీసీ సభ్యులు పార్టీకలకతీతంగా పని చేసి జిల్లాను అభివృద్ధి పథంలో నిలపాలన్నాపారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ నగరం నడిబొడ్డులో ఇటువంటి గెస్ట్‌హౌస్ ఉండడం ఆనందంగా ఉందన్నారు. నగరానికి వచ్చే సభ్యులు ఉండేందుకు అన్ని వసతులతో గెస్ట్‌హౌస్ అందుబాటులో తీసుకురావడం అభినందనీయమన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు నిధులు లేక పనులు చేయలేకపోతున్నామన్నారు. చైర్మన్ జెడ్పీటీసీ సభ్యులకు నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. జెడ్పీ సీఈఓ ఎం.జితేంద్ర, డీఎంహెచ్ఓ డాక్టర్ భారతీరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు. -
ఇదేనా ‘సంక్షేమం’..!
ఇందూరు: ‘నీళ్లుంటే, బాత్రూంలుండవు.. బాత్రూంలుంటే నీళ్లుండవు. సన్నబియ్యం వండుతున్నరు.. కానీ కూరలు, పప్పులు నాణ్యంగా ఉండవు. పప్పును చూస్తే నీళ్లలో పసుపు కలిపినట్లుగా ఉంటుంది. కొన్ని హాస్టళ్లను చూస్తే పశువులా కొట్టాల్లా ఉన్నారుు.. ఇదేనా... పిల్లలకు ఇచ్చే సంక్షేమం..’ అని సాంఘిక సంక్షేమ స్థాయీసంఘం సంబంధిత శాఖాధికారులపై మండిపడింది. జిల్లా పరిషత్‌లో సాంఘిక సంక్షేమం స్థాయి సంఘం సమావేశం ఆ కమిటీ చైర్మన్ కున్యోత్ లత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సంఘం సభ్యులు సంక్షేమాధికారుల పనితీరును ఎండగట్టారు. చదివించే స్థోమత లేని పేద తల్లిదండ్రులు తమ పిల్లలను నమ్మకంతో వసతిగృహాలకు పంపుతున్నారు. అలాంటి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులనూ ఇస్తోంది. కానీ.. బాధ్యతలను నెరవేర్చాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వార్డెన్లు స్థానికకంగా ఉండాలని నిబంధనలు ఉన్నా.. పాటించడం లేదని ఆరోపించారు. సహాయ సంక్షేమాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే వార్డెన్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. కొన్ని వసతిగృహాల్లో విద్యార్థులకు పెట్టే భోజన మెనూ లేదని, హాస్టళ్లు అధ్వానంగా ఉన్నాయని జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు అసహనం వ్యక్తం చేశారు. తాగునీటి, టాయిలెట్ల సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తాను విజిట్ చేసినప్పుడు నిజాలు బయటపడినట్లు తెలిపారు. తమ మండలంలో ఉన్న ఓ వసతిగృహం పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉందని, పశువుల కొట్టాన్ని తలపిస్తోందని స్థాయిసంఘం చైర్మన్ కున్యోత్ లత ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్‌గల్, కుద్వాన్పూర్ వసతిగృహాల వార్డెన్ల పనితీరు బాగోలేదని, వారికి మెమోలు జారీ చేయాలని స్థాయీ సంఘం సభ్యులు తీర్మానించారు. కల్యాణలక్ష్మి పథకం కార్యక్రమాల్లో జడ్పీటీసీలను పిలువడం లేదని, ఇక ముందు తప్పనిసరిగా పిలువాలని నిర్ణయించారు. సాక్షి కథనంతో ఆరా.. డిసెంబర్లో ఎస్సీ వసతిగృహాల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసిన వాటిలో గోల్మాల్ జరిగిందని, నాణ్యత లేని దుప్పట్లు పంపిణీ చేశారని పక్షం రోజుల కిత్రం సాక్షి జిల్లా టాబ్లాయిడ్లో ‘దుప్పట్ల కొనుగోల్‌మాల్’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై జడ్పీ ఇన్చార్జి సీఈఓ, ఏజేసీ రాజారాం ఆరా తీశారు. స్థాయి సంఘ సమావేశానికి వచ్చిన ఏఎస్‌డబ్ల్యుఓ జగదీశ్వర్ రెడ్డిని ప్రశ్నించారు. దుప్పట్ల కొనుగోలు టెండర్లు పిలువడం మట్టుకే పరిశీలన కమిటీని సద్వినియోగం చేసుకున్నారని, పంపిణీ చేసే సమయంలో కమిటీ ముందు పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతను చూడకుండా ఎలా పంపిణీ చేశారన్నారు. దీని విషయంలో తనకు వివరణ ఇవ్వాలని దేశించారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఇంజినీరింగ్ శాఖ చేపడుతున్న భవనాల నిర్మాణాల నివేదిక పాతది ఇవ్వడంపై సంబంధిత అధికారిపై మండిపడ్డారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా నడుస్తున్న బీసీ స్టడీ సర్కిల్లో అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చే విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్నాం మూడు గంటలకు పనుల స్థాయి సంఘ సమావేశం జరిగింది. భవనాలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. -
జిల్లాపై వివక్ష
కడప ఎడ్యుకేషన్: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం పలు సమస్యలపై వాడివేడిగా సాగింది. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం జిల్లాపై వివక్ష చూపుతోందంటూ పలువురు ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం దాదాపు 7 గంటల వరకు కొనసాగింది. జిల్లాలో తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, హార్టికల్చరల్, డ్వామా,ఎస్సీ ఎస్టీ బీసీ సబ్‌ప్లాన్, పంచాయతీరాజ్ సమస్యలపై చర్చ జరిగింది. సమావేశానికి జెడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షత వహించారు. రైతులకు సంబంధించిన రుణమాఫీ ప్రకటించకుండానే ఇంత చేశాం అంతచేశాం అని చెప్పుకోవటం ఏమిటని సభలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించ కుండా ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రొద్దుటూరు నియోజక వర్గానికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదన్నారు. పదివేలు పెట్టి మంచినీటి సమస్యను కూడా తీర్చలేదన్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తనపై కక్ష సాధింపులో భాగంగా తన స్వగ్రామమైన పైడిపాలెంలో రైతులు సాగు చేసిన భూములపై విచారణ మొదలు పెట్టించారన్నారు. ఈ విషయంలో రైతులకు అన్యాయం జరిగితే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో మంచినీటి సమస్య అధికంగా ఉందని పలువురు ఎమ్మెల్యేలు సభ దృష్టికి తెచ్చారు. జిల్లాలో సుండుపల్లి, రాయచోటి, పులివెందులతోపాటు ఇంకా చాలా మండలాల్లో మంచినీటి సమస్య ఉందని పలువురు జెడ్పీటీసీ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. వీటితోపాటు చాలా మండలాల్లో మంచినీటిని సరఫరాచేసినందుకు ఇంతవరకూ నిధులు రాలేదని పలువురు సభ్యలు సభలో ఆర్‌డబ్లూఎస్ ఆధికారులపై ధ్వజమెత్తారు. ఇలీవల మంచినీటి పథకాలకు విద్యుత్తును తొలిగించడం వల్ల జిల్లాలో ప్రజలు 48 గంటలపాటు మంచినీటికి ఇబ్బందులు పడ్డారని మైదుకూరు ఎమ్మెల్యే రఘరామిరెడ్డి విద్యుత్తు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి పథకాలకు సంబంధించిన బిల్లులు గత ప్రభుత్వమే చెల్లిస్తే ఈప్రభుత్వం మాత్రం పంచాయితీ నిధుల నుంచి కట్టించుకోవాలనటం విడ్డూరంగా ఉందన్నారు. సంబంధిత బిల్లులు ప్రభుత్వమే చెల్లించే విధంగా సభ తీర్మానం చేయాలని కోరగా సభ్యులంతా బలపరిచారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు చేయాలని కోరగా, ఎస్ఈ స్పందిస్తూ నియోజకవర్గానికి ఒక సబ్‌స్టేషన్ చొప్పున మంజూరు కోసం ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి నిధులు ఇచ్చినా చాలా పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ఏమైనట్లు? చంద్రబాబు అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ అందిస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘరామిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పిన పథకంలో జిల్లాలో ఎన్ని గ్రామాలకు మినరల్ వాటర్ ఇస్తున్నారో చెప్పాలని ఆర్‌డబ్లూఎస్ ఆధికారులను నిలదీశారు. దీనికి ఆర్‌డబ్ల్యుఎస్ అధికారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 613 యూనిట్లు గుర్తించామని, 63 యూనిట్లు మంజూరయ్యారని, 44 పూర్తయి మినరల్ వాటర్‌ను అందిస్తున్నాయన్నారు. దాతల సహకారంతో వాటిని నిర్వహిస్తున్నారని చెప్పడంతో సొమ్ము ఒకరిది... సోకకరిది అన్న రీతిలో వీటి నిర్వహణలో ఉందిన ఎమ్మెల్మేలు విమర్శించారు. మంచినీటి సమస్యపై ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో జరిగిన విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో వేముల మండలంలో మంచినీటి సమస్య గురించి కలెక్టర్ దృష్టికి తెచ్చామని, ఇంతవరకు పరిష్కరించలేదని ఆయన అన్నారు. వీటితోపాటు సింహాద్రిపురం, లింగాల మండలంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఇసుక క్వారీలు రద్దు చేయాలి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలో ఇప్పటికే ఐదు ఇసుక క్వారీల మంజూరు చేసిందని, ఇది చాలదన్నట్లు మళ్లీ 15 క్వారీలకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధమవుతోందన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా జిల్లాలో తీవ్ర తాగునీటి సమస్య ఎదురవుతోందన్నారు. దీంతోపాటు ఇసుకపై వచ్చే ఆదాయాన్ని జిల్లా అభివృద్ధికే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు బిల్లుల చెల్లింపు విషయంలో స్పష్టమైన హామి ఇవ్వాలన్నారు. గత ఏడాది గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేసిన బిల్లులు ఇంతవరకు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటన్నారు. ఆక్రమణ నుంచి దుంపలగట్టు చెరువును కాపాడండి ఖాజీపేట మండలంలోని దుంపలగట్టు చెరువును కొంతమంది ఆక్రమించుకున్నారని, దీంతో 400 ఎకరాల ఆయకట్టు బీడుగా ఉందన్నారు. దీంతో రైతులు చాలామేర నష్టపోయారన్నారు. దుంపలగట్టుకు చెందిన ఓ రైతు చెరువు ఆక్రమణ భూమిలో బోరును వేసి అక్రమంగా విద్యుత్‌ను ఏర్పాటు చేసుకుని పంటలను సాగు చేసుకుంటున్నారన్నారు. దీంతోపాటు చెరువు అలుగును ఎవరో ధ్వంసం చేశారని, దీనిపై కేసీ అధికారులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ బొజ్జవారిపల్లె చెరువులో కొంతమంది భూమిని ఆక్రమించుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత విషయం గురించి గతంలో ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేయాలి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కలలుగన్న స్టీల్ ప్లాంటు ఏర్పాటు త్వరగా జరిగేటట్లు చూడాలని ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కోరారు. దీనిపై సభలో తీర్మానం చేయాలని కోరారు. అలాగే కౌలు రైతులకు కూడా రైతు రుణమాఫీ వర్తించేలా చూడాలని కోరారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు తమ ప్రాంతంలో నెలకొన్న మంచినీటి సమ్యను పరిష్కరించాలని సభ దృష్టికి తెచ్చారు. మైదుకూరు జెడ్పీటీసీ తన మండలంలోని కొంతమంది పసుపు రైతులు కలుపు నివారణకు పిచికారి చేసిన మందుతో పంట మొత్తం దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వీరికి ప్రభుత్వమా లేక కంపెనీ ప్రతినిధులు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారో చెప్పాలని నిలదీశారు. అలాగే ఎరువుల మంజూరులో కూడా కొంత అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆరోపించారు. గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, సుండుపల్లె జెడ్పీటీసీలు మాట్లాడుతూ తమ మండలాల్లో ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయని, వాటి స్థానంలో కొత్తవి మంజూరు చేయాలని విద్యుత్‌శాఖ ఎస్ఈని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్బి అంజాద్బాష, జయరాములు, ఎమ్మెల్సీలు బచ్చల పుల్లయ్య, బత్యాల చెంగల్రాయులు, జాయింట్ కలెక్టర్ రామారావు, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, వైస్ చైర్మన్ సుబ్బారెడ్దిలతోపాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ పెత్తనం
అనంతపురం సెంట్రల్ : జిల్లా అభివృద్ధికి దిశా నిర్దేశం చేసే జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు అభాసుపాలు అవుతున్నాయి. సమావేశాల్లో ప్రజాప్రతినిధుల కన్నా ప్రైవేటు వ్యక్తులే ఎక్కువగా హల్ చల్ చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోనే కాదు జిల్లా స్థాయిలో జరిగిన సమావేశాల్లో కూడా మహిళా ప్రజాప్రతినిధులకు ఏమాత్రం గౌరవం దక్కడం లేదు. ముందుగా మహిళల్లో చైతన్యం తీసుకొచ్చింది మేమే నంటూ గొప్పలు పోయే అధికార తెలుగుదేశం పార్టీ పాలనలోనే ఈ వ్యవస్థ నడుస్తుండడం గమనార్హం. మంగళవారం జిల్లా పరిషత్‌లో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. వివరాల్లోకి వెలితే... జెడ్పీ చెర్మైన్ చమన్ అధ్యక్షతన ఆయన చాంబర్లో గ్రామీణాభివృద్ది, విద్యా-వైద్యం, ఆర్థికం, ప్రణాళిక, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ైవె స్ చెర్మైన్ సుబాషిణమ్మ అధ్యక్షతన వ్యవసాయం ఇతర అంశాలపై చర్చించారు. అయితే ఈ సమావేశాల్లో సభ్యులు కానీ వారు దర్జాగా ఆసీనులయ్యారు. వారికి జెడ్పీ కార్యాలయ అధికార వర్గాలు సకల మర్యాదలు చేయడం కనిపించింది. అంతటితో ఆగకుండా వారి ప్రాంతాల్లోని సమస్యలపై అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవన్నీ సాక్షాత్తు మంత్రి పల్లె రఘునాథరెడ్డి, చెర్మైన్ చమన్ సమక్షంలో చోటుచేసుకున్నారుు. విద్యా-వైద్యం అంశంపై జరుగుతున్న సమావేశంలో నల్లచెరువు జెడ్పీటీసీ సభ్యురాలు నాగరత్నమ్మ భర్త నాగభూషణనాయుడు సమావేశంలో ఆసీనులయ్యారు. వైద్య సమస్యలపై మంత్రి సమక్షంలో ప్రశ్నించారు. ఈయన ఈ సమావేశంలోనే కాకుండా ఇటీవల జరిగిన జెడ్పీ జనరల్‌బాడీ సమావేశంలో కూడా పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించినట్లు తెలిసింది. ఇదే సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాకపోయినప్పటికీ బుక్కరాయసముద్రం జెడ్పీటీసీ రామలింగారెడ్డి దర్జాగా కూర్చున్నారు. కాగా, జెడ్పీలో వైఎస్ చెర్మైన్ సుబాషిణమ్మ కన్నా ఆమె కుమారుడు ఉమామహేశ్వరరావుదే ఎక్కువ పెత్తనం సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి అంశంలోనూ ఆమె కుమారుడే జోక్యం చేసుకోవడం జరుగుతోందని సమాచారం. మంగళవారం నిర్వహించిన వ్యవసాయూనికి సంబంధించిన సమావేశంలో ఆయన దర్జాగా కూర్చున్నారు. పట్టు పరిశ్రమ శాఖ, ఇతర శాఖల సమస్యలపై అధికారులను ప్రశ్నించడం కనిపించింది. సమావేశ అనంతరం ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా వైఎస్ చెర్మైన్ కన్నా ఆమె కుమారునికే నమస్కారాలు పెడుతూ వెళ్లడం చర్చనీయూంశమైంది. ఇవన్నీ ఒకెత్తు అయితే జెడ్పీ చెర్మైన్ చమన్ అనుచర గణానిది మరొక ఎత్తు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు సెల్ కెమరాల్లో బంధిస్తూ హంగామా చేస్తున్నారు. -
ప్రకాశంలో రాజకీయ మలుపులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కాల చక్రం గిర్రున తిరిగిపోతోంది. ఈ ఏడాది రాజకీయ చక్రంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మున్సిపల్, స్థానిక సంస్థలు, జెడ్పీ, సాధారణ ఎన్నికల్లో జిల్లా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపించారు. దీంతో తమ ఆధిపత్యం చాటుకునేందుకు తెలుగుదేశం నాయకులు అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టినా జిల్లాలో అత్యధిక స్థానాలు మాత్రం వైఎస్సార్ సీపీకే దక్కాయి. ఒంగోలు ఎంపీ స్థానంతోపాటు ఆరు స్థానాలను వైఎస్సార్ సీపీ గెలుచుకోగా, ఐదు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, ఒక స్థానంలో నవోదయ పార్టీ తరపున గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ గెలుపొందారు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన జిల్లాలో సీనియర్ నాయకుడు కావడంతో దర్శి శాసనసభ్యుడు శిద్దా రాఘవరావుకు రవాణాశాఖ మంత్రి పదవి దక్కింది. తక్కువ స్థానాలు రావడంతో ముఖ్యమంత్రి ప్రకాశంపై శీతకన్ను వేశారు. ఒక్క జాతీయ స్థాయి విద్యాసంస్థను కూడా జిల్లాకు కేటాయించలేదు. శివరామకృష్ణన్ కమిటీ రాజధానిని వినుకొండ - మార్టూరు - దొనకొండ మధ్య ఏర్పాటు చేయాలని సూచించినా దాన్ని తుళ్లూరుకు తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేవలం రెండుసార్లే జిల్లా పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంలో కూడా తమకు జిల్లా ప్రజలు మద్దతు పలుకలేదంటూ అక్కసు వెళ్లగక్కారు. రోడ్డున పడిన జెడ్పీ ప్రతిష్ట రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినా ఇక్కడ మెజారిటీ రాకపోవడంతో తెలుగుదేశం నాయకులు అడ్డదారులు తొక్కారు. ప్రలోభాలకు గురిచేసి ఎంపీపీ పదవులు చేజిక్కించుకునే ప్రయత్నం చేశారు. జిల్లా పరిషత్ పీఠం దక్కించుకునేందుకు వారు ఎంతకైనా తెగించారు. అయితే అదృష్టం కలిసి రాలేదు. 59 జెడ్పీ స్థానాల్లో 31 స్థానాలు వైఎస్సార్ సీపీ దక్కించుకున్నా ముగ్గురిని ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకున్నారు. మెజారిటీ కోసం ఒక సభ్యునిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి నెగ్గుదామనుకున్నా సొంత పార్టీ సభ్యుడైన ఈదర హరిబాబు ఝలక్ ఇవ్వడంతో కంగుతిన్నారు. పార్టీకి వ్యతిరేకంగా జెడ్పీ పీఠం దక్కించుకున్న ఈదర హరిబాబుపై అనర్హత వేటు పడే వరకూ వారు నిద్రపోలేదు. ఆరు మాసాలుగా జెడ్పీ వ్యవహారంలో సాగిన రాజకీయ హైడ్రామాతో జిల్లా పరిషత్ ప్రతిష్ట రోడ్డున పడింది. ఉనికి కోసం కాంగ్రెస్... మరోవైపు కాంగ్రెస్ పార్టీ నిస్తేజంగా మారింది. ఈ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతు కావడంతో వారు తమ ఉనికి కోసం పాట్లు పడుతున్నారు. రైతు రుణమాఫీపై జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించగా, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హాజరయ్యారు. వామపక్షాలు, రైతు సంఘాలు పలు సమస్యలపై ఆందోళనలకు పరిమితం కాగా, బీజేపీ సభ్యత్వ నమోదు పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఉవ్వెత్తున సమైక్యపోరు రాష్ట్రం కలిసి ఉండాలంటూ జిల్లాలో సమైక్యపోరు ఉవ్వెత్తున సాగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు ఉద్యోగులు, సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉద్యమం ఉధృతంగా సాగింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒంగోలుతో పాటు జిల్లాలోని అన్ని కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, వినూత్న రీతుల్లో నిరసనలు కొనసాగాయి. ఉద్యోగులు రెండోదఫా సమ్మెకు దిగారు. పాఠశాలల నుంచి విద్యార్థులు, గృహిణిలు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు చేసిన ఆందోళనలు వృధాగా మారాయి. సోనియాగాంధీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి తన పంతం సాధించగా, చంద్రబాబు నోట సమైక్యం అనే మాట కూడా రాలేదు. సమైక్యవాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగింది. దాడులకు తెగబడిన తమ్ముళ్లు మరోవైపు ఎన్నికల్లో తమ పార్టీ గెలవడంతో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. జిల్లాలో ఎన్నికల తర్వాత జరిగిన అధికార పక్షం చేసిన దాడుల్లో ఇద్దరు, అధికార పక్షానికి కొమ్ము కాస్తూ పోలీసులు చేసిన దాడిలో ఒకరు మృతి చెందారు. మొత్తం 40 మందికిపైగా గాయపడ్డారు. హత్యకు గురైన గోగాడి సింగయ్య, తేలుకుంట్ల వెంకయ్య కుటుంబ సభ్యులను తెలుగుదేశం నేతలు బెదిరిస్తున్నారు. కేసు వాపసు తీసుకోకపోతే మీకు ఇదే పరిస్థితి తప్పదని బెదిరింపులకు దిగుతున్నారు. గిద్దలూరులోని ఒక అపార్టుమెంటులో రెండు ప్లాట్ల ఓనర్ల మధ్య జరిగిన వివాదాన్ని ఎస్సై వై.శ్రీనివాసరావు పెద్దది చేయగా, అపార్టుమెంటు ఓనరుగా వైఎస్సార్ సీపీ నేత వైజా భాస్కర్‌రెడ్డి వారిని విడిపించేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, తెలుగుదేశం పార్టీ తొత్తుగా వ్యవహరించిన ఎస్సై దౌర్జన్యానికి దిగడంతో గుండెపోటుకు గురై ఓజా భాస్కరరెడ్డి మరణించారు. పోలీస్ స్టేషన్లో ఒక ప్రజాప్రతినిధి మరణిస్తే, అందుకు కారణమైన ఎస్సైపై చర్య లు తీసుకోవాలని కోరిన వైఎస్సార్సీపీ ఎమ్మె ల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలపై లేనిపోని కేసులు పెట్టి ఇరికించారు. తమకు వ్యతిరేకంగా నిలబడి గెలిచిన చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ను కూడా వదలలేదు. ఆఖరికి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నించిన వ్యక్తిపై కూడా ఎస్సీఎస్టీ కేసు పెట్టి తమ ప్రతాపం చూపించారు. పచ్చ కమిటీలు... అన్ని కమిటీలలో తమ పట్టు నిరూపించుకునేందుకు తెలుగుదేశం నాయకులు ప్రయత్నించారు. అర్హతల పరిశీలన పేరుతో వేసిన ప్రత్యేక కమిటీలు పసుపుమయంగా మారాయి. ప్రతి కమిటీలోనూ తమ పార్టీ సభ్యులను నియమించుకున్నారు. ప్రభుత్వ జీవోలో స్థానిక ప్రజాప్రతినిధులకు చోటుకల్పించాలని స్పష్టంగా ఉన్నా మంత్రి నిర్ణయం పేరుతో పలుచోట్ల ప్రజాప్రతినిధులకు ఆ కమిటీల్లో స్థానం కల్పించకపోవడం వివాదాస్పదంగా మారింది. పింఛన్ తీసుకుంటున్న వారి అర్హతల పరిశీలనతోపాటు ఆధార్‌కార్డుల సీడింగ్ ప్రక్రియ వివరాలతో సరిపోల్చేందుకు ఇంటింటికీ ప్రత్యేక కమిటీలను పంపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలనే రుణమాఫీ అర్హులను తేల్చేందుకు ఉపయోగించారు. సామాజిక కార్యకర్తల పేరుతో ఓడిపోయిన నాయకులను కమిటీలలో వేశారు. ఈ కమిటీల నిర్వాకం కారణంగా జిల్లాలో కనీసం 50 వేల మంది ముసలివారు పింఛన్ కోల్పోయారు. దీంతో అద్దంకిలో ఒక వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. -
నేడు జెడ్పీ ప్రత్యేక సమావేశం
సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం సోమవారం జరగనుంది. సమావేశంలోజిల్లా మంత్రి హరీష్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హాజరుకానున్నారు. సమావేశంలో మిషన్ కాకతీయ, వ్యవసాయం, ఆహారభద్రత కార్డుల పంపిణీపై మంత్రులు సమీక్ష జరపనున్నారు. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు, తహశీల్దార్లు పాల్గొననున్నారు. ఈ సమావేశం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమీక్షా సమావేశంలో భాగంగా నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు జిల్లాలో ‘మిషన్ కాకతీయ’ పనులపై సమీక్షి ంచనున్నారు. మిషన్ కాకతీయకు జిల్లాలో తొలి విడతగా ఎంపిక చేసిన చెరువులు, ప్రతిపాదనల రూపకల్పన, పనుల అమలుకు తీసుకుంటున్న చర్యలను మంత్రి హరీష్ అధికారులతో చర్చించి పలు సూచనలు చేయనున్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖలకు సంబంధించి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమీక్షిస్తారు. జిల్లాలో పంటల సాగు, పంటరుణాలు, నష్టపరిహారం పంపిణీ తదితర అంశాల పురోగతిని ఆయన సమీక్షిస్తారు. ఆహారభద్రత కార్డుల పంపిణీ ఇతర ఆర్థిక అంశాలపై మంత్రి ఈటెల రాజేందర్ అధికారులతో మాట్లాడతారు. జిల్లా పరిషత్, నీటిపారుదల శాఖ అధికారులు సమీక్షా సమావేశానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. -
ప్రణాళికాబద్ధంగా పంపకాలు
ముగిసిన డీపీసీ ఎన్నికల ప్రక్రియ ⇒ గ్రామీణ స్థానాలు ఏకగ్రీవం ⇒పట్టణ సీట్లకు తప్పని పోటీ ⇒మూడు స్థానాలకు ఓటింగ్ ⇒విజేతలను ప్రకటించిన సీఈఓ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా ప్రణాళిక కమిటీ(డీపీసీ) సభ్యుల ఎన్నికల క్రతువు ముగిసింది. పార్టీల పరస్పర అంగీకారంతో గ్రామీణ స్థానాలు(జిల్లా పరిషత్) ఏకగ్రీవం కాగా, మూడు పట్టణ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. జిల్లా పరిషత్‌లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగగా, ఆ తర్వాత ఓట్లను లెక్కించారు. మూడు సీట్లకు ఐదుగురు బరిలో ఉండడంతో మొదటి వరుసలో నిలిచిన ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. జిల్లాలోని బడంగ్‌పేట, తాండూరు, వికారాబాద్ , పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలకు చెందిన 119 మంది కౌన్సిలర్లు ఓట్లు వేయాల్సివుండగా, 18 మంది గైర్హాజరయ్యారు. వీరిలో అధికంగా 15 మంది వికారాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఉన్నారు. ‘మంత్రా’ంగం! తొలిసారి డీపీసీ స్థానాలకు ఎన్నికలను ప్రకటించడంతో జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అన్ని పార్టీల నాయకత్వంతో చర్చించి రాజీమార్గాన్ని పాటించారు. ఈ మేరకు సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్(గ్రామీణ) స్థానాల(10) ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అయితే, పట్టణ నియోజకవర్గాల స్థానాల(14) విషయంలో టీడీపీ, బీజేపీల మధ్య అవగాహన కుదరకపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. మూడు బీసీ(జనరల్) స్థానాలకు ఐదుగురు పోటీలో ఉండడంతో పోలింగ్ తప్పనిసరైంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఆనంతరం సీఈఓ చక్రధర్‌రావు ముగ్గురు విజేతలను ప్రకటించారు. డీపీసీ సభ్యులు వీరే..! గ్రామీణ నియోజకవర్గం: పోలమెళ్ల బాలేష్, జే.కే.శైలజ, పి.సరోజ, కర్నాటి రమేశ్‌గౌడ్, పట్లోళ రాములు, ముచ్చోతు మంజుల, ఎనుగుల జంగారెడ్డి, మంద సంజీవరెడ్డి, చింపుల శైలజ, ముంగి జ్యోతి. పట్టణ నియోజకవర్గం: పి. స్వప్న, ఆకుల యాదగిరి, పి.నర్సిములు, యాతం శ్రీశైలంయాదవ్, పూడూరి దమయంతి, బి.సునీత, ఈరంకి వేణుకుమార్‌గౌడ్, పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డి, విజయేందర్‌గౌడ్, వినోద్‌కుమార్‌జైన్, అంజలి, అమరావతి, చామ సంపూర్ణరెడ్డి, దేవిడి స్వప్న. -
ప్రజల గోడు పట్టదా...
నివేదికల వెల్లడితోనే సరిపుచ్చిన అధికారులు సాదాసీదాగా తొలి స్థాయీ సంఘాల సమావేశం కొన్ని అంశాలకే పరిమితమైన ప్రజాప్రతినిధులు ఖమ్మం జెడ్పీ సెంటర్ : జిల్లా పరిషత్ స్థాయి సంఘాల తొలి సమావేశం తూతూ మంత్రంగానే ముగిసింది. జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నా వాటిపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపలేదు. కొందరు మాత్రమే ఆయా మండలాల్లోని పలు అంశాలపై ప్రశ్నించినప్పటికీ అధికారులు మాత్రం చేస్తాం..చూస్తాం.. అంటూ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. దీంతో కొందరు జెడ్పీటీసీ సభ్యులు నిరాశతోనే వెనుదిరగాల్సి వచ్చింది. అయితే పలువురు అధికారులు మాత్రం కొందరు సభ్యులను మండలస్థాయి సమస్యలకు మాత్రమే పరిమితం చేశారు. ఒకానొక దశలో చైర్ పర్సన్ సైతం సమావేశం తీరుపై అనాసక్తి చూపారు. ఎప్పుడు ముగిద్దామనే రీతిలో అధికారులు ఉండడం, సమయాభావం వల్ల స్థాయి సంఘాల సమావేశాన్ని కుదించారు. దీంతో పూర్తిస్థాయిలో సమావేశం జరగలేదు. మరోపక్క స్థాయి సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా హాజరు కాకపోవడం, శాసన మండలి సభ్యుల్లో కేవలం పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రమే హాజరుకావడం గమనార్హం. సమావేశం జరిగిందిలా... తొలుత జెడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన గ్రామీణ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరాపథకం తీరు గురించి డీఆర్డీఏ ఏపీడీ వివరించారు. ఆసరా పథకం కింద 3,13,831 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 3,11,545 దఖాస్తులను విచారించి వారిలో 2,14,605 మందిని అర్హులుగా గుర్తించామని, ఇంకా కొంతమంది దరఖాస్తులు విచారణ చేపట్టాల్సి ఉందని, ఇప్పటికే అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేశారని తెలిపారు. దీనిపై ఇల్లెందు, బయ్యారం జెడ్పీటీసీలు చండ్ర అరుణ, గౌని ఐలయ్య మాట్లాడుతూ అర్హులకు కాకుండా అనర్హులకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని, ఈ పింఛన్లపై కూడా ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా అధికారులు, ఎంపీడీఓలే చూస్తున్నారని అన్నారు. అందుకు స్పందించిన ఏపీడీ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జిల్లాలో తహశీల్దార్, ఎంపీడీఓ, రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో పింఛన్లు అందించేలా చర్యలు చేట్టామని అన్నారు. ఏజెన్సీలోని రిజిస్టర్ సొసైటీల గీత కార్మికులకు పింఛన్ రావడం లేదని, వారికి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని, సదరం క్యాంప్‌లో 2010 - 11 సంవత్సరంలో వచ్చిన వారికి సైతం పింఛన్లు రావడం లేదని, దీనిపై దృష్టి సారించాలని పలువురు జెడ్పీటీసీలు కోరారు. పాత ఇనుము దుకాణంలో పింఛన్ దరఖాస్తులు... ఇల్లెందు జెడ్పీటీసీ చండ్ర అరుణ మాట్లాడుతూ ఆసరా పింఛన్ కోసం వచ్చిన దరఖాస్తులు పాత ఇనుము దుకాణంలో ప్రత్యక్షమయ్యాయని, అందులో ఆ పాత ఇనుము షాపు యజమాని దరఖాస్తు కూడా ఉందని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన జెడ్పీచైర్‌పర్సన్ ఇలాంటి పొరపాట్లు జరుగకుండా చూడాలని, అర్హులకు మాత్రమే ఆసరా అందేలా అధికారులు చూడాలని అన్నారు. అనంతరం ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సీతామహాలక్ష్మి వివరించారు. దీంతో భూమి పంపిణీకి ఎంత మందిని ఎంపిక చేశారని, ఇప్పటి వరకు ఎంతమందికి భూమిని కొనుగోలు చేశారని జెడ్పీటీసీలు ప్రశ్నించగా 17 ఎకరాల భూమిని ఏడుగురికి అందజేశామని, మిగిలిని వారికి అందిస్తామని ఈడీ సీతామహాలక్ష్మి తెలిపారు. రూ.50వేల డిపాజిట్ చేయాలనడం సరికాదు... రాజీవ్ యువశక్తి పథకం వల్ల యువతకు ప్రయోజనం లేదని, రూ 50వేలు డిపాజిట్ చేయాలనడం సరికాదని, ఇదే పరిస్థితి కొనసాగితే ఆ శాఖ అధికారులు సమావేశానికి రావాల్సిన అవసరం లేదని దుమ్ముగూడెం, బయ్యారం జెడ్పీటీసీలు పేర్కొన్నారు. అనంతరం హౌసింగ్ పీడీవైద్యం భాస్కర్ ఆ శాఖ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. జిల్లాకు రూ.25 కోట్లు విడుదలయ్యాయని, వాటిని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కల్పించుకుని జాబితాలో ఉన్న అనర్హులకు కూడా నగదు జమ చేశారా..? అని ప్రశ్నింగా హౌసింగ్ పీడీ సరైన సమాధానం ఇవ్వలేదు. ఆయన ఎమ్మెల్సీ అసహనం వ్యక్తం చేశారు. అర్హులకు మాత్రమే అందేలా చూడాలని, అనర్హుల పేర్లు తొలగించాలని ఎమ్మెల్సీ సూచించారు. అనంతరం విద్యవైద్యంపై జరిగిన సమావేశంలో ఆయా శాఖల ప్రగతిని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన ప్రజాప్రతినిధులు విద్యా, వైద్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సక్రమంగా ఖర్చుచేసి ప్రజలకు పథకాలు అందేలా చర్యలుతీసుకోవాలన్నారు. కో ఆప్షన్‌సభ్యులు మౌలానా మాట్లాడుతూ డెంగీ నిర్ధారణకు జిల్లా కేంద్రంలోనే పరికరాలు ఉన్నాయని, మిగతా ప్రాంతాల్లో పరిస్థితులేమిటని ప్రశ్నించారు. కొత్తగూడెం జెడ్పీటీసీ మాట్లాడుతూ 2009లో సదరం వారికి ఇప్పటి వరకు సర్టిఫికెట్లు ఇవ్వలేదని అన్నారు. టేకులపల్లి జెడ్పీటీసీ మాట్లాడుతూ డబ్బులు తీసుకుని అనర్హులకు సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, సదరంలో పారదర్శకత పాటించాలని అన్నారు. వ్యవసాయ కమిటీ సమావేశం జెడ్పీ వైస్ చైర్మన్ బరపటి వాసుదేవ అధ్యక్షతన, మహిళా సంక్షేమ స్థాయి కమిటీ సమావేశం తోటమల్ల హరిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జెడ్పీటీసీలు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడం లేదని, మహిళా ప్రాంగణం అస్తవ్యస్తంగా ఉందని, సిబ్బంది లేక సక్రమంగా శిక్షణ ఇవ్వడం లేదని అన్నారు. సాంఘిక సంక్షేమ స్థాయి కమిటీ సమావేశం అసావత్ లక్ష్మి అధ్యక్షతన జరిగింది. అనంతరం పంచాయతీ రాజ్ ఎస్ఈ గంగారెడ్డి పీఆర్ శాఖలో చేపడుతున్న అభివృద్ధి పనులు వివరించారు. మార్చిలోగా అన్ని పనులు పూర్తి చేస్తామని వివరించారు. ఆర్అండ్బీ ఎస్ఈ సతీష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఆర్అండ్బి శాఖ ద్వారా చేపడుతున్న పలు అభివృద్ధి పనులను వివరించారు. వైరా జెడ్పీటీసీ బొర్రా ఉమాదేవి మాట్లాడుతూ వైరాలోని ఆర్అండ్బి ప్రధాన రహదారి అధ్వానంగా ఉందని ఎస్ఈ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన ఆయన ఆ రహదారిపై నీరు నిల్వ ఉండడం వల్ల దెబ్బతిన్నదని, డ్రెయిన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తీర్మానిలివే.. సక్సెస్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివిన ఉపాధ్యాయులను మాత్రమే నియమించేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలనీ తీర్మానించారు. రూ.50వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికే రాజీవ్ యువశక్తి పథకం కింద బ్యాంక్ కాన్సెంట్ ఇస్తున్నారని, దీంతో ఆ పథకం నీరుగారుతోందని, వార్షికాదాన్ని రెండు లక్షలకు పెంచాలని తీర్మానించారు. ఎన్ఆర్ఈజీఎస్లో పని దినాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, పని దినాలు యధావిథిగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి సిఫార్సు చేయాలని తీర్మానించారు. ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపడుతున్న పనుల్లో ప్రత్యేక విజిలెన్స్ కమిటీని కలెక్టర్ నియమించటం వల్ల నిధులు రాక ఇబ్బందులు పడాల్సి వస్తోందని, అన్ని వర్కులపై విచారణ జరుపకుండా నాణ్యతా ప్రమాణాలు లేని వాటిపై విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. -
చిత్తూరు పరిషత్ సమావేశం రసాభస
-
రెండోరోజు జడ్పీ వద్ద ఉత్కంఠే
ఒంగోలు: జిల్లా పరిషత్‌లో నెలకొన్న ఉత్కంఠ రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగింది. జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు ఉదయం 10 గంటలకే ఈదర హరిబాబు చేరుకున్నారు. గురువారం ఎదురైన అనుభవమే శుక్రవారం కూడా సాక్షాత్కరించింది. అయితే తొలిరోజు కనీసం కుర్చీ కూడా లేకుండా మెట్లమీదనే కూర్చోగా, శుక్రవారం జెడ్పీ సిబ్బంది మాత్రం ఒక బల్ల, కుర్చీ ఏర్పాటు చేశారు. జెడ్పీ చైర్మన్ ఛాంబర్‌తోపాటు సీఈవో గదికి కూడా తాళాలు వేసి ఉండడంతో ఈదర హరిబాబు తన నిరసనను రెండో రోజు కూడా మెట్లమీదనే నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజన సమయం వరకు కూడా అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు. దీనిపై ఈదర హరిబాబు మాట్లాడుతూ తాను కోర్టు ఉత్తర్వులను ఇచ్చినపుడే తాను జెడ్పీ చైర్మన్ కాదని సీఈవో స్పష్టం చేసి ఉంటే తాను జెడ్పీ కార్యాలయం వద్దకు కూడా వచ్చి ఉండేవాడిని కాదన్నారు. కానీ ఆ సమయంలో తనకు చెప్పకపోగా రెండుసార్లు తన అనుమతితో శెలవు తీసుకున్నారని, అందువల్ల తాను జిల్లా పరిషత్ చైర్మన్‌గా గుర్తించినట్లే అన్నారు. కానీ నేడు న్యాయస్థానం ఉత్తర్వులను గౌరవించకపోగా, తాను జెడ్పీ చైర్మన్‌గా ఉన్న జెడ్పీలో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం తట్టుకోలేకే తాను మెట్లమీదనే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నానన్నారు. తనను రాజకీయంగా హత్య చేయాలని చూస్తున్నారని, రాజకీయంగా ప్రాణాలు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తనకు కలెక్టర్ భవనం నుంచి వచ్చిన ఉత్తర్వులతోటే గ్రహణం పట్టిందని, అయితే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో తనకు గ్రహణం వీడిందన్నారు. కానీ సూర్యగ్రహణం వీడినా ఇంకా చంద్రగ్రహణం వీడలేదంటూ ఇబ్బందిపెడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ, అధికారులు సహకరించి తనకు అవకాశం కల్పించి తనకు పరిపాలన చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12గంటలకు నూకసాని బాలాజీతోపాటు పోలీసులు కూడా జెడ్పీ కార్యాలయం వద్దకు చేరుకొని చైర్మన్ ఛాంబర్‌కు ఈదర హరిబాబు వేసిన తాళం తీపిస్తారంటూ ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున జనం కూడా గుమికూడారు. -
అన్నీ కోతలే...
ఒంగోలు వన్‌టౌన్: ఇదిగో డీఎస్సీ...అదిగో డీఎస్సీ...అంటూ ఇన్నాళ్లు ఊదరగొట్టిన ప్రభుత్వం డీఎస్సీ కింద ప్రకటించే పోస్టుల్లో కోత పెట్టి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. నాలుగు నెలలుగా డీఎస్సీపై రకరకాల ప్రచారం చేసిన ప్రభుత్వం చివరకు పోస్టుల్లో కోత పెట్టి నిరుద్యోగులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మొదట 20 వేల పోస్టులు డీఎస్సీకి ప్రకటిస్తామంటూ కోతలు కోసిన ప్రభుత్వం ఆ తర్వాత ఆ సంఖ్యను 15 వేలకు కుదించింది. మరో నెల గడిచేటప్పటి కి ఆ సంఖ్యను మరీ కుదించి 10 వేలకు చేర్చింది. తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే నాటికి అది కాస్త 9,061 పోస్టులకు మాత్రమే పరిమితం చేసింది. జిల్లాలో పరిస్థితి ఇదీ.. జిల్లాలో మొత్తం 839 టీచర్ పోస్టులు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో కేవలం 688 పోస్టులను భర్తీ చేసేందుకు మాత్రమే ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. దీంతో జిల్లాలోని ఖాళీల్లో 151 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోనున్నాయి. ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల్లోని ఎస్జీటీ పోస్టుల్లోనే ప్రభుత్వం భారీగా కోత విధించింది. జిల్లాలో సెకండరీ గ్రేడ్ తెలుగు 715, ఉర్దూ 8 కలిపి మొత్తం 723 పోస్టులు ఖాళీగా ఉండగా, వీటిలో 579 పోస్టులు మాత్రమే భర్తీ చేసేందుకు అనుమతించారు. అంటే ఎస్జీటీ విభాగంలో 144 పోస్టులకు కోత పెట్టారు. అదేవిధంగా హిందీ గ్రేడ్-2 భాషా పండితులు 13 పోస్టులు ఖాళీ ఉండగా కేవలం 10 పోస్టులకు మాత్రమే అనుమతించారు. వ్యాయామోపాధ్యాయుల్లో 21 పోస్టులు ఖాళీ కాగా 17 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. స్కూలు అసిస్టెంట్ క్యాడర్లో మొత్తం 79 పోస్టులు ఖాళీగా ఉండగా అన్ని పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతించారు. నిరుద్యోగ టీచర్ల నిరసన: ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్ష (టెట్ కమ్ టీఆర్టీ)కు ప్రకటించే పోస్టుల్లో ప్రభుత్వం కోత విధించటంపై నిరుద్యోగ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 64 డీఈడీ కళాశాలలు, 45 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. డీఈడీ కళాశాలల నుంచి ఏటా 6,400 మంది ఛాత్రోపాధ్యాయులు, బీఈడీ కళాశాల నుంచి ఏటా సుమారు 4 వేల మంది బీఈడీ పట్టాతో బయటకు వస్తున్నారు. వీరందరూ డీఎస్సీ పోస్టులపై గంపెడాశతో ఉన్నారు. అయితే ప్రభుత్వం ఉన్న పోస్టులను కూడా కుదించి నోటిఫికేషన్ జారీ చేయడంపై నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. జిల్లాలోని పాఠశాలల్లో ఖాళీలన్నింటినీ డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని మున్సిపల్, ఐటీడీఏ పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయుల నియామకానికి డీఎస్సీ ద్వారానే చేపట్టాలని నిరుద్యోగ టీచర్లు కోరుతున్నారు. -
డబ్బు ఇచ్చుకో.. కోరిన చోటకు బదిలీ పుచ్చుకో
* జెడ్పీ ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు * ప్రభుత్వ నిబంధనలకు పాతర * నేటితో బదిలీలకు తెర ఏలూరు టూటౌన్ : జిల్లా పరిషత్‌లో ఎంపీడీవోలు, ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలకు తూట్లు పొడిచి జెడ్పీ చైర్మన్, సీఈవో తమ ఇష్టారాజ్యంగా బదిలీలు చేపడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 979 నంబర్ జీవోను తుంగలోకి తొక్కుతున్నారని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. జెడ్పీలోని కీలక అధికారి ఒకరు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ బదిలీల్లో సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కోరుకునే వారి వద్ద రూ. 25 నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. నాలుగు రోజులుగా ఎంపీడీవోల బదిలీలకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద నుంచి భారీస్థాయిలో సిఫార్సు లేఖలు జెడ్పీ సీఈవో, చైర్మన్‌కు అందాయి. నిబంధనల ప్రకారం ఎంపీడీవోలకు జీరో సర్వీస్ ఆధారంగా బదిలీలు చేయాల్సి ఉండగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కోరిక మేరకు బదిలీలు జరుగుతున్నాయి. జిల్లా పరిషత్‌లో మినిస్ట్రీరియల్ ఉద్యోగులైన సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, లైబ్రరీ అసిస్టెంట్లతో కలిపి మొత్తం వెయ్యి మంది వరకు ఉద్యోగులున్నారు. వీరిని జీవో నంబర్ 709 ప్రకారం 5 సంవత్సరాలు నిండిన వారిని 20 శాతం బదిలీలు కౌన్సిలింగ్ పద్ధతిలో జరపాల్సి ఉంది. అయితే ఆ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. గతంలో జెడ్పీ ఉద్యోగులకు సంబంధించి బదిలీల విషయంలో యూనియన్ నాయకులతో కూడా సీఈవో, చైర్మన్ సంప్రదింపులు జరిపేవారు. కాని ఈసారి దానికి విరుద్ధంగా తమ ఇష్టానుసారం బదిలీలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల మేరకే చేస్తాం : ఇన్చార్జి సీఈవో పి.సుబ్బారావు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో బదిలీల నిబంధనల మేరకే చేస్తామని ఇన్చార్జి జెడ్పీ సీఈవో పి.సుబ్బారావు తెలిపారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తప్పనిసరిగా కౌన్సిలింగ్ జరపాలనే నిబంధన లేదు. అందుకే ఉద్యోగుల ద్వారా అన్లైన్లో ఆప్షన్ తీసుకుని బదిలీలు చేస్తున్నాం. జీవో నెం.709 ప్రకారం బదిలీ చేయాలన్న నిబంధనతో ఫైల్ తయారు చేసి జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు పంపామని చెప్పారు. ఇంజినీరింగ్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి డబ్బులు వసూలు చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణలు అవాస్తవం. ఎవరైనా డబ్బులు చేసే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అధికారులూ పద్ధతి తప్పితే కష్టాలే
సాక్షి, చిత్తూరు: అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు నిబంధనలు అతిక్రమించి తప్పులుచేస్తే కష్టాలు ఎదుర్కోక తప్పదని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరించారు. తప్పులు చేసిన అధికారులు శిక్ష అనుభవించక తప్పదన్నారు. ఇప్పటికే చాలామంది అధికారులు బలిపశువులయ్యారని భాస్కర్‌రెడ్డి ఉదహరించారు. ఎన్ని తప్పులు చేసినా అధికారపార్టీ అండగా ఉంటుందనుకుంటే తమకేమీ అభ్యంతరంలేదన్నారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్మన్ గీర్వాణి అధ్యక్షతన 1వ, 7వ స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశానికి హాజరైన చెవిరెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్‌లో రిసీట్స్, డిస్ట్రిబ్యూషన్, బడ్జెట్లకు సంబంధించి పాజిటివ్ చర్చను స్వాగతించాలన్నారు. ఈ సమావేశానికి ఎటువంటి వివరాలు లేకుండా అధికారులు రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. డెవలప్మెంటు పాలసీ, ప్రొసీజర్ ప్రకారం చేయాలన్నారు. ప్రొసీజర్ ఫాలో కాకపోతే ఘర్షణ వాతావరణం తప్పదన్నారు. జిల్లా పరిషత్ పరిధిలో కమర్షియల్ టాక్స్, సీన రీసెస్, జనరల్‌ఫండ్స్, మినరల్సెస్, పంచాయతీరాజ్ తదితర శాఖల నుంచేగాక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు వస్తాయన్నారు. మొత్తం ఎన్ని నిధులు వస్తున్నాయి? వీటిని ఎలా పంపిణీ చేస్తున్నారు? ఏ సిస్టమ్ అమలు చేస్తున్నారు? వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధా?, జనాభా నిష్పత్తి ప్రకారమా ?, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికా? అంటూ చెవిరెడ్ది ప్రశ్నల వర్షం కురి పించారు. నిధుల కేటాయింపునకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎప్పటి లోగా బడ్జెట్ ఫార్మెట్ పంపబోతున్నారు? అంటూ చెవిరెడ్డి ప్రశ్నిం చారు. ప్రధానంగా పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో కేటాయింపులకు సంబంధించి రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. మరి దీనికి చివరి గడువు ప్రకటిం చారా? వీటి అనుమతుల కోసం పంచాయతీరాజ్ కమిషనరుకు ఎప్పుడు పంపుతున్నారు? అంటూ ఆయన అధికారులను నిలదీశారు. ఈ వివరాలు సకాలంలో పంపకపోవడంతో ఖమ్మం, వరంగల్ జెడ్పీసీఈవోల చెక్ పవర్‌ను ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పనులకు సంబంధించిన లిస్ట్‌ను సకాలంలో తయారు చేయనందుకు నెల్లూరు సీఈవో కైలాస్గిరిని ప్రభుత్వం టెర్మినేట్ చేసిందన్నారు. ఆ తరువాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నారని చెవిరెడ్డి గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ నిధులను వారికే ఖర్చు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. లేకపోతే కమిషనర్ చూస్తూ ఊరుకోదని చెవిరెడ్డి హెచ్చరించారు. జిల్లాకు సంబంధించిన వివరాలు లేవు, తాగునీటికి ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పలేకున్నారు? అసలు ఏ విషయం లేకుండా సమావేశాలు ఎందుకని నిలదీశారు. మొదటిసారి అని వదులుతున్నా, పదేపదే తప్పులు జరిగితే సీఈవోనే దోషిగా నిలవాల్సి వస్తుందని చెవిరెడ్డి హెచ్చరించారు. తప్పుచేసిన అధికారులను వదిలేది లేదన్నారు. జెడ్పీ విధివిదానాలు, అధికారుల విధులు, నిబంధనలతోపాటు తప్పుచేసి బలిపశువులైన అధికారుల వివరాలు సైతం ఉదాహరణలతోసహా ఉటంకించడంతో అధికారులు బెంబేలెత్తిపోయారు. చెవిరెడ్డి అన్ని విషయాలు తెలివిగా తెలియజెప్పి పరోక్ష హెచ్చరికలకు దిగి అధికారులను బ్లాక్మైల్ చేస్తున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. తప్పుచేసినా అధికార పార్టీ నేతలు కాపాడుతారని భరోసా ఉంటే అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిం చినా తమకేమీ అభ్యంతరం లేదని చెవిరెడ్డి తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, మిగిలిన అధికారులు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
జెడ్పీలో చాంబర్ లొల్లి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా పరిషత్‌లో చాంబర్ లొల్లి కొనసాగుతోంది. పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించి రెండు నెలలు కావస్తున్నా చాంబర్ ఏర్పాటు చేయలేదన్న ఆవేదనలో వైస్ చైర్మన్ వర్గీయులుండగా, రెండు గదులు చూపించినా వాటిని కాదని తాను కోరుకున్న చోటే చాంబర్ ఏర్పాటు చేయాలంటూ వైస్ చైర్మన్ పట్టుబట్టడం సరికాదంటూ చైర్పర్సన్ వర్గీయులు వాదిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై రసవత్తర చర్చ జరుగుతోంది. టీడీపీలోని ఓ వర్గ ఎమ్మెల్యేలు జెడ్పీలో మరో పవర్ సెంటర్ ఉండాలన్న వ్యూహాత్మక ఎత్తుగడతో పావులు కదిపారు. దీనిలో భాగంగా వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తికి ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును కోరారు. వైఎస్ చైర్మన్‌కు ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేయాలని రెండు నెలల క్రితం జరిగిన ఓ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణికి మంత్రి నేరుగా సూచించారు. ఈ నిర్ణయాన్ని చైర్పర్సన్ జెడ్పీలో చాంబర్ లొల్లి వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. ఎప్పుడూ లేని విధంగా వైస్ చైర్మన్‌కు ప్రత్యేక చాంబర్ ఏంటని డిఫెన్స్‌లో పడ్డారు. ప్రత్యర్థుల ఎత్తుగడగా భావించినప్పటికీ మంత్రి ఆదేశించిన తర్వాత తప్పదని వైస్ చైర్మన్‌కు ప్రత్యేక చాంబర్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. తొలుత జెడ్పీ ప్రాంగణంలో ఉన్న పాత భవనంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే దాన్ని వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి అంగీకరించలేదు. ప్రస్తుత పరిపాలన భవనంపై ఉన్న ప్రత్యేక రూమ్‌లోనే చాంబర్ ఏర్పాటు చేయాలని పట్టు బట్టారు. చైర్పర్సన్ కోసం కేటాయించిన రూమ్‌ను ఆయనకు కేటాయించాలని కోరడమేంటని చైర్పర్సన్ వర్గీయులు ఇరకాటంలో పడ్డారు. ఇప్పటికే చైర్పర్సన్ వాడుతున్నారని, అందులో వైస్ చైర్మన్‌కు చాంబర్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని సంకేతాలు పంపారు. సమావేశం హాలు పక్కనే ఉన్న రూమ్‌లో చాంబర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.ఆ ప్రతిపాదనను కూడా వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి తిరస్కరించారు. ప్రస్తుతం పరిపాలన భవనంపైన ఉన్న రూమ్‌లోనే ఏర్పాటు చేయాలని మొండికేసి కూర్చొన్నారు. దీంతో ఏకాభిప్రాయం కుదరక చాంబర్ లొల్లి ఏర్పడింది. మంత్రి ఆదేశించినా పట్టించుకోలేదని వైస్ చైర్మన్, ఆయన అనుకున్న చోటే కేటాయించాలని కోరడం సరికాదని చైర్‌పర్సన వర్గీయుల మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. దీంతో ఆ రెండు వర్గాల మధ్య అంతరం పెరుగుతోంది. రాజకీయ ఆధిపత్యం కోసం ఇప్పటికే కొనసాగుతున్న పోరాటంలో ఈ చాంబర్ లొల్లి ఏ మేర ప్రభావం చూపుతుందో, ఎక్కడికి దారితీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. -
జడ్పీ స్థాయీ సంఘాల ఎన్నిక పూర్తి
ఖమ్మం జడ్పీసెంటర్: జిల్లా పరిషత్‌లోని ఐదు స్థాయీ సంఘాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత అధ్యక్షతన మంగళవారం ఏర్పాటైన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. గత సమావేశంలో ఆర్థిక, పనుల కమిటీలను పూర్తి స్ధాయిలో ఎన్నుకోగా మిగతా ఐదు కమిటీల్లో కొందరు సభ్యులు సంతకాలు చేయకపోవడంతో మళ్లీ సమావేశం నిర్వహించారు. ఈ మిగిలిన పోయిన ఐదు కమిటీల సభ్యులను ఎన్నుకున్నారు. వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, మహిళా సంక్షేమ కమిటీల్లో చైర్పర్సన్ కోఆప్షన్ మెంబర్‌గా ఉంటారు. అశ్వాపురం జడ్పీటీసీ తోకల లత సమావేశానికి హాజరుకాకపోవడంతో ఇద్దరు జడ్పీటీసీ సభ్యులు ఆమె పేరును ప్రతిపాదించి, బలపరచడంతో ఆమె మహిళా సంక్షేమ కమిటీకి ఎన్నికయ్యారు. దీనితో జడ్పీ స్థాయీ సంఘాల ఎన్నిక పూర్తయింది. 1. ప్రణాళిక, ఆర్థిక కమిటీ అధ్యక్షురాలిగా చైర్పర్సన్ గడిపల్లి కవిత, సభ్యులుగా తల్లాడ, దమ్మపేట, కల్లూరు, కామేపల్లి, మణుగూరు, చండ్రుగొండ జడ్పీటీసీలు మూకర ప్రసాద్, దొడ్డాకుల సరోజిని, జె.లీలవతి, మేకల మల్లిబాబుయాదవ్, పాల్వంచ దుర్గ, కృష్ణారెడ్డితో పాటు మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు. 2. గ్రామీణాభివృద్ధి కమిటీ అధ్యక్షురాలిగా చైర్పర్సన్ కవిత, సభ్యులుగా జడ్పీటీసీలు ఎ. సత్యనారాయణమూర్తి (దుమ్ముగూడెం), అంకత మల్లికార్జున్ (అశ్వారావుపేట), చండ్ర అరుణ (ఇల్లెందు), జాడి జానమ్మ (పినపాక), గౌని ఐలయ్య (బయ్యారం), ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, అశ్వారావుపేట, ఖమ్మం ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పువ్వాడ అజయ్‌కుమార్ ఎన్నికయ్యారు. 3. వ్యవసాయ కమిటీ ఈ కమిటీ అధ్యక్షులుగా వైస్ చైర్మన్ బరపటి వాసు, సభ్యులుగా జడ్పీటీసీలు సోమిడి ధనలక్ష్మి (వాజేడు), వి.రామచంద్రనాయక్ (కూసుమంచి), గుగులోత్ బాషా (వేంసూరు), గోగ్గిల లక్ష్మి (గుండాల), జియావుద్దీన్ (కోఆప్షన్ సభ్యులు), ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. 4. విద్య, వైద్య సేవల కమిటీ అధ్యక్షులుగా చైర్పర్సన్ కవిత, సభ్యులుగా లక్కినేని సురేందర్ (టేకులపల్లి), గిడ్లం పరంజ్యోతిరావు ( కొత్తగూడెం), కూరపాటి తిరీషా (చింతకాని), అంకశాల శ్రీనివాస్ (ఎర్రుపాలెం), మౌలాన (కోఆప్షన్ సభ్యులు), కొత్తగూడెం, మధిర ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావ్, మల్లు భట్టివిక్రమార్క ఎన్నికయ్యారు. 5. మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా జడ్పీటీసీ తోటమళ్ల హరిత (చర్ల), సభ్యులుగా అనిత (నేలకొండపల్లి), మూడు ప్రియాంక (మధిర), తోకల లత (అశ్వాపురం), విజయ (తిరుమలాయపాలెం), పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య ఎన్నికయ్యారు. 6. సాంఘిక సంక్షేమ కమిటీ అధ్యక్షురాలిగా సత్తుపల్లి జడ్పీటీసీ హసావత్ లక్ష్మి, సభ్యులుగా శ్యామల (ఏన్కూరు), తేజావత్ సోమ్మా (కొణిజర్ల), వాంకుడోతు రజిత (పెనుబల్లి), బి. అంజి (ముల్కలపల్లి), ఏఎస్ వెంకటేశ్వర్లు (జూలూరుపాడు), నాగేశ్వరరావు (ముదిగొండ) వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు బాణోత్ మదన్‌లాల్, సండ్ర వెంకటవీరయ్య ఎన్నికయ్యారు. 7. పనుల స్థాయీ కమిటీ అధ్యక్షురాలిగా చైర్పర్సన్ కవిత, సభ్యులుగా జడ్పీటీసీలు ఉన్నం వీరేందర్ (కారేపల్లి), ధరావత్ భారతి (ఖమ్మం రూరల్), వీరూనాయక్ (రఘునాథపాలెం), బాణోత్ కొండ (బోనకల్లు), బొర్రా ఉమాదేవి (వైరా), ఎద్దు మాధవి (గార్ల), ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎన్నికయ్యారు. -
‘కారుణ్యం’ కరువాయె..!
ఖమ్మం జడ్పీ సెంటర్: జిల్లాలో కారుణ్య నియామకాల జాడ కనపించటం లేదు. అనేక మంది అర్హులైన అభ్యర్థులు ఉన్నా పోస్టుల భర్తీకి అధికారులు ఆసక్తి చూపటం లేదు. డ్యూటీలో ఉండి చనిపోయిన వారి పిల్లలకు రోస్టర్, విద్యార్హత ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు మాత్రం.. ఈ పోస్టుల భర్తీపై శ్రద్ధపెట్టడం లేదు. ఇప్పటికే పలువురి ఉద్యోగ విరమణతో పలు శాఖల్లో పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటిని కారుణ్య నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తే.. ఇప్పటికే విధుల్లో ఉన్న ఉద్యోగులకు పదోన్నతి లభించదనే కారణంతోనే ఖాళీల వివరాలను ఆయా శాఖల అధికారులు గోప్యంగా ఉంచుతున్నార నే ఆరోపణలు ఉన్నాయి. కలెక్టర్‌కు కూడా వీటి విషయం తెలపడం లేదని తెలుస్తోంది. జిల్లా పరిషత్ ఆధీనంలోని పంచాయతీరాజ్‌శాఖలో సుమారు 50 వరకు కారుణ్య నియామక దరఖాస్తులు ఉన్నాయని సమాచారం. ఈ ఒక్క శాఖలోనే ఇన్ని దరఖాస్తులు ఉంటే జిల్లావ్యాప్తంగా అన్ని శాఖల్లో ఇంకెన్ని ఉంటాయో ఊహించుకోవచ్చు. కలెక్టరేట్లో కారణ్య నియామకాల కోసం వంద మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్నారు. ఆందోళనలో అభ్యర్థులు కారుణ్య నియామకాలకు అర్హులైన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. గతంలో ఒకసారి కారుణ్య నియామకాలు చేపట్టారు. ఆయా శాఖల అధికారులు సరైన వివరాలు ఇవ్వకపోవడంతో ఈ నియామకాలు పూర్తిస్థాయిలో జరుగలేదు. సకాలంలో ఉద్యోగం రాక పోవడంతో కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన వారు ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక, మానసిక వేదనకు లోనవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఖాళీ పోస్టుల వివరాలు ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం.. కారుణ్య నియామక అభ్యర్థులు, వారి కుటుంబీకులకు శాపంగా మారింది. ఉద్యోగం లేకపోవడంతో తమ కుటుంబాలు వీధినపడుతున్నాయని, రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు శాఖల నుంచి ఖాళీల వివరాలు అందకపోవడం వల్లే పోస్టులను భర్తీ చేయలేకపోతున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. ఖాళీ పోస్టులను అనేక సంవత్సరాలుగా కారుణ్య నియామకాల ద్వారా భర్తీచేసే బాధ్యతను కలెక్టరేట్లోని రెవెన్యూ అధికారులు నిర్వర్తించేవారు. ఏ శాఖలో ఖాళీలను ఆ శాఖలో నింపేవారు. ఇటీవలికాలంలో ఆ బాధ్యతను కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. నాటి నుంచి పలు శాఖల పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యమవుతోంది. కొన్ని శాఖల అధికారులకే ఆయా శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడానికి, పదోన్నతులు కల్పించడానికి వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేకమంది అభ్యర్థులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టర్ ఆదేశించినా చలనం లేదు కారణ్య నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టరేట్‌కు పంపించాలని, ఆయాశాఖల్లో ఖాళీల వివరాలను అందజేయాలని కలెక్టర్ ఆదేశించినా అధికారులు మాత్రం స్పందించటం లేదు. గత కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్ సైతం ఖాళీల నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. మూడు నాలుగు నెలలు గడుస్తున్నా అధికారులు ఖాళీలను ఇవ్వకపోగా ఎలాంటి పోస్టులను భర్తీ చేయడం లేదు. వివిధ శాఖలకు సంబంధించి అనేక ఏళ్ళుగా దరఖాస్తులు భారీ సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ఆ శాఖల ఖాళీల వివరాలు లేకపోవటం వల్ల సుమారు 100కి పైగా అర్హులు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. కలెక్టర్ స్పందిస్తేనే వెలుగులు.. జిల్లా కలెక్టర్ కారుణ్య నియామకాలపై దృష్టిసారిస్తేనే పెద్ద దిక్కుకోల్పోయిన వందల కుటుంబాల్లో వెలుగులు వస్తాయి. ప్రభుత్వ శాఖల్లోని అనేక మంది ఉద్యోగులు వివిధ కారణాల వల్ల మృతిచెందడంతో పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. వారసత్వంగా అర్హులకు ప్రభుత్వం వెంటనే పొస్టింగ్‌లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. కానీ జిల్లాలో అనేకేళ్లుగా ఈపోస్టుల పై జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించక పోవటంతో కుటుంబాలు వీధినపడుతున్నాయి. పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాల్లో వెలుగులు నింపాలంటే కలెక్టర్ స్పందించాల్సిందేనని పలువురంటున్నారు. -
పవర్‌పైనే వార్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దాదాపు మూడున్నరేళ్ల తర్వాత జిల్లా పరిషత్ పాలక మండలి శుక్రవారం భేటీ కానుంది. ఎన్నికల జాప్యంతో మూడేళ్లపాటు పాలకమండలి లేకపోవడంతో జిల్లా పరిషత్ ప్రత్యేక పాలనలో సాగింది. తాజాగా పాలకవర్గం ఏర్పాటైన తర్వాత శుక్రవారం తొలిసారిగా సమావేశం కానుంది. పాలకవర్గం ఎన్నికైన అనంతరం మన ఊరు-మన ప్రణాళిక నేపథ్యంలో ఓసారి సమావేశం జరిగినప్పటికీ.. స్థాయి సంఘాల ఏర్పాటు, వాటి సమావేశాల తర్వాత జరుగుతున్న భేటీ కానుండడంతో సమావేశానికి ప్రాముఖ్యత సంతరించుకుంది. దరఖాస్తులు.. విద్యుత్ సమస్య జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 11గంటలకు చైర్పర్సన్ సునీతారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు కలెక్టర్ ఎన్.శ్రీధర్, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు సమావేశంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం జిల్లా రైతాంగం విద్యుత్ సమస్యనెదుర్కొంటోంది. ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న సంక్షేమ పథకాల దరఖాస్తు అంశంపైనా వాడీవేడి చర్చ జరగనుంది. దరఖాస్తు ప్రక్రియలో గ్రామాల్లో గంటల తరబడి వేచిచూడాల్సి రావడం.. దరఖాస్తు పత్రం తీసుకునే అంశంలో అధికారుల వైఖరి తదితర అంశాలు స్థానిక ప్రజాప్రతినిధులకు ఇబ్బందికరంగా మారాయి. ఈ సమస్యలను తాజా సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ప్రస్తావించనున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్లు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. మరోవైపు నిధులు మంజూరైనా అధికారుల నిర్లక్ష్య వైఖరితో వాటి పనులు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఈ అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ముంది. కొత్త పాలకవర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కొత్తవారే కావడంతో జెడ్పీలో సమావేశంలో దాదాపు అందరూ కూడా తమ ప్రాంత సమస్యలపై గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. -
సాదాసీదాగా..
ఆదిలాబాద్ అర్బన్ : మొదటిసారిగా నిర్వహించిన జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు సాదాసీదాగా కొనసాగాయి. కొత్త ప్రజాప్రతినిధులు.. కొత్త బాధ్యతలు.. మొదటిసారి కమిటీ అధ్యక్షులు.. ఇలా అంతా కొత్తకొత్తగా అన్నట్లు సాగింది. సమావేశాలు జిల్లా పరిషత్‌లోని చైర్పర్సన్ చాంబర్లో మంగళవారం జరిగాయి. ఆయా కమిటీల అధ్యక్షుల ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహించారు. మొత్తం ఏడు స్థాయీ సంఘాలు ఉండగా.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగాయి. ప్రణాళిక, ఆర్థిక స్థాయి కమిటీ, గ్రామీణాభివ ృద్ధి కమిటీ, వ్యవసాయ కమిటీ, విద్య, వైద్య సేవల కమిటీ, మహిళా సంక్షేమ కమిటీ, సాంఘిక సంక్షేమ కమిటీ, పనుల స్థాయి కమిటీలు ఉన్నాయి. కాగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ వల్లకొండ శోభారాణి, కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆరు స్థాయీ సంఘ సమావేశాలు జరుగగా, వ్యవసాయ కమిటీ స్థాయీ సంఘ సమావేశం జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ మూల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశాలకు కమిటీ జెడ్పీ సభ్యురాళ్లు అధ్యక్షులుగా వ్యవహరించారు. కాగా.. మొదటిసారి నిర్వహించిన ఈ సమావేశాలకు ముఖ్యనేతలు గైర్హాజరయ్యారు. పనుల కమిటీలో ఉన్న నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి తప్ప ఇతర శాసన, పార్లమెంట్, మంత్రి, మండలి సభ్యులు హాజరుకాకపోవడం గమనార్హం. కాగా, స్థాయి సంఘాల సమావేశంలో కమిటీ సభ్యులు చర్చించినా అంశాలు మండల స్థాయి సమస్యలు కావడం శోచనీయం. జిల్లా స్థాయి సమస్యలు చర్చకు రావడం లేదని అధికారులు చర్చించుకోవడం విశేషం. కాగా కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు జిల్లా స్థాయి అధికారులు సమాధానాలు ఇస్తూ అంశాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, జిల్లా అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. స్థాయి సంఘాల వారీగా... గ్రామీణాభివ ృద్ధి కమిటీ : ఈ స్థాయి కమిటీకి అధ్యక్షులుగా జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి నిర్వహించగా.. ఆమె ఆధ్వర్యంలోనే కమిటీ సమీక్ష జరిగింది. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, వడ్డీ లేని రుణాలు, మార్కెటింగ్, పింఛన్లు, ఉన్నతి, వికలాంగుల సంక్షేమంపై చర్చించారు. జిల్లాలో 122 మంది వికలాంగులకు పోలియో వ్యాధికి శస్త్ర చికిత్సలు మొదటి సారిగా చేయించామన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రెవెన్యూ భూములకు చెందిన 1,07,936 కేసులు నమోదు కాగా, 1,00,472 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. జిల్లాలో పది పాలశీతలీకరణ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం నాలుగు పని చేయడం లేదని వివరించారు. హెల్త్ నూట్రిషీయన్ ద్వారా 2042 మంది బాలింతలు లబ్ధిపొందుతున్నారని వివరించారు. బంగారుతల్లి పథకం కింద ఇప్పటి వరకు 14,158 మందిని నమోదు చేశామన్నారు. జిల్లాలోని పర్యాటక అభివ ృద్ధి పనులపైనా చర్చించారు. కాగా, పింఛన్లు అర్హులకు సైతం రావడం లేదని, నడవలేని వారు సైతం ఉన్నారని, వారి కుటుంబ సభ్యులకు నెలనెలా పింఛన్ ఇచ్చేలా చూడాలని కమిటీ సభ్యులు చైర్పర్సన్ ద ృష్టికి తెచ్చారు. వ్యక్తిగత మరుగుదొడ్లు సొంత డబ్బులతో నిర్మించుకున్నా ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదన్నారు. ఉపాధి పనులకు సంబంధించి ఇప్పటి వరకు కూలీ డబ్బులు చెల్లించని దుస్థితి నెలకొందని వివరించారు. దీంతో పాటు వివిధ 13 అంశాలను ఈ కమిటీలో సమీక్షించారు. ప్రణాళిక, ఆర్థిక స్థాయి కమిటీ.. : ఈ కమిటీకి జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి అధ్యక్షులుగా వ్యవహరించారు. సాధించిన ప్రగతి అంశాలపై చర్చించారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ సభ్యులుగా ఉన్నారు. ఆర్థిక స్థితిగతులపై సమీక్షించారు. వ్యవసాయ కమిటీ : ఈ కమిటీకి అధ్యక్షుడిగా జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి వ్యవహరించారు. వ్యవసాయ, అనుబంధ శాఖలకు చెందిన అంశాలను చర్చించారు. వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, హార్టికల్చర్, మార్కెటింగ్, ఆత్మ, ఇతర అంశాలు చర్చించారు. ముఖ్యంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదని, భూమి రైతులకు పరిహారం ఇస్తున్నారని, దీన్ని నిలుపుదల చేసి రైతులకు మేలు చేయాలని సభ్యులు కమిటీ ద ృష్టికి తెచ్చారు. 30 శాతం మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆదర్శ రైతుల వల్ల పూర్తి స్థాయిలో వారు చెప్పిన పేర్లు పరిహారం జాబితాలో ఉన్నాయని కమిటీ ద ృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం రైతులు రుణాల మాఫీకి, రీ షెడ్యూల్‌కు, నష్ట పరిహారానికి నోచుకోవడం లేదని కమిటీ సభ్యులు వివరించారు. కోటపల్లి మండలంలోని సిర్పా గ్రామంలో అనుమతులు లేకుండా ఎరువులు విక్రయిస్తున్నారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీంతో ఆ ఏరియాలో 200 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిందని జేడీఏ రోజ్‌లీల ద ృష్టికి తెచ్చారు. అనంతరం ఒక్కో శాఖపై సమీక్షించారు. విద్య, వైద్య సేవల కమిటీ : ఈ కమిటీకి జెడ్పీ చైర్‌పర్సనే అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఎనిమిది అంశాలపై చర్చ జరిగింది. పాఠశాలల్లో కంప్యూటర్ విద్య మూలనపడిందని, పాఠశాలల్లో కంప్యూటర్ నిర్వహణ కొత్త సంస్థకు అప్పగించేందుకు రాష్ట్ర స్థాయికి పంపాలని సభ్యులు కమిటీ ద ృష్టికి తెచ్చారు. భీమిని మండల వైద్యాధికారి కార్యాలయంలో ఒకే డాక్టర్ ఉన్నారని, అక్కడ స్థానికంగా ఉండే డాక్టర్‌ను నియమించాలన్నారు. రిమ్స్ ఆస్పత్రిలో డెంగ్యూ వ్యాధికి మెడిసిన్ దొరుకుతుందా.. అని అధికారులను ప్రశ్నించారు. లక్షలు ఖర్చు చేస్తూ ఇతర జిల్లాలో వైద్యం చేయించుకున్నారని చెప్పారు. సిర్పూర్(టి)లోని ఆస్పత్రిలో ముగ్గురు డాక్టర్లు ఉన్నా.. అత్యవసర సమయానికి ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో ఉండరని చెప్పారు. మహిళా సంక్షేమ కమిటీ.. : కుంటాల జెడ్పీటీసీ సభ్యురాలు రాథోడ్ విమల అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఈమె ఆధ్వర్యంలో ఏడు అంశాలపై చర్చ జరిగింది. అంగన్వాడీ భవనాలు కావాలని, జైనూర్‌లో పనిచేస్తున్న సూపర్వైజర్, అంగన్వాడీ వర్కర్లు ఇంత వరకు తెలియడం లేదని జెడ్పీటీసీ సభ్యులు కమిటీ ద ృష్టికి తెచ్చింది. పౌష్టికాహారం వివరాలు ఇంత వరకు తెలియదని భైంసా జెడ్పీటీసీ సభ్యుడు తెలిపారు. సాంఘిక సంక్షేమ కమిటీ.. : ఈ కమిటీకి అధ్యక్షురాలిగా ఖానాపూర్ జెడ్పీటీసీ సభ్యురాలు తాళ్లపెల్లి సునిత ఉన్నారు. మొత్తం ఎనిమిది అంశాలపై చర్చ జరిగింది. ఎస్సీ, బీసీ కులాలకు చెందిన ప్రగతి అంశాలపై చర్చించారు. సాంఘిక, వెనుకబడిన తరగతుల పాఠశాలల్లో ఇంత వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదని, హాస్టల్ విద్యార్థులకు బెడ్‌షీట్ ఇవ్వలేదని సభ్యులు కమిటీ ద ృష్టికి తెచ్చారు. గురుకుల పాఠశాలల్లో, వసతి గ ృహాల్లో సోలార్ వెలుగులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. కస్తూరిబా బాలిక విద్యాలయాల్లో నాణ్యత లేని కూరగాయలు కొని విద్యార్థులకు పెడుతున్నారని చెప్పారు. పనుల స్థాయి కమిటీ.. : ఈ కమిటీకి జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి అధ్యక్షులు. కమిటీలో ఉన్న మొత్తం 26 అంశాలపై చర్చించారు. ఒక్కో అంశానికి ఐదు నిమిషాల చొప్పున సమయం కేటాయించారు. పనుల స్థాయి కమిటీ సమీక్షల్లో పెండింగ్‌లో ఉన్న పనులు ప్రధానంగా చర్చించారు. రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. మండల స్థాయిలో జరిగిన సర్వసభ్య సమావేశాలకు సైతం 50 శాతం మంది మండల స్థాయి అధికారులు హాజరుకావడం లేదనినిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి కమిటీ ద ృష్టికి తెచ్చారు. ముఖ్యంగా పనులు పూర్తైపెండింగ్లో ఉన్న వివిధ బిల్లులు, భవన ప్రారంభోత్సవాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. భవనాలు పూర్తి చేసి తాళాలు వేసుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం ఒక్కో అంశంపై చర్చించారు. -
ఇదేనా ‘ప్రగతి’
* జిల్లా ప్రగతి నివేదికలో అస్తవ్యస్తంగా సమాచారం * రూపకల్పనలోనూ అధికారుల అలసత్వం * నిర్లక్ష్యాన్ని వీడని ప్రభుత్వ శాఖలు ఒంగోలు: జిల్లా పరిషత్ పాలనా పగ్గాలు మూడున్నరేళ్లుగా అధికారుల చేతుల్లోనే ఉండటంతో వారిలో నిర్లక్ష్యం పాలు పెరిగి పోయింది. జెడ్పీ నూతన పాలకవర్గం ఏర్పడిన తరువాత ఈనెల 10వ తేదీ నిర్వహించి న తొలి సర్వసభ్య సమావేశానికి హాజరైన సభ్యులకు వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రగతి నివేదికను జెడ్పీ అధికారులు పంపిణీ చేశారు. దాదాపు అన్ని శాఖలూ మొక్కుబడి సమాచారాన్నే అందించాయి. * ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన గృహాల వివరాలను 2006 - 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు జీవో నంబర్ 171, రచ్చబండలకు సంబంధించిన వివరాలు మాత్రమే నివేదికలో పొందుపర్చారు. అంతే తప్ప ఆ శాఖ వద్ద ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం కోసం ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంత మందికి ఈ ఏడాది రుణం మంజూరు చేశారు, ప్రస్తుతం ప్రభుత్వం ఏయే పథకాలను అమలు చేస్తోంది, గత ప్రభుత్వంలో రుణం మంజూరై నిర్మాణంలో ఉన్న గృహాలకు బిల్లులు ఏమైనా చెల్లించారా తదితర వివరాలు ఏవీ పొందుపరచకపోవడం గమనార్హం. * ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ లిమిటెడ్ పొందుపరిచిన సమాచారం కూడా అరకొరగానే ఉంది. అమ్మహస్తం పథకం సరుకుల కొనుగోలు లేదా పంపిణీ వివరాలు కేవలం ఏప్రిల్ 2014 వరకే ఉన్నాయి. ప్రస్తుతం ఎటువంటి సరుకులను పంపిణీ చేస్తున్నారనే సమాచారాన్ని పౌరసరఫరాల శాఖ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఈ నెలలో భారీగా రేషన్ కార్డులకు కోత పడింది.ఆధార్ సమర్పించలేదంటూ 5.30 లక్షల కార్డులు తొలగించారు. అయినా కార్డుదారుల పాత వివరాలనే సమర్పించారు. * ఈ వ్యవసాయ సీజన్లో విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కారు. అసలు విత్తనాభివృద్ధి సంస్థ వద్ద ఏయే రకం విత్తనాలు ఎంత మేరకు ఉన్నాయి. ఇంకా విత్తనాలు ఎంత మోతాదులో అవసరం అనే వివరాలు కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎరువులు, ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎంతమేర పంటలను సాగుచేశారనే వివరాలను కూడా సభ్యులకు ఇవ్వకపోవడం గమనార్హం. * జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి పంపిన సమాచారంలో కూడా కనీసం ఎన్ని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు? గ్రంథపాలకులు లేనివెన్ని, నూతన భవనాల నిర్మాణం కోసం ఎక్కడెక్కడ స్థలాలు కావాలని విజ్ఞప్తి చేశారనే వివరాలు కూడా లేవు. * జిల్లా విద్యాశాఖ పొందుపరిచిన సమాచారం అసమగ్రంగా ఉండటంతో సభ్యుల ఆగ్రహానికి గురికావలసి వచ్చింది. జిల్లాలో మొదటి దశలో మొత్తం 37 మోడల్ పాఠశాలల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతి లభించింది. వాటిలో 11 పాఠశాలలకు మాత్రమే నిధులు మంజూరయ్యాయి. 5 నిర్మాణం పూర్తిచేసుకోగా...5 చోట్ల నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే ఈ వివరాలను తెలియజేయడంలో విద్యాశాఖ అయోమయాన్ని సృష్టించింది. దీంతో జిల్లా విద్యాశాఖాధికారిపై జెడ్పీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. * జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం లిమిటెడ్ మొత్తం మూడు పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే కేవలం 27 మండలాల సమాచారం మాత్రమే నివేదికలో ఉంది. మిగిలిన 29 మండలాల సమాచారం లేదు. అది కూడా కేవలం ఒక పథకానికి సంబంధించిన సమాచారం మాత్రమే ఇచ్చారు. * ఏపీబీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం కోసం ప్రగతి భవన్ వెనుక వైపు శంకుస్థాపన చేశారు. దానిపై ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు. దాని నిర్మాణానికి సంబంధించి ఎటువంటి వివరాలు లేవు. * జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వివరాలే సభ్యులకు ఇచ్చిన పుస్తకంలో లేవు. -
శాసిస్తే... ఖబడ్దార్
ఒంగోలు: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రెండో రోజైన శనివారం కూడా తీవ్ర వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశం హాలులో ప్రారంభమైన ఈ సమావేశంలో బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి మాట్లాడుతూ పలుమార్లు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ జడ్పీ చైర్మన్‌ను విమర్శించడంతో ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అడ్డగోలు’ అనే పదాన్ని ఉపసంహరించుకోవాలి. సభాధ్యక్షుడ్ని గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి అంటూ హితవు పలికారు. తాను అడ్డగోలు తనంగా తీర్మానం పెట్టరాదని మాత్రమే చెప్పానని, అలా చేస్తే చట్టవిరుద్ధంగా చేశారంటూ ప్రభుత్వం రద్దుచేస్తుంది...అప్పుడు ఏం చేస్తారంటూ ఎంపీ చెబుతుండగానే జడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ మరింత ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వంలో ఉన్నది మీరు...మంచిపనికి ..చెడ్డపనికి తేడా తెలియదా....మంచి పనిని ఫ్రభుత్వం ఎందుకు రద్దుచేస్తుంది....రాజకీయంగా మాట్లా డి జడ్పీని నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదంటూ మండిపడ్డారు. ఇప్పటికే స్టాండింగ్ కమిటీలు వేయకుండా అడ్డుకుంటున్నారు. ఇంకా జిల్లా అభివృద్ధిని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తే జడ్పీటీసీ సభ్యులు, జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వ్యవసాయంపై చర్చ... అనంతరం వ్యవసాయశాఖపై చర్చకు జెడ్పీ చైర్మన్ అనుమతించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతూ శనగకు ప్రత్యామ్నాయంగా ఏయే పంటలు వేసుకోవాలో రైతులను చైతన్యం చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని విమర్శించారు. ఇప్పటికే కోల్డ్ స్టోరేజీలలో శనగలు నిల్వ ఉంచుకొని రైతాంగం తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నా ప్రత్యామ్నాయ చర్యలపై మౌనం వహించడం సరికాదంటూ పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, కౌలు రైతులకు రుణాలు తదితర అంశాలపైనా ప్రశ్నల పరంపర కొనసాగించారు. మార్కాపురం ప్రాంతాల్లో ఎరువులు, పురుగు మందుల ధరలు ఎంఆర్పీ కంటే దాదాపు వంద రూపాయల తక్కువకు విక్రయిస్తున్నారని, నాసిరకంగా ఉన్నాయేమో పరిశీలించాలని సూచించారు. అద్దంకి నియోజకవర్గంలో కొన్ని సొసైటీలకు ఎరువులు ఇచ్చి, మరికొన్ని సొసైటీలకు నిధులు ఇవ్వకుండా అధికారులు వ్యవహరించడం సరికాదంటూ అద్దంకి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బల్లికురవ ఏవోపై ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లోపం ఎక్కడ జరిగిందో పరిశీలించి చర్యలు తీసుకుంటామని జేడీ మురళీకృష్ణ సమాధానమిచ్చారు. ఫారెస్ట్ అకాడమీని దోర్నాలలో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలి సమైక్య రాష్ట్రంలో ఫారెస్ట్ అకాడమీ అదిలాబాద్ జిల్లాలో ఉందని, అయితే నేడు రాష్ట్రం విడిపోయిన తరువాత నల్లమల అటవీప్రాంతం దట్టంగా ఉన్న యర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాలలో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలంటూ సమావేశంలో డేవిడ్‌రాజు సూచించారు. ప్రతిపాదనను తప్పకుండా ప్రభుత్వానికి పంపుతామంటూ జడ్పీ చైర్మన్ ప్రకటించారు. అనంతరం అధికారులు తుఫాను ప్రభావ ప్రాంతాలలో సేవలందించేందుకు అం దుబాటులో ఉండాల్సి ఉన్నందున సర్వసభ్య సమావేశాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించారు. కైలాష్ సత్యార్థి....మలాలకు జడ్పీ అభినందనలు... బాల కార్మికుల నిర్మూలనకు , బాలికా విద్య కోసం ఒంటరి పోరాటం చేస్తూ నోబుల్ శాంతి బహుమతికి ఎంపికైన మధ్యపదేశ్ ఇంజినీర్ కైలాష్ సత్యార్థి, పాక్ బాలిక మలాలాను అభినందించే తీర్మానాన్ని అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవి కుమార్ ప్రవేశపెట్టగా సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ ప్రతిపాదించారు. మార్కాపురం శాసనసభ్యుడు జంకే వెంకటరెడ్డి, యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజులు మాట్లాడుతూ మధర్థెరెస్సా తరువాత నోబుల్ శాంతి బహుమతికి ఎంపికైన సత్యార్థి మన దేశవాసులందరికీ గర్వకారణమంటూ ప్రశంసించారు. 80 వేలమంది బాల కార్మికులకు విముక్తి కల్పించిన సత్యార్థికు అభినందనలు ప్రకటిస్తూ ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే అంశంపై కొండేపి శాసన సభ్యుడు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ తీర్మానాన్ని తాము కూడా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. -
మూడేళ్ల తర్వాత... నేడే
ఒంగోలు : సమస్యలకు ... సవాళ్లకు జెడ్పీ తొలి సర్వసభ్య సమావేశం వేదిక కానుంది. శుక్రవారం పాత జిల్లా పరిషత్ సమావేశం హాలులో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి జెడ్పీటీసీ సభ్యులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొననున్నారు. మూడేళ్ల జాప్యం అనంతరం జెడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతుండడంతోపాటు ప్రస్తుతం రైతులు, పింఛన్‌దారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు సమావేశానికి ‘కాక’ పుట్టించనున్నాయి. ఈ నేపథ్యంలో సభను అర్థవంతంగా...ఆదర్శవంతంగా నిర్వహించేందుకు సభ్యులంతా సహకరించాలని, జిల్లా పరిషత్ సమావేశాలు రాష్ట్రంలోనే అందరి దృష్టినీ ఆకర్షించేలా ప్రజాప్రతినిధులు కూడా మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ పిలుపు ఇవ్వడం తెలిసిందే. మూడేళ్ల అనంతరం... జిల్లా పరిషత్ గత పాలకవర్గం గడువు 2011 జూలై 9వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో చివరి సర్వసభ్య సమావేశం 2011 జూలై 7వ తేదీన వాడీవేడీగా జరిగింది. ఆ తరువాత ఎన్నికల నిర్వహణకు పలు కీలకాంశాలు సమస్యగా మారడంతో జిల్లా పరిషత్‌కు ప్రత్యేకాధికారి పాలనే దిక్కయింది. ఈ ఏడాది సాధారణ ఎన్నికలకు ముందు ఏప్రిల్ నెలలో జడ్పీటీసీ ఎన్నికలు జరగడం ... ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చెందిన 31 మంది సభ్యులు, తెలుగుదేశం పార్టీకి చెందిన 25 మంది సభ్యులు గెలుపొందారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వైఎస్సార్ సీపీ సభ్యులను దేశం వర్గీయులు గాలం వేయడంతో కొంత గందరగోళం నెలకుంది. ఛైర్మన్ ఎంపిక విషయంలో ఉత్కంఠ చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో చైర్మన్ ఎన్నిక సమయంలో టీడీపీ తరుపున గెలిచిన ఈదర హరిబాబు స్వతంత్ర అభ్యర్థిగా చైర్మన్ బరిలో నిలవడం, అతనికి వైఎస్సార్సీపీ సభ్యులు సహకరించి మద్దతు తెలపడంతో ఆయన ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. తరువాత విప్ ధిక్కరణ నేరంపై ఈదర హరిబాబు ఎన్నికను రద్దుచేయడంతో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న నూకసాని బాలాజీ చైర్మన్ హోదాలో నేడు కొనసాగుతున్నారు. ప్రధాన చర్చనీయాంశాలు ఇవే...: తాజాగా జరగనున్న జెడ్పీ సమావేశంలో ప్రధానంగా పలు అంశాలు చర్చకు రానున్నాయి. శనగల మద్ధతు ధర, కొనుగోలు విషయం, పింఛన్లు అంశాలపై సభ్యులు తమ గళాన్ని విప్పడానికి సమాయత్తమవుతున్నారు. సెగ పెట్టించనున్న శనగలు, పింఛన్లు: జిల్లాలో శనగ రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్చూరు జన్మభూమి కార్యక్రమంలో రైతులనుద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు సహజంగానే రైతులకే కాకుండా వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలను సైతం ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. మరో వైపు జన్మభూమిలో పెన్షన్ల విషయంలో పారదర్శకత లోపించిందంటూ వస్తున్న ఆరోపణలపై కూడా సభ్యులు తీవ్రంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది. తమకు కనీసం సెంటు భూమి కూడా లేకున్నా ఐదు ఎకరాల పొలం ఉందంటూ పెన్షన్లు రద్దు చేస్తున్నారనే వాదన ప్రజల నుంచి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపైనా కొంతమంది సభ్యులు పూర్తిస్థాయిలో తమ వాదనలను వినిపించే అవకాశం కనిపిస్తోంది. ఈదర హరిబాబును అనర్హుడిగా జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించినందున 55 మంది మాత్రమే జడ్పీ పాలకవర్గంలో ఉన్నారు. జిల్లాలో ముగ్గురు ఎంపీలలో వైఎస్సార్సీపీకి చెందిన ఇరువురు, టీడీపీకి చెందిన ఒకరు హాజరుకానున్నారు. ఎంపీ లాడ్స్పై సమావేశం ఢిల్లీలో ఉండటంతో ఎంపీలు వచ్చే అవకాశాలు లేవు. వైఎస్సార్సీపీ తరుపున రుగురు ఎంఎల్ఏలు, టీడీపీ తరుపున ఐదుగురు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఈ సమావేశాలకు హాజరుకావాల్సి ఉంది. ఎంఎల్సీలకు సంబంధించి ఇద్దరు సీపీఎం పార్టీకి చెందిన వారు కాగా, మరొకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు. క్రీడాకారుల సమస్యకు పరిష్కారం లభించే అవకాశం... క్రీడల నిర్వహణకు నిధుల లేమి కారణంగా క్రీడాకారులు నిత్యం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల స్కూల్‌గేమ్స్ సెలక్షన్స్ సందర్బంగా కనీసం భోజనం కూడా లేకుండా క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థుల సమస్యను జెడ్పీ చైర్మన్ స్వయంగా చూశారు. నిధుల కొరతే కారణమని తెలియడంతో దానిపై ఆయన అధ్యయనం చేసి జిల్లా పరిషత్‌కు వచ్చే కొన్ని రకాల నిధులలో కొంత శాతాన్ని క్రీడలకు ఇచ్చే అవకాశం ఉందని గుర్తించారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావనకు తేనున్నారు. వాటితోపాటు జిల్లా పరిషత్ నూతన భవన నిర్మాణం, జడ్పీ ఆస్తుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, పచ్చని ప్రకాశం- పరిశుభ్రత, అక్షర ప్రకాశం తదితర అంశాలపైనా తీర్మానం చేసే అవకాశం ఉంది. -
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
నీలగిరి :జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు, స్థాయీ సంఘ సమావేశాలకు గైర్హాజరవుతున్న సంబంధిత శాఖల అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి హెచ్చరించారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో 3వ వ్యవసాయ స్థాయీ సంఘ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశానికి 14 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉంది. కానీ సమావేశంలో ప్రధాన ఎజెండా అంశాలైన డ్వామా, మార్కెటింగ్, అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారులు గైర్హాజరయ్యారు. డ్వామా పీడీ సెలవులో ఉన్నందున ఆమె స్థానంలో ఏపీడీ హాజరుకావాల్సి ఉండగా సూపరింటెండెంట్ వచ్చారు. అదేవిధంగా అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారికి బదులు కిందిస్థాయి ఉద్యోగి హాజరయ్యారు. ఇక మార్కెటింగ్ శాఖ అధికారులు ఎవరూ కూడా సమావేశానికి రాలేదు. దీంతో ఉద్యోగులతో సమీక్షలు చేయడం సాధ్యం కాదని.. జెడ్పీ సమావేశాలకు తప్పని సరిగా అధికారులు హాజరుకావాల్సిందేనని చైర్మన్, వైస్ చైర్మన్లు స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా అధికారులు సమీక్షలకు గైర్హాజరవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో సారి ఆ శాఖల అధికారులను రప్పించి కలెక్టర్ సమక్షంలో సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఈఓను ఆదేశించారు. వన్యప్రాణి విభాగం పై ఫైర్... నాగార్జునసాగర్ అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చైర్మన్, వైస్‌చైర్మన్ మండిపడ్డారు. మారుమూల తండాల్లో కంకర రోడ్లు పూర్తయినా వాటిపై బీటీ వేయకుండా సం బంధింత అధికారి లేనిపోని కొర్రీలు పెడుతున్నారని వాపోయారు. సాగర్‌లో మెయిన్‌రోడ్డుకు సమీపంలో నిర్మించిన దేవస్థానం గోపుర శిఖరం అటవీ శాఖ నిబంధనలకు అడ్డుగా ఉం దన్న కారణంతో దానిని సంబంధిత అధికారి తీసుకెళ్లారని వైస్ చైర్మన్ తెలి పారు. హాలియా - పెద్దవూర కూడలి వద్ద ఏర్పాటు చేసిన సమ్మక్క-సారక్క దేవస్థానం లైట్లు పులులకు ఇబ్బందికరంగా మారాయని వాటిని తొలగించారన్నారు. ఈ విషయాలన్నీ చర్చించాల్సిన సమావేశానికి అధికారి గైర్హాజరుకావడం పట్ల వారు మండిపడ్డారు. అడ్డగోలు అక్రమాలు.. కిరోసిన్ డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా కిరోసిన్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారని స్థాయీ సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. రెండు నెలల పేరు మీద ఒక్కసారి మాత్రమే కిరోసిన్ పంపిణీ చేసి మిగతా కోటాను బ్లాక్మార్కెట్లో అమ్ముకుంటున్నారని వైస్ చైర్మన్ అధికారులకు వివరించారు. నెలవారీ కోటాలో కోత పెడుతూ చివరకు వచ్చే సరికి ట్యాం కుల కొద్దీ కిరోసిన్ అక్రమంగా హోల్‌సేల్ డీలర్లు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇక ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేయడంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సకాలంలో కాంట్రాక్టర్లు లారీలను పం పడం లేదని దీంతో రైతులే స్వయంగా డబ్బులు చెల్లించి ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ధాన్యం తరలిస్తున్నారని సభ్యులు వివరించారు. అలాకాకుండా వచ్చే సీజన్ నుంచి ధాన్యం రవాణా బాధ్యతలను సంఘాలకు అప్పగించాలని సభ్యులు సూచించారు. ఇక సూక్ష్మనీటి పారుదల శాఖ ఉద్యోగులు డ్రిప్ మంజూరు చేయకుండా లబ్ధిదారుల నుంచి సంతకాలు తీసుకుంటున్నారని.. వాటి పై ఎంపీపీ, జెడ్పీటీసీలను సంతకం చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని వైస్ చైర్మన్ సంబంధిత అధికారులకు తెలిపారు. లబ్ధిదారుల పేరు మీద ఇతర జిల్లాలకు డ్రిప్ పరికరాలు తరలిస్తున్నారని, డ్రిప్ ఏజెన్సీలు అక్రమాలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత డ్రిప్ బిల్లులు చెల్లించాలని, రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మంజూరు చేయాలని వైస్ చైర్మన్, సభ్యులు సూచించారు. యూరియా కోటా సహకార సంఘాలకు 60 శాతం, అధీకృత డీలర్లకు 40 శాతం ఇవ్వాలని సభ్యులు సమావేశంలో ప్రతిపాదించారు. ఈ సమావేశానికి జెడ్పీ సీఈఓ దామోదర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు రవి, సీహెచ్ కోటేశ్వరారవు, యాదగిరి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి బాసట
- జెడ్పీకాంప్లెక్స్ నిర్మాణ పనులకు మరోసారి గడువు పొడిగింపు - అంచనావ్యయం పెంచేందుకు పావులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం అనవసర ప్రేమను కురిపిస్తోంది. నాలుగేళ్లయినా పునాదులు దాటని జెడ్పీ కాంప్లెక్స్ నిర్మాణ గడువును మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా పరిషత్ బహుళ అంతస్తు భవన సముదాయం నిర్మించే పనిని 2012లో కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. ఒక్కో అంతస్తులో 20వేల చదరపు అడుగులు ఉండేలా డిజైన్ చేసిన ఈ భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించింది. గత మే నెలాఖరునాటికే ఈ భవనం అందుబాటులోకి రావాల్సివుండగా పనుల జాప్యం కారణంగా ఇప్పటికీ పునాదులకు నోచుకోలేదు. ఈ క్రమంలోనే మరో ఏడాది కాలపరిమితిని కూడా పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, నిర్మాణం పూర్తయ్యే అవకాశాల్లేకపోవడంతో మరోసారి కాంట్రాక్టు కాలపరిమితిని పెంచాలని కోరుతూ పంచాయతీరాజ్‌శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రేమాండ్ పీట ర్ 2015 మార్చినాటికీ జెడ్పీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా పరిషత్ సాధారణ నిధులతో ప్రతి పాదించిన ఈ బిల్డింగ్ ను త్వరితగతిన పూర్తి చేయాల్సిన యంత్రాంగం.. ఆ దిశగా చర్యలు తీసుకోకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని వెనుకేసుకొస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అంచనా వ్యయాన్ని కూడా మరో రూ.రెండు కోట్లు పెంచేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందుచూపు లేకుండా 2003లో నేలమట్టం చేసిన పాత భవనం స్థానే బహుళ అంతస్తుల సముదాయాన్ని నిర్మించాలనే ప్రతిపాదనలకు అడుగడుగునా అవరోధాలే ఎదురవుతున్నాయి. నిర్మాణం మొదలు పెట్టింది తడువు రాజకీయ వివాదంతో కొన్నేళ్లు బిల్డింగ్ పనులు నిలిచిపోగా, తాజాగా పనులు మొదలైనప్పటికీ, నల్లా కనెక్షన్ తీసుకోవడంలో చేస్తున్న జాప్యంతో పనులు పెండింగ్‌లో పెట్టడం అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది. -
ఎంపీపీల గుర్రు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :మండల పరిషత్ కార్యాలయాల్లో జిల్లా పరిషత్ సభ్యులకు సీట్లు కేటాయించాలనే నిర్ణయం ఇప్పటికే వివాదాస్పమై.. రానున్న రోజుల్లో ఎన్ని సమస్యలకు దారితీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ‘మండల పరిషత్‌లలో ఉన్న గదులు అధికారుల విధుల నిర్వహణకే సరిపోవడం లేదు. ఇప్పుడు కొత్తగా జడ్పీటీసీ సభ్యులకు కూడా చాంబర్, సీట్లు కేటాయించాలంటే తాము ఖాళీ చేసి బయటకు పోవాల్సిందే’నని మండల పరిషత్ అధ్యక్షులు మండిపడుతున్నారు. వాస్తవానికి జడ్పీటీసీలు గతం నుంచే మండల పరిషత్‌లలో సీటు కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇదే జరిగితే మండల పరిషత్‌లకు సమాంతరంగా జడ్పీటీసీలు పాలన సాగిస్తారని, దాని వల్ల అనవసర వివాదాలు తలెత్తుతాయనే ముందుచూపుతో ప్రభుత్వం ఇందుకు సమ్మతించలేదని అంటున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా గత నెల 24న జరిగిన జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశంలో మండల పరిషత్ కార్యాలయాల్లో జడ్పీటీసీలకు సీటు కేటాయించాలని తీర్మానించారు. దీంతో పాటు జిల్లాలోని టోల్‌ప్లాజాల ద్వారా ఉచితంగా ప్రయాణం డిమాండ్ కూడా లేవనెత్తారు. ఈ డిమాండ్ చేసింది సహచర సభ్యులే కావడం, వారి సహకారంతోనే చైర్పర్సన్ పీఠం అధిరోహించడంతో నామన రాంబాబు కాదనలేకపోయారు. ఇందుకు ప్రతిగా జెడ్పీటీసీలు పెద్ద ఎత్తున చప్పట్లతో సభలో స్వాగతం పలికి నామనకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తీరా ‘సీటు’ నిర్ణయం అమలులోకి వచ్చేసరికి ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యుల మధ్య ఆధిపత్య పోరుకు తెరతీసింది. జిల్లాలో ఈ వివాదానికి అంకురార్పణ తుని రూరల్ మండల పరిషత్‌లో జరిగింది. తుని ఎంపీపీ పల్లేటి నీరజకు కనీస సమాచారం లేకుండా జడ్పీటీసీ సభ్యురాలు జె.వెంకటలక్ష్మికి సోమవారం అడ్డగోలుగా చాంబర్ కేటాయించడం వివాదాస్పదమై పోలీసు కేసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇన్‌ఛార్జి ఎండీవో, ఈవోపీఆర్డీ కె.శేషారత్నం ఆత్యుత్సాహం ఫలితంగానే ఈ వివాదం తలెత్తిందని జిల్లావ్యాప్తంగా ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీపీ కార్యాలయంలో జడ్పీటీసీకి సీటు కేటాయించే అవకాశాన్ని అటుంచితే.. తునిలో ఈవోపీఆర్డీ దుందుడుకుగా కేటాయించే పద్ధతి కారణంతో వివాదం ముదురుపాకాన పడిందని పలువురు ఎంపీపీలు అభిప్రాయపడుతున్నారు. జడ్పీలో తీర్మానం చేశారనే ఏకైక కారణంతో ముందస్తు సమాచారం లేకుండా ఒక ఎంపీపీని అవమానించే రీతిలో తునిలో సీటు కేటాయించారని జిల్లాలోని మిగతా ఎంపీపీలు గుర్రుగా ఉన్నారు. ఇవాళ తునిలో అయ్యింది రేపు మరో మండల పరిషత్‌లో పునరావృతం కాదనే గ్యారెంటీ ఏమిటనే ప్రశ్న అధికార పార్టీకి చెందిన ఎంపీపీలు కూడా లేవనెత్తుతున్నారు. పార్టీ ఏదైనా ఎంపీపీలంతా ఒకే మాటమీద ఉండేందుకు సిద్ధపడుతున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కాజులూరు మండల పరిషత్ అధ్యక్షుడు యాళ్ల కృష్ణారావు మంగళవారం తీవ్రంగా స్పందించారు. తునిలో జరిగిన వివాదాన్ని తక్షణం పరిష్కరించాలని ఆయన ఒక పత్రికా ప్రకటనలో డిమాండ్ చేశారు. అవగాహన లేని పంచాయతీరాజ్ అధికారులతోనే ఎంపీపీలు, జడ్పీటీసీల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ విషయంలో ఇకనైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలంటున్నారు. జడ్పీలో తీర్మానం, వారికి చాంబర్ల కేటాయింపు తదితర అంశాలపై పార్టీరహితంగా ఎంపీపీలంతా ఒకటి, రెండు రోజుల్లో సమావేశం అవుతున్నారు. అ సమావేశంలోనే దీనిపై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించాలనుకుంటున్నారు. జడ్పీ నిర్ణయం ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే. -
నేడు ఎన్సీపీ నేత పాటిల్ కాంగ్రెస్‌లో చేరిక
యవత్మాల్ : జిల్లాలో గట్టి పట్టున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు ఉత్తమ్రావ్ పాటిల్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన సొంత గ్రామమైన అర్ని తాలూకా లోనీలో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో ఆయన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని మంగళవారం యవత్మాల్ జిల్లా కేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (వైడీసీసీ) చైర్మన్, ఉత్తమ్రావ్ పాటిల్ కుమారుడైన మనీష్ పాటిల్ తెలిపారు. జిల్లాపరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్ల మన్కర్ కూడా పాటిల్‌తోపాటు కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారు. డిప్యూటీ స్పీకర్ వసంత్ పర్కే, మంత్రి శివాజీరావ్ మోఘే సూచన మేరకు వారం కిందట సీఎం పృథ్వీరాజ్ చవాన్‌ను కలిసి తాము కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపామని మనీష్ వివరించారు. ఇంతకుముందు, మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రకాశ్ పాటిల్ దియోసర్కార్ సైతం పార్టీని వీడి శివసేనలో చేరిన విషయం తెలిసిందే. ఎన్సీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సందీప్ బజోరియా తిరిగి అక్కడ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టారు. ఆయనపై అసంతృప్తితో జిల్లాలోని చాలామంది ఎన్సీపీ నాయకులు పక్క పార్టీల్లో చేరిపోతున్నారు. -
అరకొరగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలోని పాఠశాలలకు ప్రభుత్వం అరకొరగా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులను మంజూరు చేసింది. జిల్లాకు అవసరమైన పోస్టుల్లో మూడవ వంతు అంటే 33 శాతం పోస్టులకు ప్రభుత్వం కోత పెట్టింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో విద్యా బోధన కుంటు పడకుండా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం జిల్లాల నుంచి ప్రతిపాదనలు కోరింది. జిల్లాలో 898 మంది అకడమిక్ ఇనస్ట్రక్టర్లు అవసరమని డీఈవో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం జిల్లాకు కేవలం 601 పోస్టులను మాత్రమే మంజూరు చేసింది. అంటే 297 పోస్టులకు కోత పెట్టింది. ఆ పోస్టులు కూడా కేవలం మూడు నెలలకే పరిమితం చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పాఠశాలలకు మరో రెండు మూడు రోజుల్లో దసరా సెలవులు ప్రకటించనున్నారు. అంటే విద్యా సంవత్సరం మొత్తంలో మూడో వంతు కాలం ముగిసినట్లే. ప్రస్తుతం జిల్లాకు మంజూరు చేసిన పోస్టులను భర్తీ చేసేప్పటికి మరి కొంత కాలం పడుతుంది. మొత్తంగా అక్టోబర్ నుంచే అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు పాఠశాలల్లో పనిచేసే అవకాశం ఉంది. ఉన్నత పాఠశాలల్లో స్కూలు అసిస్టెంట్ గణితం పోస్టులు 18 అవసరమని ప్రతిపాదించగా 13 పోస్టులు మంజూరయ్యాయి. బయోలాజికల్ సైన్స్ 28 పోస్టులు అవసరం కాగా 20 పోస్టులు, సోషల్ స్టడీస్ 70 పోస్టులు అవసరమని ప్రతిపాదన పంపగా కేవలం 26 మాత్రమే మంజూరయ్యాయి. హైస్కూళ్లలో సోషల్ టీచర్ పోస్టులు తక్కువగా ఉన్నాయి. వాటికి తోడు అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను కూడా ఇవ్వకపోవడంతో పాఠశాలల్లో సోషల్ టీచర్లకు పనిభారం విపరీతంగా పెరిగింది. భాషా పండితులకు మొత్తం 38 పోస్టులు అవసరం కాగా కేవలం 12 పోస్టులు మాత్రమే మంజూ రు చేశారు. సెకండరీ గ్రేడ్‌లో తెలుగు, ఉర్దూ మీడియంకు సంబంధించి 723 పోస్టులు అవసరం కాగా కేవలం 530 పోస్టులు మాత్రమే మంజూరు చేశారు. వ్యాయామోపాధ్యాయ పోస్టులు 21 అవసరం కాగా ఒక్క పోస్టు కూడా మంజూరు చేయలేదు. -
నేడు ‘పచ్చని ప్రకాశం’
ఒంగోలు: ‘పచ్చని ప్రకాశం...పరిశుభ్రమైన ప్రకాశం’లో భాగంగా జిల్లా పరిషత్ తొలి అడుగు వేసింది. ‘పచ్చని ప్రకాశం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలి విడత శనివారం లక్ష మొక్కలు నాటేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఈమేరకు జిల్లా అటవీశాఖ అధికారులతో కూడా చర్చించారు. లక్ష మొక్కలను అటవీశాఖ అధికారులు సిద్ధంగా ఉంచారు. పాఠశాలలే తొలి లక్ష్యం: జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల పరిధిలో దాదాపు 4 వేల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. లక్ష మొక్కలను పాఠశాలల్లోనే నాటడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలనేది జిల్లా పరిషత్ ఆకాంక్ష. అందుకు ఉపాధ్యాయులు, విద్యార్థుల భాగస్వామ్యం తీసుకునే బాధ్యత ఎంపీడీవోలపై ఉంచారు. ప్రతి పాఠశాలలో కనీసం 25 మొక్కల చొప్పున పెంచాలని ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో స్థలాభావం వల్ల మొక్కలు పెంచలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఆవరణ, గ్రంథాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాల వద్ద మొక్కలు నాటాలని దిశా నిర్దేశం చేశారు. -
నేడు జడ్పీ స్థాయీ సంఘాల ఎన్నికలు
ఇందూరు: జిల్లా పరిషత్ మరోసారి వేడెక్కనుంది. జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం స్థాయీ సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. పాలకవర్గం కొలుదీరిన 60 రోజుల లో ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆలస్యం జరిగింది. పదవులను ఆశిస్తున్న జడ్పీటీసీలు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను ఇప్పటికే కలిసినట్లు తెలి సింది. 36 జడ్పీటీసీలకు గాను 24 స్థానాలను సాధించిన టీఆర్ఎస్ జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. స్థాయీ సం ఘాల ఎన్నికలలోనూ ఆ పార్టీ దూసుకుపోనుం ది. మొత్తం ఏడు కమిటీలలో ఎవరెవరు ఉండాలనే విషయంలో మంత్రి పోచారం, ఎంపీ కవిత ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఉదయం 11గంటలకు ఎన్నికలు ప్రారంభం కాగానే, ముందుగా అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీ లేకపోతే ఏకగ్రీవంగా అభ్యర్థులను ఎన్నుకున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు మంత్రి పో చారం శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, నిజామాబాద్ ఎంపీ కవిత, జడ్పీ వైస్ చైర్ పర్సన్ గడ్డం సుమనారెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రోస్‌తోపాటు జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు హాజరుకానున్నారు. 36 మంది జడ్పీటీసీలలో కనీసం సగం మంది సభ్యులు కచ్ఛితంగా హాజరైతేనే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణకు జడ్పీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సభ్యులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. -
స్టాండింగ్ కమిటీలు ఇవే..
మచిలీపట్నం : జిల్లా పరిషత్‌లో ఏడు స్టాండింగ్ కమిటీలకు సభ్యులను నియమించినట్లు జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ ప్రకటించారు. ఆయా స్టాండింగ్ కమిటీల చైర్మన్లు, సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రణాళిక, ఆర్థిక సంఘం : గద్దె అనూరాధ చైర్పర్సన్ కాగా, మంత్రి కొల్లు రవీంద్ర, డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యులు నున్నా రామాదేవి(కలిదిండి), కిలారు విజయబిందు(తిరువూరు), మట్టా ధనలక్ష్మి(విస్సన్నపేట), మెడబలిమి మల్లికార్జునరావు(మోపిదేవి), మోటూరు వెంకట సుబ్బయ్య(పమిడిముక్కల), తాతినేని పద్మావతి(తోట్లవల్లూరు), డి.వెంకట కృష్ణారావు(గంపలగూడెం) సభ్యులుగా ఉన్నారు. గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘం : గద్దె అనూరాధ(చైర్పర్సన్) కాగా ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావు(పెడన), బోడే ప్రసాద్(పెనమలూరు), ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యులు గింజుపల్లి శ్రీదేవి(పెనుగంచిప్రోలు), బొగ్గవరపు శ్రీనివాసరావు(పెనమలూరు), కోవెలమూడి ప్రమీల(నందిగామ), పాలెం ఆంజనేయులు(ఎ.కొండూరు), కాజా రాంబాబు(ఆగిరిపల్లి), పైడిపాముల కృష్ణకుమారి(చల్లపల్లి), బడుగు తులసీరావు(కృత్తివెన్ను) సభ్యులుగా ఉన్నారు. వ్యవసాయ స్థాయీ సంఘం : శాయన పుష్పావతి చైర్ పర్సన్ కాగా, ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు), నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు భూపతి నాగకళ్యాణి(ముదినేపల్లి), షేక్ మహ్మద్ షహనాజ్‌బేగం(వీరులపాడు), మరీదు లక్ష్మీదుర్గ(గన్నవరం), మీగడ ప్రేమ్‌కుమార్(నందివాడ), కన్నా నాగరాజు(నాగయలంక), బాణావతు రాజు(నూజివీడు) సభ్యులుగా ఉన్నారు. విద్య, వైద్యసేవల స్థాయీ సంఘం : గద్దె అనూరాధ చైర్పర్సన్ కాగా, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, జెడ్పీటీసీ సభ్యులు తుమ్మల వరలక్ష్మి(ఘంటసాల), దొండపాటి రాము(మైలవరం), అమ్మనబోయిన రాణి(జగ్గయ్యపేట), ఎల్.కమల(వత్సవాయి), బి.నాగవెంకట శ్రీనుబాబు(పెడన), శాయన పుష్పావతి(గుడ్లవల్లేరు), మూల్పూరి హరీష(పెదపారుపూడి) సభ్యులుగా ఉన్నారు. మహిళా సంక్షేమ స్థాయీ సంఘం : పొట్లూరి శశి చైర్పర్సన్ కాగా, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, మంత్రి కామినేని శ్రీనివాస్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), జెడ్పీటీసీ సభ్యులు కాటూరి మోహనరాజు(ఉయ్యూరు), చెన్నుబోయిన రాధ(ఇబ్రహీంపట్నం), పాలంకి విజయలక్ష్మి(రెడ్డిగూడెం), కైలా జ్ఞానమణి(బాపులపాడు), డి.రాఘవరెడ్డి(చాట్రాయి), కంచికచర్ల కో-ఆప్షన్ సభ్యుడు అన్వర్ సభ్యులుగా ఉన్నారు. సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘం : దాసరి కరుణజ్యోతి చైర్పర్సన్ కాగా, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, తిరువూరు కో-ఆప్షన్ సభ్యుడు టి.పుష్పరాజు, జెడ్పీటీసీ సభ్యులు జి.శివరామకృష్ణప్రసాద్(కంకిపాడు), కాజ బ్రహ్మయ్య(జి.కొండూరు), చిన్ని శ్రీనివాసకుమారి(గుడివాడ), ముత్యాల నాగ నాంచారమ్మ(మండవల్లి), చిమటా విజయశాంతి(మొవ్వ), కొల్లూరి వెంకటేశ్వరరావు(అవనిగడ్డ) సభ్యులుగా ఉన్నారు. పనుల స్థాయీ సంఘం : గద్దె అనూరాధ చైర్ పర్సన్ కాగా, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జెడ్పీటీసీ భ్యులు బొమ్మనబోయిన విజయలక్ష్మి(కైకలూరు), వాసిరెడ్డి కృష్ణప్రసాద్(చందర్లపాడు), బి.శ్రీనివాసరావు(కోడూరు), కోగంటి వెంకట సత్యనారాయణ(కంచికచర్ల), కందిమళ్ల అంజనీకుమారి(విజయవాడ రూరల్), చిలుకోటి గోపాలకృష్ణ గోఖలే(గూడూరు), లంకే నారాయణప్రసాద్(మచిలీపట్నం), చిలుకూరి వెంకటేశ్వరరావు(ముసునూరు) సభ్యులుగా ఉన్నారు. -
‘స్థాయీ’పై దిశానిర్దేశం
సాక్షి, విశాఖపట్నం : జిల్లాపరిషత్ స్థాయీ సంఘ సమావేశంలో పార్టీ పరంగా వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం నగరంలోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతోపాటు, జెడ్పీ సభ్యులతో అజెండా అంశాలపై చర్చించారు. ఎవరెవరు ఏయే అంశాలపై మాట్లాడాలి. ఎవరు ఏ స్థాయీ కమిటీల్లో ఉండాలన్నదానిపై సమీక్షించారు. ఇకపై ప్రతి జెడ్పీ సమావేశానికి ముందు పార్టీపరంగా సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. ప్రజల తరపున పోరాడదాం.. : పార్టీ నేతలనుద్దేశించి అమర్నాథ్ మాట్లాడుతూ అటు రాష్ట్రంలో, ఇటు జిల్లాలో ప్రధాన ప్రతిపక్షంగా గురుతర బాధ్యత నిర్వర్తించాల్సింది మనమేనంటూ జెడ్పీ సభ్యుల్లో ఉత్సాహం నింపారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలన్నారు. స్థానికంగా జరుగుతున్న అక్రమాలు, టీడీపీ నేతల దౌర్జన్యాలను స్థాయీ సమావేశాల్లో ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలన్నారు. అజెండా అంశాలు ప్రజోపయోగ మా?, కాదా? అన్నదానిపై అజెండా అందిన వెంటనే చర్చించుకోవాలన్నారు. స్వార్థ, రాజకీయ ప్రయోజనా ల కోసం చేర్చే అంశాలపై అధికారపక్షాన్ని ఎండగట్టాలన్నారు. జిల్లాలోని మండలాలవారీ అన్ని అంశాలపై పూర్తిస్థాయి అవగాహన తెచ్చుకునేందుకు ప్రయత్నిం చాల్సిందిగా సభ్యుల్ని సూచించారు. ప్రధాన ప్రతిపక్షం గా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు బూడి ముత్యాలునాయుడు, కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పార్టీ నేతలు పెట్ల ఉమాశంకర గణేష్, ప్రగడ నాగేశ్వరరావు, 14 మంది జెడ్పీ సభ్యులు పాల్గొన్నారు. -
‘స్థాయీ’ ఏకగ్రీవం
జెడ్పీ ఏడు కమిటీలు, సభ్యుల ఎన్నిక కొన్నింటికి చైర్మన్‌గా భవాని అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం విశాఖ రూరల్: జిల్లా పరిషత్ స్థాయీ సంఘం కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కీలకమైన ఏడు కమిటీలకు చైర్మన్‌తోపాటు, సభ్యుల ఎన్నిక విషయంలో అధికార పార్టీ, విపక్ష సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. తొలుత జెడ్పీ చైర్పర్సన్,జెడ్పీటీసీలు, ఎమ్మెల్యే, ఎంపీలు చర్చించి కమిటీలో ఎవరెవరు ఉండాలన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చారు. రెండు కమిటీల్లో వైఎస్సార్సీపీకి ప్రాతినిథ్యం నామమాత్రంగా ఉండడంతో వారు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే వాటిల్లో మార్పులు చేసి వైఎస్సార్ సీపీ సభ్యులను కూడా చేర్చారు. దీంతో ఏడు కమిటీల సభ్యుల ఎన్నిక ఏకగ్రీవ మైనట్లు జెడ్పీ సీఈవో మహేశ్వరరె డ్డి ప్రకటించారు. కొన్ని కమిటీలకు చైర్మన్‌గా వ్యవహరించే జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ కమిటీల ఎన్నిక ఏకగ్రీం కావడం సంతోషదాయకమన్నారు. పార్టీలకు అతీతంగా జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు కుటుంబ సభ్యుల్లా ఉంటూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దామన్నారు. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి జెడ్పీ మంచి కార్యక్రమాలు, నిర్ణయాలు చేయాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో కరువు, మంచినీరు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు మాట్లాడుతూ డీడీఆర్సీని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జెడ్పీలోనే సమస్యలపై విస్తృతంగా చర్చించి వాటిని పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, తదితరులు పాల్గొన్నారు. ప్లానింగ్ అండ్ ఫైనాన్స్ కమిటీకి చైర్మన్‌గా జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని,ఇతర సభ్యులుగా రాష్ర్ట విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రావికమతం జెడ్పీటీ సీ రాజాన శ్రీవాణి(టీడీపీ), నాతవరం జె డ్పీటీసీ సత్యనారాయణ(టీడీపీ), జి.మాడుగుల జెడ్పీటీసీ ఎస్.ఆదినారాయణ(టీడీపీ), కోటవురట్ల జెడ్పీటీసీ వంతర వెంకటలక్ష్మి(వైఎస్సార్సీపీ) ఎన్నికయ్యారు. గ్రామీణాభివృద్ధి : అరకు ఎంపీ కొత్తపల్లి గీత, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు, భీమిలి జెడ్పీటీసీ ఎస్.అప్పారావు(టీడీపీ), కో-ఆప్షన్ సభ్యుడు గూనూరు జోసెఫ్ సత్యశ్రీరామ మూర్తి(టీడీపీ), ఆనందపురం జెడ్పీటీసీ మారికనూకరాజు (టీడీపీ), పాడేరు జెడ్పీటీసీ పొలుపర్తి నూకరత్నం (వైఎస్సార్ సీపీ), చింతపల్లి జెడ్పీటీసీ మంచాన పద్మకుమారి(వైఎస్సార్ సీపీ)లను ఎన్నుకున్నారు. వ్యవసాయం : ఈ కమిటీకి జెడ్పీ వైస్ చైర్మన్, అనంతగిరి జెడ్పీటీసీ కొట్యాడ అప్పారావు(టీడీపీ) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. సభ్యులుగా విశాఖ ఎంపీ కె.హరిబాబు, ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ, ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, అనంతగిరి జెడ్పీటీసీ కె.అప్పారావు(టీడీపీ), కొయ్యూరు జెడ్పీటీసీ గాదె శ్రీరామమూర్తి(టీడీపీ), యలమంచిలి జెడ్పీటీసీ మట్టా రాజవేణి( వైఎస్సార్ సీపీ), కో-ఆప్షన్ సభ్యుడు కొప్పిశెట్టి కొండబాబు(టీడీపీ)లు ఎన్నికయ్యారు. విద్య, వైద్యం : ఈ కమిటీకి ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, బుచ్చెయ్యపేట జెడ్పీటీసీ మామిడి సురేంద్ర(టీడీపీ), గొలుగొండ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్(టీడీపీ), మునగపాక జెడ్పీటీసీ డి.లక్ష్మీ సత్యనారాయణ(టీడీపీ), మాకవరపాలెం జెట్పీడీసీ కాశీపల్లి కుమారి(టీడీపీ), డుంబ్రిగుడ జెడ్పీటీసీ కె.కుజ్జమ్మ( వైఎస్సార్ సీపీ), జి.కె.వీధి జెడ్పీటీసీ గంటా నళినీ కృష్ణ( వైఎస్సార్ సీపీ), వి.మాడుగుల గొల్లవిల్లి ప్రభావతి( వైఎస్సార్ సీపీ)లు వ్యవహరించనున్నారు. మహిళా సంక్షేమం : ఈ కమిటీకి చైర్మన్‌గా దేవరాపల్లి జెడ్పీటీసీ గాలి వరలక్ష్మి(టీడీపీ), సభ్యులు గా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూ డి అనిత, దేవరాపల్లి జెడ్పీటీసీ గాలి వరలక్ష్మి(టీడీపీ), రోలుగుంట జెడ్పీటీసీ బోణంగి రామలక్ష్మి(టీడీపీ), అనకాపల్లి జెడ్పీటీసీ పాలెళ్ల గంగాభవాని(టీడీపీ), పెందుర్తి జెడ్పీటీసీ కె.సూర్యమణి (టీడీపీ), హుకుంపేట జెడ్పీటీసీ సాగరి వ సంతకుమారి (వైఎస్సార్ సీపీ), కె.కోటపాడు జెడ్పీటీసీ దాసరి గురయ్య (వైఎస్సార్ సీపీ), పాయకరావుపేట జెడ్పీటీసీ చిక్కాల రామారావు(వైఎస్సార్ సీపీ)లు ఏకగ్రీవమయ్యారు. సాంఘిక సంక్షేమం : కశింకోట జెడ్పీటీసీ ఎం.కాసులమ్మ చైర్మన్‌గా, చోడవరం జెడ్పీటీసీ కనిశెట్టి సన్యాసిరావు(టీడీపీ), సబ్బవరం జెడ్పీటీసీ గేదెల సత్యనారాయణ(టీడీపీ), నక్కపల్లి జెడ్పీటీసీ రాగిన వెంకటరమణ(టీడీపీ), అరకు జెడ్పీటీసీ కూన వనజ( వైఎస్సార్ సీపీ), నర్సీపట్నం జెడ్పీటీసీ చదలవాడ సువర్ణలత( వైఎస్సార్ సీపీ), పెదబయలు జెడ్పీటీసీ జర్సింగి గంగాభవాని( వైఎస్సార్ సీపీ), ముంచింగపుట్ కె.కాసులమ్మ( వైఎస్సార్ సీపీ) సభ్యులుగా వ్యవహరించనున్నారు. వర్క్స్ కమిటీ : ఈ కమిటీలో పంచాయతీరాజ్ మంత్రి సి.హెచ్.అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎమ్మెల్యేల పీలా గోవింద సత్యనారాయణ, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, ఎస్.రాయవరం జెడ్పీటీసీ బొట్టా లక్ష్మి(టీడీపీ), పరవాడ జెడ్పీటీసీ పైల జగన్నాథరావు(టీడీపీ), అచ్యుతాపురం జెడ్పీటీసీ జనపరెడ్డి శ్రీనివాసరావు(టీడీపీ), పద్మనాభం జెడ్పీటీసీ కాశిరెడ్డి దామోదరరావు(టీడీపీ), చీడికాడ జెడ్పీటీసీ పులపర్తి సత్యవతి(వైఎస్సార్ సీపీ)లు సభ్యులుగా ఎన్నికయ్యారు. -
పరిషత్ జాగాలో ‘పచ్చ’పాగాకు సై
సాక్షి ప్రతినిధి, కాకినాడ : నిరుపేదలు భయపడినట్టే కోట్ల విలువైన జెడ్పీ స్థలాన్ని తెలుగుదేశం పరం చేసేందుకు జిల్లా పరిషత్ ‘పచ్చ’జెండా ఊపింది. ‘పరిషత్ జాగాలో పచ్చపాగా’ అంటూ జెడ్పీ స్థలంపై అధికార పార్టీ కన్నేసిన వైనాన్ని ‘సాక్షి’ ఈ నెల 21నే వెలుగులోకి తెచ్చినసంగతి తెలిసిందే. టీడీపీ జిల్లా కార్యాలయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో 99 ఏళ్లు లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా.. ఆమోదిస్తూ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. కాకినాడ పాతబస్టాండ్ సమీపంలో జెడ్పీకి చెందిన ఆ భూమి లీజు అంశాన్ని జెడ్పీ చైర్పర్సన్ నామన రాంబాబు సభ దృష్టికి తీసుకువచ్చారు. కోట్ల విలువైన భూమిని ఒక పార్టీకి ఏ విధంగా ధారాదత్తం చేస్తారని కిర్లంపూడి జెడ్పీటీసీ సభ్యుడు వీరంరెడ్డి రామలింగేశ్వరరావు(కాశీ బాబు) అభ్యంతరం వ్యక్తం చేశారు. జెడ్పీ ఉద్యోగులకు జి ప్లస్ 2 ప్లాట్ల నిర్మాణానికి గత జెడ్పీలో తీర్మానం చేయగా, పార్టీకి ఎలా లీజుకిస్తారని ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్‌కుమార్ ప్రశ్నించారు. ‘ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం తీర్మానం చేస్తున్నారు.. కానీ టీడీపీ కార్యాలయం కోసమే అంటున్నారు. ఇందులో ఏది వాస్తవమో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ట్రస్ట్ అంటే ఒక చైర్మన్, డెరైక్టర్లు, అడిగేందుకు ఒక పద్ధతి ఉండదా అని రావులపాలెం జెడ్పీటీసీ సాకా ప్రసన్న కుమార్ ప్రశ్నించారు. మెజార్టీ ఉంది కదా అని అడ్డగోలు తీర్మానాలు చేస్తూ కోట్ల విలువైన భూములు ఎవరికి పడితే వారికి ధారాదత్తం చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ‘ఇక్కడ తీర్మానం చేసినంత మాత్రాన భూమిని ఇచ్చేసినట్టు కాదని, ప్రభుత్వానికి వెళ్లాలి, కేబినెట్లో తీర్మానం కావాలి అప్పుడు కానీ అవదు..ఇదంతా జరగాలంటే చాలా సమయం పడుతుం’దంటూ చైర్పర్సన్ నామన తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.26.18 కోట్లను ప్రతిపాదిత 38 మంచినీటి పథకాల నిర్వహణ, మరమ్మతులకు ఖర్చు చేసేందుకు, జెడ్పీ చైర్‌పర్సన్‌కు కొత్తగా ఇన్నోవా కారు కొనుగోలుకు అనుమతిస్తూ తీర్మానాలను ఆమోదించారు. ఏడు స్థాయీ సంఘాలు ఏకగ్రీవం ప్రణాళిక ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య వైద్య సేవలు, మహిళా, సాంఘిక సంక్షేమం, పనుల నిర్వహణ స్థాయా సంఘాలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీటిలో వ్యవసాయం, సాంఘిక సంక్షేమం స్థాయా సంఘాలు మినహా ఐదింటికీ జెడ్పీ చైర్‌పర్సనే చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వ్యవసాయ స్థాయా సంఘానికి వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, సాంఘిక సంక్షేమానికి పాలపర్తి రోజా ఎన్నికయ్యారు. ఒక్కో సంఘంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీ సభ్యులతో కలిసి 15 మంది సభ్యులున్నారు. -
ఆద్యంతం..జనపక్షం
సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లా పరిషత్ కొత్త పాలకవర్గ తొలి సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ నామన రాంబాబు అధ్యక్షతన ఆదివారం జరిగింది. అనుభవజ్ఞులైన సభ్యులతో సమానంగా కొత్త సభ్యులు, మహిళా జెడ్పీటీసీలు పోటాపోటీగా కురిపించిన ప్రశ్నల వర్షంతో అధికారులు ఉక్కిరిబిక్కిర య్యారు. కొందరైతే సమాధానాలు చెప్పలేక నీళ్లునమలాల్సి వచ్చింది. సమావేశంలో అధికారపక్షమే విపక్షపాత్ర పోషించడం కొసమెరుపు. స్థాయీ సంఘాల ఎన్నికలతో ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశం మధ్యాహ్నం గంటపాటు భోజన విరామం మినహా రాత్రి ఏడు గంటల వరకు సాగింది. తొలి సమావేశాన్ని సమన్వయంతో నిర్వహించడంలో నామన కొంత తత్తరపడడం కనిపించింది. తెలంగాణ నుంచి విలీనమైన పోలవరం ముంపు మండలాల జెడ్పీటీసీ సభ్యులు సోయపు అరుణ (చింతూరు), ముత్యాల కుసుమాంబ (వరరామచంద్రపురం), ఎడవల్లి కన్యకాపరమేశ్వరి (కూనవరం) సభలో ప్రమాణం చేశారు. వీరి చేరికతో జెడ్పీటీసీ సభ్యుల సంఖ్య 61కి, మహిళల ప్రాతినిధ్యం 32కి పెరిగాయి. స్థాయీ సంఘాలకు నియమితులైన సభ్యులను సీఈఓ ఎం.సూర్యభగవాన్ ప్రకటించాక అజెండాను చేపట్టారు. నగరం పేలుడుపై విస్తృతచర్చ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి కారణమైన నగరం గ్యాస్ పైపులైన్ పేలుడులో బాధితులను విస్మరించిన విషయాన్ని ఐ.పోలవరం జెడ్పీటీసీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్ సభ దృష్టికి తీసుకువెళ్లాక రెండు నిమిషాలు మౌనం పాటించారు. గెయిల్, ఓఎన్జీసీ, జీఎస్పీసీ వంటి చమురు సంస్థల పైపులైన్లతో కోనసీమ ప్రజలకు భద్రత లేని విషయంపై అధికార, ప్రతిపక్షాలు విస్తృత చర్చ చేపట్టారు. భద్రతపై భరోసా ఇవ్వడం, చమురు సంస్థలతో ఇక ముందు నిర్వహించే భేటీలో పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులందరికీ భాగస్వామ్యం కల్పించడం, దీనిపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ తీర్మానించాలని కోనసీమ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు పట్టుబట్టారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు చొరవతో ఆర్థిక సాయం అందిందని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ తోట నరసింహం చెపుతున్నప్పుడు, ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పార్టీ తరఫున కుటుంబానికి లక్ష ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. పూడ్చలేని నష్టం జరిగిందంటూ ప్రతిపక్షంతో పాటు అధికార పక్షం కూడా గొంతు కలిపింది. విపక్షనేతగా ఆకట్టుకున్న నవీన్ జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్ పదునైన పదాలతో తొలి ప్రసంగంతోనే సభ దృష్టిని ఆకర్షించగలిగారు. సమయస్ఫూర్తితో స్పందించారు. సమావేశమందిరంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని తొలగించేందుకు తీర్మానం చేయాలని ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పట్టుబట్టినప్పుడు ‘వైఎస్ ప్రజానాయకుడు. ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు. అలాంటి నేత ఫొటో తీసేయమంటారా, కావాలంటే తీర్మానం చేసుకోండి’ అంటూ నవీన్ తీవ్రంగా స్పందించడంతో.. చైర్పర్సన్ ఇది సమయం కాదంటూ చర్చకు అవకాశం ఇవ్వలేదు. నీలం పరిహారం, ఎస్సీ రుణాలకు బ్యాంకుల నిరాకరణ తదితర అంశాలపై అధికారపార్టీ సభ్యులు విపక్ష పాత్ర పోషించడంతో చైర్పర్సన్ నామన సమాధానం చెప్పలేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. ‘చూస్తాం, చేస్తా’మంటున్న ఆయనను ‘అలా అనవద్దు, కనీసం వచ్చే సర్వసభ్య సమావేశానికైనా పరిష్కారాలు చూపిస్తారని అధికారుల నుంచి భరోసా కల్పించాలి’ అని అధికారపక్షానికే చెందిన ఎమ్మెల్యే పులపర్తి, జెడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్ సూటిగా అడగడంతో అధికారులతో సమాధానం చెప్పించడానికి తడబడాల్సి వచ్చింది. నెహ్రూకు అధికారపక్ష సభ్యుల మద్దతు వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యాల సాధనలో వైఫల్యాన్ని దాదాపు నేతలంతా ఎండగట్టారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వినిపించిన పిట్టకథ సభలో నవ్వులు కురిపించింది. అవసరమైన అందరికీ మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ నీతూకుమారి అభ్యర్థించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యమవుతుందనే సాకుతో గోదావరిపై రెండు లిఫ్టుల ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా తీర్మానం కోసం పట్టుబట్టిన వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు అధికారపక్ష సభ్యులు మద్దతు ఇచ్చారు. ఇందుకు మరోసారి సమావేశమవుదామంటూ చైర్పర్సన్ దాటవేయడంపై సభ్యులు గుసగుసలాడుకోవడం వినిపించింది. తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం అజెండాలో లేకపోవడంతో ఎంపీ తోట నరసింహం ఇరిగేషన్ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్లకు ఆధార్ అనుసంధానంతో అనర్హులకు చోటు లేకుండా పోయిందంటూ చెప్పిందే చెపుతున్న డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రాజుపై జ్యోతుల నెహ్రూ అసహనం వ్యక్తం చేశారు. ‘రాజకీయ ఉపన్యాసాలు వద్దు. సమగ్ర సమాచారం ఉంటే చెప్పండి’ హితవు చెప్పారు. ఉపాధి హామీ పథకం ప్రగతిని ఇన్చార్జి పీడీ భవాని చెపుతుండగా అధికారపక్షం నుంచే ప్రతిఘటన ఎదురుకావడంతో వేదికపై ఉన్న ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కలెక్టర్ సర్దిచెప్పేందుకు తంటాలు పడాల్సి వచ్చింది. అధికారులను నిలదీసిన మహిళా సభ్యులు కొత్తగా ఎన్నికైనా ఏ మాత్రం తటపటాయింపు లేకుండా ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జెడ్పీటీసీ సభ్యులు చిన్నం అపర్ణాదేవి, అధికారి వెంకటలక్ష్మి, సోయపు అరుణ, కోసూరి బుజ్జి చిన్నాలమ్మ తదితరులు వివిధ సమస్యలపై అధికారులను నిలదీశారు. కాగా, జెడ్పీటీసీ సభ్యులు ప్రజా సమస్యలతో పాటు తమ సొంత కోర్కెల చిట్టా కూడా విప్పారు. వారి డిమాండ్లకు ప్రతిపక్ష నేత నవీన్ మద్దతు పలికారు. మండల పరిషత్‌లలో ప్రత్యేక గది, టోల్గేట్లలో ఉచిత ప్రవేశం, జెడ్పీ సమావేశంలో మాట్లాడేందుకు అవకాశం కావాలన్న సభ్యులు అందుకోసం పట్టుబట్టి మరీ అవుననిపించుకున్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ముమ్మిడివరం, కాకినాడ రూరల్ ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, పిల్లి అనంతలక్ష్మి సభలో ఒక్క మాట మాట్లాడకుండా మధ్యలోనే వెళ్లిపోయారు. -
జెడ్పీలో స్థాయీ సంఘాల ఎన్నిక నేడు
విజయనగరం ఫోర్ట్ : జిల్లా పరిషత్‌లో ఏడు స్థాయీ సంఘాలను నేడు ఎన్నుకోనున్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశంలో ఈ సంఘాలను ఎన్నుకోనున్నారు. ప్రణాళిక , ఆర్థిక సంఘం, గ్రామీ ణాభివృద్ధి, వ్యవసాయం, విద్యా వైద్యం, స్రీ,శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ, పనుల కమిటీలను ఎన్నుకోనున్నారు. ప్రణాళిక, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, విద్యావైద్య, పనుల కమిటీలకు చైర్మన్‌గా జిల్లా పరిషత్ చైర్పర్సన్ వ్యవహరిస్తారు. జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలు సభ్యులుగా ఉంటారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వ్యవసాయ సంఘం చైర్మన్‌గా, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు సభ్యులుగా వ్యవహరిస్తారు. స్త్రీ,శిశు సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమ సంఘాలకు మహిళా జెడ్పీటీసీలను చైర్మన్‌గా జిల్లా పరిషత్ చైర్పర్సన్ నియమిస్తారు. జిల్లాలో జెడ్పీటీసీలు 34 మంది, ఎంపీలు ముగ్గురు, ఎమ్మెల్యేలు తొమ్మిది మంది, ఎమ్మెల్సీలు ఇద్దరు కలిపి 48 మంది ఉన్నా రు. ఇద్దరు కోఆప్షన్ సభ్యులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. వీరిలో ఆరు కమిటీలకు ఏడుగురు చొప్పన, ఒక కమిటీకి ఎని మిది మంది సభ్యులు ఉం టారు. జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలున్నా యి. వీటిలో 24 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాగా, పది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. నాలుగు కమిటీలే కీలకం: ఏడు కమిటీల్లో నాలుగు కమిటీలే కీలకం. ప్రణాళికఆర్థిక సంఘం, పనులు, విద్యావైద్య, గ్రామీణాభివృద్ధి కమిటీలే కీలకం. కమిటీల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తారా, లేదో వేచిచూడాలి. -
కొలువుదీరనున్న కొత్త ‘పరిషత్’
సాక్షి ప్రతినిధి, కాకినాడ :మూడేళ్లకు పైగా విరామం తర్వాత.. జిల్లా పరిషత్ పాలకవర్గం ఆదివారం కొలువుదీరనుంది. అంతకు ముందు జెడ్పీ సమావేశం 2011 జూన్ 27న జరిగింది. రాష్ట్ర, జిల్లాస్థాయిలలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో.. ఆదివారం జరగనున్న జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం తొలి సర్వసభ్య సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ సమావేశాలకు ఆదివారం సెలవు కావడంతో దాదాపు జిల్లా ఎమ్మెల్యేలంతా సమావేశానికి హాజరవుతున్నారు. జరిగేది తొలి సమావేశమే అయినా ప్రజల సమస్యలపై ఎలుగెత్తేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతోంది. గత నెల 5న జెడ్పీ పాలకవర్గం ఏర్పాటైన తరువాత ప్రమాణ స్వీకారంతో సభను ముగించారు. కొత్త పాలకవర్గం ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి సర్వసభ్య సమావేశమే సమస్యల సెగతో వేడెక్కే అవకాశం ఉంది. ఉదయం 10.30 గంటలకు స్థాయీ సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అనంతరం సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్పర్సన్ నామన రాంబాబు అధ్యక్షతన జరగనుంది. సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన తదితర 40 శాఖల అంశాలను, మరో మూడు తీర్మానాలను అజెండాలో చేర్చారు. జిల్లాలో 38 సమగ్ర మంచినీటి సరఫరా పథకాల నిర్వహణ, మరమ్మతుల కోసం రూ.2,618.18 లక్షలతో ప్రతిపాదించారు. కాకినాడ మేడలైన్ ఏరియాలో 2000 చదరపు గజాల జెడ్పీ స్థలాన్ని ఎన్టీఆర్ ట్రస్టు భవన నిర్మాణ ం నిమిత్తం లీజుకుఇవ్వాలన్న జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి అభ్యర్థననూ, చైర్‌పర్సన్‌కు కొత్త ఇన్నోవా కారు కొనుగోలు అంశాన్నీ అజెండాలో చేర్చారు.జెడ్పీకి చెందిన రెండు ఎకరాల లీజుకు అధికారపక్షం చేసిన ప్రతిపాదనపై ఆసక్తికరమైన చర్చకు తెరలేవనుంది. ట్రస్టు పేరుతో టీడీపీ కార్యాలయానికి ఆ భూమిని అప్పగిస్తే ఇప్పటికే అక్కడ జీప్లస్-2 ఇళ్ల కోసం జెడ్పీ ఉద్యోగులు పెట్టుకున్న ప్రతిపాదన, కమ్యూనిటీ హాలు, పాఠశాల, హాస్టల్ నిర్మాణం కోసం స్థానికులు ఎప్పటి నుంచో అక్కడ చేస్తున్న డిమాండ్లు ఏమవుతాయో సభలో తేలనుంది. ప్రతిధ్వనించనున్న ప్రజా సమస్యలు.. అజెండాతో సంబంధం లేకుండా పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లేందుకు వైఎస్సార్ సీపీకి చెందిన ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్ సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు పార్టీ జెడ్పీటీసీ సభ్యులతో ఆయన శనివారం చర్చించారు. మెట్ట ప్రాంత మండలాల్లో శివారు ఆయకట్టుకు నీరందక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సభ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. నాట్ల సమయం పూర్తి అయిపోయినా పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా మెట్ట ప్రాంతంలో శివారు ఆయకట్టుకు నీరు సరఫరా కాక వరి పంట ప్రశ్నార్థకంగా మారినా పట్టించుకోని అధికారులు నిర్లక్ష్యాన్ని ఎండగట్టనున్నారు. 35 వేల ఎకరాలకు నీరందించే చాగల్నాడు ఎత్తిపోతల పథకం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారిన విషయాన్ని ఎత్తిచూపనున్నారు. రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లో ఆయకట్టుకు నీరందించే ఈ పథకం నుంచి మూడు రోజులుగా నీటి విడుదల నిలిచిపోయినా పట్టించుకున్న వారే కరువయ్యారు. రూ.7 కోట్లు వ్యయం కాగల ప్రతిపాదనలకు అతీగతీ లేకపోవడం, ఫ్యూజు పోయినా కనీసం వేసే వారే లేకపోవడాన్ని ప్రతిపక్షం నిలదీయనుంది. వర్షాభావ పరిస్థితులు, అటకెక్కిన రుణమాఫీతో పంట రుణాలు అందక డెల్టా, మెట్ట మండలాల్లో రైతాంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు, రుణమాఫీకి ప్రధాన అడ్డంకిగా మార్చిన జీఓ:174 సవరణకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని రైతాంగం కోరుతోంది. జిల్లా అంతటా ప్రధాన సమస్యగా మారిన ఆక్వా చెరువుల వ్యవహారాన్ని కూడా చర్చించాలని రైతులు కోరుతున్నారు. సాగుభూముల్లో అనుమతులు లేకుండా చేస్తున్న ఆక్వాసాగును నియంత్రించాలంటున్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో విద్యార్థులు భోజనం చేసేందుకు చాలా పాఠశాలల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులూ చర్చకు రానున్నాయి. జీతాలు పెంచుతామని ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు అడ్డగోలుగా జిల్లాలో వందమందికి పైగా కార్యకర్తలపై వేటు వేయడంపై సభ్యులు చర్చించాలని అంగన్వాడీలు కోరుతున్నారు. -
రూ.15 లక్షలకు ‘సున్నం’!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కొత్త పాలకవర్గం కొలువుదీరినా జిల్లా పరిషత్‌లో అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఇటీవల జెడ్పీ పరిధిలోని ఉద్యోగుల అక్రమ డిప్యూటేషన్ల వ్యవహారం నడిపిన అధికారులు ఇప్పుడు మరమ్మతు పనుల పేరుతో మరో అక్రమానికి తెరలేపారు. నిబంధనలు తుంగలో తొక్కి పనులు చేస్తూ ప్రజల సొమ్మును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సుమారు మూడేళ్ల అనంతరం జిల్లా పరిషత్‌కు కొత్త పాలకవర్గం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో జెడ్పీ భవనానికి మరమ్మతు పనులు చేపట్టాలని నిర్ణయించారు. జిల్లా పరిషత్ భవనానికి సున్నం, రంగులు వేయాలని భావించారు. చైర్పర్సన్ గదికి,వేచి ఉండే గదికి మరమ్మతులు చేపట్టా రు. నిబంధనల ప్రకారం రూ.లక్ష అంచ నా వ్యయం దాటిన పనులకు ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు నిర్వహిం చాలి. కానీ, ఎలాంటి టెండర్లు పిలువకుండానే రూ.15లక్షల అంచనా వ్యయం కలిగిన పనులు తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు అప్పగించారు. పైగా రికార్డుల్లో మాత్రం డిపార్ట్మెంట్ వర్క్‌గా పేర్కొంటున్నారు. పర్సెంటేజీలతో సం తృప్తి పరిచే ఈ కాంట్రాక్టరుకే అధికారులు గతంలో కూడా పనులు కట్టబెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పనులు రెండుగా విభజించి.. సాధారణంగా తక్కువ అంచనా వ్యయం కలిగిన చిన్నచిన్న అభివృద్ధి పనులను ఒకే పని(ప్యాకేజీ)గా మార్చి టెండర్లు ని ర్వహిస్తుంటారు. కానీ అక్రమాల్లో ఆరితేరిన ఈ అధికారులు మాత్రం రూ.లక్షల్లో అంచనా వ్యయం కలిగిన పనులను చిన్నచిన్న పనులుగా విభజించి డిపార్ట్మెంట్ వర్క్ పేరుతో కాంట్రాక్టర్లకు అప్పగించా రు. రూ.5 లక్షలతో జెడ్పీ చైర్పర్సన్ గది, జెడ్పీటీసీల వెయిటింగ్ గది మరమ్మతు లు చేపట్టారు. రూ.10 లక్షలతో జెడ్పీ భవనానికి సున్నం వేసే పనులుగా రికా ర్డు చేశారు. ఈ రెండు పనులను కలిపి ఒ కే పనిగా టెండర్లు నిర్వహించాల్సిన అధికారులు ఇలా రెండుగా విభజించారు. పైగా అత్యవసర పనులను మాత్రమే డిపార్ట్మెంట్ వర్క్ చేపట్టాలి. లేని పక్షం లో టెండర్లు నిర్వహించి ఏ కాంట్రాక్టరు తక్కువ కోట్‌చేస్తే ఆ కాంట్రాక్టరుకు పనులు అప్పగించాలి. టెండర్ల విధానం ద్వారా ప్రభుత్వ ఖాజానాకు భారం తగ్గుతుంది. కానీ ఇక్కడ ఎలాంటి అత్యవసరం లేకుండానే అధికారులు డిపార్ట్మెంట్ ద్వారా పనులు చేస్తున్నారు. పనుల నాణ్యత ప్రశ్నార్థకం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకమనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. భవనానికి వేస్తు న్న రంగులు నిర్ణీత సంవత్సరాల వరకు మన్నేలా నాణ్యమైన రంగులు వేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వినియోగిస్తున్న సున్నం, రంగుల్లో ఈ మేరకు నాణ్యత లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఆగమేఘాలపై జరుగుతున్న మరమ్మతు పనుల్లో కూడా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షాత్తు జిల్లా పరిషత్ కార్యాలయంలోనే జరుగుతున్న ఈ అక్రమ పనులపై జెడ్పీ పాలకవర్గం చర్యలకు శ్రీకారం చుడుతుందా? ప్రతిపక్ష పార్టీల సభ్యులైనా దీనిపై స్పందిస్తారా? వేచి చూడాల్సిందే. అధికారులేమన్నారంటే.. ఈ పనులకు టెండరు విధానం కాకుం డా, డిపార్ట్మెంట్ వర్క్ చేసేందుకు జిల్లా పరిషత్ నుంచి అనుమతి వచ్చిందని, ఈ మేరకే తాము ఈ పనులను చేపట్టామని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అమీనొద్దీన్ పేర్కొన్నారు. టెండరు నిబంధనల విషయమై ‘సాక్షి’ ప్రతినిధి ప్రస్తావించగా అది జెడ్పీ అధికారులు చూసుకుంటారని ఆయన పేర్కొన్నారు. -
నిలదీత.. ఉదాసీనత
ఏలూరు:కొల్లేరు జిరాయితీ భూముల్లో పంటలు సాగుకు అనుమతి ఇవ్వడం.. లేదంటే భూముల యజమానులకు నష్టపరిహారం చెల్లించడం అనే అంశాల్లో ఏదో ఒకదానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. ఇసుక రీచ్‌లపై ప్రభుత్వం కొత్త విధానం ప్రకటించే వరకు స్ధానికంగా లభ్యమయ్యే ఇసుకను పేదల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా అందించేలా ప్రభుత్వా న్ని కోరటం.. జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో నాయకుల విగ్రహాల ఏర్పాటు.. జెడ్పీ సమావేశ మందిరానికి పేరుపెట్టే అంశాలపైనా తీర్మానాలను ఆమోదిం చారు. జెడ్పీ అధ్యక్షుడు ముళ్లపూడి బాపిరాజు అధ్యక్షతన ఆదివారం సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లాలో నెలకొన్న వివిధ సమస్యలను జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఏకరువు పెట్టారు. అజెండాలో పలు కీలక అంశాలు పొందుపర్చినప్పటికీ నూతన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన సమావేశంలో సభ్యులు లేవనెత్తిన ఏ ఒక్క సమస్యకు ఉన్నతస్థారుు ప్రజాప్రతినిధులు, అధికారులు పరిష్కార మార్గం చూపలేకపోయూరు. స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ జిల్లాను ఉన్నత స్థారుులో నిలి పేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, రోడ్లు, డ్రెరుునేజీ, తాగు, సాగునీటి సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నదృష్ట్యా ఆదాయ వనరుల్ని అన్వేషించాలన్నారు. జిల్లాలో ఇసుక కొరత నివారణకు త్వరలో కొత్త విధానం తీసుకొస్తామని చెప్పారు. టీడీపీ వాళ్లకు గౌరవం ఇవ్వాల్సిందే ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యేలు అధికారులపై దర్పాన్ని ప్రదర్శించడానికే ఎక్కువ సమయం కేటారుుంచారు. మండలాల్లో ఉండే టీడీపీ ప్రజాప్రతినిధులకు యంత్రాంగం గౌరవం ఇచ్చి తీరాల్సిందేనని పదేపదే కోరారు. అధికారులెవరూ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఎంపీ మాగంటి బాబు అసహనం ప్రదర్శించారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ జిల్లాను అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలిపిందేకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాన్నారు. గ్రామాల్లో అక్రమంగా ఇసుక, మట్టి విక్రయాలను అడ్డుకుని స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యలపై ఇలా.. కొల్లేరు కాంటూరు కుదింపు, హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు, మురుగునీటి పారుదల సక్రమంగా లేకపోవడం, ఇళ్లు నిర్మించుకున్న పేదలకు బిల్లులు పంపిణీలో జాప్యం, ఉపాధి హామీ పథకంలో ఇక్కట్లు, పింఛను లబ్ధిదారులు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించి పోస్టాఫీసుల వద్ద పడిగాపులు పడుతున్న తీరుపై పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు. వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు మానుకొండ ప్రదీప్ మాట్లాడుతూ నవుడూరు-అండలూరు, నవుడూరు- వీరవాసరం రోడ్లు అధ్వానంగా తయూరయ్యూయని, ఆ రోడ్లపై ప్రయూణం నరకప్రాయంగా ఉందని చెప్పారు. వీరవాసరం ఎంపీపీ కవురు శ్రీనివాస్ వివిధ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పెదవేగి జెడ్పీటీసీ కె.విద్యాసాగర్ వ్యవసాయ అవసరాలకు 7 గంటలపాటు నిరాటకంగా విద్యుత్ సరఫరా చేయూలని డిమాండ్ చేశారు. సమావేశంలో కలెక్టర్ కాటమనేని భాస్కర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొమ్మారెడ్డి నాగచంద్రారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి, డీపీవో అల్లూరి నాగరాజువర్మ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ బి.రమణ, డీఆర్డీఏ పీడీ పి.శ్రీనివాసులు, ఈపీడీసీఎల్ ఎస్ఈ టీవీ సూర్యప్రకాష్, వ్యవసాయ శాఖ జేడీ వి.సత్యనారాయణ, ఉద్యానశాఖ ఏడీ ఎస్.సుజాత, డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్ కె.జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు ఏమన్నారంటే... ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ కొల్లేరు కాంటూర్ కుదింపుపై ఇచ్చిన హామీని త్వరలోనే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా నుంచి కొల్లేటి కోటకు వెళ్లేందుకు వీలుగా వంతెన నిర్మించేందుకు అన్ని అనుమతులు సాధించామన్నారు. ద్వారకాతిరుమల ప్రాంతంలో సిరామిక్ హబ్ ఏర్పాటుకు గుజరాత్ పారిశ్రామికవేత్తల సాయం తీసుకుంటామన్నారు. సిరామిక్ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తే 30వేల మందికి ఉపాధి కల్పించవచ్చన్నారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో అధికారుల తీరు ఏమాత్రం బాగాలేదన్నారు. ఇసుక, మట్టిని అక్రమంగా దోచుకుంటున్న అధికారులు అభివృద్ధి పనులను పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనలతో కాలయాపన చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం మంచి పద్దతి కాదు. నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు జెడ్పీ సీఈవో వెంకటరెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశ అజెండాను సభ్యులకు వారం రోజుల ముందుగా ఎందుకు పంపలేదని నిలదీశారు. ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతిపక్షం లేదని గర్వపడకుండా.. జిల్లా అభివృద్దికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మం త్రుల సహకారంతో జెడ్పీటీసీలు ముం దుకు సాగాలని సూచించారు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, అక్కడ పరిశ్రమల స్థాపనకు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో సాగునీటి సమస్యతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇసుక కొరత కారణంగా డెల్టా ఆధునికీక రణ పనులు ముందుకు సాగడం లేదన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అన్నిచర్యలు తీసుకోవాలని కోరారు. కొవ్వూరు నియోజకవర్గం వరదలతో అతలాకుతలం అవుతోందని, డెల్టా ఆధునికీకరణలో డ్రెయిన్లు, కాలువ పనులు చేపట్టాలని కోరారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ కొల్లేరు కాంటూర్ కుదింపు ప్రక్రియను వేగవంతం చేయూలని కోరారు. -
కొమ్మూరు వారి భూములు అమ్మేశారు!
రైతులు బతకాలి... తిండిగింజలు పండించి నలుగుర్ని బతి కించాలన్న లక్ష్యంతో ఊపిరి పోసుకున్న ట్రస్ట్ మహోన్నత ఆశయం... అతని అత్యాశ ముందు చిన్నబోయింది. అతని స్వలాభాపేక్షతో... ఆ సంస్థ సంకల్పం వికల్పమైంది.. కంచే చేను మేయడంతో కొమ్మూరు అప్పడుదొర ట్రస్టుకు చెందిన ఐదున్నర ఎకరాలు అక్రమంగా పరులపాలైంది. కంటికి రెప్పలా ట్రస్ట్ ఆస్తులను కాపాడాల్సిన ప్రతినిధే విలువైన స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేశారు. ఇప్పుడా భూమి విలువ రూ.5 కోట్లు పైమాటే.... భోగాపురం :జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, భోగాపురానికి చెందిన దివంగత కొమ్మూరు అప్పడుదొర సజీవంగా ఉన్న కాలంలో పాతికేళ్ల క్రితం పేదలకు చేయూత అందించాలనే సంకల్పంతో తన పేరు మీద ఓ ట్రస్టును ఏర్పాటుచేశారు. అప్పట్లో గూడెపువలస రెవెన్యూ పరిధిలో సర్వే నం. 5/4లో తన సొంత స్థలమైన 22 ఎకరాల 81 సెంట్లను ట్రస్టుకు రాసిచ్చారు. ఆ స్థలంలో ఎటువంటి క్రయ విక్రయాలు జరుపకుండా రైతులు పంటలు పండించుకుంటూ జీవనోపాధి పొందాలనేది కొమ్మూరు ఆశయం. అందుకే తమ కుటుంబంతో ఎలాంటి సంబంధంలేని ఒక వ్యక్తిని ట్రస్టు చైర్మన్‌గా నియమించారు. భవిష్యత్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ట్రస్టుకే అప్పగించారు. అయితే ‘కంచె చేను మేసినట్లు’గా ట్రస్టు చైర్మన్‌గా నియమితులైన వ్యక్తే స్వయంగా సదరు భూముల్లోని సుమారు ఐదున్నర ఎకరాలను పరులకు విక్రయించేశాడు. ప్రస్తుతం విక్రయించిన భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చి సదరు కొనుగోలుదారులు ప్లాట్లు వేసేశారు. అయితే ఈ విషయంలో ఆలస్యంగా కళ్లు తెరచిన ప్రభుత్వం మూడేళ్ల క్రితం విచారణ ప్రారంభించింది. అంతే గాకుండా ట్రస్టును దేవాదాయ శాఖకు అప్పగించింది. ప్రస్తుతం ఈ భూములు దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్నాయి. రామతీర్థం దేవస్థానానికి చెందిన సహాయక కమిషనర్ ట్రస్టు బాధ్యతలు చేపట్టారు. గతంలో ట్రస్టు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి అక్రమంగా విక్రయించిన భూములను తిరిగి స్వాధీనం చేసేందుకు గత రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రస్టుకి చెందిన భూముల్లో దేవాదాయశాఖ తమ బోర్డులను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విక్రయాలకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సదరు అధికారులు నిర్ణయించారు. అంతేగాకుండా ట్రస్టుకు చెందిన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ చేయరాదని అభ్యర్థిస్తూ స్థానిక రిజిస్ట్రారు కార్యాలయానికి సంబంధిత అధికారులు వినతిపత్రం అందజేశారు. ఎలాగైనా విక్రయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని సదరు అధికారులు దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాగే ట్రస్టుకు చెందిన మిగిలిన భూములను సైతం పూర్తి స్థాయిలో కాపాడేందుకు కంకణం కట్టుకున్నారు. చేతులు మారడం వాస్తవమే... నెల్లిమర్ల మండలం రామతీర్థాలు దేవస్థానం ఈఓ బాబూరావుని ఫోనులో వివరణ కోరగా... భోగాపురం మండలం గుడెపువలసలో ఎండోమెంటుకి అప్పజెప్పిన కొమ్మూరు అప్పడు దొర ట్రస్టు భూముల్లో కొంత భూమి చేతులుమారిన విషయం వాస్తవమేనన్నారు. సదరు భూమిని ఇటీవల పరిశీలించినట్టు చెప్పారు. అమ్మకాలు జరిగిన స్థలంలో ప్లాట్లు వేసి ఉండడాన్ని గమనించామన్నారు. మిగిలిన భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడుతున్నామని, అలాగే చేతులు మారిన ట్రస్టు భూమిపై ఎండోమెంటు ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశామని చెప్పారు. ఆక్రమణ భూములపై కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. -
ఆదాయం ఉన్నా అభివృద్ధి సున్నా
- జిల్లాలో పడవుల రేవుల ఆదాయం రూ. 1.24 కోట్లు - వాటి అభివృద్ధికి రూపాయి కూడా ఖర్చుచేయని అధికారులు - ప్రమాద భరితంగా పడవ ప్రయాణం పాతగుంటూరు : జిల్లాలో బల్లకట్టు, పడవల రేవుల నుంచి జిల్లా పరిషత్‌కు భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ రేవుల్లో అభివృద్ధి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు పడవల రేవుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే నిర్వహిస్తుండడంతో రేవుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రేట్లను భారీగా పెంచేస్తున్నారు. అధికారుల కన్నుసన్నల్లోనే బల్లకట్టు, పడవల్లో చార్జీలు పెంచినట్లు ఆరోపణలున్నాయి. రేవుల నుంచి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ ర్యాంపులు, రోడ్లు ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. గుంటూరు జిల్లా వైపు నుంచి కృష్ణా, నల్గొండ జిల్లాలకు కృష్ణానది గుండా ప్రజలు పడవలు, బల్లకట్టు ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. జిల్లాపరిషత్ ఆధ్వర్యంలో 2014-15 సంవత్సరానికి జిల్లాలో బల్లకట్లు, పడవల రేవులకు మార్చిలో వేలం నిర్వహించారు. జిల్లాలో మూడు బల్లకట్టులు, 12 పడవల రేవులకు వేలం నిర్వహించగా, రూ. కోటీ 24 లక్షల ఆదాయం వచ్చింది. అయితే ఇప్పటికీ రేవుల అభివృద్ధికి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల బల్లకట్టుపై పరిమితికి మించి వాహనాలను ఎక్కిస్తున్నారని, చార్జీలు కూడా పెంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల పరిషత్ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. నిబంధనలు బేఖాతరు... నదిలో బల్లకట్టు, పడవలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నడపాలనే నిబంధన ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన చార్జీలనే తీసుకోవాలి. అయినప్పటికీ పడవల నిర్వాహకులు అధిక చార్జీలు తీసుకుంటూ రాత్రి సమయాల్లో కూడా పడవలు నడుతున్నారు. మాచవరం మండలం గోవిందాపురం, దాచేపల్లి మండలం రామయగుండం, అచ్చంపేట మండలం మాదిపాడులలో బల్లకట్టు రేవులున్నాయి. అచ్చంపేట మండలం గింజుపల్లి, మాదిపాడు, తాడువాయి, చామర్రు, చింతపల్లి, కొల్లిపర మండలం వల్లభాపురం, వెల్దుర్తి మండలం పుట్టపల్లి, గురజాల మండలం గొట్టిముక్కలలో పడవల రేవులున్నాయి. బెల్లంకొండ మండలం కోళ్ళూరు, చిట్యాల, బోధనంలలో పడవల రేవులను పులిచింతల ముంపు గ్రామాలు కావడంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రద్దు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం... పడవల రేవుల పర్యవేక్షణ నిర్వహిస్తున్నాం. అధిక ధరలు తీసుకుంటున్న విషయం నా దృష్టికి రాలేదు. రేవుల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఎప్పటికప్పుడు రేవులను ఎంపీడీవోలు పరిశీలించి నివేదికలు ఇస్తున్నారు. నిఘా పెట్టి.. ధరలు పెంచినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. - సుబ్బారావు, జెడ్పీ సీఈవో -
జడ్పీ చైర్పర్సన్ టీడీపీకే పీఠం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : అనుకున్నదే అయింది.. జిల్లా పరిషత్‌లో అత్యధిక స్థానాలు గెలుపొందిన తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్, వైస్‌చైర్మన్ పదవులను దక్కించుకుంది. గురువారం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జరిగిన జడ్పీ పాలకవర్గ ఎన్నికలలో జడ్పీ చైర్‌పర్సన్‌గా గడిపల్లి కవిత (వెంకటాపురం), వైస్ చైర్మన్‌గా బరపాటి వాసుదేవరావు (పాల్వంచ)లు ఎన్నికయ్యారు. సీపీఐకి చెందిన ఒకరు, సీపీఎం పక్షాన గెలిచిన ఇద్దరు సభ్యులు టీడీపీకి మద్దతివ్వడంతో మొత్తం 22 ఓట్లు పొంది కవిత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ పదవికి వాసు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక, టీడీపీకి మద్దతిచ్చినందుకు గాను సీపీఐ, సీపీఎంలకు చెరో కో-ఆప్షన్ పదవి లభించింది. మహ్మద్ మౌలానా (సీపీఐ), సయ్యద్ జియావుద్దీన్ (సీపీఎం)లు జడ్పీ కో-ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించగా, జడ్పీ సీఈవో జయప్రకాశ్ నారాయణ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఎన్నిక ప్రక్రియను న్యూడెమోక్రసీ సభ్యులు ముగ్గురు బహిష్కరించగా, వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు తటస్థంగా ఉన్నారు. మొత్తంమీద జడ్పీ చైర్పర్సన్ ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎనిమిదిగంటల పాటు ఎన్నిక ప్రక్రియ పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు జిల్లా పరిషత్ సభ్యులు గురువారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముందుగా ఉదయం 8 గంటల సమయంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్.కె.ఇలంబరితి సమావేశమందిరానికి చేరుకున్నారు. ఆ తర్వాత కో-ఆప్షన్ పదవులకు సీపీఐ, సీపీఎం అభ్యర్థులు నామినేషన్లు వేశారు. స్క్రూటినీ అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు ఎన్నిక నిర్వహించారు. ఈ ప్రక్రియలో మొత్తం 39 మంది సభ్యులు పాల్గొన్నారు. రెండు పదవులకు రెండే నామినేషన్లు రావడంతో ఆ ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు కలెక్టర్ ప్రకటించారు. ఆ తర్వాత సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం భోజన విరామం తర్వాత మళ్లీ మూడుగంటలకు సమావేశం ప్రారంభమయింది. అప్పుడు కూడా 39 మంది సభ్యులు హాజరయ్యారు. చైర్పర్సన్ పదవికి గుడిపల్లి కవిత (టీడీపీ), జాడి జానమ్మ (కాంగ్రెస్)లు నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నిక అనివార్యం అయింది. అయితే, ఈ సమయంలోనే ఎన్డీ సభ్యులు పోలవరం ముంపు ప్రాంతాల కింద ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ, పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు. ఆ తర్వాత కవితకు మద్దతుగా 19 మంది టీడీపీ, ఇద్దరు సీపీఎం, ఒక సీపీఐ సభ్యుడు చేతులు లేపారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి జానమ్మకు మద్దతుగా 10 మంది కాంగ్రెస్ సభ్యులు చేతులు లేపారు. దీంతో మొత్తం 22 ఓట్లు సాధించిన కవిత జడ్పీచైర్‌పర్సన్‌గా ఎన్నికయినట్టు కలెక్టర్ ప్రకటించారు. వెంటనే కాంగ్రెస్, వైఎస్సార్సీపీ సభ్యులు కూడా సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఇక, ఆ తర్వాత జడ్పీ వైస్‌చైర్మన్‌గా పాల్వంచ జడ్పీటీసీ వాసు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన కూడా ఎన్నికయినట్టు కలెక్టర్ చెప్పారు. అనంతరం ఇద్దరికీ డిక్లరేషన్ పత్రాలు ఇచ్చి, ప్రమాణం చేయించిన అనంతరం నాలుగు గంటల సమయంలో సమావేశం ముగిసినట్టు కలెక్టర్ ప్రకటించారు. ప్రమాణ స్వీకారంలో గందరగోళం జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా కొంతసేపు గందరగోళం నెలకొంది. సభ్యులందరూ ఒక్కొక్కరుగా ప్రమా ణం చేయాల్సి ఉండగా, ప్రిసైడింగ్ అధికారిగా ఉన్న కలెక్టర్ అందరితో సామూహిక ప్రమాణం చేయించారు. ఈ సందర్భం గా తొలుత అందరూ కూర్చునే ప్రమాణం చదువుతుండగా, కొందరి సూచన మేరకు కలెక్టర్‌తో సహా జడ్పీటీసీ సభ్యులంద రూ నిల్చుని ప్రమాణం చేశారు. అయితే, అప్పుడు కేవలం టీడీపీ సభ్యులు మాత్రమే సామూహికంగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా ప్రమాణం చేయదల్చుకున్న వారు రావాలని కలెక్టర్ ఆహ్వానించడంతో సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ, న్యూడెమొక్రసీ, టీడీపీ కి చెందిన ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. మిగిలిన టీడీపీ సభ్యులు మాత్రం సామూహిక ప్రమాణంతోనే సరిపెట్టారు. అసలు సామూహిక ప్రమాణం చేసే పద్ధతి సరైందేనా అనేది ఈ సందర్భంగా అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. సండ్ర, బాలసాని హవా జడ్పీ పాలకవర్గం ఎన్నికలలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణల హవా కనిపించింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే జడ్పీ కార్యాలయంలో హడావుడి చేసిన ఎమ్మెల్యే సండ్ర పార్టీ తరఫున విప్ జారీ చేశారు. ఉదయం నుంచి మీడియాకు ఇంటర్వ్యూలతో పాటు అధికారులతో చేయాల్సిన కార్యక్రమాలను సమన్వయం చేసిన సండ్ర.. ఎన్నిక ప్రక్రియ సమయంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇక, బాలసాని పూర్తిగా తెరవెనుక మంత్రాంగం నడిపారు. ఉదయం తుమ్మల నివాసం నుంచి జడ్పీటీసీ సభ్యులతో ఉన్న ఆయన వారిని జడ్పీ కార్యాలయానికి తోడ్కొని వచ్చారు. పార్టీ సభ్యులు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే అంశాలను వివరిస్తూ కనిపించారు. ఇక, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు (వైఎస్సార్సీపీ), రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్, కోరం కనకయ్య (కాంగ్రెస్)లు హాజరుకాగా, పాయం వెంకటేశ్వర్లు, మదన్‌లాల్ (వైఎస్సార్సీపీ), సున్నం రాజయ్య (భద్రాచలం), జలగం వెంకట్రావు (కొత్తగూడెం) హాజరు కాలేదు. ఇక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న కారణంగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలెవరూ సమావేశానికి రాలేదు. -
బదిలీల వేళ...సిఫారసుల గోల
సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లా పరిషత్‌లో అధికారులకు భారీ స్థాయిలో బదిలీలు జరగనున్నాయి. ఈ మేరకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పుడున్న వారికి దాదాపు స్థానచలనం కలగనుంది. కాంగ్రెస్ హయాంలో ఉన్న అధికారులందర్నీ మార్చేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఆ మేరకు జిల్లా పరిషత్‌కు సిఫారసు లేఖలు వెల్లువెత్తుతున్నాయి. ఆశావహులు కూడా అందుకు తగ్గట్టుగా పైరవీలు ప్రారంభించారు. కావల్సినపోస్టింగ్ కోసం ముడుపులు ముట్టజెప్పడానికి సిద్ధమవుతున్నారు. రంగంలోకి నేతలు: బదిలీలపై నిషేధం ఎత్తివేయడమే తరువాయి టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. తమకు కావల్సిన వారిని అనుకూలమైన పోస్టుల్లో నియమించుకునేందుకు పావులు కదుపుతున్నారు. జిల్లా పరిషత్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న వారినే కాకుండా మండల స్థాయిలో ఉన్న ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలు, సూపరింటెండెంట్లను బదిలీ చేసే యోచనలో ఉన్నారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను కూడా కదపాలని నిర్ణయానికొచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారిలో ఎక్కువ మంది షాడో నేతకు అనుకూలంగా వ్యవహరించారని, ఆయన చెప్పినట్టే నడుచుకున్నారని టీడీపీ నాయకులు అనుమానిస్తున్నారు. దీంతో ఎలాగైనా వారిని కదపాలని భావిస్తున్నారు. జాబితాలు సిద్ధం: ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బదిలీలు చేయవలసిన సిబ్బంది జాబితాలను టీడీపీ నేతలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న జెడ్పీ ఉద్యోగులు, అధికారులు తాము కోరుకున్న పోస్టుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వేర్వేరు మార్గాల ద్వారా టీడీపీ నేతలను ఆశ్రయించి కావలసిన సీటు కోసం పైరవీలు చేసుకుంటున్నారు. కొందరు టీడీపీ నాయకులు కూడా ఇదే మంచి తరుణంగా భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు కాసులొచ్చే అవకాశం దొరికిందని ఆనందపడుతున్నారు. రూ.లక్షల్లో రేటు!: కొంతమందైతే బదిలీల్లో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగారు. ఉద్యోగులు, అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. కోరినంత ఇస్తే మంచి పోస్టులిప్పిస్తామని నమ్మ బలుకుతున్నారు. తాము చెప్పినట్లే జరుగుతుందని భరోసా కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎంపీడీఓ, ఇంజినీరింగ్ స్థాయి పోస్టులకు భారీస్థాయిలో రేటు పలుకుతోంది. రూ.లక్షల్లోనే ముట్టజెప్పేందుకు ఆశావహులు ముందుకొస్తున్నారు. మొత్తానికి బదిలీల నిషేధం ఎత్తివేసిన రోజు నుంచి జెడ్పీ ఉన్నతాధికారులకు సిఫారసులు, ఫోన్‌కాల్స్ తాకిడి ఎక్కువైంది. తాము సూచించిన వ్యక్తులనే తమ మండలాల్లో నియమించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. విశేషమేమిటంటే ఒక మండలం నుంచి రెండేసి, మూడేసి వర్గాలుగా విడిపోయి తమ అనుకూల వ్యక్తుల కోసం జెడ్పీ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. తీవ్ర పోటీ ఉన్న మండలాలు ఎంపీడీఓల విషయంలోనైతే విజయనగరం, డెంకాడ, పూసపాటిరేగ, నెల్లిమర్ల, లక్కవరపుకోట, జామి, ఎస్.కోట, గంట్యాడ, కొత్తవలస, వేపాడ, సీతానగరం, రామభద్రపురం, బొబ్బిలి, పార్వతీపురంలో పోస్టులకు డిమాండ్ బాగా ఉంది. ఇంజినీరింగ్ పోస్టుల విషయంలోనైతే గజపతినగరం, చీపురుపల్లి, గరివిడి, కొత్తవలస, ఎస్‌కోట, డెంకాడ, లక్కవరపుకోట, వేపాడ, సాలూరు, నెల్లిమర్ల, పార్వతీపురం స్థానాలకు విపరీతమైన పోటీ నెలకొంది. అధికార పార్టీ నేతలు ఈ పోటీనే క్యాష్ చేసుకుంటున్నారు. ఆశావహులతో ఒప్పందాలు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. -
‘జేబులు నింపిన ఎన్నికలు’ పై పోస్టుమార్టం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిధులను మింగేసిన కొందరు ఎంపీడీవోలపై విచారణ జరుగుతోంది. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిధులకు తోడు, మండల పరిషత్‌ల నిధులను వాహనాల వినియోగం కోసం ఖర్చు చేసిన విషయం విదితమే. కొందరు ఎంపీడీవోలు లాగ్‌బుక్‌లు లేకుండా వాహన వినియోగం పేరిట భారీగా నిధులు కాజేశారు. ప్రజాధనంతో తమ జేబు లు నింపుకున్న అధికారుల వ్యవహారంపై ‘సాక్షి’ గత నెల 30వ తేదీన ‘జేబులు నింపిన ఎన్నికలు’ శీర్షికన ప్రచురించిన కథనం కలకలం సృష్టిస్తోంది. అక్రమార్కుల బండారం బయట పెట్టేందుకు ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగగా, తాజాగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీలు) సైతం ఆరా తీస్తున్నారు. కాగా ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం జిల్లాకు ఈసారి కూడా భారీగానే నిధులు కేటాయించింది. పోలింగ్ స్టేషన్ల సంఖ్యను బట్టి ఒక్కో మండలానికి రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో ఎన్నికలను సజావుగా నిర్వహించే అవకాశం ఉంది. ఎంపీడీవోలు సైతం ఈ నిధుల నుంచే ఆయా మండలాల్లో పోలింగ్ స్టేషన్లను బట్టి రూ. 1.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు వా హన వినియోగం కోసం ఖర్చు చేసే వీలుంది. అయినప్పటికీ ఎన్నికల నిర్వహణ నిధులకు తోడు మండల పరిషత్ సాధారణ నిధుల నుంచి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో.. ఒక్కో నెలకు రూ. 24 వేల చొప్పున డ్రా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నే పథ్యంలో వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు ఇంటెలిజెన్స్ విభాగం విచారణకు దిగగా.. తాజాగా ఎంపీపీలు ‘పరిషత్’ నిధుల వినియోగంపై ఆరా తీస్తున్నారు. దీంతో రెండు రకాలుగా నిధులు కాజేసిన కొందరు ఎంపీడీవోల్లో దడ మొదలైంది. మండల పరిషత్ కార్యాలయాల ఖాతాల్లో నెలల వారీగా ఎంత జమయ్యింది? ఏ ఏ పద్దుల కింద ఎంపీడీవోలు ఎంత ఖర్చు చేశారు? ప్రధానంగా మార్చి, ఏప్రిల్, మే నెలలకు ముందు పరిషత్‌ల నిధుల నిల్వ ఎంత? జూలై ఒకటి నాటికి ఏ ఏ పద్దుల కింద ఎంతెంత ఖర్చు చేశారు? అన్న లెక్కలు తేల్చే పనిలో ఎంపీపీలు ఉన్నట్లు తెలుస్తోంది. జడ్పీ నుంచి రూ. 34 లక్షలు? మండల పరిషత్ నిధులకు తోడు ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి రూ. 34 లక్షలు డ్రా చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం రూ. 2.92 కోట్లు ప్రభుత్వం కేటాయించగా.. జడ్పీ నుంచి మరో రూ. 34 లక్షలు డ్రా చేయాల్సిన అవసరం ఏమోచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలింగ్ స్టేషన్ల వారీగా నిధులతో పాటు మండల పరిషత్ నిధులను వాహనాల పేరిట కొందరు ఎంపీడీవోలు కాజేస్తే.. రూ. 34 లక్షల జడ్పీ నిధులు ఎటు వెళ్లాయన్న విషయమై సర్వత్రా చర్చ జరుగుతోంది. -
ప్రతిపాదనలపై రుసరుస
‘మన జిల్లా-మన ప్రణాళిక’ ఖరారే ప్రధానంగా గురువారం చేపట్టిన జిల్లా పరిషత్ తొలి సమావేశం గరంగరంగా సాగింది. సమస్యల ప్రస్తావన, ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రతిపక్ష సభ్యుల వాగ్బాణాలు వాతావరణాన్ని వేడెక్కించాయి. తమతో చర్చించకుండానే పనుల ప్రతిపాదనలను రూపొందించడంపై విపక్ష కాంగ్రెస్ జెడ్పీటీసీల రుసరుసలాడగా.. కలెక్టర్ ‘కూల్’గా సమాధానమిచ్చి చల్లబరిచారు. వర్షాభావ పరిస్థితులను ఏకరువు పెడుతూ టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ‘కరువు జిల్లా’గా ప్రకటించాలని తీర్మానం చేయాలని పట్టుబట్టడం... దానిని సభ ఆమోదించడం చకచకా సాగిపోయాయి. తొలిసారి సమావేశ మందిరంలోకి అడుగిడిన కొత్త సభ్యులు స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ తడబాట్లతో సాగించిన ప్రసంగాలు ఆసక్తి కలిగించాయి. - వాడివేడిగా సాగిన జిల్లా పరిషత్ తొలి భేటీ - సమస్యలు ఏకరువు పెట్టిన కొత్త సభ్యులు - ‘కరువు జిల్లా’గా తీర్మానం సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం గురువారం గందరగోళంగా మారింది. తమ ప్రమేయం లేకుండానే ప్రణాళిక తయారు చేయడంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వర్గానికి చెందిన వారితో ప్రణాళిక తయారు చేయించి సభలో ఆమోదించాలనడం సరికాదంటూ కాంగ్రెస్ జెడ్పీటీసీలు మండిపడ్డారు. సభ్యుల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక తయారు చేస్తేనే.. పక్కాగా ఉంటుందని, సొంత ఆలోచనలు మానుకోవాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, కలెక్టర్ ఎన్.శ్రీధర్ హాజరయ్యారు. ‘మన జిల్లా-మన ప్రణాళిక’ నేపథ్యంలో చేపట్టిన ఈ సమావేశం.. ప్రజా సమస్యలపై కాకుండా పార్టీలపై విమర్శలు, ప్రతివిమర్శలకు దారితీసింది. కనీస సమాచారం ఇవ్వరా? చైర్పర్సన్ సునీతారెడ్డి సమావేశం ప్రధాన ఎజెండాను ప్రస్తావిస్తూ.. రూ.40 కోట్లతో రూపొందించిన ‘జిల్లా ప్రణాళిక’లో లోటుపాట్లను వివరించి సవరణలు సూచించాలని సభ్యులను కోరారు. ఇంతలో కాంగ్రెస్ జెడ్పీటీసీలు ఏనుగు జంగారెడ్డి, బి.మహిపాల్ కల్పించుకుంటూ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఏవిధంగా ప్రణాళిక తయారు చేస్తారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రణాళికపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ వాగ్వాదానికి దిగారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలవుతున్నా ఏ సమస్యకూ పరిష్కారాన్ని చూపలేదని పేర్కొన్నారు. దీంతో మంత్రి మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం అభివృద్ధి చేశారంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఇంతలో కలెక్టర్ శ్రీధర్ కల్పించుకుని ప్రణాళికపై మాట్లాడాలని, సభ్యుల సందేహాలకు తాను ప్రత్యేకంగా సమాధానం ఇస్తానని పేర్కొనడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. సమస్యల ప్రస్తావన కొత్తగా ఎన్నికైన పాలకవర్గం తొలి భేటీ కావడంతో పలువురు సభ్యులు సమస్యల ప్రస్తావనలో కొంత తడబడ్డారు. సమావేశంలో అన్ని మండలాల ప్రజాప్రతినిధులకు ప్రాధా న్యం ఇచ్చారు. దీంతో దాదాపు అందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు తమ పరిధి సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులు పేర్కొన్న సమస్యల్ని నోట్ చేసుకున్న అనంతరం వాటిని మండల, జిల్లాస్థాయి ప్రణాళికలో తగిన ప్రాధాన్యం ఇస్తామని చైర్పర్సన్ సునీతారెడ్డి హామీ ఇచ్చారు. కరువుపై తీర్మానం.. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంపై దృష్టిసారించి ప్రత్యేక చర్చ జరపాలంటూ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, యాదయ్య, తీగల కృష్టారెడ్డి సభలో ప్రస్తావిం చారు. గతేడాది పంట నష్టపరిహారం సైతం అందలేదని, రైతులు పలురకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు లేవనెత్తారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలోని తాజా పరిస్థితిని వివరించాలని జేడీఏ విజయ్‌కుమార్‌ను ఆదేశిం చారు. జిల్లాలో వర్షపాతం, సాగు వివరాలు ప్రకటించగా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు, అధికారుల నివేదికలకు పొంతనలేదని, వర్షపాత వివరాలు తీసుకోవడంలో ఆయా శాఖలు పూర్తిగా విఫలమవుతున్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నష్టానికి సంబంధించిన సరైన అంచనాలతో నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి ఇవ్వాలని ఎమ్మెల్యే యాదయ్య సూచించారు. జిల్లాలోని పరిస్థితుల దృష్ట్యా కరువు ప్రాంతంగా ప్రకటించాలంటూ సభ్యులు ఈ సందర్భంగా తీర్మానం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీలు నరేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంజీవరావు, ప్రకాష్‌గౌడ్, కేఎం వివేక్, సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. ‘ప్రణాళిక’పై స్పష్టత ఏదీ? ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ‘మన జిల్లా- మన ప్రణాళిక’లో భాగంగా జిల్లా యంత్రాంగం తయారుచేసిన ప్రణాళికపై స్పష్టత ఇవ్వాలంటూ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రణాళికలో గ్రామానికి మూడు, మండలానికి పది పనుల చొప్పున ప్రణాళికలో పేర్కొన్నారని, మొత్తంగా వేల కోట్ల రూపాయలతో కూడిన ఈ ప్రణాళిక కేవలం ఏడాది కాలానికా, లేక ఐదేళ్ల ప్రణాళికా అంటూ ప్రశ్నించారు. నిధుల విడుదలపైనా స్పష్టతలేదని, మొత్తంగా ఈ ప్రణాళికకు సంబంధించి నెలకొన్న సందేహాలపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ సభ ముగిసే వరకు అటు అధికార యంత్రాంగం, ఇటు జెడ్పీ పాలకవర్గం స్పష్టత ఇవ్వకపోవడం కొసమెరుపు. ఎత్తిపోతల పథకాన్ని ప్రణాళికలో చేర్చాలి: ఎమ్మెల్యే టీఆర్ఆర్ జిల్లాకు కీలకం కానున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి ప్రత్యేకంగా కొంత బడ్జెట్‌ను జిల్లా ప్రణాళికలో పొందుపర్చాలని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి సూచించారు. కనిష్టంగా మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించాల న్నారు. అదేవిధంగా అనంతగిరిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్- బీజాపూర్ రోడ్డును నాలుగు లైన్లతో ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశాలపై సీఎం కేసీఆర్‌ను కలిసి వివరించే ఏర్పాటు చేయాలని ఆయన కోరగా.. మంత్రి మహేందర్‌రెడ్డి స్పందిస్తూ త్వరలో జిల్లాలోని ప్రజాప్రతినిధులను సీఎం వద్దకు తీసుకెళ్లి భేటీ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. -
‘ప్రణాళిక’ పైనే దృష్టి
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ పాలకవర్గం ఏర్పాటైన అనంతరం గురువారం తొలిసారిగా సర్వసభ్య సమావేశం జరగబోతోంది. చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి మంత్రి పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరు కానున్నారు. దాదాపు వీరందరికీ ఇదే ప్రథమ సమావేశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేయాలని భావిస్తూ ప్రత్యేక ప్రణాళికలకు కార్యరూపం ఇస్తోంది. ఇందులో భాగంగా గ్రామ, మండల స్థాయి ప్రణాళికలు రూపొం దించిన యంత్రాంగం.. తాజాగా జిల్లా స్థాయి ప్రణాళికను తయారు చేసింది. గురువారం జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఈ ప్రణాళికకు ఆమోదం తెలుపనున్నారు. రూ.1372 కోట్లతో ప్రణాళిక ప్రభుత్వం చేపట్టిన మన ఊరు- మన ప్రణాళికలో భాగంగా ప్పటివరకు రూపొందించిన గ్రామ ప్రణాళికలను క్రోడీకరిస్తూ మండలస్థాయి ప్రణాళికలను తయారు చేశారు. వీటి ఆధారంగా తాజాగా జిల్లాస్థాయిలో ప్రణాళికను తయారు చేశారు. రూ.1372 కోట్లతో రూపొందించిన ఈ ప్రణాళికలో జిల్లాలోని 33 మండలాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో గ్రామస్థాయిలో అత్యంత ప్రాధాన్యమైన మూడు పనులు, అదేవిధంగా మండల స్థాయిలో ప్రాధాన్యమైన 10 పనులను పేర్కొంటూ ఈ ప్రణాళికను తయారు చేశారు. రూ.40 కోట్లతో జెడ్పీ ప్రణాళిక గ్రామ, మండల స్థాయిలో తయారు చేసిన ప్రణాళిక నమూనాలో జిల్లా పరిషత్ కూడా ప్రాధాన్యత పనులు పేర్కొంటూ ప్రణాళిక రూపొందిం చింది. ఇందులో మండలానికో పని చొప్పున 33 పనులు, జిల్లా పరిషత్ చైర్మన్, కలెక్టర్ తరపున అదనంగా మరో 7 పనులు తీసుకున్నారు. ఒక్కో పని దాదాపు రూ.కోటి వ్యయంతో ఉంది. మొత్తంగా జెడ్పీ ప్రణాళిక రూ.40 కోట్లతో తయారైంది. గురువారం జెడ్పీ సమావేశంలో ఈ ప్రణాళిక ఆమోదం పొందే అవకాశం ఉంది. -
నేడు జెడ్పీ అత్యవసర సమావేశం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు.. మన ప్రణాళిక’లో భాగంగా రూపొందించిన జిల్లా ప్రణాళికకు ఆమోదముద్ర వేసేందుకు జిల్లా పరిషత్ పాలకవర్గం సోమవారం అత్యవసరంగా సమావేశం కానుంది. చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక తర్వాత తొలిసారిగా జరగనున్న ఈ సర్వసభ్య సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రూ. 2,471 కోట్ల అంచనా వ్యయంతో రూపొందిం చిన జిల్లా ప్రణాళిక అంశాలను సభ్యులు చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ఈనెల 31న ఈ సమావేశాన్ని నిర్వహించాలని ముందు గా భావించారు. ఈ మేరకు సభ్యులకు సమాచారం అందించారు. కానీ ఆ రోజు లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రెండు రోజుల ముందే సోమవారం జెడ్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. జెడ్పీ చైర్మన్ శోభారాణి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశాలున్నాయి. ప్రణాళికలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి ‘మన ఊరు.. మన ప్రణాళిక’లో భాగంగా అధికార యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించింది. గ్రామ, మండల, జిల్లా ప్రణాళికలు వేర్వేరుగా రూపొందించారు. గ్రామ పరిధిలోని అభివృద్ధి పనులకు సంబంధించి గ్రామ ప్రణాళికను రూపొందించగా, రెండు, అంతకంటే ఎక్కువ గ్రామాలకు సంబంధించిన రోడ్లు, తాగునీటి పథకాలు, చెరువులు వంటి అభివృద్ధి పనులు మండల ప్రణాళికలో పొందుపరిచారు. అలాగే భారీ అభివృద్ధి పనులు రెండు, అంతకంటే ఎక్కువ మండలాల పరిధిలో ప్రభావితం చూపే ఆర్అండ్బీ రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాల పనులను జిల్లా ప్రణాళికలో చోటు కల్పించారు. ఈ మేరకు రూ.2,471 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన జిల్లా ప్రణాళికకు సోమవారం ఆమోద ముద్ర పడనుంది. ఈ ప్రణాళికలకు ఆమోదం తెలిపి ఈనెల 31లోపు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ జగన్మోహన్ ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైతే ఇతర అంశాలపై చర్చకు అనుమతి.. - శోభారాణి, జెడ్పీ చైర్పర్సన్ కేవలం ప్రణాళికలకు ఆమోద ముద్ర వేసేందుకే జెడ్పీ అత్యవసర సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని చైర్పర్సన్ శోభారాణి ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు. ఈ మేరకు అజెండా రూపొందించామని అన్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు ఏమైనా సూచనలు చేస్తే ఆ మేరకు సంబంధిత అంశాలపై చర్చకు అనుమతిస్తామని అన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జెడ్పీ సీఈవో అనితాగ్రేస్ తెలిపారు. ఈ మేరకు సభ్యులందరికి సమాచారం అందించామని పేర్కొన్నారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు!
నేడు కోదాడలో కాంగ్రెస్ సమావేశం ఇంకా ఏకతాటిపైకి రాని జిల్లా నాయకులు పార్టీ భవిష్యత్‌పై చర్చ ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి పెరిగిన వలసలు సాక్షిప్రతినిధి, నల్లగొండ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లా కాంగ్రె స్ తొలిసారి భేటీ కాబోతోంది. ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, జిల్లాపరిషత్, మూడు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు, మెజారిటీ ఎంపీపీలు వెరసి... జిల్లాలో కాంగ్రెస్ బలంగానే కనిపిస్తోంది. ఎమ్మెల్యే పదవులను మినహాయిస్తే, ఒకవిధంగా అధికార టీఆర్ఎస్ కంటే కూడా బలంగానే ఉంది. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇది మున్ముందు మరింతగా పెరిగే వీలుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు, నాయకుల్లో ఆత్మవిశ్వాసం నింపాల్సిన అవసరాన్ని ఆలస్యంగానైనా పార్టీ అగ్ర నాయకత్వం గుర్తించినట్లే కనిపిస్తోంది. పార్టీ శ్రేణులనుఓ చోట చేర్చేందుకు శుక్రవారం కోదాడలో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అయితే, సమావేశం ఏర్పాటు చేసిన నియోజకవర్గాన్ని బట్టి కొంత ప్రతికూలత ఉంది. జిల్లా కాంగ్రెస్‌లో బలమైన వర్గంగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు ఈ సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కోమటిరెడ్డి సోదరులకు అటు టీపీసీసీ చీఫ్ పొన్నాల, ఇటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌తో పేచీ ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే జిల్లా కాంగ్రెస్ ఏకతాటిపైన లేనే లేదు. టీసీఎల్పీ నేతగా ఉన్న పార్టీ సీనియర్ కె.జానారెడ్డి సైతం జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, జిల్లా కాంగ్రెస్‌ను గాడిలో పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో టీపీసీసీ నాయకత్వం ఇప్పటిదాకా కనీస ఆలోచన చేసిన పాపాన పోలేదన్న విమర్శ పార్టీ నేతల్లో ఉంది. ఈ కారణంగానే భువనగిరి నుంచి చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, నకిరేకల్ నుంచి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ టీఆర్ఎస్కు దగ్గరయ్యారు. మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి కావాల్సినంత బలం ఉన్నా, సభ్యులను కాపాడుకోలేక సూర్యాపేటను కోల్పోవాల్సి వచ్చింది. కొన్ని మండలాల్లోనూ ఎంపీపీలను ఇదే తరహాలో కోల్పోయారు. చూడడానికి పదవుల రీత్యా బలంగా కనిపిస్తున్నా, టీఆర్ఎస్ దూకుడును అడ్డుకోవడంలో మాత్రం ఇక్కడి నాయకులు విఫలమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, టీసీఎల్పీ నేత జానారెడ్డి, వర్కింగ్‌ప్రెసిడెంట్ ఉత్తమ్, జిల్లా అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి హాజరవుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్చైర్మన్లు ఇలా ప్రజాప్రతినిధులంతా హాజరవుతున్నారు. మరి ఈ సమావేశంలో పార్టీని బతికించుకునే దిశలో ఏమైనా చర్చిస్తారా..? కేవలం మొక్కుబడిగా కలిసి చేతులు కలిపేసుకుని వెళ్లిపోతారా..? అన్న ప్రశ్నలు సగటు కాంగ్రెస్ కార్యకర్తల మదిని వేధిస్తున్నాయి. -
మూడేళ్ల తర్వాత..
నేటినుంచి జెడ్పీ సర్వసభ్య సమావేశాలు ►వరుసగా రెండు రోజులపాటు నిర్వహణ ►‘మన జిల్లా-మన ప్రణాళిక’ ఎజెండా ► మండలాల అనుసంధానానికి ప్రాధాన్యత ►కొత్త పాలకవర్గం తొలి సమావేశం కరీంనగర్ సిటీ : తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. వరుసగా శుక్ర, శనివారాల్లో ఉదయం 11 గంటల నుంచి చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ సదానందం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన ప్రణాళిక చివరి దశ అయిన మన జిల్లా-మన ప్రణాళిక అనే అంశం ఎజెండాగా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. జిల్లాలో ఇప్పటికే మన ఊరు-మన ప్రణాళిక, మన మండలం-మన ప్రణాళిక సమావేశాలు పూర్తయినందున, మన జిల్లా-మన ప్రణాళిక కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాల్సి వచ్చింది. దీంతో మన జిల్లా-మన ప్రణాళిక అంశంపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ నెల 26వ తేదీన ఒక్కరోజే సమావేశం నిర్వహించాలని అధికారులు భావించినా, జిల్లా సమస్యలపై కూలంకషంగా చర్చించి, ప్రణాళికలు రూపొందించాలంటే ఒక్క రోజు సమయం సరిపోదని భావించిన జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ సమావేశాలు రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. మండలాల అనుసంధానానికి ప్రాధాన్యం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో రెండు, అంతకన్నా ఎక్కువ మండలాలకు సంబంధించిన పనులకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా మండలాలను అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా గొలుసుకట్టు చెరువుల నిర్మాణానికి జిల్లా ప్రణాళికలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పచ్చదనాన్ని ప్రోత్సహించేందుకు మొక్కల పెంపకానికి ప్ర ణాళికు రూపొందించనున్నారు. మండలాల ను కలుపుతూ రోడ్ల నిర్మాణం, గొలుసుకట్టు చెరువులు, కుంటల నిర్మాణం, మొక్కల పెం పకం అనే మూడు అంశాలకు జిల్లా ప్రణాళిక లో అధిక ప్రాధాన్యతను కల్పించనున్నారు. ఈ అంశాలపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా చర్చించి జిల్లా ప్రణాళికలో పొందుపరచనున్నారు. వీటితోపాటు అవకాశాలను బట్టి ఇతర సమస్యలపై కూడా చర్చిస్తారు. మూడు సంవత్సరాల తర్వాత.. మూడు సంవత్సరాల తర్వాత జిల్లా పరిషత్ పాలకవర్గం తెలంగాణ రాష్ట్రంలో సమావేశం కానుంది. 2011 జూలై నుంచి జిల్లా పరిషత్ పాలకవర్గం లేకపోవడంతో సమావేశాలకు అవకాశం లేకుండాపోయింది. ఇటీవల ఎన్నికై న జెడ్పీ పాలకవర్గం కొలువుతీరిన అనంతరం మూడునెలల లోపు ఎప్పుడైనా సమావేశం పె ట్టుకొనే అవకాశం ఉంటుంది. అయితే జిల్లా ప్రణాళిక రూపొందించేందుకు అత్యవసరంగా సమావేశం కావాల్సి వచ్చింది. ప్రయోగాత్మకం గా మూడున్నర సంవత్సరాల క్రితం రెండు రో జుల పాటు సమావేశాలు ఏర్పాటు చేసినా, కాంగ్రెస్, టీడీపీ సభ్యుల నడుమ గొడవతో ఆ సమావేశాలు అనుకున్న లక్ష్యం సాధించలేకపోయాయి. ఈసారి పూర్తిస్థాయి లో చర్చించి నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. సభ్యులు, మంత్రులు హాజరు.. జెడ్పీ సర్వసభ్య సమావేశానికి 57 మంది జెడ్పీటీసీలు, 57 మంది ఎంపీపీలు, ఇద్దరు మంత్రులు సహా 13 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉంటారు. డీసీసీబీ, డీసీఎంఎస్, డెయిరీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు ఆహ్వానితులుగా హాజరవుతారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలకు రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారక రామారావు హాజరుకానున్నారు. -
ప్రగతి శూన్యం
ఖమ్మం జడ్పీసెంటర్ : జిల్లా పరిపాలనకు కేంద్ర బిందువు జిల్లా పరిషత్. అయితే దీని పాత్ర రాజకీయాలకే పరిమితమవుతోంది. ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నా వాటిపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. వచ్చిన నిధులను ఎలా ఖర్చు చేయాలనే ఆలోచన తప్పితే.. ఉన్నవనరులతో ఎలా నిధులు సమకూర్చాలనే అలోచన కరువైంది. ఫలితంగా అభివృద్దికి బాటలు వేయాల్సిన ఈ కార్యాలయం వెనుకబాటుకు గురవుతోంది. పాలకులు రాజకీయాలపై చూపిన శ్రద్ధ అభివృద్ధిపై చూపడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. స్వయం సమృద్ధి సాధించడంలో జిల్లా పరిషత్ ప్రగతి అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్లపై ఆధారపడడమే తప్ప సొంతగా ఆదాయ వనరులను సమకూర్చుకోవడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. మండల పరిషత్‌లకు ఆదర్శంగా నిలవాల్సిన జడ్పీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం నుంచి వచ్చే సాధారణ నిధులతోనే కాలం వెళ్లదీస్తున్నారు తప్ప.. ఆదాయ వనరులపై అధికారులు, పాలకులు దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జిల్లా పరిషత్‌కు ఎన్నికలు జరిగినా కోర్టు సమస్య వల్ల పాలకవర్గాలు ఏర్పడలేదు. అధికారులు సైతం తమకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. జడ్పీకి ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ సైతం దీనిపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే అరకొర నిధులు కార్యాలయంలో అవసరమైన సామగ్రి కొనుగోలుకు సరిపోతున్నాయి. ఒక్కోసారి అభివృద్ది నిధులలో కోతల కారణంగా ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లా పరిషత్ ఆవరణంలోని సమావేశ మందిరాన్ని మినీ అసెంబ్లీగా మార్చాలని గతంలో పాలక వర్గాలు తీర్మానం చేసినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఉన్న సీలింగ్‌ను తరచూ మరమ్మతులు చేయిస్తూ కాలం గడుపుతున్నారు. ఉన్న ఫ్యాన్లలో ఒకటి తిరిగితే మరొకటి తిరిగే పరిస్థితిలేదు. ఖమ్మం నగరంలో ఉన్న భక్తరామదాసు కళాక్షేత్రం ఆదాయం శూన్యమనే చెప్పాలి. నగరంలో ఒక్కో ఫంక్షన్ హాలుకు రోజుకు వేలల్లో రుసుము చెల్లిస్తున్నారు. అన్ని వనరులున్నా ఈ కళాక్షేత్రానికి నెలకు వేలల్లో కూడా ఆదాయం రావడంలేదు. దీని నిర్వహణ సక్రమంగా లేక అతి తక్కువ ఆదాయానికే పరిమితం అవుతోంది. ఏడాదికి కోటిపైనే ఆదాయం.... జిల్లా పరిషత్‌కు వనరుల ద్వారా ఏడాదికి రూ.1.66 కోట్ల ఆదాయం వస్తోంది. జిల్లా పరిషత్ సముదాయంలో ఉన్న బ్యాంక్ నుంచి ఏడాదికి రూ.లక్ష, మీటింగ్ హాలుకు రూ.2 లక్షలు, కొత్తగూడెంలో షాపింగ్ కాంప్లెక్స్‌కు రూ.80 వేలు, జెడ్పీ వెనుక మామిడి తోటకు రూ.1.50 లక్షలు, రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఏడాదికి రూ.కోటి, ఇసుక వేలం ద్వారా రూ.50 లక్షల ఆదాయం వస్తోంది. ఈ నిధులను వివిధ ప్రాధాన్యత రంగాలకు కేటాయిస్తారు. వాటిలో 9 శాతం మంచినీరు, 35 శాతం సాధారణ పనులు, 15 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు, 15 శాతం మహిళా సంక్షేమానికి, 16 శాతం కార్యాలయ ఖర్చులు, 4 శాతం కాంటిన్జెన్స్ ఖర్చు చేస్తారు. క్వార్టర్ల ద్వారా... జెడ్పీ వెనుక భాగంలో 38 క్వార్టర్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి రూ.6.25 లక్షలు, కొత్తగూడెంలో ఉన్న 24 క్వార్టర్ల ద్వారా రూ.3.50 లక్షల ఆదాయం వస్తుంది. అయితే వీటి పర్యవేక్షణ సక్రమంగా లేక పోవడంతో ఈ ఆదాయంలోనూ గండిపడుతోందనే వాదనలు ఉన్నాయి. ఇక ఖమ్మం,భద్రాచలం, కొత్తగూడెంలలో జెడ్పీ గెస్ట్ హౌస్‌లు ఉన్నాయి. వీటి ద్వారా ఆదాయం శూన్యమనే చెప్పాలి. లక్షల రూపాయల వ్య యంతో వీటిని నిర్మించారు. అయితే వచ్చే ఆదా యం నిర్వహణకు కూడా సరిపోవడం లేదు. నిరుపయోగంగా ఉన్న వనరులు... ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెంలలో స్థలా లు ఉన్నా నిరుపయోగంగా ఉన్నాయి. భద్రాచ లం, ఖమ్మంలో ఉన్న పలు స్థలాలు ఆక్రమణల కు గుైరయ్యాయి. వీటిపై అధికారులు, పాల కులు దృష్టిసారించిన దాఖలాలు లేవు. ప్రభు త్వ భూములకు రక్షణ కల్పించాల్సిన అధికారు లు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన రహదాలరు పక్కన ఉన్న ఈ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తే ఏడాదికి లక్షల్లో ఆదాయం వస్తుందని పలువురు అంటున్నారు. భక్తరామదాసు కళాక్షేత్రం ప్రధాన వ్యాపార కూడలి మధ్యలో ఉంది. అన్ని వైపులా రహదారి సౌకర్యం ఉంది. దీని చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఏడాదికి లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. జెడ్పీ కార్యాలయం ఎదుట కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే భారీగా ఆదాయం వస్తుంది. నగరంలో అడ్వాన్స్‌లే రూ. లక్షల్లో ఉన్నాయి. జెడ్పీ వెనుక బాగంలో ఉన్న పండ్లతోటలో ఎర్రచందనం, టేకు మొక్కల పెంపకం చేపడితే ఆదాయం లక్షల్లో వస్తుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. జెడ్పీకి చెందిన సుమారు రూ.1.50 కోట్ల విలువైన స్థలాలు కబ్జాకు గురయ్యాయి. అయినా వీటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
సింహపురి ZP సింహాసనం వైసీపీకే !
-
'గుణపాఠంగా భావించండి'
హైదరాబాద్: నెల్లూరు జెడ్పీ చైర్మన్ పదవిని తమ పార్టీ కైవశం చేసుకోవడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక అక్రమాలు పాల్పడిన ప్రభుత్వం రాబోయే కాలంలో ప్రజావ్యతిరేకత ఎదుర్కొబోతోందని ఆయన హెచ్చరించారు. ప్రశాంతంగా జరగాల్సిన జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్త వాతావరణంలో జరగాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఆటవిక సమాజంలో ఉన్నామా అని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ నాయకులు దుర్మార్గంగా వ్యవహించారని విమర్శించారు. అధికార దుర్వినియోగం చేసినా తమ పార్టీ అభ్యర్థికి చైర్మన్ పదవి దక్కడం సంతోషకర పరిణామని అన్నారు. టీడీపీ దీన్ని గుణపాఠంగా భావించాలని అంబటి రాంబాబు హితవు పలికారు. -
నెల్లూరు జెడ్పీ చైర్మన్ గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి
నెల్లూరు: నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఎన్నికయ్యారు. ఆసక్తికరంగా సాగిన ఎన్నికల ప్రక్రియ రాజకీయ వర్గాలను ఉత్కంఠకు గురిచేసిన ఈ ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలో 46 జెడ్పీటీఎస్ స్థానాలుండగా, వైఎస్ఆర్ సీపీకి చెందిన 8 మంది మద్దతు తెలపడంతో టీడీపీకి 23 మంది సభ్యుల బలం చేకూరింది. దాంతో వైఎస్ఆర్సీపీ (23), టీడీపీ(23)లు ఓట్లు సమానంగా ఉండటంతో లాటరీ పద్దతి ద్వారా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైస్ చైర్మన్ గా పీ.శిరీషలు ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. టీడీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిచండంతో పార్టీ శిబిరంలో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుని ఆనందాన్ని పంచుకున్నారు. -
జిల్లా పరిషత్‌కు ‘ఖజానా’ షాక్!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ యంత్రాంగానికి ఖజానాశాఖ షాకిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు చేసిన ఎన్నికల నిధులను విడుదల చేయలేమని తేల్చి చెప్పింది. రాష్ట్ర పునర్విభజన అనంతరం పాత బిల్లుల మంజూరు కుదరదని తెగేసి చెప్పింది. దీంతో ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు వెచ్చించిన నిధులను సమకూర్చుకునేందుకు.. నిబంధనలకు విరుద్ధంగా మండల పరిషత్‌లలోని సాధారణ నిధులను వాడుకుంటోంది. జిల్లావ్యాప్తంగా మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4.30 కోట్లను కేటాయించింది. దీంట్లో సుమారు రూ.3.60 కోట్లు విడుదల చేసింది. అయితే, ఈ సొమ్మును మే నెలాఖరులోపు వినియోగించుకోవాలని నిర్దేశించింది. జూన్ 2 అపాయింటెడ్ డే కావడంతో ఆ లోపే ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన పద్దులను తొలగించి.. జీరో పద్దులను తెరవాలని ప్రభుత్వం సూచించింది. మే రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటికీ జిల్లా పరిషత్ అధికారులు బిల్లుల సమర్పణలో జాప్యం చేశారు. ఈ క్రమంలోనే జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ఇతర జిల్లాల నుంచి వ చ్చిన ఎంపీడీఓలు.. అదే నెల 24న సొంత జిల్లాలకు తిరిగి వెళ్లిపోయారు. దీంతో ఎన్నికల నిర్వహణా వ్యయానికి సంబంధించిన బిల్లులు/క్లెయిమ్‌లు ట్రెజరీలకు చేరడంలో ఆలస్యమైంది. కొత్త ఎంపీడీఓలు బాధ్యతలు స్వీకరించిన అనంతరం 30వ తేదీన బిల్లులు ప్రతిపాదించినప్పటికీ, వాటిని ఖజానాశాఖ అనుమతించలేదు. జూన్ 2న రాష్ట్రం లాంఛనంగా విడిపోవడంతో ఉమ్మడి రాష్ర్టంలో ఖర్చుచేసిన బిల్లులు మంజూరు చేసేదిలేదని ట్రెజరీ శాఖ కొర్రీ పెట్టింది. ఈ పేచీ తో ఎన్నికలకు వ్యయం చేసిన సుమారు రూ.60 లక్షల నిధుల విడుదల నిలిచిపోయింది. ఎన్నికల నిధుల విడుదలకు రాష్ట్ర విభజన ఆంక్షలు వర్తించవని తొలుత ఖ జానా శాఖ చెప్పడంతోనే బిల్లుల సమర్పణలో జాప్యం జరిగిందని, ఇప్పుడు ఆ శాఖ మాటమార్చడం దారుణమని అంటోంది. ఎన్నికల నిర్వహణలో వినియోగించుకున్న సేవలకుగానూ చెల్లించాల్సిన నిధులను మండల పరిషత్‌లలోని జనరల్‌ఫండ్స్‌తో సర్దుబాటు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో ఆయా మండలాల్లో అత్యవసర పనుల నిర్వహణకు నిధులు అందుబాటులో లేకుండా పోయాయని జిల్లా పరిషత్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణకు నిర్ధేశించిన నిధులపై ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించడం సరికాదని, ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆయన చెప్పారు. -
చైర్‌పర్సన్‌గా పట్నం సునీతారెడ్డి ఎన్నిక
-
జెడ్పీ.. గులాబీ వశం
చైర్‌పర్సన్‌గా పట్నం సునీతారెడ్డి ఎన్నిక టీడీపీతో సహా 21 మంది సభ్యుల మద్దతు వైస్ చైర్మన్‌గా టీడీపీ జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి ఫలించిన మంత్రి మహేందర్‌రెడ్డి ‘మంత్రాంగం’ తుదకంటూ కొనసాగిన ఉత్కంఠ సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠంపై రెండు నెలల పాటు కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడింది. ఆదివారం జిల్లా పరిషత్‌లో జరిగిన పరోక్ష ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన యాలాల జడ్పీటీసీ పట్నం సునీతారెడ్డి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆమె పేరును తాండూరు జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్ ప్రతిపాదించగా, యాచారం జెడ్పీటీసీ రమేష్ బలపర్చారు. టీఆర్ఎస్ సభ్యులు 12మంది, టీడీపీ సభ్యులు ఏడుగురితోపాటు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇద్దరు సునీతారెడ్డికి మద్దతు పలికారు. మొత్తంగా 21 మంది మద్దతు ఆమెకు లభించింది. కుత్భుల్లాపూర్ జెడ్పీటీసీ సభ్యుడు బి.ప్రభాకర్‌రెడ్డి (టీడీపీ) జడ్పీ వైస్ చైర్మన్‌గా గెలుపొందారు. ఈయన పేరును ఘట్కేసర్ జెడ్పీటీసీ సంజీవరెడ్డి ప్రతిపాదించగా, ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ ఐలయ్య బలపర్చారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పీఠం సొంత చేసుకునేంత ఆధిక్యం ఏ పార్టీకి లభించలేదు. 14 స్థానాలు కాంగ్రెస్, 12 స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకోగా టీడీపీ ఏడు స్థానాలను సంపాదించుకుంది. ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ లేకపోవడంతో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. రాజకీయ పరిస్థితులను టీఆర్ఎస్ అనుకూలంగా మలుచుకుని.. ఆదివారం నాటకీయంగా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంది. అధ్యక్ష ఎన్నికలో సహకరించిన టీడీపీకి ఉపాధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టింది. కాంగ్రెస్ పార్టీ నుంచి జంగారెడ్డికి చైర్మన్ పదవికి పోటీపడగా, 12 మంది మద్దతు తెలిపారు. టెన్షన్.. టెన్షన్ జడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి జిల్లా పరిషత్‌లో ఉత్కంఠత నెలకొంది. వాస్తవానికి ఈనెల 6న ఎన్నిక జరగాల్సి ఉం డగా.. కోరం లేకపోవడంతో వారం పాటు ఎన్నికను వా యిదా వేశారు. ఈ సమయంలో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. టీడీపీ సభ్యులకు ఉపాధ్యక్ష పదవిని ఎరవేస్తూ టీఆర్ఎస్ నెరిపిన రాజకీయ వ్యూహం ఫలించింది. కాంగ్రెస్‌కి సహకరించి పదవీ కాలాన్ని పంచుకోవాలని టీడీపీ ఆధినాయకత్వం నిర్ణయించి చర్చలు జరిపినప్పటికీ.. మధ్యలో నెలకొన్న అవాంతరాలతో స్నేహం చిగురించలేదు. అయితే అంతర్గతంలో టీఆర్ఎస్, టీడీపీ మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ.. బయటకు పొక్కకుండా ఇరు పార్టీల నేతలు జాగ్రత్త పడ్డారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన కో-ఆప్షన్ ఎన్నికలో టీఆర్ఎస్కి టీడీపీ పూర్తి సహకారం ఇవ్వడంతో అధ్యక్ష పీఠం కూడా టీఆర్ఎస్కే దక్కనున్నట్లు స్పష్టమైంది. ఏకపక్షంగా ఎన్నిక కో-ఆప్షన్ సభ్యులు ఎన్నికకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బరిలో నలుగురు అభ్యర్థులు నిలిచారు. ఖాజామొయినుద్దీన్, నవాజ్ ముంతాజ్, మహ్మద్ రఫీ, మీర్ మహ్మద్ అలీ ఉన్నారు. వీరిలో ఖాజామొయినుద్దీన్, మీర్ మహ్మద్‌అలీ కోఆప్షన్ సభ్యులుగా 21 మంది మద్దతుతో గెలుపొందారు. రెండోసారి.. పట్నం సునీతారెడ్డి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తాండూరు ఎమ్మెల్యే, జిల్లా మంత్రి పి.మహేందర్‌రెడ్డి సతీమణి అయిన ఈమె 2006 జెడ్పీటీసీ ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశించి.. తొలిసారి జిల్లా చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. తాజాగా 2014 ఎన్నికల్లో యాలాల మండలం నుంచి టీఆర్ఎస్ తరఫున జెడ్పీటీసీగా పోటీచేసి గెలుపొందారు. భర్త మహేందర్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఆమె రెండోసారి చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించారు. ప్రొఫైల్ పేరు: పట్నం సునీతారెడ్డి పుట్టిన తేదీ: 25-11-1975 విద్యార్హత: బీఎస్సీ మ్యాథ్స్ సొంతూరు: మెదక్ జిల్లా జోగిపేట మండలం దాకూర్ తల్లిదండ్రులు: రాజమణి, గోపాల్‌రెడ్డి భర్త: మహేందర్‌రెడ్డి (రవాణశాఖ మంత్రి) సంతానం: కూతురు మనీషారెడ్డి, కుమారుడు రినీష్‌రెడ్డి చేపట్టిన పదవులు: 2006లో తొలిసారి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక, తాజాగా మరోసారి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక. -
గులాబీ శిబిరంవైపు మరో ఇద్దరి చూపు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రోజురోజుకు సమీకరణలు మారిపోతున్నాయి.. జిల్లా పరిషత్ రాజకీయం తుది అంకానికి చేరుకుంటున్న నేపథ్యంలో సంఖ్యాబలం తారుమారు అవుతోంది. మూడు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తుండడంతో జెడ్పీ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. ఓ వైపు కాంగ్రెస్ బలం పడిపోతూ టీఆర్ఎస్ బలం పెరుగుతోంది. జిల్లా పరిషత్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న గులాబీ దళం ప్రత్యర్థులను ఆకర్షించడంలో సక్సెస్ అవుతోంది. చైర్మన్ కుర్చీని చేజిక్కించుకునేందుకు అవసరమైన 17 మంది జెడ్పీటీసీల మద్దతును సమీకరించేందుకు గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ను విజయవ ంతంగా పూర్తి చేస్తోంది. కాంగ్రెస్ నేతల్లో అనైక్యతను అసరా చేసుకుని వ్యూహాత్మకంగా పావులు కదిపిన రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి.. ఏకంగా ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థి యాదవరెడ్డినే తనవైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థి శిబిరాన్ని కకావికలం చేశారు. ఈ పరిణామం నుంచి తేరుకునేలోపు రాజేంద్రనగర్ జెడ్పీటీసీ సభ్యురాలు ముంగి జ్యోతికి కూడా గులాబీ కండువా కప్పేశారు. ఈ ఇరువురి చేరికతో కాంగ్రెస్ బలం 12కు పడిపోగా, టీఆర్ఎస్ బలం 14కు చేరింది. లుకలుకల నేపథ్యంలో కాంగ్రెస్ గతంలో శిబిరాన్ని ఎత్తివేసింది. ఈ తరుణంలో కొంతమంది అసంతుష్టులతో రాయబేరాలు నడిపిన టీఆర్ఎస్ నేతలు.. ఆ మేరకు ప్యాకేజీల ద్వారా ఆ సభ్యుల మద్దతు కూడగట్టారు. అయితే, అనూహ్యంగా టీడీపీతో దోస్తీ కుదరడం వీరిని ఆత్మరక్షణలో పడేసింది. టీఆర్ఎస్ తాయిలాలు అందుకున్న తర్వాత జరిగిన పరిణామాలు ఈ సభ్యులకు ఇబ్బందిగా మారాయి. కేవలం కాంగ్రెస్‌కే కాకుండా టీడీపీ సభ్యులను కూడా ఇది ఇరకాటంలో పడేసింది. ఎందుకుంటే పచ్చసోదరులు కూడా కొందరు గులాబీ దం డుకు దగ్గరయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరుపార్టీలు క్యాంపులపై పట్టుబిగించాయి. టీఆర్ఎస్ ఆకర్షణకు చిక్కకుండా.. సభ్యులను రహాస్య ప్రాంతాలకు తరలించాయి. ‘ఓటు వేయకపోతే..’! బేరం కుదుర్చుకున్న ఓ సభ్యుడు.. సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి తీవ్రతరం కావడంతో పునరాలోచనలో పడ్డారు. గోడదూకడం కష్టం కావడంతో ప్యాకేజీ మొత్తాన్ని వెనక్కి పంపారు. అయితే ప్యాకేజీ ఇచ్చిన నేత ఈ విషయం తెలుసుకుని ‘మాట ఇచ్చినట్లు ఓటు వేయాల్సిందే.. లేని పక్షంలో..’ అంటూ తనదైన శైలిలో కుటుంబ సభ్యులకు సంకేతాలు పంపారట. దీంతో బెదిరిన కుటుంబ సభ్యులు క్యాంపులో ఉన్న తమ జెడ్పీటీసీకి ఈ విషయం చేరవేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో మాట ఇచ్చినందున.. ప్రత్యర్థికే తన మద్దతు అం టూ బహిరంగంగా సెలవిస్తున్నారు. దీంతో అవాక్కయిన కాంగ్రెస్ పార్టీ.. ఇలా ఇంకెంతమంది ప్లేటు ఫిరాయిస్తారోనని బయపడుతోంది. చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థి ఇప్పటికే కొంత అడ్వాన్స్‌ను సొంత పార్టీ నేతలకు కూడా ముట్ట జెప్పారు. తాజా పరిణామాలను విశ్లేషించుకున్న సదరు నాయకులు ఖర్చు విషయంలో అచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. అలకపాన్పు! చైర్మన్‌గిరి వ్యవహారం అత్యధిక స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్‌కే కాదు టీడీపీలోనూ కలకలం రేపుతోంది. పరస్పర అవగాహనలో భాగంగా తొలుత తెలుగుదేశం పార్టీకి జిల్లా పరిషత్‌ను వదిలేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీలో చైర్మన్ స్థానానికి ఇద్దరి పేర్లను అధిష్టానం పరిశీలించింది. ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్న వీరిరువురు.. ఖర్చుకు వెనుకాడబోమని పార్టీకి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించడం మరొకరికి కోపం తెప్పించింది. దీంతో అలకబూనిన ఆయన శిబిరం నుంచి జారుకున్నారు. మూడు రోజులుగా క్యాంపునకు రమ్మని పార్టీ నేతలు పిలుస్తున్నా.. సదరు జెడ్పీటీసీ నుంచి సానుకూల స్పందన రావ డంలేదు. దీంతో ఈ సభ్యుడు కూడా గోడదూకే అవకాశంలేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. ఇలా కాంగ్రెస్, టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలు టీఆర్ఎస్ను జెడ్పీ పీఠం దరికి చేరుస్తున్నాయి. తాజా పరిణామాలను పరిశీలిస్తే ఆదివారం జరిగే ఎన్నికలో జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. -
మళ్లీ ఎన్నికల సందడి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో మళ్లీ ఎన్నికల సందడి నెల కొననుంది. మూడు నెలలుగా జోరుగా సాగిన మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల సందడి ఇటీవలే సద్దుమణిగింది. జిల్లాలో మాత్రం మళ్లీ ఎన్నికల వేడి రాజుకోనుంది. ఏడాదిగా ఖాళీ ఉన్న స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ పదవికి ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వివరాలు పంపాలని జిల్లాలోని ఎన్నికల విభాగం అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఇప్పటికే స్థానిక సంస్థ ఎమ్మెల్సీని ఎన్నుకోనున్న ఓటర్ల సంఖ్యను ఎన్నికల సంఘానికి పంపారు. తాజాగా ఈ స్థానిక ప్రజాప్రతినిధుల ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసి మూడేళ్లయినా వాటికి ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఈ ఎమ్మెల్సీ పదవి ఏడాదిగా ఖాళీగా ఉంటోంది. ఎట్టకేలకు వీటికి ఎన్నికలు జరగడం.. గురువారం నుంచి శనివారం వరకు వరుసగా మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలక మండళ్లపాలక వర్గం కొలువుదీరడం.. ఈ సందర్భంగా ఆయా సంస్థల ప్రజాప్రతినిధులైన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఇటీవలే ప్రమాణ స్వీకారం చేయడం ముగిసింది. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్లెవరో తేలిపోవడంతో ఎన్నికల సంఘం ఖాళీగా ఉన్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టి సారించింది. జిల్లాలోని స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ పదవికి చివరిసారిగా 2007 ఏప్రిల్‌లో ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.ప్రేంసాగర్‌రావు టీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీల మద్దతుతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. లాటరీలో ఆయనకు ఆరేళ్ల పదవీ కాలం వచ్చింది. 2013 మేలో ఈ పదవీకాలం ముగిసింది. అయితే స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో ఏడాది కాలంగా ఈ పదవి ఖాళీగా ఉంటోంది. ఇప్పుడు అన్ని స్థానిక సంస్థలకు పాలకవర్గాలు కొలువుదీరడంతో ఈ ఎన్నికకు మార్గం సుగమమైంది. ఇదీ టీఆర్ఎస్ ఖాతాలోకే.. జిల్లాలో 877 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్లుగా ఉంటారు. ఇందులో 52 మంది జెడ్పీటీసీలు, 636 మంది ఎంపీటీసీలు కాగా, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 189 మంది కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. వరుస ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్కే అత్యధిక జెడ్పీటీసీలు, ఎంపీటీసీ, కౌన్సిలర్ స్థానాలు దక్కడంతో ఈ ఎమ్మెల్సీ పదవి టీఆర్ఎస్ ఖాతాలోనే పడటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ పదవి కోసం ఆ పార్టీ నేతలు ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు. ఇప్పటికే ఈ పదవి కోసం నలుగురు ముఖ్యనేతల పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ.. ఈ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత బరిలో ఉండేది ఎవరో తేలనుంది. కాగా ‘స్థానిక’ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు రూ.లక్షలు ఖర్చు చేశారు. దీంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికపై స్థానిక ప్రజాప్రతినిధులు ‘ఎన్నో’ ఆశలు పెట్టుకున్నారు. -
ఆకర్ష్ గులాబీ..!
- టీఆర్ఎస్ గూటికి మరికొంతమంది - మొగ్గుచూపుతున్న ఓ మున్సిపల్ చైర్మన్ - అదేబాటలో 9మంది కాంగ్రెస్, - టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు అధికార పార్టీవైపు - కొందరు ఎంపీపీల చూపు - ప్రత్యర్థులకు చుక్కలు చూపేందుకు గులాబీదళ వ్యూహం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందునుంచి ప్రారంభమైన రాజకీయ వలసలు.. ఎంపీపీ, జెడ్పీ, మున్సిపల్ పాలకమండళ్ల ఏర్పాటు సమయంలో తీవ్రరూపం దాల్చాయి. వాటి ఎన్నిక ప్రక్రియ పూర్తయినా.. పార్టీ ఫిరాయింపులు ఇంతటితో ముగిసేలా లేవు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న గులాబీ పార్టీలో చేరేందుకు పలువురు ప్రజాప్రతినిధులు మొగ్గుచూపుతున్నారు. జిల్లాకు చెందిన ఓ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 9మంది జెడ్పీటీసీ సభ్యులు గులాబీ తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నారు. కొందరు ఎంపీపీలు సైతం అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే అయిదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందని భావించిన ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్లో చేరాలని భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రలోభాల ఎర చూపడం.. లేదంటే ఇదివరకు ఎంపీపీ, జెడ్పీటీసీ పదువులు అనుభవించిన వారు చేపట్టిన పనులను నిధులు మంజూరు చేసేందుకు తాత్కాలికంగా కొర్రీ విధించడం.. పనులను నాణ్యతను చూశాకే.. మంజూరు చేస్తామని చెబుతూ ఇతర పార్టీలకు చెందిన వారిని గులాబీవైపు మళ్లించేందుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను ఒక్కొక్కరిగా కాకుండా అందరినీ ఒకే వేదికమీద కండువాలను కప్పి తమ పార్టీలో చేరేందుకు సందర్భంకోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించడమే కాకుండా.. గులాబీ పార్టీ ప్రతిష్టను కూడా చాటుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్ర విచిత్ర రాజకీయ కూటములతో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకీ సరిపడినంత సంఖ్యాబలం లేని చోట ప్రలోభాల పర్వం జోరుగా సాగింది. క్యాంపుల పేరిట తమ సభ్యులు చేజారకుండా పార్టీలు, నేతలు కట్టుదిట్టంగా వ్యవహరించినా పలుచోట్ల ఫిరాయింపులు జరిగాయి. పార్టీలు, సిద్ధాంతాలకు తిలోదకాలివ్వడంతో ‘కలగూర గంప’ కూటములకు మండల పరిషత్ పీఠాలు దక్కాయి. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మెజారిటీ మండల పరిషత్ పీఠాలను కైవసం చేసుకుంది. వ్యూహాత్మక ఎన్నిక..! జెడ్పీ చైర్మన్ పదవిపై కన్నేసిన టీఆర్ఎస్ పార్టీ ముందస్తుగా ఇతర పార్టీల జెడ్పీటీసీలను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించి జిల్లాపరిషత్ పీఠాన్ని దక్కించుకుంది. గద్వాల జెడ్పీటీసీ సభ్యుడు బండారి భాస్కర్ జిల్లా పరిషత్ ైచైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ విప్ ఉల్లంఘించి టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన కొత్తూరు కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుడు నవీన్‌కుమార్‌రెడ్డికి వైస్ చైర్మన్ పదవి దక్కింది. 64మంది సభ్యులున్న జిల్లా పరిషత్‌లో చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నికయ్యేందుకు కనీసం 33మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉండగా.. టీఆర్ఎస్కు చెందిన 25మంది సభ్యులతో పాటు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు చైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్కు సహకరించడంతో సంఖ్యాబలం 35కు చేరింది. దీంతో జెడ్పీ పీఠాన్ని దక్కించుకోగలిగారు. 64 మండల పరిషత్‌లకు గాను 62 మండలాలకు సంబంధించి ఎంపీపీ ఎన్నిక పూర్తయింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితి 27చోట్ల ఎంపీపీ అధ్యక్ష పదవులు, 20 ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది. -
‘గులాబీ' నగర్
మారిన జిల్లా రాజకీయ ముఖచిత్రం - కుదేలైన కాంగ్రెస్ - అడ్రస్ లేని టీడీపీ - ఉనికి కోసం బీజేపీ కరీంనగర్ సిటీ: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 12 ఎమ్మెల్యే సీట్లు, మూడు ఎంపీ స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్.. అదే హవాను స్థానిక సంస్థల్లో కొనసాగించింది. ఈనెల 3, 4, 5 తేదీల్లో వరుసగా జరిగిన పరోక్ష ఎన్నికల్లో టీఆర్ఎస్ దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది. జిల్లాలో 11 మున్సిపాలిటీకు.. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో సహా మెట్పల్లి, కోరుట్ల, సిరిసిల్ల మున్సిపాలిటీలు, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట, పెద్దపల్లి నగరపంచాయతీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జిల్లాలో 57 జెడ్పీటీసీ స్థానాలకు.. 41 సీట్లను సాధించి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగురవేసింది. జెడ్పీ చైర్పర్సన్, వైస్‌చైర్మన్, కో-ఆప్షన్ సీట్లను తన ఖాతాలో వేసుకుంది. 57 మండల పరిషత్‌లకు గాను.. 42 ఎంపీపీలను ఏకపక్షంగా గెలుచుకొని జిల్లాను పూర్తిగా గులాబీమయం చేసింది. పలు మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లతో మెజారిటీ లేకున్నా.. అధికార బలంలో పరోక్ష ఎన్నికల్లో సత్తా చాటుకుంది. జిల్లావ్యాప్తంగా ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో మాత్రమే టీఆర్ఎస్ వెనుకబడగా, కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంది. జగిత్యాల మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని మూడు ఎంపీపీలను కైవసం చేసుకుంది. నరేంద్రమోడీ హవాతో జాతీయస్థాయిలో అధికారం చేపట్టిన బీజేపీ జిల్లాలో మాత్రం ఉనికి కోసం అపసోపాలు పడుతోంది. ఒక్క జెడ్పీటీసీ, ఒక్క ఎంపీపీ, ఒక్క నగరపంచాయతీ సాధించుకొని ‘నంబర్ వన్’ గా చతికిలపడింది. జిల్లాలో మొన్నటిదాకా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అడ్రసే గల్లంతైంది. కేవలం ఓదెల జెడ్పీటీసీని గెలుచుకున్న ఆ పార్టీ.. ఒక్క మండల పరిషత్‌ను కూడా సొంతం చేసుకోలేక పోయింది. మున్సిపాలిటీల్లో బోణీ కూడా కొట్టని దుస్థితి ఏర్పడింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సొంత జగిత్యాల నియోజకవర్గంలో పూర్తిగా గల్లయింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు సిహెచ్.విజయరమణారావు నియోజకవర్గమైన పెద్దపల్లిలోనూ టీడీపీ కనుమరుగైంది. సుల్తానాబాద్‌లో కాంగ్రెస్ మద్దతుతో ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నించినప్పటికీ సొంత పార్టీ ఎంపీటీసీలే షాక్నిచ్చి.. టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారు. పెద్దపల్లి నగర పంచాయతీలోనూ కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని టీడీపీ నేతలు తీర్మానిస్తే.. విప్‌ను ధిక్కరించి మరీ కౌన్సిలర్లు టీఆర్ఎస్కు ఓటేశారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల పరిస్థితి దయనీయంగా మారింది. కారు వైపు పరుగులు అధికార పార్టీ టీఆర్ఎస్ తన హవాను కొనసాగిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కారెక్కేందుకు పరుగులు తీస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు మండలి చైర్మన్ ఎన్నికకు ముందు టీఆర్ఎస్లో చేరి ఆ పార్టీ అభ్యర్థి స్వామిగౌడ్‌కు ఓటేశారు. జిల్లాలో నలుగురు ఎమ్మెల్సీలకు గాను భానుప్రసాద్‌రావు చేరడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీల సంఖ్య మూడుకు చేరింది. కరీంనగర్ కార్పొరేషన్లో 14 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలుపొందగా.. ఐదుగురు సీనియర్ కార్పొరేటర్లు గులాబీ గూటికి చేరుకున్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన విజయ్ టీఆర్ఎస్లో చేరి ఏకంగా చైర్మన్ అయ్యారు. అధికారంలోకి రావడమే తరువాయి.. రాజకీయంగా పట్టు సాధించేందుకు గులాబీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండటంతో చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా కారువైపు పరుగులు పెడుతున్నారు. పలువురు సర్పంచులు, వార్డు సభ్యులు, సింగిల్‌విండో చైర్మన్లు సైతం టీఆర్ఎస్లో చే రుతున్నారు. దీంతో జిల్లాలో 90 శాతానికి పైగా పదవులు టీఆర్ఎస్ ఖాతాలో ఉండడం విశేషం. -
గులాబీ జోరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఏకంగా వారం రోజుల పాటు వాయిదాపడడంతో ఆయా పార్టీల్లో మరింత ఉత్కంఠ పెరిగింది. మొత్తం 33 జెడ్పీటీసీలకుగాను కాంగ్రెస్ 14, టీఆర్ఎస్ 12, టీడీపీ 7 స్థానాలను కైవసం చేసుకున్నాయి. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల అనంతరం మారిన సమీకరణల నేపథ్యంలో నవాబుపేట జెడ్పీటీసీ యాదవరెడ్డి టీఆర్ఎస్ పక్షాన చేరారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్లకు సంఖ్యాబలం సమానమైంది. ఆదివారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజేంద్రనగర్ జెడ్పీటీసీ ముంగి జ్యోతి జైపాల్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర మంత్రులు మహేందర్‌రెడ్డి, ఈటెల రాజేందర్ల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. దీంతో జెడ్పీలో టీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 14కు చేరింది. ఇక జెడ్పీ పీఠం మాదే అనే ధీమా టీఆర్ఎస్ నేతల్లో పెరిగింది. ‘వాయిదా’ తెచ్చిన తంటా జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునే క్రమంలో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు జతకట్టాయి. పదవీకాలాన్ని విభజించి ఇరు పార్టీలు పంచుకునే ఒప్పందంతో ఒక్కటైన వాటికి కొత్త చిక్కులు వచ్చాయి. వాస్తవానికి ఈ రెండు పార్టీలు కలిస్తే జెడ్పీ కుర్చీ కైవసం చేసుకోవడం నల్లేరు మీద బండి నడకే. ఇందులో భాగంగా శనివారం నాటి ఎన్నిక ప్రక్రియపై కాంగ్రెస్, టీడీపీలు ధీమాగా ఉన్నాయి. కానీ మెజార్టీ సభ్యులు ఎన్నికకు గైర్హాజరయ్యారు. కోరం లేని కారణంగా ఎన్నికను ఏకంగా వారం పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ వాయిదా వ్యవహారం ఆ పార్టీలకు గుబులు పుట్టిస్తోంది. సభ్యుల గోడ దూకే అవకాశం ఉండడంతోఅన్ని పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన రాజేంద్రనగర్ జెడ్పీటీసీ ముంగి జ్యోతి భర్త జైపాల్‌రెడ్డి టీఆర్ఎస్ కండువా వేసుకున్నారు. మాజీ మంత్రి సబిత అనుచరుల్లో ఒకరైన జైపాల్‌రెడ్డి, ఆయన సతీమణి రాజేంద్రగనగర్ జెడ్పీటీసీ జ్యోతి పార్టీ మారడం.. ఆమె అనుచరులుగా ఉన్న మరో ఇద్దరు జెడ్పీటీసీలు సైతం పార్టీ మారే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్‌ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. బలపడిన టీఆర్ఎస్.. మారుతున్న సమీకరణలతో తెలంగాణ రాష్ట్ర సమితికి ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ సం ఖ్యాబలం 14కు చేరింది. దీంతో జెడ్పీలో మెజార్టీ స్థానాలున్న పార్టీగా ఎదిగింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు ఇంకా ఏడు రోజులు గడువుండడంతో.. పీఠాన్ని దక్కించుకునేందుకు ఆ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలువురు టీడీపీ, కాంగ్రెస్ జెడ్పీటీసీలతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. కానీ ఇలాంటివేవీ లేవంటూ కాంగ్రెస్, టీడీపీలు ప్రకటనలు చేస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి జంగారెడ్డి పేరును కొందరు సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. -
దుర్మార్గం
తలుపులు మూసి జెడ్పీ చైర్మన్ ఎన్నిక - అడుగడుగునా అధికార దుర్వినియోగం - ఓడిన ఓటరన్న ఆశయం - ఖూనీ అయిన ప్రజాస్వామ్యం - ఎమ్మెల్యేలని చూడకుండా గెంటేసిన వైనం - కీలుబొమ్మలుగా మారిన అధికారులు - మెజారిటీ వైఎస్సార్సీపీకి పీఠం టీడీపీకి - భూమా ప్రశ్నలకు నీళ్లు నమిలిన అధికార యంత్రాంగం సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లా పరిషత్‌లో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా టీడీపీ నాయకులు బరితెగించారు. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అడ్డదారులు తొక్కారు. జిల్లా అధికారులూ వీరికి వంతపాడారు. ఫలితంగా శనివారం నిర్వహించిన జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఏకపక్షంగా ముగిసింది. మెజార్టీ జెడ్పీటీసీ స్థానాలు దక్కించుకొన్న వైఎస్సార్సీపీకి కాదని టీడీపీ జెడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకోగలింది. ఓటరు ఒక ఆశయంతో తీర్పు ఇస్తే.. మరో ఆశయంతో పచ్చ పార్టీ దుర్మార్గానికి పాల్పడి బలవంతంగా గద్దెనెక్కింది. జిల్లాలో 53 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వైఎస్సార్సీపీకి అత్యధికంగా 30 స్థానాలను ఓటర్లు కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీ 20 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ 2, ఆర్పీఎస్ ఒక స్థానంలో గెలిచాయి. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులను బెదిరించి, భయపెట్టి, డబ్బులు ఎర చూపి తమ వైపునకు తిప్పుకున్నారు. అడుగులకు మడుగులొత్తే అధికారుల సహకారం కూడా తీసుకున్నారు. జెడ్పీ సీఈఓ కనుసన్నల్లోనే అంతా.. జెడ్పీ సీఈఓ సూర్యప్రకాషరావు కనుసన్నల్లో శనివారం జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరిగింది. జెడ్పీ సమావేశ మందిరంలో బారికేడ్లు కట్టడం నుంచి జెడ్పీ చైర్మన్ ప్రమాణ స్వీకారం వరకు ఆయన అంతా తానై నడిపించారు. జెడ్పీ హాల్లో వైఎస్సార్సీపీకి వేరుగా.. టీడీపీకి వేరుగా సీట్లు ఏర్పాటు చేశారు. మధ్య బ్యారికేడ్లు ఉంచారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారిని దగ్గరుండి ‘పచ్చ’ పార్టీకి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను అడ్డుకునే విషయంలోనూ ఈయన పాత్ర ఉందని సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టేలా ప్రవర్తించటం కూడా అందులో భాగమేనని ప్రచారం జరుగుతోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పలుమార్లు కలెక్టర్‌ను నిలదీశారు. అధికారులు చేసిన తప్పును ఎత్తిచూపారు. అధికార యంత్రాంగం చేసింది తప్పేనని అర్థం కావటంతో కలెక్టర్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. సుమారు నాలుగు గంటల పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ నిరసన తెలియజేస్తున్నా సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. పలు ప్రశ్నలకు అధికారులు నీళ్లునమిలారు. భూమా నాగిరెడ్డి పలుమార్లు జీఓ కాపీని చూపించి మాట్లాడుతుంటే ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ‘మీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మాకు అడిగే హక్కు ఉంది. ఎమ్మెల్యేలను తాకే అధికారం పోలీసులకు లేదు. మీరు ఇలా చేయమని ఏ చట్టం చెపుతోంది’ అంటూ పలు ప్రశ్నలు సంధించటంతో కలెక్టర్, జేసీ, సీఈఓలు పక్కనే ఉన్న న్యాయనిపుణులతో మాట్లాడటం కనిపించింది. ‘ఇలా చేయొచ్చని రాత పూర్వకంగా రాసివ్వండి’ అని పలుమార్లు కలెక్టర్‌ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, ఐజయ్యలు నిలదీశారు. ఎమ్మెల్యేలు ఓ పక్క నిరసన తెలియజేస్తుంటే.. సీఈఓ మాత్రం సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించండి అంటూ కలెక్టర్‌కు చెప్పటం కనిపించింది. పక్కా పథకం ప్రకారమే.. జెడ్పీ చైర్మన్ ఎన్నికను పక్కా పథకం ప్రకారం పూర్తి చేయించారు. అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. ఇలాగే కొనసాగితే పథకం తిరగబడుతుందని తెలిసి ఎమ్మెల్యేలను బయటకు పంపేందుకు రంగం సిద్ధం చేశారు. ముందుగా టీడీపీ జెడ్పీటీసీలు కొందరిచేత ప్రమాణం చేయించారు. తాము న్యాయం అడుగుతుంటే సమాధానం ఇవ్వకుండా ప్రమాణం చేయటంపై భూమా నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ‘కలెక్టర్ గారూ.. కలెక్టర్ గారూ.. అంటూ గట్టిగా అరిచారు. సమాధానం రాకపోవటం, పోలీసులు దౌర్జన్యానికి దిగటంతో ‘కలెక్టర్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ వారు ప్రమాణం చేయరని భావించి, జాబితాలో వారి పేర్లను మాత్రం టిక్ చేశారు. ఎవరు టీడీపీ, ఎవరు వైఎస్సార్సీపీ, ఎవరు పార్టీ ఫిరాయించారనే వివరాలను క్షణాల్లో కలెక్టర్‌కు ఇచ్చారు. వారిని మాత్రం పిలవబోమని సూచించారు. సీఈఓ చెప్పిన విధంగానే కలెక్టర్ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యుల పేర్లు చదవుకుంటూ వెళ్లారు. వారెవ్వరూ ప్రమాణం చేయలేదని, ఎన్నిక జరక్కుండా చేస్తారని ఎమ్మెల్యేలని చూడకుండా బయటకు ఎత్తుకెళ్లారు. ముందుగా కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. అదే విధంగా ఆదోని, మంత్రాలయం, డోన్ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, బుగ్గన రాజారెడ్డిని ఎత్తుకునేందుకు ప్రయత్నించారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను సైతం మహిళా పోలీసులచేత ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యులను బయటకు పంపేసి తలుపులు మూసివేశారు. పదినిముషాల్లో జెడ్పీ చెర్మైన్, వైస్ చైర్మన్ ఎంపికను పూర్తి చేసి హడావుడిగా వెళ్లిపోయారు. -
టీడీపీ కోటకు బీటలు
- పాతికేళ్లుగా జెడ్పీని ఏలిన టీడీపీ.. - నేడు తుడిచిపెట్టుకుపోయింది.. సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : పూలమ్మిన చోటే.. కట్టెలమ్మినట్లు తయారైంది.. జిల్లా పరిషత్ విషయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. వరుస గా ఆరు సార్లు జెడ్పీ చైర్మన్ పీఠాలను దక్కించుకుని.. పాతికేళ్లుగా జిల్లా పరిషత్‌లో తిరుగులేని పాలన కొనసాగించిన టీడీపీకి ఇప్పుడు కేవలం ఇద్దరంటే ఇద్దరు జెడ్పీటీసీలు మాత్రమే మిగిలారంటే జిల్లాలో ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. కొత్తగా శనివారం కొలువుదీరిన జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశంలో ఆ పార్టీ జెడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్రావు (వాంకిడి), అబ్దుల్‌కలాంలు (కెరమెరి) మాత్రమే ఉన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో ఘెర పరాజయం పాలైన ఆ పార్టీ కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే గెలిచారు. ఇన్నాళ్లు పచ్చకండువాలు ధరించిన టీడీపీ సభ్యులతో నిండిపోయిన జెడ్పీ సమావేశాల్లో ఇప్పుడు ఆ పార్టీ సభ్యులతో కోసం వెతుక్కుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 27 ఏళ్లుగా టీడీపీ పాలనలోనే.. 1987 ఫిబ్రవరిలో జెడ్పీ చైర్మన్‌గా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (అప్పట్లో టీడీపీలో ఉన్నారు.) ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2009 వరకు సుమారు 27 ఏళ్లు పాటు తెలుగుదేశం పార్టీ జిల్లా పరిషత్‌లో పాగా వేసింది. మధ్యలో 1992 నుంచి 1995 వరకు మూడేళ్లు, 2000 నుంచి 2001 వరకు మరో ఏడాది మొత్తం నాలుగేళ్ల పాట ప్రత్యేక అధికారి (కలెక్టర్) పాలన కొనసాగింది. ఆ తర్వాత మళ్లీ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ 2009 సెప్టెంబర్ వరకు టీడీపీ కొనసాగింది. తర్వాత జెడ్పీ పీఠం కాంగ్రెస్‌కు దక్కింది. 2009 నుంచి 2011 వరకు కాంగ్రెస్ జెడ్పీటీసీ సిడాం గణపతి జెడ్పీ చైర్మన్‌గా కొనసాగారు. ఆ తర్వాత ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో మళ్లీ మూడేళ్లుగా జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారి పాలనలో కొనసాగింది. ఎట్టకేలకు ప్రభుత్వం ఏప్రిల్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం.. ఇప్పుడు పాలక మండలి కొలువుదీరడం జరిగిపోయింది. సుమారు 27 ఏళ్లుగా జిల్లా పరిషత్‌ను పాలించిన టీడీపికి ఇప్పుడు ఉనికిని చాటుకునే పరిస్థితి ఏర్పడింది. అధినేత తీరుతో.. తెలంగాణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా ఆ పార్టీ జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అధినేత తీరును నిరసిస్తూ క్షేత్రస్థాయి కార్యకర్తలు వలసలు పోగా, ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో జిల్లాలో ఆ పార్టీ ఖాళీ అయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా పార్టీకి దక్కకపోగా, ప్రాదేశిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఘెర పరాజయం పాలైంది. దీంతో జిల్లాలో ఆ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. జిల్లా పరిషత్ చైర్మన్లుగా పనిచేసిన నేతల వివరాలు ఇలా ఉన్నాయి.. -
జెడ్పీ కా ‘రాణి’
- జెడ్పీపై ఎగిరిన గులాబీ జెండా - చైర్‌పర్సన్‌గా వల్లకొండ శోభారాణి - వైస్ చైర్మన్‌గా మూల రాజిరెడ్డి - మూడేళ్ల తర్వాత ఎన్నిక.. సాక్షి,ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా నిర్మల్ జెడ్పీటీసీ వల్లకొండ శోభారాణి ఎన్నికయ్యారు. వైస్‌చైర్మన్‌గా చెన్నూరు జెడ్పీటీసీ మూల రాజిరెడ్డిని ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక కోసం శనివారం జెడ్పీ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు జెడ్పీటీసీలు వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్‌పర్సన్‌గా శోభారాణి పేరును గుడిహత్నూర్ జెడ్పీటీసీ కేశవ్‌గిత్తే ప్రతిపాదించగా, ఆదిలాబాద్ జెడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్ బలపరిచారు. ఈ పదవికి ఎవరూ పోటీలో లేకపోవడంతో శోభారాణి చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ జగన్మోహన్ ప్రకటించారు. అలాగే వైస్‌చైర్మన్‌గా మూల రాజిరెడ్డి పేరును మందమర్రి జెడ్పీటీసీ కె.సుదర్శన్ ప్రతిపాదించగా, కౌటాల జెడ్పీటీసీ డుబ్బుల నానయ్య (బీఎస్పీ నుంచి పోటీచేసి గెలిచారు) బలపరిచారు. ఈ పదవికి కూడా ఎవరూ పోటీలో లేకపోవడంతో వైస్‌చైర్మన్‌గా రాజిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలో 52 స్థానాలకు గాను 38 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ జిల్లా పరిషత్ చరిత్రలోనే మొదటి సారిగా జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాను ఎగురవేశారు. కో ఆప్షన్ సభ్యులూ ఏకగ్రీవమే.. జెడ్పీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరిగింది. చెన్నూరుకు చెందిన సయ్యద్ సాదిఖ్ అలీ, ఖానాపూర్‌కు చెందిన యూసుఫ్ అహ్మద్ ఖాన్లు ఎన్నికయ్యారు. ఈ రెండు కోఆప్షన్ పదవులకు ఐదుగురు నామినేషన్లు వేశారు. ఈ ఇద్దరితో పాటు ఇంద్రవెల్లికి చెందిన ఎం.డి.అంజద్, ఖానాపూర్‌కు చెందిన రఫీక్ బేగ్, ఎండీ జహీరుద్దీన్లు నామినేషన్లు వేశారు. ఇందులో అంజద్, రఫీక్ బేగ్‌ల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, జహీరుద్దీన్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో ఉన్న సాదిఖ్ అలీ, యూసుఫ్ అహ్మద్‌ఖాన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. ఎన్నిక జరిగింది ఇలా.. శనివారం ఉదయం 10 గంటల వరకు కోఆప్షన్ సభ్యుల పదవులకు నామినేషన్లు తీసుకున్నారు. ఈ నామినేషన్లను పరిశీలించిన అనంతరం ముగ్గురు బరిలో ఉన్నట్లు ప్రకటించారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు జెడ్పీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. మొదట జెడ్పీటీసీలతో జెడ్పీ సీఈఓ అనితాగ్రేస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారం అనంతరం కోఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అనంతరం సమావేశాన్ని మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. తిరిగి మూడు గంటలకు సమావేశం ప్రారంభం కాగా మొదట చైర్‌పర్సన్‌ను, తర్వాత వైస్‌చైర్మన్ ఎన్నిక జరిగింది. ఎట్టకేలకు మూడేళ్ల అనంతరం జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరింది. బాధ్యతలు స్వీకరించిన జెడ్పీ చైర్మన్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అనంతరం శోభారాణితో సీఈఓ అనితాగ్రేస్ మరోమారు ప్రమాణ స్వీకారం చేయించారు. శోభారాణి జెడ్పీటీసీగా ఒకసారి, చైర్‌పర్సన్‌గా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెను ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ఘనంగా సన్మించారు. సమావేశం ముగిసిన తర్వాత శోభారాణి నేరుగా తన చాంబర్లోకి వెళ్లి పదవీ బాధ్యతలు స్వీకరించారు. చివరి వరకూ కొనసాగిన ఉత్కంఠ చైర్పర్సన్ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. శోభారాణితో పాటు, మంచిర్యాల జెడ్పీటీసీ ఆశలత పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే ఎట్టకేలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శోభారాణి పేరు ఖరారైంది. కాగా మంత్రి జోగురామన్న, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు జెడ్పీటీసీలతో కలిసి బాసరలో క్యాంపులో ప్రత్యేక సమావేశమై.. ఎన్నిక విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. హాజరైన ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్ తొలి సమావేశానికి జెడ్పీటీసీ సభ్యులతో పాటు, రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్), నడిపెల్లి దివాకర్‌రావు (మంచిర్యాల), కోనేరు కోనప్ప (సిర్పూర్), నల్లాల ఓదేలు (చెన్నూరు), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్), జి.విఠల్‌రెడ్డి (ముథోల్), కోవ లక్ష్మి (ఆసిఫాబాద్), దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి), రాథోడ్ బాపురావు (బోథ్)లు హాజరయ్యారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కరీంనగర్ జెడ్పీ సమావేశానికి వెళ్లడంతో ఇక్కడి సమావేశానికి రాలేకపోయినట్లు సమాచారం. ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. పార్టీ కార్యక్రమంలా ముగిసిన తొలి సమావేశం.. జెడ్పీ చైర్పర్సన్, వైస్‌చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ తొలి సమావేశం చివరకు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల అభినందన సభగా ముగిసింది. చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ప్రమాణ స్వీకారం అనంతరం వీరిని సన్మానించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని మండలాల ఎంపీపీలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. సమావేశం వేదిక ముందున్న ఎంపీ, ఎమ్మెల్యేలను కలెక్టర్ జగన్మోహన్ వేదికపైకి ఆహ్వానించి, సమావేశం నుంచి నిష్ర్కమించారు. ఆ తర్వాత జెడ్పీ ప్రత్యేక సమావేశం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా సాగింది. పార్టీ అభినందన సభలా తయారైంది. కేవలం అర్హత కలిగిన ప్రజాప్రతినిధులు మాత్రమే వేదికపైన కూర్చునే నిబంధనలు ఉండగా, ఆ పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు వేదికపై ఆసీనులయ్యారు. జెడ్పీటీసీల కుర్చీల్లో పార్టీ కార్యకర్తలు ఆసీనులయ్యారు. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు సమావేశం హాలులోకి చొచ్చుకు వచ్చారు. తమ నాయకున్ని వేదికపైకి పిలవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చైర్పర్సన్ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశం కాస్త పార్టీ కార్యక్రమంలా ముగియడం అందరిని ముక్కున వేలేసుకునేలా చేసింది. -
కొలువుదీరిన జడ్పీ పాలకవర్గం
ఇందూరు : సుమారు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జడ్పీ పాలకవర్గం కొలువుదీరింది. బాధ్యతలు స్వీకరించడానికి నెలన్నరగా నిరీక్షిస్తున్న జడ్పీటీసీలు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. సాయంత్రం ఆరు గంటలకు జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం సమావేశమైంది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులను సభ్యులకు పరిచయం చేయించా రు. డీఆర్డీఏ పీడీ వెంకటేశంతో పరిచయ కార్యక్రమం ప్రారంభించారు. డీఆర్డీఏ, జిల్లా పంచాయతీ, డ్వామా, ట్రాన్స్‌కో, వ్యవసాయ, ఉద్యాన, సంక్షేమ తదితర శాఖల అధికారులు ఆయా శాఖలు అమలు చేస్తున్న పథకాలు, అవి అందించే ఫలాలను జడ్పీటీసీ సభ్యులకు వివరించారు. ఘనసన్మానం జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లను మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సన్మానిం చారు. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కవిత, బీబీపాటిల్, కలెక్టర్ వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈఓ రాజారాం, జడ్పీటీసీ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు తన కుటుంబ సభ్యులను అందరికీ పరిచయం చేశారు. జడ్పీ కార్యాలయం వద్ద జుక్కల్, నిజాంసాగర్ మండలాలకు చెందిన అభిమానులు టపాకాయలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. భారీ బందోబస్తు పాలక వర్గం ఎన్నిక సందర్భంగా జిల్లా పరిషత్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకే జిల్లా పరిషత్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు. జడ్పీ పరిసరాల చుట్టూ 144 సెక్షన్ అమలు చేశారు. గుర్తింపు కార్డులు లేనిదే ఎవరినీ లోనికి అనుమతించలేదు. సీఐలు, ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. -
నెల్లూరు జడ్పీ చైర్మన్ ఎన్నిక వాయిదా
నెల్లూరు:జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు వీరంగం వేసి ఛైర్మన్ ఎన్నికను అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా పరిషత్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్నా.. ఎలాగోలా ప్రలోభాలతో జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని లేనిపక్షంలో ఎన్నికను వాయిదా వేయించాలని టీడీపీ యత్నించడంతో ఈ స్థానంలో ఎన్నిక వాయిదా వేయక తప్పలేదు. శనివారం మధ్యాహ్నం నెల్లూరులో కలెక్టర్ అధ్యక్షతన జడ్పీ ఛైర్పర్సన్ ఎన్నికకు సమావేశం ప్రారంభం కాగానే కొద్ది సేపటికే తెలుగుదేశం నాయకులు వీరంగం వేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ అయితే నేరుగా వేదిక మీదకు వెళ్లి, కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌ను నానా దుర్భాషలాడి, ఆయన ముందున్న మైకులను కూడా విరిచిపారేశారు. పరోక్ష పద్ధతిలో, సీక్రెట్ బ్యాలెట్ ద్వారానే ఎన్నిక నిర్వహించాలని, లేనిపక్షంలో వాయిదా వేయాలని ఆయన పట్టుబట్టారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు పోడియం ముందు బైఠాయించి, ఎన్నికను ఎలాగైనా వాయిదా వేయించాలని విశ్వప్రయత్నాలు చేశారు. కలెక్టర్ మాత్రం అక్కడి పరిస్థితి మొత్తాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వివరిస్తూ లేఖ పంపారు. అక్కడి నుంచి అందిన ఉత్తర్వులు, సూచనల మేరకు తాను స్పందించి ఎలా చెబితే అలా చేస్తానని కలెక్టర్ చెప్పారు. వాస్తవానికి నెల్లూరు జిల్లాలో మొత్తం 46 మండలాలున్నాయి. వీటిలో 31 జడ్పీటీసీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కగా, టీడీపీ కేవలం 15 స్థానాలతో సరిపెట్టుకుంది. అయినా సరే.. ఎలాగోలా ప్రలోభాలతో నెట్టుకురావాలని టీడీపీ యత్నించింది. -
నెల్లూరులో టీడీపీ నేతల వీరంగం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు వీరంగం వేస్తున్నారు. జిల్లా పరిషత్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్నా, ఎలాగోలా ప్రలోభాలతో జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని, లేనిపక్షంలో ఎన్నికను వాయిదా వేయించి ప్రలోభాలకు మరికొంత సమయం తీసుకోవాలని టీడీపీ చూస్తోంది. శనివారం మధ్యాహ్నం నెల్లూరులో కలెక్టర్ అధ్యక్షతన జడ్పీ ఛైర్పర్సన్ ఎన్నికకు సమావేశం ప్రారంభం కాగానే కొద్ది సేపటికే తెలుగుదేశం నాయకులు వీరంగం వేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ అయితే నేరుగా వేదిక మీదకు వెళ్లి, కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌ను నానా దుర్భాషలాడి, ఆయన ముందున్న మైకులను కూడా విరిచిపారేశారు. పరోక్ష పద్ధతిలో, సీక్రెట్ బ్యాలెట్ ద్వారానే ఎన్నిక నిర్వహించాలని, లేనిపక్షంలో వాయిదా వేయాలని ఆయన పట్టుబట్టారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు పోడియం ముందు బైఠాయించి, ఎన్నికను ఎలాగైనా వాయిదా వేయించాలని విశ్వప్రయత్నాలు చేశారు. కలెక్టర్ మాత్రం అక్కడి పరిస్థితి మొత్తాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వివరిస్తూ లేఖ పంపారు. అక్కడి నుంచి అందిన ఉత్తర్వులు, సూచనల మేరకు తాను స్పందించి ఎలా చెబితే అలా చేస్తానని కలెక్టర్ చెప్పారు. వాస్తవానికి నెల్లూరు జిల్లాలో మొత్తం 46 మండలాలున్నాయి. వీటిలో 31 జడ్పీటీసీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కగా, టీడీపీ కేవలం 15 స్థానాలతో సరిపెట్టుకుంది. అయినా సరే.. ఎలాగోలా ప్రలోభాలతో నెట్టుకురావాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. వాళ్లు ఎంత రెచ్చగొట్టినా, వైఎస్ఆర్ సీపీ నాయకులు మాత్రం పూర్తి సంయమనం పాటిస్తూ.. కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా అనుసరిస్తున్నారు. -
జెడ్పీపై టీ‘ఢీ’పీ!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేదెవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. శనివారం జరగనున్న జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు జెడ్పీ సీఈవో నాగార్జున సాగర్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ 6, 11 తేదీల్లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో 22 స్థానాలు టీడీపీకి దక్కగా, వైఎస్ఆర్సీపీకి 16 స్థానా లు దక్కాయి. దీంతో టీడీపీకే జెడ్పీ పీఠం దక్కడం ఖాయం. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ భార్య ధనలక్ష్మి పేరును అధ్యక్ష పదవికి ప్రకటించినప్పటికీ, మంత్రి మండలి ఏర్పాటు తర్వాత సామాజిక సమీకరణల పేరుతో జెడ్పీని కాపు వర్గానికి ఇవ్వాలని ఒత్తిళ్లు పెరిగాయి. అధ్యక్ష పీఠం కాళింగులకే ఇస్తే.. ఉపాధ్యక్ష పదవైనా కాపులకు ఇచ్చేలా ఆ వర్గం నేతలు పార్టీ అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇదే పోస్టును టెక్కలి డివిజన్‌కు చెందిన మత్స్యకారులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యం లో ఎన్నిక సందర్భంగా టీడీపీ నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. అయితే జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో చౌదరి ధనలక్ష్మికే పీఠం దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఉపాధ్యక్ష పదవికి మాత్రం ఇంతవరకు ఖరారు చేయలేదని తెలుస్తోంది. ఈ రెండు పదవులు తమ వర్గానికే దక్కించుకోవడం ద్వారా సీనియర్ నేత కళాకు చెక్ పెట్టాలని కింజరాపు వర్గం యోచిస్తోంది. వైస్ పదవిపై మల్లగుల్లాలు చైర్మన్ పదవికి ధనలక్ష్మి పేరు ఖరారైనట్లేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు సీనియర్ నేత కళా వెంకటరావు వర్గానికి అన్యాయం జరగకుండా ఉండేందుకు, కాపులకు కాస్తయినా సంతృప్తి కలిగించేందుకు జెడ్పీ వైస్ చైర్మన్ పదవిని ఆఫర్ ఇస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు గత రెండు రోజులుగా జిల్లా టీడీపీ నేతలు పలుమార్లు మంతనాలు జరిపి నిర్ణయించినట్లు తెలిసింది. ఆ సామాజికవర్గానికి చెందిన పాలకొండ జెడ్పీటీసీ సామంతుల దామోదరరావు, వంగర జెడ్పీటీసీ బొత్స వాసుదేవరావు నాయుడు, సంతకవిటి జెడ్పీటీసీ అయిన పార్టీ సీనియర్ నేత కొల్ల అప్పలనాయుడు భార్య పేరుతో పాటు మరో మహిళా జెడ్పీటీసీ పేరూ వినిపిస్తోంది. అయితే పార్టీలో చాలా మంది దామోదర్‌రావు పేరును వ్యతిరేకించినట్టు తెలిసింది. వేరే పార్టీ నుంచి ఇటీవలే టీడీపీలోకి వచ్చిన ఆయనకు పదవి ఎలా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా చైర్మన్ పదవి మహిళకు కట్టబెట్టినప్పుడు వైస్ పదవి కూడా మహిళ కెందుకు అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. సోంపేట ప్రాంతానికి చెందిన మత్స్యకార సభ్యుడు కూడా వైస్ పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నిక జరిగేదిలా... అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నిక కార్యక్రమం ఇలా జరుగుతుంది. ఉదయం 10 గంటలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం మధ్యాహ్నం 1 గంట- నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, తుది జాబితా ప్రకటన మధ్యాహ్నం 3 గంటలు - జెడ్పీ తొలి సమావేశం. ఏకగ్రీవం కాకపోతే చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహణ అనంతరం.. కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షల ప్రమాణ స్వీకారం -
జెడ్పీ పీఠంపై గద్దె, శాయన !
నేడు పాలకవర్గం ఏర్పాటు ఎన్నిక లాంఛనప్రాయమే మచిలీపట్నం : ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ పాలకవర్గ ఎంపిక శనివారం జరగనుంది. ఎన్నికల ముందే టీడీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్ధిగా గద్దె అనూరాధను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె ఎన్నిక లాంఛన ప్రాయం కానుంది. 1961వ సంవత్సరంలో జిల్లా పరిషత్ ఏర్పడింది. చైర్మన్ పదవిని అధిష్టించిన మహిళల్లో నల్లగట్ల సుధారాణి ఒకరు కాగా రెండో మహిళ అనూరాధ. జిల్లా పరిషత్ పాలకవర్గ ఎంపిక శనివారం జరగనుండటంతో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు జిల్లా పరిషత్‌కు రానున్నారు. ఈ ఎన్నిక కోసం కలెక్టర్ ఎం. రఘునందనరావు ఆధ్వర్యంలో విసృ్తత ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 49 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా వాటిలో 34 టీడీపీ, 15 స్థానాలను వైఎస్ఆర్ సీపీ గెలుచుకున్నాయి. వైస్‌చైర్మన్‌గా పుష్పావతి ఖరారు జెడ్పీ వైస్‌చైర్మన్ పదవికి గుడ్లవల్లేరు జెడ్పీటీసీ సభ్యురాలు శాయన పుష్పావతి పేరును టీడీపీ నాయకులు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం రాత్రి విజయవాడలో నిర్వహించిన టీడీపీ నాయకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పుష్పావతిని జెడ్పీ వైస్‌చైర్మన్‌గా ఎంపిక చేయటం గమనార్హం. జెడ్పీ పాలకవర్గ ఎన్నిక ప్రక్రియ ఇలా .. ఇద్దరు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు శనివారం ఉదయం 10 గంటలకు నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంది. 10 నుంచి నామినేషన్లు పరిశీ లించి 12 గంటలకు సక్రమంగా ఉన్నా జాబితా ప్రకటిస్తారు. మధ్యాహ్నం 1.00 గంటలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు, 12గంటలకు ఆయా పార్టీలు జారీ చేసే విప్ (ఎనగ్జర్-3)ను స్వీకరిస్తారు. 1.00 గంటకు జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం కో- ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం తెలుగు అక్షరమాల క్రమంలో సభ్యుల పేర్లు పిలిచి ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు, ఎన్నికైన కో-ఆప్టెడ్ సభ్యులకు ప్రత్యేక సమావేశంలో నోటీసు జారీ చేస్తారు. అనంతరం మద్దతు తెలిపేందుకు సభ్యులు చేతులు ఎత్తటం ద్వారా ఎన్నిక జరుగుతుంది. -
ఎవరి జెండా ఎగురునో!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : స్థానిక సంస్థల్లో సారథులు కొలువుదీరే వేళ ఆసన్నమైంది. పురపాలకులకు నేడే పట్టాభిషేకం జరగనుంది. ము న్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాలకు వరుసగా గురు, శుక్ర, శనివారాల్లో పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడురోజుల పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఇటు నాయకులు, అటు అధికారు లు బిజీబిజీగా ఉన్నారు. జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూరు, బోధన్, కామారెడ్డి మున్సిపాలిటీల్లో గురువారం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి వరకు కొనసాగిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల క్యాంపు రాజకీయాలకు తెరపడనుంది. 4న మండల పరిష త్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 5న జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ఇంకా క్యాంపుల్లోనే కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెల కొనడంతో ఆయా పార్టీల నాయకులు బుధవారం రాత్రే నిజామాబాద్‌కు చేరుకున్నారు. గురువారం జరిగే కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల ఎన్నికలపై వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. మూడు రోజుల పాటు జరిగే వరుస ఎన్నికల నేపథ్యంలో పోలీసుశాఖ జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. వ్యూహప్రతివ్యూహాలు పరోక్ష ఎన్నికల్లో తమదే విజయం కావాలని ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. చివరి నిమిషం వరకు సర్వశక్తులొడ్డేందుకు.. తమ అస్త్రశస్త్రాలన్నీ సంధించేందుకు సిద్ధమవుతున్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీలకు గురువారంతో ఎన్నికలు ముగియనుండగా.. శుక్ర, శనివారాల్లో జరిగే ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎన్నికలను టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నాయి. జడ్పీ చైర్మన్ పీఠం ఇప్పటికే టీఆర్ఎస్ కైవసం కాగా.. అత్యధిక ఎంపీపీ స్థానాలను సాధించుకునేందుకు ఇరుపార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. దీంతో జిల్లాలో పరోక్ష పోరు రసవత్తరంగా మారనుంది. ఇంతకాలం బుజ్జగింపులు, సమీకరణలు, వ్యూహప్రతివ్యూహాలు, చేరికలపై దృష్టి సారించిన ఈ పార్టీల నేతలు బుధవారం నుంచి మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో మకాం వేసి రాజకీయాలు నడిపిన టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్‌కు చేరుకున్నారు. ‘గీత’ దాటొద్దు మున్సిపల్, పరిషత్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు విప్ జారీ చేశాయి. నిజామాబాద్ మేయర్‌తో పాటు ఆర్మూరు, బోధన్, కామారెడ్డి మున్సిపాలిటీ పీఠాలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ఆయా పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ, ఎంఐఎంల మద్దతు లేకుండా కాంగ్రెస్, టీఆర్ఎస్ నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్ మున్సిపాలిటీల్లో గట్టెక్కే పరిస్థితి లేదు. దీంతో బీజేపీ, ఎంఐఎంలు సైతం తమ పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు బుధవారం సాయంత్రం విప్ జారీ చేశాయి. నిజామాబాద్‌లో అందుబాటులో లేని కొందరు కార్పోరేటర్ల ఇళ్లకు ‘విప్’ పత్రాలను అంటించారు. పరోక్ష ఎన్నికల షెడ్యూల్ ఇలా మున్సిపల్, పరిషత్ పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. 3, 4, 5 తేదీలలో వరుసగా జరిగే ఈ ఎన్నికల కోసం ప్రత్యేక అధికారులను కూడా నియమించనున్నారు. గురువారం నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఆర్మూరు, కామారెడ్డి, బోధన్ మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. అన్నిచోట్లా ఉదయం 11గంటలకు ఆయా పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు హాజరై ఎన్నుకోవాల్సి ఉంటుంది. పాలకవర్గం ఎన్నిక ప్రక్రియ ముగిసిన అనంతరం అదేరోజు మొదటి కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తారు. శుక్రవారం జిల్లాలోని 36 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక ఉంటుంది. అంతకంటే ముందు మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక కోసం ఉదయం 10 గంటలకు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణల అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక ప్రకటిస్తారు. 3 గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. అనంతరం మొదటి సర్వసభ్య సమావేశం ఉంటుంది. శనివారం జడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఉంటుంది. ఒక్కరోజు ముందుగా ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రకటన, సమావేశం ఉంటుంది. 5న ఉదయం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటల జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం మూడుగంటల తర్వాత జడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరుగుతుంది. అనంతరం జిల్లా పరిషత్ మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. -
నువ్వా నేనా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రోజుకో మలుపుతో జిల్లా పరిషత్ రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి యాదవరెడ్డి గులాబీ గూటికి చేరడం జిల్లా రాజకీయాల్లో సరికొత్త మార్పులకు దారితీస్తోంది. జెడ్పీ సారథి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనూహ్యంగా యాదవరెడ్డి ప్రత్యర్థి పంచన చేరడం కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. యాదవరెడ్డి కారెక్కడం ఖాయమని ముందే ఊహించిన ఆ పార్టీ న ష్టనివారణ చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ జెడ్పీటీసీ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టీడీపీ మద్దతుతో ఎలాగైనా జిల్లా పరిషత్‌ను వశం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్.. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ సమావేశంలో పదవీకాలం పంచుకునే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. పోటాపోటీ! జిల్లా పరిషత్‌లో 33 జెడ్పీటీసీలకుగాను టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 14, టీడీపీకి ఏడు స్థానాలున్నాయి. నవాబుపేట జెడ్పీటీసీగా గెలుపొందిన యాదవరెడ్డి టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన బుధవారం మండలి చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేశారు. దీంతో జిల్లా పరిషత్‌లోనూ ఆ పార్టీకి మద్దతు పలికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన టీఆర్ఎస్కు అండగా నిలిస్తే.. కాంగ్రెస్, టీఆర్ఎస్ల బలం సమం అవుతుంది. చైర్మన్ ఎన్నిక లో తటస్థంగా ఉన్నా కాంగ్రెస్‌కు నష్టమే. టీఆర్ఎస్కంటే ఇప్పుడు రెండు సీట్లు అధికంగా ఉన్న ఆ పార్టీకి ఒక సీటు తగ్గిపోతుంది. యాదవరెడ్డి జెడ్పీలో ఓటు హక్కు వినియోగించుకున్నా ఆయన పదవికి ఎలాంటి ముప్పు ఉండదు. ఓటేసిన తర్వాత రెండింటిలో ఏదో ఒక పదవికి రాజీనామా చేస్తే సరిపోతుంది. జెడ్పీ కుర్చీని గెలుచుకోవాలంటే 17మంది సభ్యుల బలం అవసరం. ఈ నేపథ్యంలో ఇరుపార్టీలకుటీడీపీ మద్దతు తప్పనిసరి. ఏడు జెడ్పీటీసీలున్న ‘దేశం’ ఇదే అదనుగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో మద్దతుపై దోబూచులాడుతోంది. స్పష్టమైన అధిక్యతలేకున్నా.. కుర్చీ మాదేనని మొదట్నుంచి ధీమాతో ఉన్న గులాబీ శిబిరం తాజా పరిణామాలతో మరింత హుషారుగా కనిపిస్తోంది. ఏకంగా చైర్మన్ అభ్యర్థినే తమవైపు తిప్పుకోవడం ద్వారా కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేశామని భావి స్తున్న ఆ పార్టీ.. మరో ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల మద్దతును కూడగట్టినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి బుధవారం టీడీపీ ఎమ్మెల్యేతో కూడా మద్దతు సమీకరణపై సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఎవరివైపో రేపు తేలుస్తాం! జెడ్పీలో కీలకంగా మారిన టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బుధవారం ఆ పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా ఎమ్మెల్యేలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన తీరుపై చర్చించారు. ఈ నేపథ్యంలో జెడ్పీ ఎన్నికలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంపై శుక్రవారం చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిద్దామని స్పష్టం చేశారు. కాగా, ఈ సమావేశానికి హాజరైన మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు ఇద్దామని ప్రతిపాదించగా, ఒక ఎమ్మెల్యే మాత్రం అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు అండగా నిలిచే అంశాన్ని పరిశీలించాలని చంద్రబాబు వద్ద అన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. -
షి‘కారు’!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ రాజకీయం సరికొత్త సమీకరణకు తెరలేపింది. ఏ పార్టీకీ స్పష్టమైన అధిక్యత రాకపోవడంతో రాజకీయ ప్రత్యర్థులు చేతులు కలిపేందుకు దారితీస్తోంది. చిరకాల ప్రత్యర్థి టీడీపీతో జతకట్టడం ద్వారా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతుండగా.. అధికార టీఆర్ఎస్కు స్నేహహస్తం అందించేందుకు టీడీపీ మొగ్గు చూపుతోంది. వేగంగా మారిపోతున్న సమీకరణలు జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. జెడ్పీలో 33 జెడ్పీటీసీలకు గాను 14 చోట్ల విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌లో హుషారు కనిపించడంలేదు. అధిష్టానం ప్రకటించిన చైర్మన్ అభ్యర్థి యాదవరెడ్డి అనూహ్యంగా ప్లేటు ఫిరాయించడంతో చేతులు కాల్చుకున్న కాంగ్రెస్ పార్టీ సంకటస్థితిని ఎదుర్కొంటోంది. అధ్యక్ష పదవికి యాదవరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఖరారు చేసిన నాయకత్వం.. క్యాంపు బాధ్యతను కూడా అప్పగించింది. ఈ క్రమంలోనే కొద్దిరోజులు శిబిరాన్ని నిర్వహించిన యాదవరెడ్డి.. ఆర్థికభారాన్ని భరించలేనని క్యాంపు ఎత్తేశారు. ఇది కాంగ్రెస్‌లో కల్లోలానికి దారితీసింది. 12 జెడ్పీటీసీలు గెలుచుకొని జెడ్పీ కుర్చీకోసం కాచుకుకూర్చున్న టీఆర్ఎస్, నిర్విరామంగా తమ పార్టీ సభ్యులతో క్యాంపు నిర్వహిస్తుండగా, ఖర్చుకు భయపడి యాదవరెడ్డి శిబిరాలకు గుడ్‌బై చెప్పడం కాంగ్రెస్ నేతలను ఆత్మరక్షణలో పడేసింది. మరోవైపు క్యాంపు రాజకీయాలకు కాంగ్రెస్ రాంరాం చెప్పడమే తరువాయి.. ఆ పార్టీ సభ్యులతో గులాబీ దళం రాయబేరాలు సాగించింది. ఇందులో దాదాపుగా ఆ పార్టీ సక్సెస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలను గమనించిన టీపీసీసీ.. అత్యధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ యాదవరెడ్డి నిష్క్రియాపరత్వంతో జిల్లా పరిషత్ చేజారుతుందనే అంచనాకొచ్చింది. ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ సభ్యులను సంతృప్తిపరచడం.. ఇతర పార్టీల మద్దతు సమీకరించేందుకు కొంత వ్యయాన్ని సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది. ‘కారె’క్కనున్న యాదవ.. టీఆర్ఎస్లో చేరడానికి యాదవరెడ్డి రంగం సిద్ధంచేసుకుంటున్న సంకేతాలు రావడంతో అప్రమత్తమైన హైకమాండ్.. జెడ్పీ పీఠం కావాలంటే రూ.ఏడు కోట్లు సమకూర్చుకోవాలని తేల్చిచెప్పింది. డబ్బులు వెదజల్లితేగానీ పదవి దక్కదని, కానీపక్షంలో మరొకరి పేరును పరిశీలిస్తామని తెగేసి చెప్పడమేకాకుండా.. కొత్త అభ్యర్థి అన్వేషణలో పడింది. యాదవరెడ్డి టీఆర్ఎస్లో చేరడం ఖాయమని దాదాపుగా నిర్ణయించుకున్న కాంగ్రెస్ పెద్దలు.. ఈ విషయంలో ఆయనపై ఒత్తిడి పెంచారు. ఈ పరిణామాల నేపథ్యంలో చివరి నిమిషంలో తన స్థానంలో మరొకరిని తెరమీదకు తేవడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం సాయంత్రం టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు లేఖ రాయడం.. రాత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో విందు రాజకీయం నెరపడంతో ఆయన గులాబీ గూటికి చేరుతారనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇదిలావుండగా, బుధవారం మండలి చైర్మన్ ఎన్నికల్లో ఆయన వ్యవహరించే తీరును బట్టి ఆయన పార్టీలోనే ఉంటారా? కారెక్కుతారా అనే అంశం స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జోడు పదవుల్లో ఉన్న యాదవరెడ్డి ఇంకా జెడ్పీటీసీగా ప్రమాణం చేయనందున ఎమ్మెల్సీ పదవికి ఎలాంటి ఢోకాలేదని, జెడ్పీటీసీగా ప్రమాణంచేస్తే మాత్రం 14 రోజుల్లో ఒక పదవికి రాజీనామా చేయాల్సివుంటుందని చెప్పారు. టీఆర్ఎస్లో లొల్లి! జెడ్పీ సారథ్య బాధ్యతలను మరోసారి తన సతీమణి సునీతకు దక్కేలా జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి వ్యూహారచన చేశారు. ఫలితాలు వెలువడిందే తరువాయి.. జెడ్పీటీసీలను క్యాంపులకు తరలించారు. అయితే, ఒకే కుటుంబంలో ఇద్దరికీ పదవులు అనే అంశంపై పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కూడా ఒకింత అసంతృప్తిగానే ఉన్నప్పటికీ, మొదట్నుంచి క్యాంపులను నిర్వహిస్తున్న మహేందర్‌ను కాదనడం భావ్యంకాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహేందర్ ఫ్యామిలీకే జెడ్పీ పీఠం కట్టబెట్టే అంశంపై ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి శిబిరం వ్యతిరేకిస్తున్నప్పటికీ, మరొక నేత లేకపోవడంతో అనివార్యంగా సునీత వైపు మొగ్గుచూపాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒక దశలో టీఆర్ఎస్లో చేరడానికి సుముఖంగా ఉన్న యాదవరెడ్డికి మద్దతు పలుకుదామని భావించినా.. ఆర్థిక వనరులను సర్దుబాటుచేసే స్థితిలో లేకపోవడంతో మిన్నకుండినట్లు పార్టీవ ర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తమ్ముళ్ల కిరికిరి! జిల్లా పరిషత్ కైవసంలో కీలకంగా మారిన టీడీపీ (7 జెడ్పీటీసీలు) వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వైస్ చైర్మన్, కో ఆప్షన్ పదవులను తమకుఇస్తే మద్దతు పలుకుతామని సంకేతాలిస్తునే.. ఏ నిర్ణయమైనా అధినేత చంద్రబాబుతో చర్చించిన తర్వాతే ప్రకటిస్తామని సెలవిస్తోంది. తొలుత కాంగ్రెస్‌తో జతకట్టేందుకు తమ్ముళ్లు ఆసక్తి చూపినా.. ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల పదవీకాలంలో మొదటి మూడేళ్లు మేం.. ఆ తర్వాత రెండేళ్లు మీరు పదవుల్లో ఉండేలా పరస్పరం అంగీకారం చేసుకుందామని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. అయితే, తొలుత మాకే కుర్చీ ఇవ్వాలని టీడీపీ మడత పేచీ పెడుతోంది. అధికారపార్టీకి మద్దతు ఇస్తే కనీసం సొంత పనులయినా అవుతాయని నమ్మకంతో ఉన్న పచ్చ సోదరులు.. టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. -
జెడ్పీ తెరపైకి వీర్ల కవిత
- తుల ఉమ వద్దన్న ఎమ్మెల్యేలు - టీఆర్ఎస్లో అనూహ్య పరిణామం - నిర్ణయాధికారం అధినేత కేసీఆర్‌దే కరీంనగర్ సిటీ : జిల్లా పరిషత్ టీఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థిగా అనూహ్యంగా రామడుగు జెడ్పీటీసీ వీర్ల కవిత తెరపైకి వచ్చారు. ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ వైపు మొగ్గుచూపుతున్న అధిష్టానానికి జిల్లా ఎమ్మెల్యేలు షాక్‌నిచ్చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్‌చైర్మన్, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికపై చర్చించేందుకు సోమవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్, పార్టీ ఎంపీలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు బొడి గె శోభ, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, గంగుల కమలాకర్ , పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, కొప్పుల ఈశ్వర్, వొడితెల సతీష్‌బాబు, రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముగ్గురు ఎమ్మెల్యేలు తుల ఉమ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే క్ర మంలో రామడుగు జెడ్పీటీసీ వీర్ల కవితను చైర్పర్సన్ చేయాలని పట్టుబట్టినట్లు తెలిసింది. జిల్లాలో 57 జెడ్పీటీసీ స్థానాలకు 41 జెడ్పీటీసీలను గెలుచుకొని అన్ని పదవులను సొంతం చేసుకొనేందుకు టీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో స్వయంగా కేసీఆర్ పార్టీలో సీనియర్, అధిష్టానానికి సన్నిహితురాలైన తుల ఉమను జెడ్పీటీసీకి పోటీ చేయించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ క్రమంలోనే కథలాపూర్ నుంచి జెడ్పీటీసీగా ఉమ విజయం సాధించడంతో చైర్పర్సన్ కావడం ఖాయమని అంతా భావిస్తూ వచ్చారు. స్వ యంగా పార్టీ అధినేత కేసీఆర్ అంతర్గత సంభాషణ ల్లో తుల అభ్యర్థిత్వాన్ని నిర్ధారించారు కూడా. దీంతో ఇతర పోటీదారులు కూడా తమ ప్రయత్నాలను దాదాపుగా విరమించుకున్నారు. ఈ దశలో కీలకమైన సమావేశంలో ఎమ్మెల్యేలు తుల ఉమ అభ్యర్థిత్వానికి విముఖత చూపుతూ.. వీర్ల కవితను చైర్పర్సన్ చేయాలని సూచించడం పార్టీలో సంచలనం సృష్టించింది. తొలుత ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమకు బదులు కవితను చైర్పర్సన్ చేయాలని, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సదరు ఎమ్మెల్యే వాదనతో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఏకీభవించినట్లు సమాచారం. వీర్ల కవిత భర్త, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు పార్టీలో చురుగ్గా పాల్గొంటారని, పార్టీకి అన్ని విధాలుగా చేదోడువాదోడుగా ఉంటాడని మద్దతు పలికినట్లు తెలిసింది. దీంతో మంత్రి ఈటెల, ఎంపీ వినోద్‌లు చైర్పర్సన్ అభ్యర్థి ఎంపికను పార్టీ అధినేతకు వదిలివేయాలని సూచించినట్లు సమాచారం. ఈ మేరకు సమావేశంలో తీర్మానించారు. ఎమ్మెల్యేలు సైతం చైర్పర్సన్ ఎంపికలో తమ అభిప్రాయాలు మాత్రమే చెప్పామని, అంతిమంగా అధినేత తీసుకొనే నిర్ణయానికి కట్టుబడుతామని చెప్పినట్లు తెలిసింది. మంగళవారం చైర్పర్సన్ ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
ఒక్క జిల్లానూ ‘చే’జారనీయొద్దు
* అన్ని జెడ్పీలపై గులాబీ జెండా రెపరెపలు.. * జిల్లా, స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత మంత్రులకే * జిల్లా పరిషత్ చైర్మన్ల ఎంపిక అధిష్టానానిదే: సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఏ ఒక్క జిల్లా పరిషత్‌ను కూడా చేజారనీయవద్దని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తన కేబినెట్ సహచరులను ఆదేశించారు. దీనికోసం కాంగ్రెస్, టీడీపీ సహా ఏ పార్టీ నుండి వలసలు వచ్చినా స్వాగతించాలని సూచించారు. కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉన్న నల్లగొండ సహా అన్ని జిల్లా పరిషత్లపైనా గులాబీ జెండా రెపరెపలాడాలని ఆయన ఆదేశించారు. ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో తెలంగాణ కేబినెట్ మంత్రులతో కేసీఆర్ సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఆయన మంత్రులకు సూచనలు చేశారు. నల్లగొండ జిల్లాపై కొంత దృష్టిని కేంద్రీకరిస్తే ఆ జిల్లా పరిషత్‌ను కూడా టీఆర్ఎస్ దక్కించుకుంటుందని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపిద్దామన్నారు. మిగిలిన జిల్లా పరిషత్‌లలో మెజారిటీకి కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటికే చైర్మన్ల ఎన్నికకు అవసరమయ్యేంత జెడ్పీటీసీలు టీఆర్ఎస్లోకి వలసలు వచ్చినట్టు సీఎం తెలిపారు. జిల్లాల వారీగా మున్సిపాలిటీల్లో, జిల్లా పరిషత్‌లపై పార్టీ ఆధిపత్యం సాధించే బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులకే కేసీఆర్ అప్పగించారు. జూలై 3, 4, 5 తేదీల్లో మున్సిపాలిటీ, నగరపాలక, మండల, జిల్లా పరిషత్‌ల చైర్మన్ పదవులకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్కు స్పష్టంగా ఆధిక్యత ఉన్న ప్రాంతాలు, కొంచెం అటూఇటుగా ఉన్న స్థానాలు, ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహించి గులాబీ కండువాలు కప్పితే వచ్చే స్థానాలేమిటి అనే అంశాలపై ఆయా జిల్లాల మంత్రులు సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నల్లగొండ జిల్లా సహా జిల్లా పరిషత్‌లన్నీ టీఆర్ఎస్కు వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీపట్ల నిబద్ధతే కొలమానంగా.... అయితే జిల్లా పరిషత్ చైర్మన్లకు పేర్లను అధిష్టానమే సూచిస్తుందని ఆయన స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ల ఎంపికలో అనేక అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీ పట్ల నిబద్ధత, గతంలో ఇచ్చిన హామీలు వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని జిల్లా పరిషత్తు చైర్మన్లను పార్టీ అధిష్టానమే సూచిస్తుందని, చైర్మన్ల ఎంపిక విషయంలో ఎలాంటి హామీలు స్థానికంగా ఇవ్వవద్దని కేసీఆర్ మంత్రులను హెచ్చరించారు. పార్టీని ఏమాత్రం నిర్ల్యక్షం చేసినా భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయన్నారు. ‘ఆటా’ సభలకు ఆహ్వానం అందిన మంత్రులు అమెరికా పర్యటన రద్దుచేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. మండలి చైర్మన్ విషయంలో జాగరూకత స్థానిక ఎన్నికలను, జూలై 2 నుంచి జరిగే శాసనమండలి సమావేశాలను, చైర్మన్ ఎన్నికను దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, మంత్రులంతా అందుబాటులోనే ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. జిల్లా పరిషత్‌ల బాధ్యతలను ఆయా మంత్రులకు ఆయన అప్పగించారు. మంత్రివర్గంలో స్థానం దక్కని మహబూబ్‌నగర్ జిల్లా బాధ్యతను ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి పద్మారావులకు అప్పగించారు. నల్లగొండ జిల్లా పరిషత్ బాధ్యతను హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, జిల్లామంత్రి జి.జగదీశ్ రెడ్డిలకు అప్పగించారు. మెదక్ జిల్లాకు హరీశ్‌రావు, కరీంనగర్‌కు ఈటెల రాజేందర్, కె.తారక రామారావు, వరంగల్ జిల్లా బాధ్యతను ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యకు అప్పగించారు. నిజామాబాద్ బాధ్యతను పోచారం శ్రీనివాస్ రెడ్డికి, ఆదిలాబాద్‌ను జోగు రామన్నకు అప్పగిస్తూనే ఆయా జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులను సమన్వయం చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. అయితే ఖమ్మం జిల్లాలో పార్టీకి ఎక్కువగా స్థానాలు లేనందున అ జిల్లా బాధ్యతను ఎవరికీ అప్పగించలేదు. -
నంబర్ గేమ్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో రాజకీయం వేడెక్కింది. స్థానిక సంస్థల సారథుల ఎంపికకు ముహూర్తం ఖరారుకావడమే తరువాయి.. రాజకీయపక్షాలు ‘కుర్చీలాట’లో పైచేయి సాధించేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. నంబర్‌గేమ్‌లో ముందు వరుసలో ఉండేం దుకు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. మున్సిపాలిటీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో శుక్రవారం ప్రధాన పార్టీలు అంతర్గత సమావేశాల్లో బిజీగా గడిపాయి. సొంత పార్టీ సభ్యులను క్యాంపులకు తరలించడం మొదలు ఇతర పార్టీల సభ్యుల మద్దతు కూడగట్టే అంశంపై చర్చోపచర్చలు సాగించాయి. మండలాల్లో పాగా వేసే దిశగా వ్యూహారచన చేస్తున్న ఆశావహులు.. ఎంపీటీసీలను మరోసారి యాత్రలకు పంపారు. స్థానిక సంస్థల పీఠాలను కైవసం చేసుకునే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్న అధిష్టానాలు.. సొంత పార్టీ సభ్యులను కాపాడుకునే బాధ్యత కూడా వారికే కట్టబెట్టారు. నగర పంచాయతీ/మున్సిపాలిటీల చైర్మన్ల ఎంపికపై టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతున్నాయి. పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నంలో స్పష్టమైన అధిక్యత లభించడంతో ఈ రెండింటి చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. బడంగ్‌పేటలో కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ లభించింది. అలాగే తాండూరులో టీఆర్ఎస్, మజ్లిస్‌లు పోటాపోటీగా కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్నాయి. ఎన్నికల అనంతరం ఈ ఇరుపార్టీల మధ్య బంధం బలపడిన నేపథ్యంలో ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించే వాతావరణం కనిపిస్తోంది. ఇక వికారాబాద్‌లో మాత్రం ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అత్యధిక సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలను అనుకూలంగా మలుచుకునే దిశగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. టీడీపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న ఆ పార్టీ.. ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఓటు హక్కు కలిగియున్న ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా వికారాబాద్ మున్సిపాలిటీనే ఆఫ్షన్‌గా ఇచ్చారు. దీంతో సంఖ్యాబలం అటు ఇటు అయ్యే అవకాశం కనిపిస్తోంది. జోరుగా మంతనాలు! సుదీర్ఘ విరామం తర్వాత అత్యధిక జెడ్పీటీసీలు సాధించిన కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా జిల్లా పరిషత్ పీఠాన్ని అధిరోహించాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఆ పార్టీ అగ్రనేతలు విభేదాలు పక్కనపెట్టి శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రసాద్‌కుమార్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో సమావేశమైన సీఎల్పీ నేత జానారెడ్డి.. ఎట్టి పరిస్థితుల్లో జెడ్పీ చేజార్చుకోవద్దని తేల్చిచెప్పారు. సొంత పార్టీ సభ్యులను సమన్వయపరిచే బాధ్యతను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్‌లకు అప్పగించిన జానా.. ఇతర పార్టీల మద్దతు కూడగట్టే అంశాన్ని కేఎల్లార్‌కు కట్టబెట్టారు. మరోవైపు శంషాబాద్‌లో ఆ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు సమావేశమై.. తాజా పరిణామాలను చర్చించుకున్నారు. యాదవరెడ్డి తప్పుకుంటే బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానని ఎనుగు జంగారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో హైకమాండ్‌తో ఈ అంశంపై శనివారం చర్చించాలని నిర్ణయించారు. కాగా, మంచిరెడ్డితో భేటీ అయిన కేఎల్లార్, ప్రసాద్‌లకు స్పష్టమైన హామీ లభించలేదు. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అంశంపై పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ముందు మీ పార్టీలో ఏకాభిప్రాయం సాధించండి.. అప్పుడు మా నిర్ణయాన్ని వెల్లడిస్తామని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇదిలావుండగా.. జిల్లా పరిషత్ కుర్చీ దక్కించుకునేందుకు దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్.. కాంగ్రెస్, టీడీపీల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. కాంగ్రెస్‌లో అనైక్యతతో మేజిక్ ఫిగర్‌ను సాధిస్తామని భావిస్తున్న ఆపార్టీ.. టీడీపీలో ఒక వర్గం తమకు అనుకూలంగా ఉంటుందని అంఛనా వేస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలతో మంత్రి పి.మహేందర్‌రెడ్డి చర్చించినట్లు తెలిసింది. సాధ్యమైనంతవరకు అధిక సంఖ్యలో మండల పరిషత్‌లను కైవసం చేసుకునే దిశగా వ్యూహరచన చేయాలని ఆదేశించినట్లు సమాచారం. -
ఆఖరి మోఖా !
జెడ్పీలో అడ్డగోలుగా పనులు - నామినేషన్ల పద్ధతిన అప్పగిస్తున్న అధికారులు - నెలాఖరులో ఉన్నతాధికారి రిటైర్మెంట్ - కింది స్థాయి అధికారుల అత్యుత్సాహం - కొత్త పాలక మండలి కొలువుదీరే ముందు హడావుడిపై సందేహాలు - పాత తేదీలతోనే ఆమోదం సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లా పరిషత్‌లో పద్ధతి మారింది. పనుల కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా... పట్టించుకోని జెడ్పీ అధికారులు ఇప్పుడు పిలిచి మరీ ఇస్తున్నారు. ఎండాకాలం లో గ్రామాల్లో తాగునీటి సరఫరా ఇబ్బందిగా మారుతుందని ముందే పనుల ప్రతిపాదనలు పంపిన సర్పంచ్‌లను అప్పుడు పక్కనబెట్టారు. వర్షాలు మొదలవుతున్న తరుణంలో ఆ పనులకు ఇప్పుడు ఆమోదం తెలుపుతున్నారు. ఇది కూడా వేగంగా జరుగుతోంది. అధికారుల్లో ఇంత పెద్ద మార్పునకు కారణం ఏమై ఉంటుందనేది జిల్లా పరిషత్‌లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా పరిషత్ సీఈఓగా ఉన్న అధికారి ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఈయన రిటైర్మెంట్కు ముందు... కొత్త పాలకమండలి వచ్చే తరుణంలో పనుల కేటాయింపు విషయం లో జిల్లాపరిషత్ అధికారుల అత్యుత్సాహం చూపుతుండడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నిబంధనలు ఇప్పుడు లేవు ! జిల్లా పరిషత్‌కు పాలకమండలి లేక మూడేళ్లవుతోంది. ప్రజాప్రతినిధులు లేని ఈ మూడేళ్ల ప్రత్యేక పాలన కాలంలో అధికారులే అధికారం చెలాయించారు. తాజాగా.. కొత్త పాలకమండలి ఏర్పాటుకు ముందు పనుల కేటాయింపులో ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. గ్రామ పంచాయ తీ ఎన్నికల తర్వాత ఆయా గ్రామాల్లో అవసరమైన పనుల మంజూరు కోసం కొత్త సర్పంచ్‌లు కాళ్లరిగేలా జిల్లా పరిషత్ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అరునా... ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఇదే జిల్లా పరిషత్ ఉన్నతాధికారులు పిలిచి మరీ పనులు కేటాయిస్తున్నరు. పనుల మంజూరుకు సంబంధించిన అన్ని అంశాలను జిల్లా పరిషత్‌లోని సూపరింటెండెంట్ స్థాయి అధికారులే చూసుకుంటున్నారు. పనుల మంజూరుకు అవసరమైన పత్రాలన్నీ కచ్చితంగా ఉండాలని గతంలో నిబంధనల పేరిట చేతులు దులుపుకున్నారు. తాజాగా లేని కాగితాలు, పనుల ప్రతిపాదనలను వారే తయారు చేసి వేగంగా ఆమోదం తెలుపుతున్నారు. పాత తేదీలతో ఆమోదం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీ ఎఫ్), 13వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్ఎఫ్సీ), సాధారణ నిధుల కింద జిల్లా పరిషత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధు లు కేటాయిస్తుంది. గ్రామాల్లో తాగునీటి సరఫ రా కోసం అవసరమైన పైపులైన్ల ఏర్పాటు, కొత్త భవనాల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల చుట్టూ ప్రహరీ నిర్మాణం వంటి పనులను నామినేషన్లపై జిల్లా పరిషత్ మంజూరు చేస్తుంది. రూ.5 లక్షల పనులకు సంబంధించి మాత్రమే ఇలా కేటాయిస్తారు. ఈ పనుల కో సం గ్రామ పంచాయతీలు తీర్మానం చేయాలి. దీని ఆధారంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పనుల కేటాయింపుపై ప్రతిపాదనలను జిల్లా పరిషత్‌కు పంపిస్తారు. జెడ్పీ సీఈఓ ద్వారా కలెక్టర్ ఆమోదంతో పనుల కేటాయింపు జరుగుతుంది. ఇన్నాళ్లు ఎంపీడీఓలు, జెడ్పీ సీఈఓ వరకు వచ్చి ఆగినపనుల ప్రతిపాదనలు ఇప్పుడు వేగంగా కదులుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో పెట్టిన ప్రతిపాదనల దరఖాస్తులు ఇప్పుడు పాత తేదీలతో ఆమోదం పొందుతున్నాయి. రికార్డుల్లో తేడా రాకుండా ఉండేందుకు కొన్ని కొత్త ప్రతిపాదనలకు సైతం పాత తేదీల తో తీర్మానం లేఖలు తీసుకుని మరీ పనులు కేటాయిస్తున్నారు. బీఆర్జీఎఫ్, 13వ ఆర్థిక సం ఘం, ఎస్ఎఫ్సీ, సాధారణ నిధుల కింద జిల్లా పరిషత్ జనవరి నుంచి ఈ నెల వరకు 82 పను ల కోసం 3.72 కోట్లు విడుదల చేసింది. ఇవన్నీ రూ.5 లక్షలలోపు విలువైన పనులే ఉన్నాయి. వీటిలో ఎక్కువగా వేసవిలో అవసరమైన పను లే ఉన్నాయి. నర్సంపేట, పాలకుర్తి, జనగామ, భూపాలపల్లి నియోజకవర్గాలకు సంబంధించి ఇలా ఎక్కువ పనులు కేటాయించారు.