అనంతపురం సెంట్రల్ : జిల్లా అభివృద్ధికి దిశా నిర్దేశం చేసే జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు అభాసుపాలు అవుతున్నాయి. సమావేశాల్లో ప్రజాప్రతినిధుల కన్నా ప్రైవేటు వ్యక్తులే ఎక్కువగా హల్ చల్ చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోనే కాదు జిల్లా స్థాయిలో జరిగిన సమావేశాల్లో కూడా మహిళా ప్రజాప్రతినిధులకు ఏమాత్రం గౌరవం దక్కడం లేదు. ముందుగా మహిళల్లో చైతన్యం తీసుకొచ్చింది మేమే నంటూ గొప్పలు పోయే అధికార తెలుగుదేశం పార్టీ పాలనలోనే ఈ వ్యవస్థ నడుస్తుండడం గమనార్హం.
మంగళవారం జిల్లా పరిషత్‌లో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. వివరాల్లోకి వెలితే... జెడ్పీ చెర్మైన్ చమన్ అధ్యక్షతన ఆయన చాంబర్‌లో గ్రామీణాభివృద్ది, విద్యా-వైద్యం, ఆర్థికం, ప్రణాళిక, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ైవె స్ చెర్మైన్ సుబాషిణమ్మ అధ్యక్షతన వ్యవసాయం ఇతర అంశాలపై చర్చించారు. అయితే ఈ సమావేశాల్లో సభ్యులు కానీ వారు దర్జాగా ఆసీనులయ్యారు. వారికి జెడ్పీ కార్యాలయ అధికార వర్గాలు సకల మర్యాదలు చేయడం కనిపించింది.
అంతటితో ఆగకుండా వారి ప్రాంతాల్లోని సమస్యలపై అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవన్నీ సాక్షాత్తు మంత్రి పల్లె రఘునాథరెడ్డి, చెర్మైన్ చమన్ సమక్షంలో చోటుచేసుకున్నారుు. విద్యా-వైద్యం అంశంపై జరుగుతున్న సమావేశంలో నల్లచెరువు జెడ్పీటీసీ సభ్యురాలు నాగరత్నమ్మ భర్త నాగభూషణనాయుడు సమావేశంలో ఆసీనులయ్యారు. వైద్య సమస్యలపై మంత్రి సమక్షంలో ప్రశ్నించారు. ఈయన ఈ సమావేశంలోనే కాకుండా ఇటీవల జరిగిన జెడ్పీ జనరల్‌బాడీ సమావేశంలో కూడా పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించినట్లు తెలిసింది.
ఇదే సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాకపోయినప్పటికీ బుక్కరాయసముద్రం జెడ్పీటీసీ రామలింగారెడ్డి దర్జాగా కూర్చున్నారు. కాగా, జెడ్పీలో వైఎస్ చెర్మైన్ సుబాషిణమ్మ కన్నా ఆమె కుమారుడు ఉమామహేశ్వరరావుదే ఎక్కువ పెత్తనం సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి అంశంలోనూ ఆమె కుమారుడే జోక్యం చేసుకోవడం జరుగుతోందని సమాచారం. మంగళవారం నిర్వహించిన వ్యవసాయూనికి సంబంధించిన సమావేశంలో ఆయన దర్జాగా కూర్చున్నారు. పట్టు పరిశ్రమ శాఖ, ఇతర శాఖల సమస్యలపై అధికారులను ప్రశ్నించడం కనిపించింది.
సమావేశ అనంతరం ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా వైఎస్ చెర్మైన్ కన్నా ఆమె కుమారునికే నమస్కారాలు పెడుతూ వెళ్లడం చర్చనీయూంశమైంది. ఇవన్నీ ఒకెత్తు అయితే జెడ్పీ చెర్మైన్ చమన్ అనుచర గణానిది మరొక ఎత్తు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు సెల్ కెమరాల్లో బంధిస్తూ హంగామా చేస్తున్నారు.
ప్రైవేట్ పెత్తనం
Published Wed, Dec 31 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM
Advertisement