కరీంనగర్: కరీంనరగ్ జిల్లా జిల్లా పరిషత్ సమావేశంలో సోమవారం రివాల్వర్ కలకలం సృష్టించింది. రివాల్వర్‌తో కాంగ్రెస్ సభ్యుడు చల్లానారాయణ రెడ్డి సమావేశానికి హాజరుకాగా టీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దాంతో సమావేశం నుంచి కాంగ్రెస్ సభ్యుడు నారాయణరెడ్డి అలిగి వెళ్లిపోయారు.