ఎర్రవల్లి: బీఆర్‌ఎస్‌ నేతలతో సమావేశమైన కేసీఆర్‌ | Ex CM KCR Key Meeting With BRS Party Leaders At Erravalli | Sakshi
Sakshi News home page

ఎర్రవల్లి: బీఆర్‌ఎస్‌ నేతలతో సమావేశమైన కేసీఆర్‌

Published Fri, Mar 7 2025 9:11 AM | Last Updated on Fri, Mar 7 2025 12:40 PM

Ex CM KCR Key Meeting With BRS Party Leaders At Erravalli

సాక్షి, ఎర్రవెల్లి: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కీలక సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, పార్టీ భవిష్యత్‌ కార్యచరణపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం.

ఈ సమావేశానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం సందర్బంగా ఇటీవల జరిగిన‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై సమీక్ష చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే,  ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యచరణపై కూడా ప్రధాన చర్చ జరిగే అవకాశముంది.

ఇదే సమయంలో, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత మందిని రంగంలోకి దింపాలన్న అంశంపై కూడా చర్చించనున్నారు. వచ్చే నెల 27వ తేదీన‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇక, ఈ నెల 12వతేదీ నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement