మనసు మార్చుకున్న వార్నర్‌..? | DAVID WARNER CONFIRMS HIS AVAILABILITY FOR CHAMPIONS TROPHY 2025 | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ విషయంలో మనసు మార్చుకున్న వార్నర్‌..?

Jul 8 2024 8:54 PM | Updated on Jul 8 2024 8:54 PM

DAVID WARNER CONFIRMS HIS AVAILABILITY FOR CHAMPIONS TROPHY 2025

టీ20 వరల్డ్‌కప్‌ 2024తో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియన్‌ వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌.. రిటైర్మెంట్‌ విషయంలో మనసు మార్చుకున్నాడని తెలుస్తుంది. వార్నర్‌ వన్డేల్లో తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. జట్టుకు అవసరమైతే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కి అందుబాటులో ఉంటానని వార్నర్‌ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు టాక్‌. 

వార్నర్‌ రిటైర్మెంట్‌ విషయంలో వెనక్కు తగ్గినా అతన్ని జట్టులోకి తీసుకుంటారా లేదా అన్నది ఆసక్తికరం. 37 ఏళ్ల వార్నర్‌ ఈ ఏడాది జనవరి 1న వన్డేలకు.. జనవరి 10న టెస్ట్‌లకు.. ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్‌తో టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

వార్నర్‌ టీ20 వరల్డ్‌కప్‌ 2024లో ఆస్ట్రేలియా తరఫున సెకెండ్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో ఆసీస్‌ సూపర్‌-8లో ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో ఓడి సెమీస్‌కు చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. 

ఆసీస్‌కు ఇప్పట్లో అంతర్జాతీయ కమిట్‌మెంట్స్‌ ఏమీ లేవు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసీస్‌.. ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌.. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరుగనున్నాయి. ఈ మధ్యలో ఆసీస్‌ రెండు నెలల పాటు ఖాళీగా ఉంటుంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా ఒక్కటే అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీగా ఉంది. ప్రస్తుతం భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు (జులై 8) రెండు మ్యాచ్‌లు ముగియగా.. ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచాయి. ఈ సిరీస్‌లో మూడో టీ20 జులై 10న జరుగనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement