'బుమ్రా, గిల్‌ కాదు.. టీమిండియా నెక్ట్స్‌ కెప్టెన్‌ అతడే' | Rohit Sharmas Test Successor Named By Mohammad Kaif | Sakshi

'బుమ్రా, గిల్‌ కాదు.. టీమిండియా నెక్ట్స్‌ కెప్టెన్‌ అతడే'

Nov 5 2024 12:54 PM | Updated on Nov 5 2024 1:21 PM

Rohit Sharmas Test Successor Named By Mohammad Kaif

స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌లో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న మార్క్‌ను చూపించలేక‌పోయాడు. కెప్టెన్‌గా, బ్యాట‌ర్‌గా రోహిత్ శ‌ర్మ దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు.

ఫ‌లితంగా తొలిసారి సొంత‌గ‌డ్డ‌పై మూడు లేదా అంత‌కంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో భార‌త్ వైట్‌వాష్ గురైంది. దీంతో రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. టెస్టుల‌కు గుడ్‌బై చెప్పాల్సిన స‌మ‌యం అసన్న‌మైంది అని ప‌లువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అయితే రోహిత్ శర్మ భవితవ్యం త్వ‌రలో జ‌ర‌గ‌నున్న‌ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫలితంపై ఆధారపడి ఉంది. ఒకవేళ భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించికపోతే హిట్‌మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది. ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. బీజీటీ త‌ర్వాత ఒక‌వేళ‌ రోహిత్ రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తే తదుప‌రి భార‌త టెస్టు కెప్టెన్‌గా రిష‌బ్ పంత్ బాధ్య‌త‌లు చేప‌డ‌తాడ‌ని కైఫ్ జోస్యం చెప్పాడు.

"ప్ర‌స్తుత భార‌త జ‌ట్టులో రిషబ్ పంత్ మాత్రమే టెస్ట్ కెప్టెన్‌గా పోటీలో ఉన్నాడు. భార‌త టెస్టు కెప్టెన్ అయ్యే అన్ని ర‌కాల ఆర్హ‌త‌లు పంత్‌కు ఉన్నాయి. అత‌డు ఆడిన ప్ర‌తీ మ్యాచ్‌లోనూ జ‌ట్టుకు త‌న వంతు న్యాయం చేస్తున్నాడు. ఏ స్ధానంలోనైనా బ్యాటింగ్ చేయ‌గ‌ల స‌త్తా పంత్‌కు ఉంది.

ఇప్ప‌టికే ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్‌లు ఆడాడు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా,దక్షిణాఫ్రికా వంటి విదేశీ పిచ్‌ల‌పై కూడా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. అది స్పిన్ ట్రాక్‌, పేస్ ట్రాక్ అయినా పంత్ ఒకేలా బ్యాటింగ్ చేస్తాడు" అని త‌న ఇనాస్టా లైవ్‌లో పేర్కొన్నాడు.

కాగా ప్ర‌స్తుతం టెస్టుల్లో రోహిత్ శ‌ర్మ డిప్యూటీగా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. గ‌తంలో ఓసారి రోహిత్ గైర్హ‌జరీలో జ‌ట్టును కూడా బుమ్రా న‌డిపించాడు. ఈ క్ర‌మంలో బుమ్రాను కాద‌ని పంత్‌ను రోహిత్ వారసుడిగా కైఫ్ ఎంచుకోవ‌డం అంద‌రిని విస్మ‌యానికి గురిచేస్తోంది.
చదవండి: Paris Olympics 2024: ఆమె మగాడే.. సంచలన విషయాలు వెలుగులోకి!.. భజ్జీ రియాక్షన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement