
ఫైల్ ఫొటో
అమ్నీషియా పబ్ అత్యాచార ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌కు.. బహిరంగ లేఖ రాశారు బండి సంజయ్.
సాక్షి, హైదరాబాద్: అమ్నీషియా పబ్ అత్యాచార ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌కు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు.
అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారాయన. ఈ ఘటనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని, నాలుగు రోజులు గడుస్తున్నా పోలీస్ శాఖ పనితీరు అనుమానాకు తావిస్తోందని లేఖలో ఆయన ఆరోపించారు.
ఘటనలో కేసీఆర్ రాజకీయ మిత్రుల వారసుల పేర్లు ప్రముఖంగా మీడియాలో, సోషల్ మీడియాలో వినిస్తున్నాయని తెలిపారు. అనుమానాలు నివృత్తి చేసి.. సంఘటనపై స్పష్టత ఇప్పించాలని తెలంగాణ బీజేపీ తరపున కోరుతున్నట్లు లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.
హైదరాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు బహిరంగ లేఖ.@TelanganaCMO pic.twitter.com/uwr4ivDW5c
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 4, 2022