
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు తక్షణమే చేపట్టాలని ప్రోగ్రెసివ్ రికగనైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయూటీఎస్) ప్రభుత్వాన్ని కోరింది. సంఘం నేతలు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర మంత్రి కె.తారకరామారావును శుక్రవారం కలిసింది.
2015 నుంచి పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడంతో పాఠశాలల్లో గుణాత్మక విద్యా బోధనకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపింది. రేషనలైజేషన్, బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరింది.