
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలుచోట్ల రోడ్లు, రైల్వే ట్రాక్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు.. భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా జలదిగ్బంధమైంది. జిల్లాలో రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోయింది. దీంతో మట్టి కోతకు గురవడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
కాగా, భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ జలమయం అయ్యాయి. కేసముద్రం మండలంలో రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. మట్టి కోతకు గురవడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్‌పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో పందిపల్లి వద్ద మహబూబ్‌నగర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ నాలుగు గంటల పాటు నిలిచిపోయింది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో మచిలీపట్నం, సింహపురి రైళ్లు నిలిచిపోయాయి. దాదాపు 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో ఈ రైళ్లను దారి మళ్లించే అవకాశం ఉంది.
భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
మహబూబాబాద్ - కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి దగ్గర భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్.
దీంతో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లను నిలిపేసిన రైల్వే అధికారులు pic.twitter.com/1uJvcXA7Iw— HARISH TIRRI (@TIRRIHARISH) September 1, 2024
