70 మంది ‘ఎర్ర’ స్మగ్లర్ల ఆట కట్టించాం | 0 'red' late game kattincam | Sakshi
Sakshi News home page

70 మంది ‘ఎర్ర’ స్మగ్లర్ల ఆట కట్టించాం

Published Sat, Jun 14 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

70 మంది ‘ఎర్ర’ స్మగ్లర్ల ఆట కట్టించాం

70 మంది ‘ఎర్ర’ స్మగ్లర్ల ఆట కట్టించాం

  • 14 మందిపై పీడీయాక్టు ప్రయోగం
  •   మరో 500 మంది హస్తం ఉన్నట్టు నిర్ధారణ
  •   ఎక్కడున్నా వెంటాడి పట్టుకోవడమే లక్ష్యం
  •   ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ
  • చిత్తూరు (క్రైమ్): శేషాచలం అడవుల నుంచి  ఎర్రచందనం సంపదను అక్రమంగా తరలించడంలో కీలకంగా వ్యవహరించిన 70 మం ది స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ పీహెచ్‌డీ.రామకృష్ణ తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపా ల్లో ఎంతటి వారైనా సరే వెంటాడి పట్టుకోవడమే లక్ష్యంగా రాత్రింబ వళ్లు కష్టపడి పని చేస్తున్నామన్నారు. ముఖ్యంగా వంద మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది ఇదే పనిపై విస్తృతంగా తిరుగుతూ స్మగ్లర్ల పనిపడుతున్నారన్నారు.

    ఫలితంగా పది రోజుల వ్యవధిలో ప్రధాన స్మగ్లర్లు, చోటా స్మగ్లర్లతో పాటు మొత్తం 70 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్టు తెలిపారు. వీరు కా కుండా ఎర్రచందనం దుంగలను సరిహద్దులు దాటించడం, వాహనాలను సమకూర్చడం, ఎర్రచందనం వాహనాలకు పెలైట్లుగా వ్యవహరించడం తదితర వాటిలో మరో 500 మంది పాత్ర ఉన్నట్టు గుర్తించామన్నారు. ఇందులో ప్రధానంగా జిల్లాలోని చిత్తూరు, పీలేరు నియోజకవర్గాల పరిధిలో ఉన్నవారే అధికంగా ఉన్నట్టు తేలిందన్నారు. వీరందరూ ఎర్రచందనం ద్వారా ఊహించనంత డబ్బు సంపాదించి ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పలు పార్టీల తరపున పోటీచేసి రాజకీయాల్లో కొనసాగుతున్నట్టు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.
     
    మొత్తం 14 మందిపై పీడీయాక్టు

    జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 14 మంది ప్రధాన స్మగ్లర్లపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయడానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఎస్పీ రామక్రిష్ణ తెలిపారు. ఇప్పటికే గత వారంలో ఏడుగురు స్మగ్లర్లపై పీడీయాక్టు ప్రయోగించి, వారిలో నలుగురిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్టు చెప్పారు. తాజాగా మరో ఏడుగురిపై పీడీయాక్టు పెట్టడం కోసం చర్యలు చేపడుతున్నామన్నారు. పీడీయాక్టు కింద కేసు నమోదైన ఏడుగురిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయని, త్వరలోనే వారిని కూడా పట్టుకొని కోర్టుకు అప్పగిస్తామని తెలిపారు.
     
    శేషాచలంలో కూలీలు ఖాళీ అయినట్టే
     
    వరుస కూంబింగ్‌లతో పాటు కాల్పుల ఘటనలు, స్మగ్లర్ల వేట ముమ్మరంగా సాగుతుండడంతో శేషాచలం అడవుల్లో ఎర్రకూలీలు ఖాళీ అయినట్టు తెలుస్తోందని ఎస్పీ పేర్కొన్నా రు. అయినా కానీ ప్రత్యేక టీముల ద్వారా రాత్రింబవళ్లు కూంబింగ్ నిర్వహిస్తూ శేషాచలం అడవులను జల్లెడ పడుతున్నట్టు చెప్పా రు.

    కూలీలు సైతం ఎర్రచందనం కోసం స్మగ్లర్ల మాయమాటలు నమ్మి జీవితం నాశనం చేసుకోవద్దని తమిళనాడులోని వేలూరు జిల్లాతో పాటు  చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఎర్రచందనం కేసుల్లో చిక్కితే ఎదుర్కొనే కేసులు, జైలుశిక్ష తదితర వాటిని క్షుణ్ణంగా వివరిస్తూ స్మగ్లర్ల ఉచ్చులో పడవద్దని ఆయా స్టేషన్ల పోలీసు అధికారుల ద్వారా పోస్టర్లు పంపిణీ చేసి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
     
    ముగ్గురు చోటా స్మగ్లర్ల అరెస్ట్
     
    తాజాగా శుక్రవారం ఎర్రచందనం రవాణాలో పాత్ర ఉన్న ముగ్గురు చోటా స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. చిత్తూరుకు చెందిన వైఎం.మున్నా(36) ఎర్రచందనం వాహనాలకు పెలైట్‌గా వ్యవహరించేవాడని, రొంపిచర్ల మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన ఎస్.శ్రీనివాసులు(22), కుమ్మరపల్లెకు చెందిన ఆర్.జగన్నాధనాయుడు(39) ఇరువురూ ఎర్రచందనం దుంగలను సేకరించి స్మగ్లర్లకు అందించేవారని తేలడంతో ఆ ముగ్గురినీ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్పీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement