ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
నర్సంపేట: ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నర్సంపేట సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. 16వ నంబర్ జాతీయ రహదారిపై ఐదుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటంతో అదుపుతప్పి పక్కకు పల్టీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న జలుమూరు మండలం ఎడ్లవానిపేటకు చెందిన ఎ.ఆదినారాయణ(50) అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన నలుగురిని శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.