ఆటోను ఢీకొన్న లారీ.. ఒకరి మృతి
Published Wed, Dec 9 2015 7:30 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో వన్ వే లో వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో పెద్దాపురం మండలం కాండ్రుకోటకు చెందిన ఎం.బాబూరావు (40) మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం కాకినాడకు తరలించారు.
Advertisement
Advertisement