పూడూరు, న్యూస్‌లైన్: ‘టీచకుడి’కి పదేళ్ల జైలు విధించడంపై పలువురు భిన్నంగా స్పందించారు. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కరస్పాండెంట్ అదుపుతప్పి విద్యార్థినిపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేయడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. పూడూరు మండలంలోని పార్‌కవుడ్ ఇంటర్నేషనల్ పాఠశాల కరస్పాండెంట్ అయూబ్‌ఖాన్ పాఠశాలలో చదివే విద్యార్థినిపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన విషయం గత 2010 జూలై 19న వెలుగు చూసింది. ఈ సంఘటన అప్పుడు
రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పట్లో నిందితుడు ఆయూబ్‌ఖాన్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అనంతరం జిల్లా విద్యా శాఖ సదరు పాఠశాల అనుమతిని రద్దు చేసింది. నిందితుడు అయాబ్‌ఖాన్‌ను కఠినంగా శిక్షించాలంటూ అప్పట్లో మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యు వజన, ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు చేశారు. అయాబ్‌ఖాన్‌కు నాంపల్లి నాలుగో అదనపు మెట్రోపాలిటన్ జడ్జి పదేళ్ల జైలు, జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. తీర్పుపై మండలవాసులు భిన్నంగా స్పందించారు. తీర్పుపై కొందరు సంతోషం వ్యక్తం చేయగా మరికొందరు శిక్ష చాలా తక్కువేనని అభిప్రాయం వెలిబుచ్చారు. నిందితుడిని ఉరి తీయాల్సిందేనని మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘టీచకుడి’కి ఈ శిక్ష సరిపోదు
Published Sat, Oct 12 2013 1:19 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement