100 రోజుల విద్యుత్ ప్రణాళికపై ప్రత్యేక దృష్టి
విజయనగరం మున్సిపాలిటీ: ఏపీఈపీడీ సీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో చేపడుతున్న 100 రోజుల ప్రణాళిక పనులపై దృష్టి సారించాలని ఎస్‌ఈ సి.శ్రీనివాసమూర్తి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. దాసన్నపేట విద్యుత్ భవనంలో జిల్లాలోని అధికారులతో గురువారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 100 రోజుల ప్రణాళికల పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని సూచించారు. ఈ పనులకు సంబంధించి సామగ్రిని ప్రతి వారం తెప్పిం చుకుని పనులను ప్రణాళికా బద్దంగా చేయాలని చెప్పారు. మొత్తం 100 రోజుల వ్యవధిలో ప్రతిపాదించిన పనులన్నింటినీ పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, ఏబీ స్విచ్‌లు ఏర్పాటుతో పాటు లూజ్ స్పాన్స్ సరిచేయటం, ఒరి గిన, శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను మార్పు చేయటం వంటి పనుల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలన్నారు. చేసే పనులను పక్కగా నిర్వహించ టం ద్వారా సమస్యలను అధిగమించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వం వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసే యోచనలో ఉన్న నేపథ్యంలో అందుకు సన్నద్ధం కావాలని సూచించారు. అనంతరం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, బిల్లుల వసూళ్లపై వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్‌ఈ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను త్వరితగతిన మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. బిల్లుల వసూళ్ల విషయంలో శతశాతం లక్ష్యాలను సాధించి సంస్థను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ టెక్నికల్ డీఈటీ ఎల్.ఆర్.దైవప్రసాద్, ఎస్‌ఈ వెంకటరాజు, విజయనగరం డీఈ నాగిరెడ్డి కృష్ణమూర్తితో పాటు పలు విభాగాల డీఈలు, ఏడీఈలు, ఏఈలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.