ఎన్నికల నేపథ్యంలో కడియం మండలం పొట్టిలంక చెక్పోస్ట్ వద్ద శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా వెయ్యి స్టీల్ బిందెల లోడ్తో వెళ్తున్న లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టీల్ బిందెలపై పోలీసులు లారీ డ్రైవర్ను ప్రశ్నించగా పొంత లేని సమాధానాలు చెప్పుతుండటంతో లారీతోపాటు స్టీల్ బిందెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లారీని పోలీస్ స్టేషన్కు తరలించి సీజ్ చేశారు.డ్రైవర్, క్లీనర్లను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పట్టుబడిన బిందెలు ఓటర్లకు పంచేందుకు తీసుకువెళ్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే ఎన్నిక సమీస్తున్న తరుణంలో ఓటర్లకు గాలం వేసేందుకు రాజకీయ నాయకులు తమ చర్యలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా గత రెండు రోజుల క్రితం విజయవాడ నగర టీడీపీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ నివాసంలో భారీగా చీరలు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే.మహిళ ఓటర్ల పంచే క్రమంలో వాహనాలలో తరలించేందుకు ఆ సిద్దంగా ఉంచిన చీరలను సదరు టీడీపీ నేత నివాసంలో నగర పోలీసులు పట్టుకున్నారు.