సాక్షి, హైదరాబాద్ : రానున్న దసరా, దీపావళి ప్రధాన పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీకనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో మొత్తం 104 రైళ్లు నడిపేందుకు చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్-విజయవాడ, సికింద్రాబాద్-ముంబై, హైదరాబాద్-షాలీమార్, సికింద్రాబాద్-గౌహతి, కాచిగూడ-మంగళూరు, తిరుపతి-ఔరంగాబాద్ మార్గాల్లో ఇవి న డుస్తాయని సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్-విజయవాడ (18 సర్వీసులు)
సికింద్రాబాద్-విజయవాడ(07203) వీక్లీ స్పెషల్ అక్టోబర్ 4, 11, 18, 25, నవంబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో(ప్రతీ శుక్రవారం) రాత్రి 11.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ-సికింద్రాబాద్(07204) వీక్లీ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 3, 10, 17, 24, 31, నవంబర్ 7, 14, 21, 28 తేదీల్లో(ప్రతీ గురువారం) రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి తెల్లవారి ఉదయం 5.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాజీపేట, వరంగల్, ఖమ్మం, మధిర స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.
సికింద్రాబాద్-గౌహతి (18 సర్వీసులు)
సికింద్రాబాద్-గౌహతి(07149) వీక్లీ స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 4, 11, 18, 25, నవంబర్ 1, 8, 15, 22, 29(ప్రతీ శుక్రవారం) తేదీల్లో ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 7.55 గంటలకు గౌహతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో గౌహతి-సికింద్రాబాద్(07150) అక్టోబర్ 7, 14, 21, 28, నవంబర్ 4, 11, 18, 25(ప్రతీ సోమవారం) తేదీల్లో ఉదయం 6 గంటలకు గౌహతి నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 9.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు మన రాష్ర్టంలోని జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్టణం, విజయనగరం, పలాస స్టేషన్లలో ఆగుతుంది.
హైదరాబాద్-షాలిమార్ (16 సర్వీసులు)
హైదరాబాద్-షాలిమార్(కోల్‌కతా) (07128) ప్రత్యేక రైలు అక్టోబర్ 6, 13, 20, 27, నవ ంబర్ 3, 10, 17, 24(ఆదివారాలు) తేదీల్లో రాత్రి 9.50 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఇది రాత్రి 10.15కు సికింద్రాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి రాత్రి 10.20 గంటలకు బయలుదేరుతుంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల కు షాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో షాలిమార్-హైదరాబాద్(07127) ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 8, 15, 22, 29, నవంబర్ 5, 12, 19, 26 తేదీల్లో(మంగళవారాలు) ఉదయం 11.05 గంటలకు షాలిమార్ నుంచి బయలుదేరుతుంది. బుధవారం మధ్యాహ్నం 2.25 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. 2.30 కు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లికి చేరుకుంటుంది. జనగామ, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజ యవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస తదితర స్టేషన్లలో ఆగుతాయి.
ఔరంగాబాద్-తిరుపతి (18 సర్వీసులు)
ఔరంగాబాద్-తిరుపతి(07405) స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 4, 11, 18, 25, నవంబర్ 1, 8, 15, 22, 29(శుక్రవారాలు) తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు ఔరంగాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి-ఔరంగాబాద్(07406) స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 5, 12, 19, 26, నవంబర్ 2, 9, 16, 23, 30(శనివారాలు) తేదీల్లో రాత్రి 9.15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8,30 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుంది. రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్ తదితర స్టేషన్లలో ఆగుతాయి.
కాచిగూడ-మంగళూరు (18 సర్వీసులు)
కాచిగూడ-మంగళూరు(07606) స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 1, 8, 15, 22, 29, నవంబర్ 5, 12, 19, 26 తేదీల్లో(మంగళవారాలు) కాచిగూడ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.20 గంటలకు మంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మంగళూరు-కాచిగూడ(07605) స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 2, 9, 16, 23, 30, నవంబర్ 6, 13, 20, 27 తేదీల్లో(బుధవారాలు) రాత్రి 8 గంటలకు మంగళూరు నుంచి బయలుదేరి శుక్రవారం తెల్లవారు జామున 3.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూలు, డోన్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట తదితర స్టేషన్లలో ఆగుతాయి.
వివిధ మార్గాల్లో 104 రైళ్లు
Published Thu, Sep 19 2013 1:46 AM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM
Advertisement
Advertisement